Home వ్యాసాలు పసుపు పచ్చ

పసుపు పచ్చ

by Vijaya Kandala

ఈ రంగుల కథ మనం అనుకున్న దానికంటే క్లిష్టమైనది  .లోతైనది కూడా !మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని లోకానికి పరిచయం చేస్తుంది .

పసుపు రంగు ఆశావాదానికి ప్రతీక  .శుభకరీ ,శోభస్కరి  ,మంగళకరి అయిన పసుపు లేనిదే ఏ వంటిల్లు సమగ్రం కాదు మన దేశంలో  .హిందూమతంలో పసుపు పవిత్రతకు జ్ఞానానికి చిహ్నం .లక్ష్మీదేవికి సంబంధించిన రంగు. విష్ణుమూర్తి పీతాంబరుడు కదా!

 ఇంద్రధనస్సులో  మూడవ రంగుపసుపు . సూక్ష్మ బుద్ధికి  ,జ్ఞానానికి ప్రతీక చక్ర వ్యవస్థలో మణిపూర చక్రానికి సంబంధించినది . ఈ చక్రం మనిషి అహానికి  ,శక్తికి స్థానం.. చరిత్రకందని కాలంలో కనిపించే గుహల చిత్రలేఖనాలలో కనిపించే  ప్రధాన రంగుల్లో ఒకటిపసుపు రంగు . రోమ్ , ఈజిప్ట్ దేశాల్లో 17 వేల సంవత్సరాల పూర్వం ఉన్నగుహల్లోని  చిత్రలేఖనాల్లో ప్రస్ఫుటంగా కనిపించే రంగు పసుపు.  క్రైస్తవ ధర్మంలో  మోసం , వంచన అనే భావాలకు గుర్తుగా వాడేవారు ఒకప్పుడు .అదే ఈజిప్టులో బంగారు వర్ణమ్  శాశ్వత జీవితానికి ప్రతీక  .ఈజిప్షన్లు దేవతల చర్మం బంగారు పసుపు వర్ణంలో ఉంటుందని ఎముకలు పసుపు రంగులో ఉంటాయని నమ్మేవారు .

ఒకప్పుడు బౌద్ధ ధర్మం లో ఈ రంగు అణ కువకు వినయానికి గుర్తు  .బౌద్ధ శ్రమణులు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు . వారిలో జాగరుకతను స్థిరపరచడానికి ఈ పద్ధతినిబుద్ధుడు నిర్దేశించాడు .

చైనాలో ప్రాచీన కాలంలో పసుపు రంగు వస్త్రాలను కేవలం చక్రవర్తులే ధరించాలని నియమం ఉండేది . ఈ సంప్రదాయం ఒకప్పుడు రాజరికానికి  గౌరవానికి చిహ్నం  .

 జపాన్లో ధైర్యానికి చిహ్నం అయితే కొన్ని యూరోపియన్ దేశాలలో  అసూయ లేదా ద్రోహభుద్ధి కి సంకేతం  . మనదేశంలో ఈ రంగు జ్ఞానం అభ్యాసానికి చిహ్నం . ముఖ్యంగా వసంత పంచమి వేడుకల్లో సరస్వతి దేవి ఆశీస్సుల కోసం పసుపు రంగు దుస్తులు ధరించడం  ,అమ్మవారికి పసుపు రంగుతో చేసిన ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ .

కొన్ని ప్రాంతాలలో ఈ రంగుకు  వ్యతిరేకమైన అర్థాలు కూడా కనిపిస్తాయి . దీని వాడకంలో ఎల్లో బెల్లీ అంటే పిరికివాడు అని సూచించడానికి  ,ఎల్లో జర్నలిజం అంటే సత్య దూరమైన  ,అతిశయోక్తులతో నిండిన వార్తలని అర్థం  .చదువరుల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి రాతలు రాస్తారని , ప్రచారం చేస్తారని దీని భావం .

నూతన సంవత్సర వేడుకల్లో పసుపు రంగులో దుస్తులు ధరిస్తే ధనాన్ని సంతోషాన్ని అదృష్టాన్ని వ స్తుందని చాలామంది లాటిన్ అమెరికన్లు విశ్వసించేవారు ఒకప్పుడు .

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రంగుల పరిశోధకుడు హోవార్డ్ కెమ్ ప్రాసెసర్ ఆసుపత్రి గదులు ప్రశాంతతను ప్రతిబింబించాలని , రోగుల మనసులో ఆందోళనను తగ్గించడానికి కొన్ని సూచనలు చేశాడు . వాటి ప్రకారం గది పైకప్పుకు ఆకాశపు నీలం , నేలకు ఆకుపచ్చ  ,గోడలు ఉదయించే సూర్యుని  రంగు అయిన పసుపును వాడాలి .

