Vijaya Kandala
Vijaya Kandala
రచయిత్రి పరిచయం పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది
మా అత్తగారితో లేకుండా ఉన్నాను . ఎప్పుడు ఏదో గొణుగుతూ విసుక్కుంటూ ఉంటుంది . ఇం ట్లో ఉండాలంటే ముళ్ళ మీద ఉన్నట్టు ఉంది ,అన్నది మా సుశీల మొన్న ఇంటికి వచ్చినప్పుడు .సుశీల మామగారు పోయి ఏడాది అయింది .అప్పటినుంచి అత్తగారు సుశీల దగ్గరే ఉంటుంది .
విసుక్కోవడం కొనుక్కోవడం నీ మీదనా లేక మరెవరి మీద నన్నా మొదట్లో నా మీదే అనుకున్నాను .చూడగా చూడగా ఎవరిమీద కాదేమో అనిపిస్తుంది .24 గంటలు మూత పడదు గదాఆ నోరు . ఇంటి పని పాటల్లో సాయం చేస్తుందా నీకు అని అడిగాను తిరిగి .అలాంటి వాటికి తడుముకో నక్కరలేదు పిల్లల పని ,వంట పని అన్ని ఆవిడే చూసుకుంటుంది .ఆవిడొచ్చింది నాకు పని తేలికైన మాట నిజమే కానీ ,ఆ గునుగు మటుకు భరించలేకుండా ఉన్నాను .నీ మీద కాదు కదా అది .ఆమె స్వభావమే ఉండవచ్చు విననట్టు ఊరుకో రాదా అని సలహా ఇచ్చాను .
ఏమో బాబు ఆ గుణ గుడు తో ఆవిడ మీద ఉండే గౌరవం పోతుంది .సుశీలా మనుషుల్లో అన్నీ మంచి గుణాలే కావాలి ,మనుషులంతా లోపరహితులై ఉండాలి అనుకోవడం ,అందరాని పండ్లకు ఆశించడం లాంటిది .మనకి ఇబ్బంది కలగని వి మనకి అ పకారం చేయనివి అయిన గుణాలు ఇతరుల్లో ఉంటే ,వాటిని గురించి ఒకటికి పది సార్లు అనుకుని అవతల వాళ్ళని ద్వేషించడం మొదలు పెడతాం . అది తప్పు కదా.

మా సుశీల మాటే చూడండి అన్ని పనులు ఇ ట్టే చేస్తుంటే సుఖ పడక ,ఆ ద్వేషించడం ఎందుకు చెప్పండి . ప్రేమించడం కంటే ద్వేషించడం తేలిక .సుశీల అత్తగారి లో ఉన్న గొణుగుడు సుశీలకి ఏమాత్రం ఇబ్బంది కలిగించేది కాదు .అసలు సుశీల ఆ గొణుగుడు గురించి ఆలోచించడం మా నేసి అత్తగారి లోని ఇతర మంచి గుణాలు చూసి ప్రేమించడం నేర్చుకుంటే ఎంతో సుఖపడుతుంది . జీ వితంలో సుఖపడాలి ,చుట్టూ ఉన్న వారిని సుఖ పెట్టాలి అనుకుంటే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి . అం టే చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి .వారి సుగుణాన్ని , లోపాన్ని ఒకే దృష్టితో తీసుకొని అవతలి వారిని అర్థం చేసుకోవడం మొదలు పెడితే చాలా హాయిగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది .అవతల మనిషిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే .హృ దయ వైశాల్యం పెరిగి మన అంతరాంతరాలలో ఉన్న అసూయ ,క్రోధం ,ద్వేషం లాంటి భావాలు మాయమైపోతాయి.
ఎప్పుడు రుస రుస లాడే మనిషి కూడా కొన్ని కొన్ని క్షణాలలో మనసారా నవ్వకుండా ఉండలేడు .ఇలాంటి క్షణాలు కల్పించడం లోనే ఉంది మన చాకచక్యం .ఆఫీసులో ఉన్న అరడజనుమంది ఉద్యోగి ను లలో మేరీని చూస్తే అందరికీ హడల్ .మేరీ ఎప్పుడైనా నవ్విందా అని అనుమానంగా ఉండేది .మేరీ ని అందరూ పులి అని పిలుస్తుండేవారు .
ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన జానకి మాత్రం మేరీ తో చాలా చనువుగా నవ్వుతూ మాట్లాడుతుండేది .అసలు జానకి రాకతో మేరీ నవ్వడం నేర్చుకుంది .జానకిని ఎవరో అడిగారు మేరీ తో స్నేహం ఎలా చేస్తున్నావు అని .మొదట్లో మీరు చెప్పినట్టే మేరీ పులి అనుకున్నాను . పదేపదే పలకరించడంతో అసలు మేరీ పులి కాదు మేక పిల్లఅని తేలింది .మేరీ అంత మంచి మనిషి కు ఇంతవరకు కనపడలేదు .మేరీ ని అర్థం చేసుకునే అంత ఓపిక లేక పోయిందిఅందరికీ . నాకు అందరూ నవ్వుతూ ఆనందంగా ఉండాలనిపిస్తుంది .మీరు కూడామేరీ నవ్వుతుంది గమనించారా . అందరూ జానకి లాగా నవ్వుతూ చుట్టూ ఉన్న మనుషుల్ని నవ్విస్తూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే జీవితం ఎంతో హాయిగా ఉంటుంది .
మనుషులలో అన్ని సద్గుణాలు కావాలి ,దుర్గుణాలు వద్దు అంటే లాభం లేదు .వెలుగునీడలలా మానవులలో మంచి చెడు రెండూ ఉంటాయి . ఈ రెండింటితో మనం మనుషుల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తేనే ఆనందం .ముందు మీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మి ,వాళ్ళ మిమ్మల్ని నమ్మేట్టు చేసుకుంటే అబద్దాలు ,పాపాలు చాలా మటుకు తగ్గిపోతాయి . ప్రతి నూతన పరిచయాన్ని పదిలంగా చూసుకోవాలి .కొత్త వాళ్ళని కలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తూ ,వారిని అర్థం చేసుకునేందుకు మీ హృదయం తెరిచి ఉంచుకోవాలి .ఒంటరి జీవితంలో నైరాశ్యం చోటు చేసుకుంటుంది . అనుభవాలు ఎక్కువైన కొద్దీ భిన్న ప్రవృత్తులు గల వారిని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. అంటే మీ భావ ప్రపంచం కూడా విస్తరిస్తుంది . వారి మీద ద్వేషానికి బదులు అనుభూతి కలుగుతుంది .సూర్యోదయం ఎలా కొత్త దో అలాగే ప్రతి కొత్త పరిచయం జీవితానికి నూతన వెలుగు ఇచ్చేటట్టు చేసుకోవడం మనలో ఉంది .అంటే సానుభూతితో అర్థం చేసుకుని ప్రేమించాలి .అందరినీ ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరు మిగలరు .
