కం!
వేదండ తొండ మండిత
కైదండగమారి మమ్ము కాపాడు మయా
వేదాంత భూషణోజ్వలమా దండి మహాత్మ శరణమయ్య గణేశా!
కం!
శ్రీ బుద్ధి సిద్ధి సేవిత
మా బుద్ధి వృద్ధి చేయ మా గృహమునకున్
రా బుద్ధి గలిగి రావయ
పో బుద్ధిని మాని తిరిగి పోకు గణేశా!
కం.
నీ కన్న తల్లిదండ్రులె
లోకులకును తల్లిదండ్రులో గణనాథా
మా కుల పెద్దవు నీవై
సాకుము మమ్మెల్లవేళ సంతస మిడుతున్!