Home వ్యాసాలు కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల కోట చరిత్ర

కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల కోట చరిత్ర

ఎలిగందుల గ్రామం పేరు వెనుక చరిత్ర

పూర్వం ఈ ఊరి పేరు బహుధాన్యానగరం. కాకతీయుల కాలం నుండి ఎలిగందులగా పిలవబడుతుంది.ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల కందులు ఎక్కువగా పండేవట. అలా తెల్లకందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు. తెల్లకందుల అన్న పేరు చింతామణి చెరువు వద్ద ఉన్న శాసనంలో స్పష్టంగా చెక్కబడి ఉంది.

గ్రామం చరిత్ర
కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిమ్మల (నిర్మల్) పాలకుడు శ్రీనివాసరావు కాలంలో ఇది అతని అధీనంలో ఉండేది.
1754లో ఎలగందల్ కోటకు ధ్వంస అధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబు ఆసఫ్ జా ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావును బంధించి అతను పాలకుడయ్యాడు.
1905 వరకు ఎలగందల్ జిల్లాకు రాజధానిగా ఉంది.1905లో రాజధాని కరీంనగరుకు మార్చి, జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడింది.

ఈ గ్రామం పూర్వం కాకతీయుల పాలనలోను, తరువాత ముస్లిం రాజుల పాలనలోను ఉన్నప్పటి చరిత్రాత్మక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. ఎలగందల్ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు, ఎలగందల్లోని చారిత్రక ప్రదేశాల్లో శ్రీరామాలయం, నీలకంఠస్వామి ఆలయం, ఆలంగీరు మసీదు, నిజాముద్దేలా అసఫ్ జాహీ కూతురు మెహరున్నీసా ఖానుమ్ సమాధి మందిరం, అనేక ముల్లాలు, మౌల్వీల సమాధులు ముఖ్యమైనవి.

ఎలగందల్ కోట తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఎలగందల్ గ్రామంలో ఉంది. కరీంనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల జిల్లా రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో అడివి మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఉన్న ఈ కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ వంశము, మొఘల్ సామ్రాజ్యం, హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది. నిజాం పాలనలో ఈ కోట కరీంనగర్ కు ప్రధాన కార్యాలయంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్-దౌలా చేత నిర్మించబడింది.
ముస్లిమ్ సన్యాసులైన సైయద్ షాహ్ మునావర్ క్వాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్, వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఉఉగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.

కరీంనగర్-వేములవాడ రహదారిలో ఎలగందల్ కోట నుండి మానకొండూరు వరకు 9 కిలోమీటర్లు మేర రహస్య సొరంగం ఉందని నమ్ముతారు.

చరిత్ర
ఎలగందల్ కోటను వెలగందుల అని కూడా పిలుస్తారు. దీనిని కాకతీయుల (1083-1323) కాలంలో నిర్మించారు. యోధులైన ముసునూరి నాయక్, రాచర్ల పద్మనాయక్ లు దీనిని దృఢంగా చేశారు. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహి వంశస్థులు ఈ కోటను ఆక్రమించుకొని, క్యుయినముల్ ఉల్ ను కమాండర్ గా నియమించారు. తదనంతరం, మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి వెళ్లింది. హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ నిజాం అసఫ్లాహ్ (1724-1748), ముగర్రాబ్ ఖాన్ హయాంలలో, అమిన్ ఖాన్ ఎలగందల్ కు ఖిలేదార్ గా నియమించబడ్డాడు. నవాబ్ సలాబత్ జంగ్ హయాంలో మిర్జా ఇబ్రహీం దంసా ఖిలేదార్ అయ్యాడు. సికందర్ ఝా (1803-1823) హయాంలో 1754 లో దంసా ఈ కోటను పునర్నిర్మాణం చేశాడు. బహదూర్ ఖాన్, కరీముద్దీన్ లు తరువాతికాలంలో ఖిలేదార్లుగా పనిచేశారు. కరీముద్దీన్ పేరుమీద కరీంనగర్ గా మారింది. 1905 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా, ఆరవ నిజాం మహాబుబ్ అలీ ఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందల్ నుండి కరీంనగర్ కి మార్చారు.

శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు వెడల్పు, 4 మీటర్లు లోతైన నీటి కందకాన్ని ఏర్పాటుచేసి అందులో మొసళ్లను వదిలేవారు. ఈద్ ప్రార్ధనల కొరకు ప్రత్యేక మసీదును కూడా ఈ కోటలో నిర్మించారు.
కొండమీది కోటను ఎలగందల్ కోట అంటారు ఇది ఒక చారిత్రక ప్రదేశం. దోమినార్ దోమినర్ను ముస్లిం మతం రాజులు అంటే నిజాం రాజులచే నిర్మించారు ఇది చార్మినార్ స్తంభాల ఎత్తున 2 పొడవైన స్తంభాలతో ఉంటుంది.

ఎలగందల్ కోట చరిత్ర
ఎలగందల్లో ఓ పురాతనమైన కోట అంటే కిల్లా ఉంది ఈ మధ్యనే తెలంగాణ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు ఎత్తైన కోట గోడలు అగర్తలు బలమైన చెక్క తలుపులు , వంకర దారులు రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతుంది టర్కీ ఫంచి ఇంజనీర్ల ప్రభావం వల్ల ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలివుంది ఈ గిరి దుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు 1195లో ప్రసిద్ధ యాదవ వంశపు రాజు జైతుగి ఎలగందుల కోటను పశపరచుకున్నాడు. 1345 నుండి 1439 వరకు బహుమనీ సుల్తాన్ లో పాలనలో ఉంది. మొఘల్లులో ప్రత్యక్షంగా 39 సంవత్సరాలపాటు పాలించారు. కరీంనగర్ గ్రామాన్ని స్థాపించిన సయ్యద్ కరీముద్దీన్ ఎలగందుల్ కోటకు ఖిలాదారుగా పనిచేశారు., 1905 వరకు జిల్లా యొక్క పాలన యంత్రాంగమంతా ఎలాగందలు కోట నుండి కేంద్రీకృతమై ఉండేది.
మానేరు నది తీరంలో తాటి చెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఎలగందలు కోట నిర్మించబడి. కోటకు ఒకవైపు మానేరు నది,మరొకవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి. ఇక్కడనుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానకోడూరు గ్రామానికి సురంగ మార్గం ఉన్నదని ప్రతీతి. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరిదుర్గం ఆ తర్వాత బహుమనీల,కుతుబ్షాహీలు, ఇమాత్ షాలు, అసఫ్ జహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్ర బిందువు అయింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండ శిఖరాల ఉన్న కోట తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్దవుల చేత నిర్మించబడింది. ముస్లిం సన్యాసులైన సయ్యద్ షా మునావర్ ఖాద్రి సాహెబ్ దూల షాహ్ సాహెబ్, సయ్యద్ మారుస్ సాహెబ్, షాహ్ తాలిబ్, వలి హైదర్ సాహెబ్ల సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. ఈ మినార్లు ఎక్కడానికి లోపలికి నుండి మెట్లు ఉన్నాయి. ఈ గ్రామంలోనే ఇంకో చివర దోమినార్ అనే కట్టడం ఉంది ఇది ముస్లింలు పండుగ రోజుల్లో ప్రార్థన చేసి ఈద్గా దీనిని బహుమనీ సుల్తానులు నిర్మించారు దీని పైకి వెళ్లడానికి కూడా లోపల నుండి మెట్లు ఉన్నాయి. ఇది ఒక పర్యాటక చారిత్రక ప్రదేశం.

You may also like

3 comments

Abby4220 November 26, 2025 - 4:51 pm Reply
Paige2207 November 28, 2025 - 12:12 pm Reply
Joe565 November 29, 2025 - 2:51 pm Reply

Leave a Reply to Joe565 Cancel Reply