పెళ్లి ,వ్రతం,పూజ మొదలైన శుభకార్యాల్లో మత్తైదువులు వచ్చి చేసే మంగళకార్యానికి పేరంటమని పేరు.ఇదే అర్థంలో పేరంటాలు అని కూడా వాడుతారు.
అది క్రమంగా ఇరుగుపొరుగు స్త్రీ అనీ,శుభకార్యాలకు ఆహ్వానించదగిన స్త్రీ అని అర్థం వచ్చింది. దీనికి విపరీతంగా కాలక్రమంలో పసుపు,కుంకుమతో భర్త శవంతో బాటే చితినెక్కిన స్త్రీని పేరంటాలని పిలవడం మొదలైంది.ఈ పధ్దతి ముగిసి చాలాకాలమైంది .కానీ మన చరిత్రలోని మెరుపులతో బాటు మరకలను కూడా తెలుసుకోవాలి గదా.
క్లుప్తంగా సంప్రదాయ పరిచయమే ఈ చిరువ్యాసం.ఈ ప్రక్రియను సహగమనం లేదా సతి లేదా సాగుమానం అంటారు. అలా చేసిన స్త్రీని సతి లేదా పేరంటాలు అని అంటారు.
సహగమనమంటే తోడుగా వెళ్ళడమని అసలర్థం.కానీ అలవాటులో తోడుగా మరణించుట అనే అర్థం వచ్చి చేరింది. పరమ శివుని నింద వినజాలక పార్వతీ దేవి అగ్నికి ఆహుతైన కథ మనందరికీ తెలిసిందే.ఆ సతీదేవి కథనే దీనికి స్ఫూర్తి అని కొందరి భావన.పతి చితిలో సతి అగ్నికి ఆహుతవడమని జనంలో సాదారణ అర్థం. వివిధ కులాలో,ప్రాంతాలలో విభిన్న రీతులుండేవి.
భర్త శవంతోబాటు స్త్రీని సజీవంగా గోతిలో పూడ్చిపెట్టడం చూసానని ప్రసిధ్ధ విదేశీ యాత్రికుడు న్యూనిజ్ రాసాడు.అబాగినులైన స్త్రీలపై మత్తుమందు ప్రయోగించేవారని చరిత్రకారుల పరిశోధనల్లో తేలింది.విజయనగర సామ్రాజ్య కాలంలో ఇలాంటివి అనేకం చూసామని నాటి విదేశీ యాత్రికులు బార్బొసా, సీజర్ ఫ్రెడరిక్ వర్ణించారు.
కారణాలను మనం ఊహించుకోవడమే.భర్త పట్ల తీవ్రమైన ప్రేమ,కీర్తికాంక్ష ,దేవతగా పూజింపబడతాననే భావన, సంఘంలో లభించే గౌరవాభిమానాలు – ఇందులో ఏదో ఒకటి గానీ,అన్నీ కలిసిగానీ కారణాలు కావచ్చు.కొన్ని స్మృతులలో సహగమనం చేసిన స్త్రీకి స్వర్గం లభిస్తుందని చెప్పటం వల్లకూడా కొన్ని జరిగి ఉండవచ్చు.
సంతానంలేని స్త్రీ జీవించిఉంటే ఆ వ్యక్తి ఆస్తిని ఆనుభవించే అవకాశముండదని వారసులు దీన్ని ప్రోత్సహించే వారని కొందరి అభిప్రాయం.ఇలా సహగమనం ( సాగుమానం ) చేసిన స్త్రీవల్ల పుట్టింటి వారికి,అత్తింటివారికి 3 తరాల వరకు పుణ్యలోకాలు కలుగుతాయనే నమ్మకంతో ఇరువైపుల బంధువులు ( ముఖ్యంగా స్త్రీలు ) ప్రోత్సహించేవారని మరి కొందరంటారు.
దుర్భర వైధవ్య బాథలు అనుభవించడంకంటె సహగమనం చేస్తే,ఒక్కసారే కష్టాలు గట్టెక్కుతాయని ఆలోచించేవారని కొంతమంది విశ్వాసం.కారణమేదైనా బలిపశువు స్త్రీయే.
ఈ సంప్రదాయం మరో రూపంలో రసపుత్రులలో ప్రబలంగా ఉండేది.భర్త ఉన్నా శత్రువుల వల్ల మానహానికి అవకాశముందని తెలిసిన రాజవంశపు స్త్రీలందరూ మూకుమ్మడిగా అగ్ని ప్రవేశం చేసేవారు.ప్రాణాని కంటే మానానికెక్కువ ప్రాధాన్యమిచ్చే ఈ సంప్రదాయాన్ని జోహార్ అనేవారు.
19 వ శ.వచ్చేసరికి ఈ పధ్ధతి విపరీత దశకు వచ్చేసింది.ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో 1818లో బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉన్న ఇండియాలో మొత్తం 839 సహగమనాలు జరిగితే ,అందులో కేవలం బెంగాల్ లోనే 544 జరిగాయి. తరవాతి స్థాయిలో వారణాసి,బరైలీ,బీహార్ ప్రాంతాల్లోజరిగాయి.
ఉమ్మడి మద్రాస్ రాష్టం లో గంజాం,విశాఖ,రాజమండ్రి ,గుంటూరు, నెల్లూరు ,చిత్తూరు,కడపల్లో జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
నాడు స్త్రీ పునర్వివాహ ప్రసక్తి లేదు.జీవితమంతా అశుభానికి ప్రతీకగా ,అవమానాలు ,కష్టాలు భరిస్తూ గడపడం కంటె భర్తతోపాటు మరణించి పూజలందుకోవడం మేలని తలచేవారేమో.అయితే ఆనందంతో ఆ మోదించే వారూ ఉన్నారని చరిత్ర చెప్తోంది.స్వఛ్చందంగానే చేస్తున్నామని చూడవచ్చిన వారితో చెప్పడం తనకు తెలుసని బార్బోసా రాశాడు.
