Home కవితలు అది నన్ను మనిషిని తయారుచేసింది

అది నన్ను మనిషిని తయారుచేసింది

నేను చిగుళ్ళను ప్రేమించాను
అవి పూలవుతాయనుకోలేదు
నేను వెలుగులను ప్రేమించాను
అవి తిమిరాన్ని తరిమికొడుతాయనుకోలేదు
నేను విత్తనాన్ని ప్రేమించాను
అది మహావృక్షమవుతుందనుకోలేదు
నేటి నీటి బొట్టును ప్రేమించాను
అది నీరధి అవుతుందనుకోలేదు
నేను మట్టిని ప్రేమించాను
అది బంగారమవుతుందనుకోలేదు
నేను దారాన్ని ప్రేమించాను
అది వ్రస్తంగా అవతరిస్తుందనుకోలేదు
నేను అమ్మను ప్రేమించాను
ఆమె అమృతమవుతుందనుకోలేదు
నేను గురువును ప్రేమించాను
ఆయన ఆకాశమంత ఎత్తనుకోలేదు
నేను అక్షరాన్ని ప్రేమించాను
అది ఓంకారమవుతుందనుకోలేదు
నేను ఉపనిషత్తును ప్రేమించాను
అది నన్ను మనిషిని తయారుచేస్తుందనుకోలేదు.

You may also like

1 comment

తమిరిశ జానకి September 15, 2021 - 10:27 am

చాలా బాగుంది కవిత.

Reply

Leave a Comment