Ketchup And  Mustard theory

ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ? బర్గర్ కింగ్  ,మెక్డోనాల్డ్ వారి లోగోలను గమనించారా ?ఇందులో ఎరుపు పసుపు రంగులు ప్రధానమైనవి .శాస్త్రబద్ధమైన ఆధారాలు దొరక్కున్న కొన్ని పరిశోధనలు ఎరుపు రంగు మనిషి ఆకలిని ప్రేరేపిస్తుందని  ,పసుపు రంగు సౌకర్యాన్ని సూచిస్తుందని అందుకని వీరు  రెండు రంగులను వాడారని అంటారు  .దీన్ని అద్భుతమైన కలయికని ఫ్రెంచ్ ఫ్రై లకు టమాటో కెచప్ గొప్ప జోడి అని అంటారు  .ఈ కాంబినేషన్ అత్యంత ప్రజాధరణ పొందిందని అందరికీ తెలుసు

పుష్యరాగం

నవరత్నాలలో పసుపు వన్నెతో ఉండేది పుష్యరాగం  .ఇది గురు గ్రహానికి చెందింది . కోరండం ఖనిజంతోనే పుష్యరాగాలు ఏర్పడతాయి . వీటిలో పారదర్శకమైన పసుపు రంగులో బంగారు వన్నెతో ధగధగలాడే రత్నాలను కనకపుష్యరాగాలని అంటారు . పురాతన కాలం నుండే ఇవి వాడుకలో ఉన్నాయి. ప్రాచీన గ్రీక్ , రోమన్  ,ఈజిప్షియన్  ,సింధులోయ నాగరికతల కాలంలో రాచ కుటుంబాల వారు ఆభరణాలలో వీటిని విరివిగా వాడేవారు .

ఆనందం ఆశావాదం

పసుపు రంగును చూడగానే మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది  .ఇది ఆనందాన్ని ఉల్లాసాన్ని  , ఉత్సాహాన్ని ,ఆశావాద దృక్పథాన్ని పెంచుతుంది  .

ఏ కాగ్రత మేధస్సు

ఇది మెదడును ఉత్తేజ పరుస్తుంది . జ్ఞాపకశక్తిని  ,ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది అందుకే స్టడీ రూము లో  పసుపు రంగు వాడడం మంచిదంటారు  .

ఆకలి

ఆకలిని ప్రేరేపించే రంగు . అందుకే రెస్టారెంట్లలో  ,డైనింగ్ రూములలో ఈ రంగుని ఎక్కువగా ఉపయోగిస్తారు  .

వాస్తు ఇంటి అలంకరణ

ఇంటి హాల్ లేదా డైనింగ్ రూమ్ లో పసుపు రంగు వేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం సంతోషం పెరుగుతాయని వాస్తు చెప్తోంది  .

పచ్చ కామెర్లు

మూత్రం పసుపు రంగులో రావడం అనేది దీని లక్షణం  .కాలేయ సంబంధిత సమస్య  .

పసుపు రంగు  వ్యక్తిలో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తుందని సైకాలజిస్ట్లు చెప్తుంటారు  .పసుపు మెదడు కార్యకలాపాలను పెంచుతుందని జ్ఞాపకశక్తిని మెరుగు  పరుస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు . అందుకే మార్కెటింగ్ నిపుణులు తమ వస్తువుల ప్యాకింగ్ లలో వాటి ప్రకటనల్లోనూ పసుపు రంగును ఎక్కువగా వాడుతుంటారు .

పసుపు రంగును మెచ్చేవారు

ఈ రంగును ఇష్టపడే వారి గురించి చెప్పడానికి చాలానే ఉంది   .ఆహ్లాదంగా చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు  .వ్యాపార దక్షత ఎక్కువ  .కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు . తాను ప్రత్యేకమైన వ్యక్తిని అనిపించుకోవడం వీ రికిష్టం  .ఎక్కువ మందితో స్నేహం చేస్తారు  .చూడడానికి మాడర్న్ గా కనిపించిన పాతకాలపు ట్రెండ్స్ అంటేనే ఎక్కువ మక్కువ  .

ఎం తటి క్లిష్ట పరిస్థితులైన తేలికగా హ్యాండిల్ చేయడం వీరి ప్రత్యేకత  .చాలా ఎమోషనల్  . కానీ ఏ ఫీలింగు బయటికి ప్రదర్శించరు. చాలా త్వరగా నిర్ణయాలు మార్చుకోవడం వీరి బలహీనత .

 త్వరగా  నిర్ణయాలను తీసుకుంటారు  .చురుకుగా పనిచేస్తారు  .సాధారణంగా ఎక్కువ  ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు . చాలా శక్తివంతులు  .