ఇలా బొమ్మగౌడ అనే అతని భార్య సంతోషంగా సహగమనం చేస్నట్లు షిమోగా జిల్లాలో దొరికిన ఒకశాసనం వల్ల తెలుస్తోంది. 1743 లో కాసింబజార్ లోని రామ్ చెంద్ పండిట్ మరణిస్తే అతని భార్య17 సంవత్సరాల వయస్సులో సహగమనానికి సిద్దపడితే నగరంలోని వర్తకులందరూ ఆ ప్రయత్నం నుండి మరలించడానికి అనేక రకాలుగా ప్రయత్నించారట.ఆమె ఫౌజ్ దార్ అనుమతితో సహగమనం చేసిందట.
ఇందోర్ పరిపాలకురాలైన రాణి అహల్యాబాయి కూతురు ముక్తాబాయి సహగమనం చేసింది.తల్లి ఎంత బ్రతిమిలాడినా వినలేదు. ఆ తల్లి ఆ ప్రదేశంలోకూతురికొకగుడి కట్టించింది.
ఇంత ఘోరాన్ని ఆపడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదా అని ఆశ్చర్యపోకండి. చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి.అంతకు రెండురెట్లు వ్యతిరేకతలూ ఎదురయ్యాయి. మధ్యయుగాల్లో అక్బర్,సిక్కు గురువులు ,పీష్వాలు దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు.
1780 ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ చేసిన ప్రయత్నాలు హిందూ వ్యతిరేకత వల్ల ముందుకు సాగలేదు.కొంతకాలానికి రాజారామ్మోహన్ రాయ్ వంటివారు దీనికి వ్యతిరేకంగా ఒకఉద్యమమే లేవదీసారు,ఈ సందర్భంలో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ చొరవ తీసుకుని అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సేకరించాడు. హిందువుల వ్యతిరేకతను లెక్కజేయకుండా 1829లో సహగమనాన్ని శిక్షార్హమైన నేరంగా లెక్కిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసాడు.
మన ఆంధ్ర ప్రాంతంలో దీనికి సాగుమానం,చిచ్చురుకుట ,గుండాన బడుట అని రకరకాలుగా పిలుస్తారు.చరిత్ర ఆధారాలను చూస్తే 12 వ శ . నుండీ జరిగినట్లు తెలుస్తుంది.గత 800 సంవత్సరాలుగా చాలానే జరిగాయి.ప్రసిధ్ది పొందిన పేర్లు చాలానే వినిపిస్తాయి.వత్సవాయి సీతమ్మ ( 1761 ) , వాసిరెడ్డి అచ్చమ్మ ( 1763 )బాలసన్యాసమ్మ లిస్టు పెద్దదే ఉంది .వీరంతా పేరంటాలు అనే పేరిట నేటికీ పూజలందుకుంటున్నారు.వీరి మహిమలను గూర్చి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే వాస్తవాలు,విశ్వాసాలు పాలునీళ్లలా కలిసిపోయాయి.
ఈ ఆధునిక కాలంలో ఇలాంటివాటిని ఎవ్వరూ ప్రోత్సహించరు.అనుమతించరు.కానీ ప్రాచీన సంస్కృతీ అధ్యయనంలో భాగంగా వీటిని గురించి రేఖామాత్రంగా నైనా తెలుసుకోవాలి.వారి చారిత్రక,సాంఘిక,ఆర్థిక దృక్పథాలనుఅవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి.
ఇంతకుముందు చెప్పుకున్నట్లు మెరుపులతోబాటు మరకలూ ఉంటాయి.వీటినీ ఒకనాడు ఎంతో పవిత్ర బాధ్యతగా గౌరవించే వారని తెలిస్తే చాలు.
రంగు అనగానే మొదట గుర్తొచ్చే రంగు రెడ్ .అదే ఎరుపు . సందేహిస్తున్నారా ?ఒక్క క్షణం ఆగండి . కళ్ళు మూసుకుని ఇలా ఊహించుకోండి .మీరు దట్టమైన అడవిలో చిన్న కాలిబాట వెంబడి నడుస్తున్నారు . .చుట్టూ అనేక వర్ణాల ఆకుపచ్చ పరచుకున్న పచ్చదనం .ఎక్కడో సుదూరంగా ఆకుల మధ్య లోంచి తొంగి చూస్తున్న చిన్ని ఎర్రని గడ్డిపువ్వు . వెంటనే మీకు తెలియకుండానే మీ దృష్టి అటువైపు మళ్ళు తుంది అదే ఎరుపు రంగు మహత్యం ఒప్పుకుంటారా !
ప్రతి రంగుకు ఉష్ణోగ్రత ఉంటుంది .ఊదా రంగు నుండి ఎరుపు రంగుకు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది .అందుకే ఇది చలింప చేసే రంగు . మిగిలిన రంగులు అందమైనవి ,కోమలమైనవి కావచ్చు . కానీ , ఇది ఉత్తేజపరిచే రంగు .
ఎరుపు అంటే ఉద్వేగం .ఎరుపంటే శక్తి .అగ్ని తత్వానికి ప్రతీక . నాడీ కణాలను రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. పంచేంద్రియాలలో చు రుకు పుట్టిస్తుంది .లోన దాగిన భావా వేశాలను ఉద్రేకాలను బయటపెడుతుంది . సమర్థమైన రంగు అంటే ఎరుపే .ఎరుపు రంగులో ఎన్నో షేడ్స్ ఉన్నాయి .మెరూన్ -కార్డినల్ -అరుణము -కుంకుమ రంగు,-రక్తం ఎరుపు -లోహితం ముఖ్యమైనవి
బూర్గుండి , క్లారిటీ ,సిరీస్ వెర్మిలియన్ , క్రిమిసన్ ,స్కార్లెట్ ఎరుపు .ఎ న్నో పేర్లు . అతి ప్రాచీన గుహలలో చిత్రకళలోతొంగి చూసిన మొదటి రంగు ఇది . చారిత్రాత్మకంగా త్యాగం , ప్రమాదం ,ధైర్య గుణాలకు సంకేతం .యూరప్ లోని ఆధునిక సర్వేలు ఈ రంగును వేడి ,కార్యాచరణ ,అభిరుచి , కోపం ,ప్రేమకు సంబంధించినదిగా నిరూపిస్తున్నాయి . కలలో ఎరుపు రంగు లేదా ఎర్రని వస్తువులు కనిపిస్తే ,మీ జీవితం ఇప్పుడు మెరుగ్గా ఉందని ,త్వరలో మరింత ఆనందాన్ని అనుభవిస్తారని అర్థం .
