Home వ్యాసాలు విశ్వకర్మ – యజ్ఞకర్త – సృష్టికర్త

విశ్వకర్మ – యజ్ఞకర్త – సృష్టికర్త


( విశ్వకర్మ జయంతి)

“విశ్వకర్మ ” అంటే అన్నింటిని చేసేవాడు అని అర్థం. ఆయన దేవతలకు శిల్పి మరియు వాస్తుశిల్పి. ఆయన దేవతలకు మానవులకు శిల్ప గురువు. పురాణాల ప్రకారం ప్రభాసుడైన మనువు, యోగసిద్ధి దంపతులకు జన్మించారు. సృష్టినిర్మాణం మరియు ఇంజనీరింగ్ లో విశ్వకర్మ యొక్క పాత్రను వివరిస్తుంది. విశ్వకర్మ పురాణములో తన పని పట్ల గర్వపడి బంగారు రాజభవనాలు,క్లిష్టమైన శిల్పాలు మరియు దోషరహిత ఇంజనీరింగ్ తో లంక వంటి అద్భుత నగరాలను ఎలా నిర్మించాడు చెప్పబడింది. ఈ పురాణం పరిపూర్ణత, తేజస్సు మరియు సంపదకు ప్రతీకగా ఉంటుంది. హిందూ మతంలో విశ్వకర్మను దేవుళ్ళ శిల్పిగా మరియు దైవిక వాస్తు శిల్పిగా గౌరవిస్తారు. పురాణాల ప్రకారం శిల్పి విశ్వకర్మ ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలోనూ నిర్మించారు. సత్యయుగంలో దేవతల నివాసం కొరకు స్వర్గలోకమును నిర్మించారు. అయోధ్యను శివుని కొరకు సువర్ణ లంకను నిర్మించారు. ద్వాపర యుగంలో రాజభవనాన్ని ద్వారకా నగరాన్ని, కలియుగంలో హస్తినాపురంలో వారణావతి( లంక భవనము) ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతోపాటు దేవతలకు అనేకమైన అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడు.

దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు, మానవులకు ఇతడు శిల్ప గురువైయున్నాడు. పురాణముల ప్రకారం ప్రభాసుడైన మనువుకు, బృహస్పతి చెల్లెలైన యోగసిద్ధికి జన్మించిన వాడు దేవశిల్పి విశ్వకర్మ. యోగసిద్ధి ప్రభాసుని భార్య. ప్రభాసుడు వసువులలో ఎనిమిదవవాడు. ప్రభాసుడు వశిష్టమహాముని ఆశ్రమము లోని నందిని అనే ఆవును యోగసిద్ధి కోరిక మేరకు అపహరించిన వాడైనందున శాపగ్రస్తుడై మానవ జన్మనెత్తి (దేవపుత్రుడు) భీష్మాచార్యునిగా శంతనుడికి, గంగకు జన్మించేను. అంగీరసుడు, అంగిరుడు అను ఈ ఇద్దరు ఒక్కరే వేరు వేరు కాదు, బ్రహ్మమానసపుత్రులలో అంగీరసుడు ఒక్కడు. అంగీరసుని భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూతురును కలిగిరి. ఈ యోగసిద్ధిని అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొనెను.

దేవశిల్పివిశ్వకర్మయను ప్రజాపతి వేల శిల్పములకాయన కర్త. భౌవన పుత్ర విశ్వకర్మ దేవశిల్పి విశ్వకర్మ తపఃశక్తితో సాక్షాత్కరింపబడి తన సర్వశక్తులను దేవశిల్పి విశ్వకర్మకోసంగినాడు. త్రిదశలకు (దేవతలకు) అతడు వర్ధకి (శిల్పి). సర్వభూషణ శిల్పకల్పనము చేయువాడు. దేవతా విమాననిర్మాత యాతడు. దేవశిల్పి విశ్వకర్మ భార్య ఆకృతి .కుమార్తె సంజ్ఞ ఈమె సూర్యుని భార్య.సూర్యుని వేడికి సంజ్ఞ తట్టుకోనలేకపోటచే విశ్వకర్మ సూర్యుని సానబెట్టి అతని వేడిని కొద్దిగా తగ్గించాడు. సూర్యుని సానబెట్టగా వచ్చినటువంటి పొడి నుంచి తయారు చేసినటువంటి చక్రము విష్ణుమూర్తి ఆయుధమై శోభన్లుచున్నది.

విశ్వకర్మ గొప్పదైన మేరు పర్వతములాంటి ఎల్లలోకములకు ఆధరమైన విశ్వశంకువుగా భావింపబడిన బ్రహ్మండమునకు నడుమ తామర మొగ్గవంటి మేరువును ఉంచి పదునాలుగు భువనములను సృష్టించాడు. ఆలాంటి ఒక భువనమునకు ప్రభువు భౌవన విశ్వకర్మ అని తెలియుచున్నది. భౌవన పుత్ర విశ్వకర్మ శిల్పి విశ్వకర్మ తపఃశక్తితో సాక్షాత్కరింపబడి తన సర్వశక్తులను దేవశిల్పివిశ్వకర్మ కోసంగి భవిష్యమానవులకు ఉద్దరింప మనెను. అటు పిమ్మట మానవులందరూ దేవశిల్పివిశ్వకర్మను స్మరించుచూ తమతమ నైపుణ్యమును చూపుతున్నవారై జీవనమును సాగించుచున్నారు.

పరబ్రహ్మ విశ్వకర్మని సాక్షాత్ కారం చేసుకున్నా మొట్ట మొదటి గురువులైయిన భావన పుత్ర విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు. విశ్వకర్మలు విశిష్ట జ్ఞానమును పొందుదురు. విశ్వకర్మ యజ్ఞకర్త,అశేష సృష్టికర్త.

విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనది. భగవంతుడు విశ్వకర్మ రచనలు రుగ్వేదం, స్థాపత్య వేదాలలో ప్రస్తావించబడ్డాయి. వాస్తు శాస్త్రం మరియు యాంత్రిక శాస్త్రం గురించి ఇందులో అనేక విషయాలున్నాయి. ఎవరైతే పని చేస్తుంటారో.. అలాంటి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు ఈ రంగంలోని ప్రజలు విశ్వకర్మ పూజ విజయవంతం కావాలని.. ఆ దేవుని ఆశీస్సులు తమకు లభించాలని.. తమ కుటుంబం ఆయురారోగ్యాలతో అనునిత్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. పని చేసే వారితో పాటు హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున వాటిని ఏ పనికి ఉపయోగించరు. తాము క్షేమంగా ఉండాలని.. తమకు నిత్యం జీవనోపాధిని కల్పించి సురక్షింతగా ఉంచాలని.. తాము చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని వారు విశ్వకర్మ దేవుడిని ప్రార్థిస్తారు.

పురాణాలలో అసలు విశ్వకర్మకు జయంతి అనేది కనిపించదు. కానీ ఇటీవల విశ్వకర్మలు విశ్వకర్మపై గల అపారమైన భక్తిని ప్రకటించుకోవడానికి ఆయన పేరా *” జయంతి ” అనేది జరుపుకోవడం జరుగుతుంది. బృహత్ కార్యక్రమాలు చేపట్టి విశ్వకర్మను స్మరిస్తున్నారు… తరిస్తున్నారు.

You may also like

2 comments

Ian1117 September 20, 2025 - 2:18 pm Reply
petite.xvideoszone.cc October 22, 2026 - 5:38 pm

Wow, tjis post is good,my sister iss analyzing these things,therefore I am going
to convey her. xnxx

Reply

Leave a Comment