Home కవితలు అమ్మాయి – ఆయుధ పాణి . . .

అమ్మాయి – ఆయుధ పాణి . . .

by రాఘవాచార్య‌

చోద్యం ! శిక్షలు ఎంతో సరలమై
నేరస్థుడి దోషాలు మాఘవేసినట్లే ఉంటాయి
ముఖం పై ఏ మాత్రం భయం సెగ ఉండదు
రిమాండులు కోర్టులు చెరసాలలూ
కీచకులకు సేదగా ఒయసిస్సులేనేమో
శిక్షా కాలంలోనూ గుడ్లు మాంసం తింటూ
అత్తవారిల్లు వైభవంగా గోవా ఊటిలాగే జైల్లా !!

శిక్షలు ఎంత సుఖమో !
శిక్షా స్మృతులు రాసేవారికి
ఆడ పడుచులున్నారా ??
శోధనగా మా ఆవేదనా ప్రకరణము

అల్లా ! మీ దేశాలలోని శిక్షలే శిక్షలు
అమ్మాయిల పై చేయి వేయడానికి
మరణ భయంతో వెనుకంజ వేసి
అక్కడికక్కడే పక్షవాతం వచ్చి పడిపోతారు
ఖబరస్తాన్ వాడి అడ్రస్

అసలు న్యాయంగా
వీధి వీధికి ఉరితాడు వేలాడుతూ
మదన కామరాజులకు అనగొండ దృశ్యం కావాలి
తల్లులు తమ  కొడుకు పెరుగుతుంటే
గల్లీలోని ఉరితాడును
చూపుడు వేలితో ముక్కు సూటిగా చూపించి
గుణ పాఠాలు చెప్పాలి  మరి మరీ
వాడికి భవిష్యత్తు దర్శనంగా !!

పగలైతేనేం అర్ధరాత్రి ఐతేనేం
సిక్కు వీరుల్లా మా అమ్మాయిలు
ఎక్కడైనా ఖడ్గాలు ధరించిన
వైనమే వైభవమే కావాలి మరి
స్వీయ చరిత్రకు స్వీయ రక్షణ

తల్లులూ ! వంటింట్లో రుచికరంగా
పరాటాలు చేయడమే కాదు
చేతి వాటంగా కరాటే చేయాల్సిందే
దెబ్బకు సీసా మత్తు దిగి
శాశ్వతంగా మగ పుట్వడిని మరువాల్సిందే

ఇక అమ్మాయి అంటే ఆయుధ పాణిగా
మనకెంతో నిర్భయం నిమ్మలం

You may also like

1 comment

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 6:05 am

సందేశాత్మక కవితనందించిన ఆచార్యులవారికి నమస్కారపూర్వక అభినందనలు.

Reply

Leave a Comment