అనేక ఆసియా దేశాలలో ఇది ఆనందాన్ని, అదృష్టాన్ని సూచించే రంగు .
ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అంగారక గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అంటారు.
తూర్పు ఐరోపా నుండి వియత్నాం వరకు కమ్యూనిస్టు పార్టీల రంగు ఎరుపు .
పాశ్చాత్య దేశాలలో ఎరుపు అమరవీరుల త్యాగానికి చిహ్నం .
1968 లో జరిగిన విఎన్ఆర్ కన్వెన్షన్ లో రహదారి సంకేతాలకు అంతర్జాతీయ రంగుగా ప్రామాణికరించారు .
1917లో బోన్షివిక్ విప్లవం తర్వాత సోవియట్ రష్యా ఎర్రజెండాను స్వీకరించింది .
మానవ జనాభాలో ఒకటి నుండి రెండు శాతం మందికి ఎర్రటి జుట్టు సహజంగా ఉంటుంది .
20వ శతాబ్దం ప్రారంభంలో నగరాల్లోని కొన్ని ప్రాంతాలను రెడ్‌లైట్ ఏరియాగా పేర్కొనడం మొదలుపెట్టారు .
ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా జట్లు ఎరుపు రంగు యూనిఫామ్ లను వాడతారు .
తప్పు చేస్తూ పట్టుబడే సందర్భాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం అంటారు .
కలర్ థెరపీ ప్రకారం ఎరుపు రంగు పరిసరాల్లో వాడడం వల్ల రక్తహీనత తగ్గుతుంది .
వా త లక్షణాలు తగ్గుముఖం పడతాయి .
తడి పొడి దగ్గు లక్షణాలు మెరుగవుతాయి
రెడ్ లైట్ ఏరియా లేక డిస్ట్రిక్ట్ అనేది పట్టణ ప్రాంతాల్లోని ఒక నిర్దిష్ట ప్రాంతం . ఈ ప్రాంతంలో అధిక లైంగిక ఆధారిత కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇది మనుషులను ఆర్థికంగా ,మానసికంగా ,సాంఘికంగా ,ఆరోగ్యపరంగా , నైతికంగా పీల్చి పిప్పి చేసే ప్రాంతం . ఇది ఒక ఊబి లాంటిది . ఇందులో నుంచి బయటకు రావడం సాధారణంగా జరగదు . వచ్చినా చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రాణరక్షణ చేసుకుందామనే బాపతు వ్యవహారం .

ఎర్రని అరటి పండు
ఒకప్పుడు ప్రాంతీయంగా దొరికే ఎరుపు అరటి పళ్ళు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయి అన్ని చోట్ల దొరుకుతున్నవి .దీంట్లో పోషకాలు ఎక్కువ .ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం .నరాల సమస్య మూర్ఛ వ్యాధితో బాధపడేవారు , తరచుగా వాడితే మంచి గుణం కనిపిస్తుంది .క్రమం తప్పకుండా వాడితే పునరుత్పత్తి వ్యవస్థ బలో పేతమై సంతానోత్పత్తి అవకాశాలు మెరుగవుతాయి .కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి పరిష్కారం .చర్మ రోగాలకు పైపూతగా దీని తొక్కను వాడుతారు .
కర్మాగారాల్లో ఎరుపు ప్రమాద సంకేతం . ఆపరేషన్ థియేటర్లలో బయట కనిపించే ఎర్ర బల్బ్ కార్యాచరణకు సంకేతం మరి ఇలాంటి రంగును ఇష్టపడే వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా?
ఎ రుపు రంగును ఇష్టపడే వారిలో దూకుడు స్వభావం ,దృఢమైన ఆలోచన విధానం ఉంటుంది . ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవిశ్రాంతంగా పనిచేస్తారు మార్పులు కొరేవారిలో ముందుంటారు . గుండె నిబ్బరం , క్రమశిక్షణ వీధిలో ఎక్కువ .సాధారణంగా ధైర్యవంతులు , ఉత్సాహవంతులు ,ఆత్మ విశ్వాసం కలిగిన వీ రు జీవితాన్ని అభిరుచులతో ఆస్వా దిస్తారు .నాయకత్వ లక్షణాలు ఎక్కువ .శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం వల్ల సమూహంలో నాయకుడిగా రాణిస్తారు .సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు .చాలా ఎమోషనల్ మనుషులు .అనర్గళంగా అనేక విషయాలపై మాట్లాడగలరు తమ కల లను సాకారం చేసుకోవడానికి పట్టుదలతో కృషి చేస్తారు .
అయితే చాలా త్వరగా వీరికి కోపం వస్తుంటుంది
ఎరుపు రంగు _మానవ స్వభావం పై చాలా పరిశోధనలు జరిగాయి . ఈ రంగును గోడలకు వాడినప్పుడు కొంతమంది రోగులు వారి రుగ్మతల త్వరగా తగ్గినట్లు చెప్పారు .హుశా ఈ కారణం చేతనే రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ గా ఏర్పడిందేమో . ఆదరణకు చిహ్నం ఈ రంగు
ఆకలిని ఎక్కువ చేస్తుంది అందుకే హోటళ్లలో చాలా పదార్థాలు ఆకర్షణీయంగా ఉండడానికి ఎరుపు రంగులో సిద్ధం చేస్తూ ఉంటారు . సభలకు మీటింగ్‌లకు ముఖ్య అతిథులు చివరగా వస్తారు. అలా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎర్రని అతిధి ఎవరో తెలుసా ఇంకెవరు ఎర్ర గులాబీ .
గులాబీలలో ఎన్నో రంగులు ఉన్న ఎరుపు గులాబీ స్థానం వేరు .దాని తరహానే వేరు సుమా !వాలెంటైన్స్ డే మొదలుకొని మహిళా దినోత్సవం వరకు ఎర్ర గులాబీల సందడే సందడి . లవ్ యు చెప్పడానికి , ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇంతకంటే గొప్ప కానుక ఇంకేముంటుంది చెప్పండి .
