Home బాల‌సాహిత్యం చిన్ని మొక్క-చిట్టితల్లి

చిన్ని మొక్క-చిట్టితల్లి

by Padma Tripurari

******
బాల గేయము
********
చిట్టితల్లి పెంచింది
చిన్ని మొక్కను
కబురులెన్నొ చెప్పింది
చిన్నిమొక్కతో.

మొక్కతల్లి నిమిరింది
చిట్టి బుగ్గను.
చిట్టితల్లి నవ్వింది
చిగురు తాకగా.

మొక్కతల్లి నువ్వే
నా ప్రాణమన్నది.
చిన్నిమొక్క, చిట్టితల్లి
నేస్తమయినవి.

చిన్ని కడవతో వచ్చి
చిట్టితల్లి
నీరు పోసి పెంచింది
చిన్ని మొక్కను

మొక్కతల్లి వేసింది
మారాకులు
మొగ్గలేసి నవ్వింది
పూల గుత్తిగా

చిట్టితల్లి అది చూసి
గంతులేసింది.
చిన్ని మొక్క కానుకగా
పువ్వులిచ్చింది.

చిట్టితల్లి సంతోషం
సంద్రమైనది.
చిన్ని మొక్క ఆనందం
ఊపిరయినది.
చిట్టితల్లి ఊపిరైనది.

You may also like

Leave a Comment