Home వ్యాసాలు “ఆస్కార్ కు ఆద్యుడు” చంద్రబోస్!

“ఆస్కార్ కు ఆద్యుడు” చంద్రబోస్!

by Kondapally Neeharini

‘  ఆస్కార్ ‘ ప్రపంచ  సినీ  పరిశ్రమ జగత్తులో అందరూ అందుకోవాలని కలలు కనే అవార్డ్.

ప్రపంచంలో సినిమాలను నిర్మించే అన్ని దేశాలు ఆస్కార్ అవార్డు  కోసం ప్రయత్నించి ప్రయత్నించి విఫలమైన వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా విడుదల కావాలంటే ఏ ఏ రంగాలు పనిచేయాలో ఏ విభాగాలు పని చేయాలో ఆయా ప్రముఖమైన విభాగాలకు అవార్డును ఇస్తూ ఉంటారు. దర్శకత్వం, నిర్మాణం, కథ ఫోటోగ్రఫీ,ఎడిటింగ్, మేకప్, పాట ఇలా అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తారో వారికి ఆస్కార్ అవార్డు గత 95 ఏళ్ళు గా ప్రదానం చేస్తున్నారు. Oscar Awards- Academy ఇచ్చే ఈ అవార్డు కోసం హాలీవుడ్ మొత్తం తమ యావత్  ప్రతిభను వెచ్చించి మరీ సినిమా లను నిర్మిస్తూ ఉంటారు.

యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డు ప్రధాన ఉత్సవం జరుగుతుంది.

నిన్న , మార్చ్ 12 ఆదివారం నాడు 2023 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డు వేడుకలు జరిగాయి.

  ఇవన్నీ తెలియని వారు ఎవరున్నారు? అందరికీ అన్ని తెలుసు !కానీ , మన చంద్రబోస్ గారి గురించి కదా ఇక్కడ  చెప్పుకోవాలి. తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం సామాన్య విషయం కాదు. పాట రాసిన రచయిత చంద్రబోస్ గారు.

పాటకు వాద్య  సహకారాలు అందించిన ,గాత్ర సాకారాలందిచిన ,తెరపైన నృత్య సహకారాలు అందించిన ,నృత్యం చేసిన నటీనటులు ఇవన్నీ లెక్కలోకి వచ్చేవే! వస్తాయి కూడా!ఇంతకన్నా మించి ఈ పాటను ఆర్ ఆర్ ఆర్ సినిమాలో పెట్టడం వలన గుర్తింపు లోకి వచ్చింది. అన్నింటికన్నా మించి అంత భారీ ఖర్చుతో అంత  నిబద్ధతతో అంత అత్యద్భుతంగా చిత్రీకరణ చేసి దర్శకత్వం వహించిన వారి వలన ఈ సినిమాకు ఇంత పేరు వచ్చింది. కాబట్టి పాట రైటర్,సింగర్స్,మ్యూజిక్ డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్, డైరెక్టర్ ఇన్ని కలిస్తే ,వీటన్నింటి కన్నా ప్రచార హోదా కల్పించడం గొప్పగా  అయినందుకు ఇవాళ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి ఆస్కార్ అవార్డు” నాటు …..నాటు……” పాట సొంతం చేసుకుంది. ప్రపంచమంతా ఆన్లైన్ మీడియాతో నడుస్తోంది అనడానికి ఒక పెద్ద ఉదాహరణ ఇటువంటి పోటీలు, ఫలితాలు . సమాచార వేగం కూడా  కారణం. ఒక వంటకం కుదరాలంటే వస్తువులు, పదార్థాలు ,చేసే వ్యక్తి , చేసే తీరు, వంటవండేవారి శ్రద్ధ ఇన్ని కూడాలి! ఇన్ని సరిపడ్డాక వంటకాన్ని వడ్డించబోయే ముందే ఎవరైనా అది బాగాలేదు రుచి సరిగా లేదు అన్నారంటే గిన్నెడు పదార్థం వృధా అయిపోతుంది. ముందు తిన్న వాళ్ళు పదార్థం చాలా  రుచికరంగా ఉంది అంటే ,ఇక తర్వాత తినేవాళ్ళు అదే అభిప్రాయంతో తింటారు. అందులో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తారు. ఇక్కడ ప్రచారమే ఉపయోగపడుతుంది.ఒక మంచి నవల వచ్చింది అంటే నవల పేరు ,అంశము, రాసిన శైలి,అభూత  కల్పన కాని సత్య నిరూపణము, అద్భుతమైన సందేశం. ఇవన్నీ కావాలి.వీటన్నింటిని మించి ఆ నవల ముద్రితమై అందరూ చదవడం, ఇతర భాషల్లోకి అనువాదం కావడం ప్రపంచానికి అందడం ముఖ్యం. ఇటువంటి ప్రచారం నలుగురు బాగుంది అన్నారంటే అప్పుడు కదా ఇలా సింహాసనం పైన దిష్టింప చేసేది! అయినా కానీ…..ఈ పాట విషయానికి వస్తే, పాటను ఒక్కటే విశ్లేషణ చేస్తే, పాటలోని మాటలు …మాటల్లోని భావము ….పలుకుబడులు ….ప్రజల భాష , పల్లెపదాల పరిమళం ,జానపద పదగుంఫనం  ….!ఇవి ఆకట్టుకునేలా ఉండడం ఈ పాటకు ప్రాణం అయింది.  అవేంటో తెలియాలంటే అట్లా  దుమ్మురేగే పొలం గట్టుకోసారి పోవాల్సిందే!!పోతరాజు ఆడినట్టు ఎవరాడగలరేంది?, దుమ్ము దులుపుతుంటె చూడాల్సిందే! జాతర ..పోలేరమ్మ జాతర! ఇవన్నీ వాటి  వాటి ప్రత్యేకతలను కళ్ళముందు కదలాడేలా చేసాయి కదా!పొలం గట్టు ,మిరప తొక్కుల  యవ్వారం  మొత్తం ఎర్ర జొన్న రొట్టె చెప్పదూ!! కుర్ర గుంపు లొల్లి లొల్లంతా మర్రి సెట్టు నీడలు తెలియజేశాయి కదా! అంతే కాదు కిర్రు సెప్పులు ఊరుకుంటాయా? ఊం..హూ…. కర్ర సాము చేసేందుకు పోవూ!!