గాఢమైన ప్రేమను నిశ్శబ్దంగా తెలియచెప్పే సున్నితమైన హృదయ స్పందనే ఎర్రగులాబి .పురాతన కాలం నుండి ఎర్ర గులాబీ ప్రేమకు ,శౌర్యానికి ,ధై ర్యానికి చిహ్నంగా పేరుగాంచింది .గ్రీకు పురాణాలలో ఎర్ర గులాబీలు ప్రేమతో అనుసంధానమై ఉన్నాయి
మన జీవితం రంగులమయం . దాని ఆవేశంతో ,అనుమానంతో ,అసహనంతో గడిపితే మిగిలేది అంతులేని ఒంటరితనం అంతేలేని ఏకాంతం .ప్రకృతిలో కనిపించే రంగులన్నీ సంస్కృతి పరిరక్షణలో రంగవల్లికలై మన జీవితాన్నిశోభాయమానం చేస్తున్నాయి .భారతీయ ఆత్మకు అభివ్యక్తీకరణమే ఈ రంగుల సమ్మేళనం.
ప్రకృతిలో సంస్కృతిలో కనిపించే రంగులన్నీ ప్రతీకాత్మకమైనవి .ప్రత్యకమైనవి . భారతీయ ఆత్మకు అభివ్యక్తీకరణమే రంగుల సమ్మేళనం .రంగులు మన జీవిత గమనంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి . మతం – రాజకీయం– పండుగలు – వేడుకలు అన్నింట్లోనూ రంగుల ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. మానవ జీవితంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది . ప్రకృతిని ,పరిసరాలను రాగరంజితం చేసే రంగులు మన భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి .ఋతువులు మారగానే రంగుల కలయిక మారుతుంది .
ఈ రంగుల కథ మనం అనుకున్న దానికంటే క్లిష్టమైనది .లోతైనది కూడా !మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని లోకానికి పరిచయం చేస్తుంది .
పసుపు రంగు ఆశావాదానికి ప్రతీక .శుభకరీ ,శోభస్కరి ,మంగళకరి అయిన పసుపు లేనిదే ఏ వంటిల్లు సమగ్రం కాదు మన దేశంలో .హిందూమతంలో పసుపు పవిత్రతకు జ్ఞానానికి చిహ్నం .లక్ష్మీదేవికి సంబంధించిన రంగు. విష్ణుమూర్తి పీతాంబరుడు కదా!
ఇంద్రధనస్సులో మూడవ రంగుపసుపు . సూక్ష్మ బుద్ధికి ,జ్ఞానానికి ప్రతీక చక్ర వ్యవస్థలో మణిపూర చక్రానికి సంబంధించినది . ఈ చక్రం మనిషి అహానికి ,శక్తికి స్థానం.. చరిత్రకందని కాలంలో కనిపించే గుహల చిత్రలేఖనాలలో కనిపించే ప్రధాన రంగుల్లో ఒకటిపసుపు రంగు . రోమ్ , ఈజిప్ట్ దేశాల్లో 17 వేల సంవత్సరాల పూర్వం ఉన్నగుహల్లోని చిత్రలేఖనాల్లో ప్రస్ఫుటంగా కనిపించే రంగు పసుపు. క్రైస్తవ ధర్మంలో మోసం , వంచన అనే భావాలకు గుర్తుగా వాడేవారు ఒకప్పుడు .అదే ఈజిప్టులో బంగారు వర్ణమ్ శాశ్వత జీవితానికి ప్రతీక .ఈజిప్షన్లు దేవతల చర్మం బంగారు పసుపు వర్ణంలో ఉంటుందని ఎముకలు పసుపు రంగులో ఉంటాయని నమ్మేవారు .
ఒకప్పుడు బౌద్ధ ధర్మం లో ఈ రంగు అణ కువకు వినయానికి గుర్తు .బౌద్ధ శ్రమణులు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు . వారిలో జాగరుకతను స్థిరపరచడానికి ఈ పద్ధతినిబుద్ధుడు నిర్దేశించాడు .
చైనాలో ప్రాచీన కాలంలో పసుపు రంగు వస్త్రాలను కేవలం చక్రవర్తులే ధరించాలని నియమం ఉండేది . ఈ సంప్రదాయం ఒకప్పుడు రాజరికానికి గౌరవానికి చిహ్నం .
జపాన్‌లో ధైర్యానికి చిహ్నం అయితే కొన్ని యూరోపియన్ దేశాలలో అసూయ లేదా ద్రోహభుద్ధి కి సంకేతం . మనదేశంలో ఈ రంగు జ్ఞానం అభ్యాసానికి చిహ్నం . ముఖ్యంగా వసంత పంచమి వేడుకల్లో సరస్వతి దేవి ఆశీస్సుల కోసం పసుపు రంగు దుస్తులు ధరించడం ,అమ్మవారికి పసుపు రంగుతో చేసిన ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ .
కొన్ని ప్రాంతాలలో ఈ రంగుకు వ్యతిరేకమైన అర్థాలు కూడా కనిపిస్తాయి . దీని వాడకంలో ఎల్లో బెల్లీ అంటే పిరికివాడు అని సూచించడానికి ,ఎల్లో జర్నలిజం అంటే సత్య దూరమైన ,అతిశయోక్తులతో నిండిన వార్తలని అర్థం .చదువరుల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి రాతలు రాస్తారని , ప్రచారం చేస్తారని దీని భావం .
నూతన సంవత్సర వేడుకల్లో పసుపు రంగులో దుస్తులు ధరిస్తే ధనాన్ని సంతోషాన్ని అదృష్టాన్ని వ స్తుందని చాలామంది లాటిన్ అమెరికన్లు విశ్వసించేవారు ఒకప్పుడు .
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రంగుల పరిశోధకుడు హోవార్డ్ కెమ్ ప్రాసెసర్ ఆసుపత్రి గదులు ప్రశాంతతను ప్రతిబింబించాలని , రోగుల మనసులో ఆందోళనను తగ్గించడానికి కొన్ని సూచనలు చేశాడు . వాటి ప్రకారం గది పైకప్పుకు ఆకాశపు నీలం , నేలకు ఆకుపచ్చ ,గోడలు ఉదయించే సూర్యుని రంగు అయిన పసుపును వాడాలి .
