Home కవితలు నాదేహమే దేశం!

నాదేహమే దేశం!

నాదేహ దేశ హృదయ కవాటాలు
మూసుక పోతున్నాయెందుకో
ఎంతతట్టినా మోడిన చెట్టు
చిగురించని హృదయ స్థితి
నిద్రలో నిజాలను జోకట్టాలన్న
మెల్కుంటునే మనసు చిద్రమై
పెదవులు కదపని స్థితి యేంటి
ఈదేహం నాదేనా?
నిశ్కర్షగా మాట్లాడితే ద్రోహులగొంతని
నాస్వదేహదేశము నిబంధన
సమస్తవయవాలను కదలనీయవు
ఈదేహాన్ని ముక్కలుముక్కలుగావిడగొట్టి
ఈదేహ బాగలను కాల్చి కూల్చాలనే
అసురసంధ్యా రక్కసులు పగలు
పగలే విజృంభిస్తు ఉన్మాదులై
రుద్రభుమిలో కలలను పండించతలచే
దృశ్యాలకు వాస్తవ హృదయాలు
కొలిమిలోని నిప్పులా ప్రజ్వరిల్లుతునే
ఏఉన్మాదవ్యవస్థలనైనా భస్మంచేస్తాయి.

You may also like

Leave a Comment