 ప్రతిభావంతులైన వ్యక్తులకు పసుపు రంగు పువ్వులు ఇవ్వడం ఆచారం. అతని ప్రతిభకు ప్రశంసలు ఈ రూపంలో అందిస్తున్నారని అర్థం. వీ రు ఎప్పుడు చుట్టుపక్కల వారికి ఆనందాన్ని పంచే స్వభావం కలిగి ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చెబుతారు ఉత్సాహంగా ఉంటారు ఎటువంటి పరిస్థితినైనా సానుకూల దృక్పథంతో స్వీకరించి ముందుకు సాగడం వీధి ప్రత్యేకత .

పసుపు గురించి మరి కాస్త

ఇది కంటికి అత్యంత ప్రకాశవంతంగా కనిపించే రంగు కనుక ట్రాఫిక్ లైట్స్ లో ఉపయోగిస్తారు .

బంగారం , ఉదయిస్తున్న సూర్యుడు   ,నిమ్మకాయ ఈ రంగు పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి  .

ఫోటోగ్రఫీలో గోల్డెన్ అవర్ అంటే సూర్యోదయం తర్వాత మొదటి గంట  ,సూర్యాస్తమయానికి ముందు చివరిగంట  .ఈ సమయంలో సూర్య కాంతి చాలా మృదువుగా  ,వెచ్చగా ఉంటూ అందమైన నీడలను ఇస్తుంది .ఫోటోలకు అద్భుతమైన రూపం ఇస్తుంది . పోర్ట్రైట్స్ , ల్యాండ్ స్కేప్  ,రొమాంటిక్ ఫోటోషూట్లకు సరైన సమయం .

మీకు తెలుసా పసుపు రంగును  చూసి భయపడే వారి భయాన్ని Xantophobia అంటారు .

 ఇది చాలా ప్రకాశ వం తమైంది . ప్రస్ఫుటంగా కనిపించే రంగు  .

పసుపు రంగుకు సంబంధించిన  సాంస్కృతిక చరిత్ర కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నది

 ట్రాఫిక్ లైట్లు మొట్టమొదటిసారిగా అమెరికాలో 1920 ప్రాంతాలలో ప్రవేశపెట్టారు  .తొలుత పసుపు నలుపు రెండు రంగులు మాత్రమే ఉండినవి .

రంగులు మన మెదడులో రకరకాలైన రసాయనాలను రిలీజ్ చేస్తాయి  .

 పసుపు రంగు మన మెదడులో  సెరటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది .ఈ సరటోనిన్  మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది  .

పొలాలలో కీటకాలను బారి నుంచి రక్షించడానికి పసుపు రంగు స్టిక్కీ ఉపయోగిస్తారు ఎందుకంటే కీటకాలు పసుపు రంగును త్వరగా ఆకర్షింపబడతాయి .

ఒకప్పుడు ఎల్లో ఫీవర్ అనేవ్యాధి  వ్యాప్తిలో ఉండేది  .ఇది దోమల ద్వారా  సోకుతుంది   .ఫ్లూ వంటి లక్షణాలతో తీవ్రమైన శారీరక బాధతో ఒకప్పుడు ప్రజలు బాధపడేవారు  .

మన దంతాలు పసుపు రంగులో మారడానికి కాఫీ టీ సో డాలాంటివి తాగడం ముఖ్యమైనకారణం . మన పంటి పైన ఉండేటువంటి ఎనామిల్ బలహీనం చేసి పసుపు రంగు పోరని ఏర్పరుస్తాయి

మరో వింతైన విషయం YELLO DAY అనేది కూడా ఉంది . సంవత్సరం మొత్తంలో చాలా సంతోషకరమైన రోజుగాదీన్ని  జరుపుకుంటారు . ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన జరుపుకుంటారు .

2016 ఫిబ్రవరిలో మలేషియన్ గవర్నమెంట్ పసుపు రంగు టీ షర్ట్ లను బ్యాన్ చేశారు  .ఎందువల్ల అంటే ఇది వేసుకున్న నిరసనకారులు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఉద్యమంలో లేవదీశారు .

John D. Hertz అనే  వ్యక్తి    Yellow Cab Company స్థాపించా .రు ఆయన కా రలన్నింటికీ   పసుపు రంగు పెయింట్తో ఉండేది  .ఆయన  పసుపు రంగు చాలా దూరం నుంచి కూడా త్వరగా గుర్తించడానికి వీలవుతుంది అని తెలుసుకున్నారు . అందువలన టాక్సీలు  అన్నిటికీ కూడా పసుపు రంగు వేయించి ఎల్లో క్యాబ్ కంపెనీ అనే పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు .

చివరిగా మరొక్క మాట

సమస్యలు ఎన్నున్నా  , సంఘర్షణలెన్నైనా మనసుంటే మార్గం అంటుంది  పసుపు రంగు .ఇదే జీవిత సత్యం .

విజయ కందాళ

9912842104

You may also like

1 comment

Cassandra4596 January 29, 2026 - 1:33 am Reply

Leave a Comment