Home కవితలు నమో! నా దేశమా!!

నమో! నా దేశమా!!

by Peddurti Venkatadasu

అమ్మను దేవతగా పూజించే నా దేశంలో… ప్రతిదీ అద్భుతమే…

సాంకేతికతలో ఈ అవనిలోనే తలమానికమై

అలరారుతున్నా!

నైతికతలోనూ నా దేశం

అన్ని దేశాలకు ఆదర్శమే…

ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య విషయంలో ఎన్నో

కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నా

మన ఆధ్యాత్మికతతో అంటు కట్టుకున్న యోగా

విశ్వవ్యాప్తంగా ఆదరణకు

నోచుకోవడం ఆశ్చర్యమే-

చెట్టును పుట్టను గట్టును

గాలిని నీటిని వేటినీ వదలక

కళ్ళకద్దుకని ప్రకృతిని ప్రాణప్రదంగా

గౌరవించడం అపూర్వమే –

పుంఖాను పుంఖాలుగా పుస్తకాలను

వల్లే వెస్తే పుట్టలేదు ఇక్కడ భక్తి

మెదడు మొదళ్ళను తలుచుకొని

అనువంశికంగా మొలుస్తుంది

అది ఈ మట్టి శక్తి

ఒక చెంపపై కొడితే మరో చెంప

చూపించిన మహాత్ముణ్ణి గన్న

మన అవని – పరమ పావని

సౌశీల్య రాముణ్ణి రాజుగా కాక

దేవునిగా గుండెల్లో దాచుకున్న

ఈ దేశంలో పుట్టడమే మన భాగ్యం

నైస్వర్గికంగా కూడా మన దేశం

సర్వశ్రేష్ఠం అది మన సౌభాగ్యం!!

You may also like

Leave a Comment