Ketchup And Mustard theory
ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ? బర్గర్ కింగ్ ,మెక్‌డోనాల్డ్ వారి లోగోలను గమనించారా ?ఇందులో ఎరుపు పసుపు రంగులు ప్రధానమైనవి .శాస్త్రబద్ధమైన ఆధారాలు దొరక్కున్న కొన్ని పరిశోధనలు ఎరుపు రంగు మనిషి ఆకలిని ప్రేరేపిస్తుందని ,పసుపు రంగు సౌకర్యాన్ని సూచిస్తుందని అందుకని వీరు రెండు రంగులను వాడారని అంటారు .దీన్ని అద్భుతమైన కలయికని ఫ్రెంచ్ ఫ్రై లకు టమాటో కెచప్ గొప్ప జోడి అని అంటారు .ఈ కాంబినేషన్ అత్యంత ప్రజాధరణ పొందిందని అందరికీ తెలుసు
పుష్యరాగం
నవరత్నాలలో పసుపు వన్నెతో ఉండేది పుష్యరాగం .ఇది గురు గ్రహానికి చెందింది . కోరండం ఖనిజంతోనే పుష్యరాగాలు ఏర్పడతాయి . వీటిలో పారదర్శకమైన పసుపు రంగులో బంగారు వన్నెతో ధగధగలాడే రత్నాలను కనకపుష్యరాగాలని అంటారు . పురాతన కాలం నుండే ఇవి వాడుకలో ఉన్నాయి. ప్రాచీన గ్రీక్ , రోమన్ ,ఈజిప్షియన్ ,సింధులోయ నాగరికతల కాలంలో రాచ కుటుంబాల వారు ఆభరణాలలో వీటిని విరివిగా వాడేవారు .
ఆనందం ఆశావాదం
పసుపు రంగును చూడగానే మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది .ఇది ఆనందాన్ని ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని ,ఆశావాద దృక్పథాన్ని పెంచుతుంది .
ఏ కాగ్రత మేధస్సు
ఇది మెదడును ఉత్తేజ పరుస్తుంది . జ్ఞాపకశక్తిని ,ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది అందుకే స్టడీ రూము లో పసుపు రంగు వాడడం మంచిదంటారు .
ఆకలి
ఆకలిని ప్రేరేపించే రంగు . అందుకే రెస్టారెంట్లలో ,డైనింగ్ రూములలో ఈ రంగుని ఎక్కువగా ఉపయోగిస్తారు .
వాస్తు ఇంటి అలంకరణ
ఇంటి హాల్ లేదా డైనింగ్ రూమ్ లో పసుపు రంగు వేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం సంతోషం పెరుగుతాయని వాస్తు చెప్తోంది .
పచ్చ కామెర్లు
మూత్రం పసుపు రంగులో రావడం అనేది దీని లక్షణం .కాలేయ సంబంధిత సమస్య .
పసుపు రంగు వ్యక్తిలో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తుందని సైకాలజిస్ట్‌లు చెప్తుంటారు .పసుపు మెదడు కార్యకలాపాలను పెంచుతుందని జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు . అందుకే మార్కెటింగ్ నిపుణులు తమ వస్తువుల ప్యాకింగ్ లలో వాటి ప్రకటనల్లోనూ పసుపు రంగును ఎక్కువగా వాడుతుంటారు .
పసుపు రంగును మెచ్చేవారు
ఈ రంగును ఇష్టపడే వారి గురించి చెప్పడానికి చాలానే ఉంది .ఆహ్లాదంగా చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు .వ్యాపార దక్షత ఎక్కువ .కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు . తాను ప్రత్యేకమైన వ్యక్తిని అనిపించుకోవడం వీ రికిష్టం .ఎక్కువ మందితో స్నేహం చేస్తారు .చూడడానికి మాడర్న్ గా కనిపించిన పాతకాలపు ట్రెండ్స్ అంటేనే ఎక్కువ మక్కువ .
ఎం తటి క్లిష్ట పరిస్థితులైన తేలికగా హ్యాండిల్ చేయడం వీరి ప్రత్యేకత .చాలా ఎమోషనల్ . కానీ ఏ ఫీలింగు బయటికి ప్రదర్శించరు. చాలా త్వరగా నిర్ణయాలు మార్చుకోవడం వీరి బలహీనత .
త్వరగా నిర్ణయాలను తీసుకుంటారు .చురుకుగా పనిచేస్తారు .సాధారణంగా ఎక్కువ ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు . చాలా శక్తివంతులు .
ప్రతిభావంతులైన వ్యక్తులకు పసుపు రంగు పువ్వులు ఇవ్వడం ఆచారం. అతని ప్రతిభకు ప్రశంసలు ఈ రూపంలో అందిస్తున్నారని అర్థం. వీ రు ఎప్పుడు చుట్టుపక్కల వారికి ఆనందాన్ని పంచే స్వభావం కలిగి ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చెబుతారు ఉత్సాహంగా ఉంటారు ఎటువంటి పరిస్థితినైనా సానుకూల దృక్పథంతో స్వీకరించి ముందుకు సాగడం వీధి ప్రత్యేకత .
ఇది కంటికి అత్యంత ప్రకాశవంతంగా కనిపించే రంగు కనుక ట్రాఫిక్ లైట్స్ లో ఉపయోగిస్తారు .
బంగారం , ఉదయిస్తున్న సూర్యుడు ,నిమ్మకాయ ఈ రంగు పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి .
ఫోటోగ్రఫీలో గోల్డెన్ అవర్ అంటే సూర్యోదయం తర్వాత మొదటి గంట ,సూర్యాస్తమయానికి ముందు చివరిగంట .ఈ సమయంలో సూర్య కాంతి చాలా మృదువుగా ,వెచ్చగా ఉంటూ అందమైన నీడలను ఇస్తుంది .ఫోటోలకు అద్భుతమైన రూపం ఇస్తుంది . పోర్ట్రైట్స్ , ల్యాండ్ స్కేప్ ,రొమాంటిక్ ఫోటోషూట్లకు సరైన సమయం .
మీకు తెలుసా పసుపు రంగును చూసి భయపడే వారి భయాన్ని Xantophobia అంటారు .
ఇది చాలా ప్రకాశ వం తమైంది . ప్రస్ఫుటంగా కనిపించే రంగు .
పసుపు రంగుకు సంబంధించిన సాంస్కృతిక చరిత్ర కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నది
ట్రాఫిక్ లైట్లు మొట్టమొదటిసారిగా అమెరికాలో 1920 ప్రాంతాలలో ప్రవేశపెట్టారు .తొలుత పసుపు నలుపు రెండు రంగులు మాత్రమే ఉండినవి .
రంగులు మన మెదడులో రకరకాలైన రసాయనాలను రిలీజ్ చేస్తాయి .
పసుపు రంగు మన మెదడులో సెరటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది .ఈ సరటోనిన్ మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది .
పొలాలలో కీటకాలను బారి నుంచి రక్షించడానికి పసుపు రంగు స్టిక్కీ ఉపయోగిస్తారు ఎందుకంటే కీటకాలు పసుపు రంగును త్వరగా ఆకర్షింపబడతాయి .
