నేననుకున్నా…
ఒక్క విత్తు నాటితే
ఎన్నో విత్తనాలొచ్చే రైతుకి
ఎందుకు లాభం రాదని!
కానీ…
తర్వాత తెలిసింది
దానికోసం పడే శ్రమ ముందు
అది చాలా తక్కువ అని.
నేననుకున్నా…
మంచి నాయకులొస్తే
పేదల జీవితాలు మారుతాయని
కానీ..
తర్వాత తెలిసింది
వాళ్ళు అధికారం కోసం
మంచిగా నటించారని
నేననుకున్నా…
అభివృద్ధి అంటే
అందరూ ఉన్నతితో
సంతోషంగా ఉంటారని
కానీ
తర్వాత తెలిసింది
ఉన్నతి కోసం పడే పోటీలో
ప్రక్కవాళ్లను కూడా పట్టించుకోనంత
అభివృద్ధి చెందామని
నేననుకున్నా…
అందరూ మనవాళ్లేనని
కానీ
తర్వాత తెలిసింది
అందరూ ‘మనీ’వాళ్లేనని