- ఆవు చేను మేస్తుంటే మరి దూడ…?
నేనెన్నోసార్లు వద్దని చెప్పా, వెయ్యి సార్లు వివరించా, కాని ‘వాడి’ బుర్రలో ఏదో త్వరగా పక్కనే ఎక్కదు. అసలు ఇలాంటి పనులు చేసే వయసా ఇది?
విశ్వనాథంగారు నాకు సెంటర్లో కలిసారు “క్రొత్త బజారు”లోని ఈ సెంటరు దానికి చాలా పేరు పొందింది. ఇక్కడ సెలూన్, స్వీటుషాపు, పూల దుకాణం, ఇలా అన్ని రకాల దుకాణాలున్నాయక్కడ. జనం ఏదో సరుకులు కావాల్సినవి కొనుక్కోవడానికి వచ్చి పరస్పరం ఏవో ముచ్చట్లు చెప్పుకొంటూ, కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.
విశ్వనాథంగారు ఒక దీర్ఘనిశ్వాస విడిచి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. “ఇలాంటి కొడుకుని ఆ దేవుడు ఎవ్వరికీ ఇవ్వకూడదు. వయసా, కేవలం పదిహేడు సంవత్సరాలు కాని చేపలా ‘మందు’ అలా త్రాగుతూనే ఉంటాడు. ఎంత చెప్పినా వినిపించుకోడు. మందు త్రాగొద్దని నేనేమీ చెప్పను కాని మరీ ఇంతలా త్రాగడం, త్రాగి రోడ్డుమీద పడడం… ఇదేం తెలివి?
చివరి వాక్యం వినగానే నాకేదో అనుమానం వచ్చింది. విశ్వనాథంగారి వంక ఎందుకో కన్నార్పకుండా చూసా, కొంచెం వాసన గట్టిగా పీల్చా. విశ్వనాథంగారు మత్తు ప్రభావంలో అటూ ఇటూ తూలుతూ కనిపించారు.
- ఇలా కూడా జరుగుతుంది
కారు చాలా వేగంగా వెళ్తోంది. డాక్టర్ సర్వేశ్వరరావు చాలా తొందరలో ఉన్నాడు. నిజమేమంటే, అసలు ఆయనెప్పుడూ హడావిడిగానే ఉంటాడు. రోగులెప్పుడూ పెద్ద సంఖ్యలో ఆయన చుట్టూతా ఉంటారు. రోజుకి ఇరవై నాలుగు గంటలకి బదులు ఇరవై అయిదెందుకు లేవా అని ఆయన ఎప్పుడూ చింతిస్తూ ఉంటాడు.
శ్యామల, ఆయన భార్య – “ఏమండోయ్! ఏదో ఒక రోజు, నేనో, మన పిల్లవాడు సురేశ్ జబ్బు పడతాం. అప్పుడైనా మీరు మా దగ్గర కూర్చుంటారో, కూర్చోరో నాకైతే సందేహమే” అని ఎప్పుడూ అంటూ ఉండేది.
నిజానికి డాక్టర్ సర్వేశ్వర్రావుకి తన కుటుంబం అంటే చాలా చాలా ప్రేమ. అయినప్పటికీ తన భార్యతో, తన ఏకైక కుమారరత్నం సురేశ్ తో కలిసి కొంచెం టైమైనా గడిపేందుకు ఆయనకు అస్సలు వీలైయే్యది కాదు.
‘అంబ’ సినిమా థియేటరం మలుపు దగ్గర కారు కొంచెం ‘స్లో’ అయింది. డాక్టర్ సర్వేశ్వరరావు ఆలోచనల దారం పుటుక్కున తెగింది.
‘ఏమైంది?’ అని అడిగాడాయన డ్రైవర్ని.
“సార్, ముందైతే చాలా పెద్ద గుంపు ఉంది. అక్కడ ఏదో ‘యాక్సిడెంట్’ అయినట్టుగా ఉంది. “ఎవరో బాగా గాయపడినట్టున్నారు” అన్నాడు డ్రైవర్.
‘అరే! నువ్వైతే బండి ఆపొద్దు. ఈ రోజుల్లో కుర్రాళ్లు వాళ్ళూ పై తెలీకుండా బండ్లు తోలుతారు, రోడ్డుపై కూడా అలాగే నడుస్తారు’ ఇలాంటివేవో చేస్తూనే ఉంటారు.
“కాని… సార్! మీరే డాక్టర్ కద. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడగలరు.”
“అయితే ఏంటట? నేను డాక్టరైతే ఇలా ప్రతి చచ్చేవాణ్ణి కాపాడుకుంటూ పోవడం నా వల్ల కాదు. నా పనులు నాకుంటాయ్”
డ్రైవర్ మౌనంగా ఓ నిట్టూర్పు విడచి బండిని ఆపకుండా, అలాగే పరుగులు తీయిస్తూ వెళ్ళాడు. డాక్టర్ గారితో వాదించడం వృధా అని అతనికి తెలుసు.
కారు హాస్పిటల్ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అంబులెన్సుతో ఢీ కొట్టబోయి క్షణంలో తప్పించుకున్నది. అంబులెన్సు డ్రైవర్ ని చెడామడా తిట్టేందుకై డాక్టర్ సర్వేశ్వరరావు కారు దిగాడు. ఇలా దిగాడో లేదో “సార్! ఆలస్యం చెయ్యకుండా కారెక్కండి. మీ అబ్బయి సురేశ్ కి ‘అంబ’ థియేటర్ దగ్గర చాలా పెద్ద యాక్సిడెంటైందట. ఎవరో ఫోన్ చేశారు. బహుశా ఈ పాటికి చినబాబు….