ఒకప్పుడు ఎల్లో ఫీవర్ అనేవ్యాధి వ్యాప్తిలో ఉండేది .ఇది దోమల ద్వారా సోకుతుంది .ఫ్లూ వంటి లక్షణాలతో తీవ్రమైన శారీరక బాధతో ఒకప్పుడు ప్రజలు బాధపడేవారు .
మన దంతాలు పసుపు రంగులో మారడానికి కాఫీ టీ సో డాలాంటివి తాగడం ముఖ్యమైనకారణం . మన పంటి పైన ఉండేటువంటి ఎనామిల్ బలహీనం చేసి పసుపు రంగు పోరని ఏర్పరుస్తాయి
మరో వింతైన విషయం YELLO DAY అనేది కూడా ఉంది . సంవత్సరం మొత్తంలో చాలా సంతోషకరమైన రోజుగాదీన్ని జరుపుకుంటారు . ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన జరుపుకుంటారు .
2016 ఫిబ్రవరిలో మలేషియన్ గవర్నమెంట్ పసుపు రంగు టీ షర్ట్ లను బ్యాన్ చేశారు .ఎందువల్ల అంటే ఇది వేసుకున్న నిరసనకారులు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఉద్యమంలో లేవదీశారు .
John D. Hertz అనే వ్యక్తి Yellow Cab Company స్థాపించా .రు ఆయన కా రలన్నింటికీ పసుపు రంగు పెయింట్‌తో ఉండేది .ఆయన పసుపు రంగు చాలా దూరం నుంచి కూడా త్వరగా గుర్తించడానికి వీలవుతుంది అని తెలుసుకున్నారు . అందువలన టాక్సీలు అన్నిటికీ కూడా పసుపు రంగు వేయించి ఎల్లో క్యాబ్ కంపెనీ అనే పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు .
చివరిగా మరొక్క మాట
సమస్యలు ఎన్నున్నా , సంఘర్షణలెన్నైనా మనసుంటే మార్గం అంటుంది పసుపు రంగు .ఇదే జీవిత సత్యం .
విజయ కందాళ
9912842104
ఈరోజు ముచ్చటలన్నీ మన తెలుగు భాషాభిమానం గురించే . చెప్పుకోడానికి అనేక సంగతులు ఉన్నాయి .ఎందరో మాతృభాష గొప్పదనం గురించి ఎప్పుడో ,ఎందరో మరెన్నో సార్లు చెప్పారు .మన మూ వింటున్నాం కానీ పాటించడంలో ఇష్టం , ఓపిక ,ఆసక్తి అనే విలేక అనే సంగతి తెలిసినా , చెప్పడం అలవాటైన వారు ఊరుకోరుగా . నేను ఆ బాపతే అనుకోండి .
ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ?అనేది చిక్కు ప్రశ్న . అయినా చీకట్లో బాణం వేస్తున్న .ఏ కొందరికైనా తగలకపోతుందా అనే అత్యాశతో మొదలెట్టా . ఇందులో స్పృశించిన అంశాలలో ఒక క్రమం గురించి వెతకకండి . కోతి కొమ్మచ్చి అనుకోండి తప్పులేదు .బహుశా అదే సరైన మాటేమో కూడా .
భాష అనేది అతి చిన్న మాట . రెండు అక్షరాల మాట కానీ ,ఆ రెండక్షరాలలో మర్రి విత్తనంలా విశ్వమం తా దాగింది .నేల నాలుగు చెరుగు ల పా కిం ది .ఆకాశపుటంచులను తాకింది ఎందుకంటే భావవ్యక్తీకరణకు పునాది భాష కదా .
ప్రతి మనిషికి తల్లి ఎలా అత్యంత సన్నిహితమో ఆమె ఒడి అనే బడిలో నేర్చిన పలుకూ అంత సన్నిహితం . అయితే ఆధునిక కాలంలో అమ్మను , అమ్మ భాషను ఒద్దు అనుకుంటున్నాం .అసలు గలగల మాట్లాడమంటే ఒక సు హృద్భావ వాతావరణ అని సృష్టించడమే . ఆ వాతావరణంలో అవసరానికి మించి , ఆడంబరాన్ని జోడించి ,ఇతర భాషా పదాలను వాడడం నల్లేరుపై బండి నడకంత సులభం .ఆ వ్యామోహం నుంచి బయటికి రావడానికి మనకు సుతరామూ ఇష్టం లేదు .
ఎప్పటిది తెలుగు అంటే ,మన ఊహకందనంత పాతది .క్రీస్తు శకం 575లో కడప జిల్లా ఎర్రగుడిపాడు లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనం జయుడు తొలి తెలుగు శాసనం వేయించాడు .
ఎంత చక్కని భాష అండి మన తెలుగు .గుండ్రంగా ముత్యాల లాంటి అక్షరాలతో ముచ్చటైనది మన లిపి . కొన్ని సరదా సంగతులు గుర్తు చేస్తాను .విసుక్కోక చదవండి .చదివించండి . ఆపై ఆలోచించండి .
ఆ అనే ఏకాక్షర పదం లేదా వాక్యం ఉంది . దీన్ని ఆశ్చర్యంగా ,ప్రశ్నగా ,జవాబుగా ,నీరసంగా , అనుమానంగా ఇంకా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు .
మొన్ననే ఓ మంచి వాక్యం చదివాను .మీరూ చదవండి మరి . సులువైనది . బరువైనది . గుర్తుపెట్టుకో తగ్గది కూడా. సముద్రమంత లోతైన అర్థమున్న వాక్యం ఇది. భూమ్మీదికి అరువు పై వచ్చాము , కొంత కాలానికి భూమికి బరువై వెళ్ళిపోతాం. ఈ మధ్యలో పరువుగా బ్రతకాలి .
చూడండి . అరువు -బరువు- పరువు ఒక అక్షరం తేడాతో ఎంత సొగసైన వాక్యం సిద్ధమైంది .
మరో చిన్న మాట .
రెండెడ్ల బండ్లు అంటే ,రెండు అర్థాలు
రెండు ఎడ్లు గల బండ్లు
ఎడ్ల బండ్లు రెండు .
ఎంత అందం ఉంది ఈ భాషలో .ఇంకోటి ఇది రెండు పదాల ప్రశ్నా ర్ధక వాక్యం .
వాడొచ్చాడా ? నేను వివరించక్కర్లేదు .
మీరు పలికే విధాన్ని బట్టి అర్థం మారుతుంది ప్రయత్నించి , చూడండి.
