అప్పటి దాకా
నీ మంచితనం నీవు చెప్పుకోవడం అనేది
తెలివితక్కువగా అవసరమనుకోవడం
ఓ పెద్ద లోపం.
కాలం ఖచ్చితంగా నీ కోసం
కొన్ని రోజులని దాచే ఉంటుంది
అందాకా ఆగితేనే
నీకు క్షమాపణ చెప్పుకుంటూ
నీ పేరు మీద గడిపే మిగిలిన రోజులన్నీ
మౌనంగా నిన్ను బలపరస్తూ
బహిరంగంగా శ్రమిస్తాయి..
నీ తరుపున దేవుడు వాదించి
తానే సాక్షిగా రుజువు చూపుకుని
నీలో నిజానికి ప్రేమతో
గెలుపును బహుమతి చేస్తాడు
సమస్యల్లా
సహనం అనే పరీక్ష శిక్ష కాదు,
అద్భుత యుద్దమని మరువకుంటే చాలు…
ఒకరేవరూ
తప్పును మోసం చేసి నటిస్తూ
తప్పించుకు పోలేరెక్కడికో…
దేవుడికి ఎన్ని పేర్లుతో రూపాలున్నా
నిజం మాత్రం ఒకే ఒక రూపంలో
తిరుగులేని తీర్పు చెబుతుంది…
కొద్దిగా ఆలస్యం అనిపించినా
మరింత పటిష్టంగా….