- డ్యూటీ
అతనో గొప్ప సర్జన్ అవ్వాలని అనుకునేవాడు. హోలీ పండుగ. ఆ రోజు కూడా ఇంట్లో ఉండకుండా డ్యూటీ చెయ్యాల్సి వచ్చిందని అతనికి డాక్టరు వృత్తిమీద బోళ్ళంత విసుగు, కోపం వచ్చాయి. మరి అవాళ అమ్మ కూడా కోపంతో ఏమేమో అన్నది. అలాంటి ఆలోచన వచ్చినందుకు. అయితే మరి ఒకటి కావాలంటే, ఒకటి పోగొట్టుకోవాలి కదా!
సరే… ఎలాగో అలా డ్యూటీకి వచ్చి అన్య మనస్కకంగానే కూర్చున్నాడు. ఇంతలో… ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో చెప్పగానే ఒక్కో ఉదుటున లేచి వార్డుకొచ్చాడు. తీరా చూస్తే, అక్కడో బెడ్ మీద తన తమ్ముడే స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఓ రెండు నిముషాలు కాగానే అతను హఠాతు్తగా లేచి రక్తపు వాంతి చేసుకున్నాడు. దాంతో తమ్ముడితో బాటుగా అతని దుస్తులపైనా రక్తం పడి ఎర్రగా అయింది. రోగినైతే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళి వెంటనే సర్జరీ చేయడం జరిగింది.
రెండు గంటలపాటు కష్టపడి అతను బయటికి వచ్చాడు. అక్కడ వాళ్ళమ్మ ఎదురుగా నిలబడి ఉంది. చూపులెక్కడో ఉన్నాయి.
“అమ్మా! నువ్వేం బాధపడకు. తమ్ముడి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది” అనగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు గిరగిర తిరిగాయి.
వెంటనే ముందుకొచ్చి తన పెద్ద బాబైన అతన్ని గట్టిగా కౌగలించుకుని – “బాబూ ప్రొద్దున్న నేనన్న మాటల్ని పట్టించుకోమాకు. మనసులో ఏమీ పెట్టుకోకు. ఇక నేను డ్యూటీ సంగతి ప్రస్తావించి నిన్నేమీ అనను సరేనా? డాక్టర్లకి హోలీ ఏమిటి? దీపావళేమిటి?” ఏదైనా ఒకటేకద!”
అతనో చిరునవ్వు నవ్వి – “మాకు హోలీ పండగ ఉండదని ఎవరంటారమ్మా? ఇదిగో, నా బట్టల్ని చూడు మనిషి రక్తం రంగు తాలూకు చుక్కల మరకలివి. ఇలాంటి హోలీ మరింకెవరన్నా ఆడతాడా అసలు?”
- ఫ్యాషన్
దేవుని తీర్పు కూడా కొంచెం విచిత్రంగానే ఉంటుంది మరి. ఆయన తన భక్తుల్లోనే కొందరికి విశేషంగా సిరిసంపదలిస్తే, కొందరి కసలేమీ ఇవ్వలేను. అసలు లోకంలో సరిసమానం అనేది ఎక్కడుంది అంటే, అది చాలా అరుదే అని చెప్పాల్సి ఉంటుంది. తేడాలనేవి మనకి తేలికగానే కనిపిస్తాయి.
నగరంలోని ఒక సందు మలుపులో ఉంది శివదయాళ్ గారి దుకాణం. శివదయాళ్ ఓ టైలర్. మంచి పేరున్నవాడు సంపాదించుకున్నదాంతో ఇల్లు గడుపుకుంటూ వస్తున్నాడు.
ఆ రోజున ఒక పెద్ద కారు వచ్చి ఆయన దుకాణం ముందు ఆగింది. దాంట్లోంచి ఒక ఫ్యాషనబుల్ అమ్మాయి – వన్నెల విసనక్రర దిగింది. దుకాణంలో లోపలకొచ్చి ‘మీరు నాకో ప్రత్యేకమైన డ్రెస్ తయారుచేసి ఇవ్వగలరా?’ అని అడిగింది.
ఆ అమ్మాయి తన కెలాంటి డ్రస్ కావాలో వివరించి చెప్పేసరికి శివదయాళ్ నోట మాట రాలేదు. ఆ డ్రస్‌లో వళ్ళు కప్పబడేది చాలా తక్కువ సరే, దాంతో తనకేంటి? తనకు పోయేదేముంది? ఆయన కొలతకు తీసుకున్నాడు.
ఆ రాత్రి శివదయాళ్ కీ నిద్ర అస్సలు పట్టలేదు పక్కనే ఉన్న గదిలో లైట్ వెలుగుతోంది. అద్దం ముందు నిలబడి శివదయాళ్ పదహారేళ్ళ కూతురు తనను తాను చూసుకుంటోంది. ఆమె చేతిలో అదే ప్రొద్దున్న తన దగ్గరికొచ్చిన అమ్మాయి కుట్టించుకున్న డ్రస్సు ఉంది. తండ్రి అక్కడికి రావటం గమనించి ఆమె సిగ్గుపడింది.
శివదయాళ్ కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పెల్లాయ్ కూతురు తలమీద చెయ్యేసి నిమురుతూ “హూ… దేవుడి తీర్పు ఎలా ఉంటుందో చూడు! పేదోళ్ళకి వళ్ళు కప్పుకునేందుకు చాలినన్ని బట్టలుండవు. ఉన్నోళ్ళకైతే వళ్ళు కప్పుకునేందుకు బట్టలు చాలానే ఉన్నాయి. కాని ఫ్యాషన్‌స పేర, వళ్ళంతా కనబడేట్టు చూపించడంలో ధనికులు ఎక్కవగా విశ్వసిస్తారు.