నన్ను నేను మర్చిపోయి
ఏదో దృశ్యంలో
లీన మవుతున్నాను
ఈ రాత్రి!
కాంతులీనే ఆధ్యాత్మిక
నగరం నడి బొడ్డులో
తత్వాన్ని కలగంటున్నాను.
ఎవరో
నన్ను ప్రశ్నిస్తున్నారు.
భక్తుల నిర్వేదానికి
అక్షర రూపమిచ్చేవా అని!
భక్తో, ఉన్మాదమో
లోపల రగులుతున్న
క్రోధం ఆశాంతిగా
నా ముఖంపై!
మనుషుల్లో ప్రమాదకర
ఉన్మత్తత ప్రసారమవుతూనే
వుంటుంది.
ఎక్కణ్ణుంచో
ఆధ్యాత్మిక పొగలు
కుమ్ముకు లేస్తున్నాయి.
మనిషి
‘ వాడి’ లోనే వుండిపోతున్నాడు.
నిజంగా
దేవుడిని చూడాలంటే
ఈ అనంత సృష్టిని చూడు. అందులో
నువ్వూ భాగమే!
ఏటూరి నాగేంద్రరావు
7416665323