ఇంత సహజ సిద్ధంగా  మాటలు అలా అలా అలా స్వరప్రవాహమై రాలే!!

మనసు మళ్ళీ మళ్ళీ నవ్వుకోలె!!

‘నాటు’లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని పెట్టేసాడు కవి చంద్రబోస్! అసలు’ నాటు’ అనే పదానికి అర్థం ఆస్కార్ వాళ్ళకు అర్థమైందో కాలేదో కానీ, అక్కడ వేదిక మీద చ ‘నాటు ‘కి  చెప్పిన అర్థమైతే వేరే! మనకు తెలుసిన నాటు కాదు!ఇవే కదా పలుకుబళ్ళు! వ్యవహారిక భాష ,యాస, ప్రాంతీయ  భాష,భావము! ఓసారి పలకరించుకొని పులకించి పోదామా?

 ఒంటి లోని రగతం!

రంకెలేసి ఎగరదూ!!

ఎకా ఎకీ!

లోపలున్న పానమంతా!!

డుముకు డుముకులాడేయదూ!!

ఎక్కడి పదాలు ఇవి?   మా చినపెండ్యాలలో, మా హన్మకొండ, మా వరంగల్ లలో తిరిగేసి వచ్చి ఉప్పస చెందినట్టు, ఊరట పొందినట్టు,నా చిన్నప్పుడు మా అన్నయ్య లు, తమ్ముడు, అక్కయ్య లతో ఆడుకున్నట్టున్నది, మేము మా దోస్తులందరం మాట్లాడుకున్నట్టున్నది.

ఈ ఒక్క పాటను నేనైతే ఎన్ని సార్లు చూసిన్నో!

 మా పిల్లలే కాదు,మా  మనవరాళ్ళు, మనవడూ ఎన్ని సార్లు డాన్సులు చేస్తారో, ఎంతగా పాడ్తారో! ఇవాళ ఈ సందర్భం వచ్చిందని చెప్పడం కాదు, చెప్పేఅవకాశం వచ్చింది కనుక చెప్పడం.

డింకిచక,

డింకనకర,

డిక్కనకర!!

ఏందిది?కవి పల్లె బుట్టలో మాటలు పోసుకొచ్చాడు. ఈ జానపద సాహిత్యాన్ని ఎన్ని దోసిళ్ళకు ఎత్తు కోవాలీ ఏందీ?

వీటి అందం తెలుసుకోగలిగితే మరింత ఆనందం! పోనీలెండి ఆస్కార్ వాళ్లకి ఎంత అర్థమైందో ఎంత అర్థం కాలేదు బేరీజు  వేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు కానీ, పాటలో ఉన్న ఏదో అందం వాళ్ళనాకర్షించింది! మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది! ఆస్కార్ వచ్చి పడింది. ఆస్కార్ తెలంగాణ యాసకు మోకరిల్లింది. ఆస్కార్ తెలుగు సినిమాకు జోహార్లు అన్నది. ఆస్కార్ తెలుగు పాట లోని వైభవాన్ని గుర్తించింది! ఇది చాలదు మనం ఇలా అనుకోవడానికి చెప్పుకోవడానికి! ఇది చాలు! ఇట్ ఈజ్ ఎ రికార్డ్! దట్సిట్!!

