Home కవితలు ఆలోచనల  విస్పోటనం

ఆలోచనల  విస్పోటనం

by Khadar basha
“ఆలోచనల అగ్నిపర్వతం బద్దలైంది/”
“నా లో నేనే ప్రశ్నించుకున్నా/”
అద్భుతమైన ఈ భూ మండలంలో
పచ్చగపరిచిన ప్రకృతిని
తోడుగా నీ సహజీవులతో
బతుకు వెళ్ళదీస్తున్ననీవు
నాది నాదంటున్నావేమిటి!!
బాటసారివి కదా నీవు?
నీ పుట్టుక కోందరికి అనందాన్నిస్తుంది
నీ గిట్టుక విషాదంలోకి ముంచేస్తుంది
పుట్టినప్పుడు ఏమి తీసుకునిరావు
పోయేటపుడు ఏమి తీసుకోనిపోవు
నిన్ను మహత్ముని చేసేది అత్మస్వరూపమే
నిన్ను ముర్కుడిగా చేసేది అహంకారమే
మంచి ప్రవర్తన నిర్థేశించేదే విధేయత/”
చెడు ప్రవర్తనను నిర్థేశించేదే అవిధేయత/”
అంతరాంతరాలలో జ్వలించే లావా నీ ఆలోచనే/
అత్యన్నత స్థాయికి ఎదగాలన్న ఆలోచనే /
అధఃపాతాళానికి దిగజారాలన్న నీచెతల్లోనే
చేతానవస్థలో నున్న నీ వ్యక్తిత్వం
సుప్తచేతనావస్థతో  సుసంపన్నం
నీ శరీరం నీ మనసుకు బానిస
మనసులోని తెల్లని ఆలోచనలు వికాస
“కర్త నేనేనంటే దానవుడు/”
“కర్త నేను కాదంటే  మానవుడు/”
“మనసు నిన్నధిగమిస్తే అసంపూర్ణం/”
“మనస్సుపై నీ అధిపత్యం జీవితం సంపూర్ణం/”
తరచి తరచి చూస్తే ఇప్పటికి నువు సాధించేదేంలేదు/
కరోనా నిన్ను బంధిస్తే విలవిలలాడిపోయావు కదు/
“ఓ మనిషి మానవత్వవిలువలు కాపాడు/”
“సమాజ సంక్షేమానికి సహయపడు/
నీ అత్మసాక్షిగా ప్రశ్నించుకో?
నీ శరీరం వదిలి వెళ్ళాలిగా
నీవీక్కడ బాటసారివేగా!!!!

You may also like

1 comment

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 6:20 am

ఖాదర్ బాషా గారి కవిత సందేశాత్మకం. అభినందనలు.

Reply

Leave a Comment