 హాట్సాఫ్ టు చంద్రబోస్ గారు!!

మానుకోట బిడ్డడు, వరంగల్ గడ్డ ప్రతాపం చూపించి, ఆస్కార్ అవార్డు ను పడ కొట్టిండు! తెలుగు ప్రజలకు  ఆస్కార్ చేరేలా చేసిన చంద్రబోస్ గారి కి శుభాకాంక్షలు!

“ఆస్కారన్న చంద్రబోసన్న ” అనే పేరు తెచ్చుకున్న చంద్రబోస్ గారి కి అభినందనలు!!

You may also like

9 comments

דירות דיסקרטיות בבאר שבע April 19, 2023 - 5:52 pm

Im very happy to find this web site. I need to to thank you for ones time for this particularly wonderful read!! I definitely liked every bit of it and I have you saved to fav to check out new stuff on your website.

Reply
דירה דיסקרטית בחולון June 8, 2023 - 6:06 am

דירות דיסקרטיות ברמת גן יכולה
להיות סוגיה לא פשוטה בעבור רבים מכם.
מאגר דירות דיסקרטיות במרכז כל הפרופילים מאומתים וזמינים עכשיו באזורכם.
כל מה שאתם צריכים לעשות הוא להגדיר את רשימת הצרכים והמטרות ולצאת לדרך כדי להתנסות בחוויה בלתי נשכחת.
לכן עזבתי את פאטמה אחותי, עזבתי את סאלים גיסי, רכבתי שבועות על גבי גמל דרומה ואני נזהר מבני-משפחתה, משפחת השייך סוליימן הגדול אשר שלטונו על פני
הנגב, והחלטתי להפליג בסירה אל בני שבטו של עַבְּד הכושי
אל אֶרֶץ שְׁבָא אולי אמצא שם את מקור סודה את אוצרה של לטיפה בת
סוליימן אשר הביא לה עַבְּד הכושי
מאפריקה. וכשבאו הרוכבים מבי-משפחתה אל בית סאלים גיסי, ברחתי לשדות והיא, ירחמה האל, רצהוהפילה עצמה עם סודה אל באר
שוע, ותמות. לא בכדי תאילנד קיבלה את הכינוי “בית הבושות הגדול בעולם” ובהחלט יש סיבה שבנגקוק קיבלה את השם “בירת הסקס העולמית”.

בנוסף, השיקה מאוחדת מוקד ייעודי לפיענוח מוניטור עוברי
מרחוק, המייעל בצורה משמעותית את
הליך הבדיקה.

My website :: דירה דיסקרטית בחולון

Reply
Dwayne December 7, 2023 - 5:53 pm

If you want to increase your familiarity simply keep
visiting this web site and be updated with the hottest information posted here.

Reply
spa-accadia.com December 8, 2023 - 3:29 pm

Thank you for the good writeup. It in fact was a amusement
account it. Look advanced to more added agreeable
from you! However, how could we communicate?

Reply
israel-lady.co.il December 8, 2023 - 8:42 pm

Today, I went to the beach front with my kids. I found a
sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She
put the shell to her ear and screamed. There was a hermit
crab inside and it pinched her ear. She never wants to go back!

LoL I know this is totally off topic but I had to
tell someone!

Reply
Caleb December 8, 2023 - 10:05 pm

First off I would like to say wonderful blog! I had a quick
question that I’d like to ask if you don’t mind.
I was curious to know how you center yourself and clear your head before
writing. I’ve had a tough time clearing my mind in getting my
thoughts out there. I truly do enjoy writing however it just seems like the first 10 to 15 minutes tend to be wasted simply just trying to figure out how to
begin. Any suggestions or tips? Many thanks!

Reply
נערות ליווי בקיסריה December 8, 2023 - 10:11 pm

Incredible! This blog looks just like my old one! It’s on a totally different subject but it has
pretty much the same layout and design. Great choice of colors!

Reply
Opal December 9, 2023 - 3:02 pm

Hi, after reading this awesome post i am as well glad to share my experience here with colleagues.

Reply
נערות ליווי בבאר שבע December 14, 2023 - 1:31 am

Every weekend i used to pay a visit this web site, for the reason that i wish for enjoyment, since this this site conations truly good funny material too.

Reply

Leave a Comment