ఇంకో సరదా వాక్యం .
నీ నూనె నా నూనె ని నేనన్నానా, నీ నూనె నీ నూనె .నా నూనె నా నూనె .
నిదానంగా చదవండి ఒకే అక్షరంతో మూడు వాక్యాలు వచ్చాయి .
ఒకే పదాన్ని సందర్భం బట్టి రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు . బొక్కలో వేస్తాను .నాకు లక్ష బొక్క వచ్చింది వ్యాపారంలో. బొక్కలు కొట్టే మిషన్ ఉందా ?మొదటి బొక్కకు జైలు , రెండవ బొక్క నష్టం ,మూడో మొక్కకు పంచింగ్ మిషన్ అని అర్ధాలు వచ్చాయి .
పులిహోర మనకు ఇష్టమైన వంటకం .ఇందులో పులి ఎక్కడుంది అని గాబరా పడకండి . ఇక్కడ పులి అంటే పుల్లని పులిసినఓ గిరం అంటే ఆహారం .పులిబొంగరాలు అనే మాట గుర్తుకు తెచ్చుకోండి .
వల్ల కాడు పూర్వరూపం ఒ ల్ల కాటు పనికిరాని అడవి . అదే పొల్లకాడై వల్లకాడుగా స్థిరపడింది .భీమా అనే పదం తీసుకోండి ఇందులోని బీమా అనేది పారసీ పదం .ఆ భాషలోభీమా అంటే భయం .జీవితంలో భయాన్ని పోగొట్టే సంస్థ భీమా సంస్థ .
తద్దినంకు చావుకు సంబంధం లేదు .దాన్ని విడదీస్తే త త్ + దినం ఆ రోజు అని అసలు అర్థం .
మనం పాకీ పనిని అసహ్యించుకుంటాం . పవిత్రత ,శుభ్రత అని అర్ధం దా నికి .పాకిస్తాన్ అంటే పవిత్రమైన దేశం అని అర్థం .
ఒకే పదం రకరకాలుగా వాడుతూ విభిన్నమైన అర్థాలను సాధిస్తాం .నమ్మట్లేదా ? కింది ఉదాహరణ చూడండి
ఆకు _లోలాకు -విస్తరాకు_ విడాకులు . ఇతర భాషా పదాలతోను వేరు వేరు అర్థాలను సాధిస్తున్నాం .
ఇది సెకండ్ హ్యాండ్ పుస్తకం .తీరా సమయానికి వాడు హ్యాండ్ ఇచ్చాడు . రెండు హ్యాండ్లూ వేర్వేరు సుమా
తెలుగు జీవద్భాష వాడుకలో ఉంది .సరిగా వాడకుంటే నాచుపట్టే స్థితికి దగ్గరగా జరుగుతుంది. వాడక మనం చెడుతున్నాం . ప్రతి భాషలోనూ మార్పులు చేర్పులు సహజం .పాత అర్థాలు పక్కకు జరిగి ,కొత్త అర్ధాలను సంతరించుకుంటాయి మనకు తెలుగు వచ్చుఅంటే సరిపోదు .మన తర్వాతి తరాల సంగతి ?
మళ్ళీ తెలుగు మనదే అన్న నిజం అప్పుడప్పుడు గుర్తుకొచ్చి ,చమత్కారాలతో కూడా జవాబిస్తాం .
ఏమండీ సుబ్బారావు గారిల్లెక్కడా ?
ఆయనకేం పని ఇల్లెక్కడానికి .
అర్థం ఉన్నా లేకున్నా , కొన్ని పదాలు జంటగా వాడితేనే మనకు అర్థమవుతాయి .ఉదాహరణ
పిల్లా జెల్ల _ఇల్లుగి ల్లు_ నగానట్రా
ధ్వని అనుకరణ శబ్దాలున్నాయి .అది మరో ముచ్చట .
డ్డా మ్మని పడ్డాడు .పూలు జలజలా రాలే . పకపక నవ్వాడు .
పద బంధాలు _నానుడులు_ సామెతలు _పొడుపు కథలు -జాతీయాలు -కథలు -కవితలు- నవలలు _కావ్యాలు ఇంత కాలం నుండి అని చెప్పడానికి వీలుకాని రోజు నుంచి కాచిన పాలపై తేరి న మీగడ ఇదంతా . ఆస్వాదించండి . ఆనందించండి మరోమాట
అడుగు
దేని గురించి అని అడగండి .అదే అడుగు గురించి . అంటే ప్రశ్నించు అని అర్థం .ఈ పదాన్ని ఎన్నో రకాలుగా వాడతాం. ప్రతి అడుగుకి అర్థం మారుతుంది .
అడుగు అంటే పాదం మూడు అడుగుల నే ల కావాలని వామనుడు బలిని అడిగాడుగా .
అడుగు తీసి అడుగు పెట్టలేనంత జనం వచ్చారు
ప్రయాణం అడుగు ఆమడగా సాగుతుందంటే చాలా కష్టంగా ఉంది అని అర్థం .
బాల్చీలో నీళ్లు అడుగంటాయి .
రేపు పొద్దున ఆయన అడిగితే ఏం చెప్పను ?
ఇవాళ వాడిని అడిగేయాలి .
నలుగురిని అడిగి చేయి .
ఒక్కొక్క పదం ఎన్నెన్ని వన్నెలతో మీ జీవితంలో చేరిపోయిందో మీ మనసునే అడగండి .
ఇవన్నీ మాకు తెలిసినవే . కొత్తదనం ఏమీ లేదు పాత చింతకాయ పచ్చడే గా అంటున్నారా .నిజమే .నాకూ తొలు త అలానే అనిపించింది .అయినా పాత చింతకాయ పచ్చడి పధ్యా నికి పనికొస్తుంది . కొత్త చింతకాయ జలుబు చేస్తుంది .సమస్యలకు పరిష్కారాలు తెలియక కాదు .పాటించడం ఇష్టం లేక , ఓపిక లేక. ఆలా వదిలేస్తే పీట ముడి పడిపోతాయి .
ఈమధ్య సురవరం ప్రతాపరెడ్డి గారి తెలంగాణ వ్యాసాలు అనే పుస్తకం చదివాను . అందులో తెలుగు భాషా సేవ అని ఆలోచనాత్మక వ్యాసం ఉంది .అది చదివాక ఇది రాయాలనిపించింది .
“దేశాభివృద్ధికి భాషాభివృద్ది ఒక గొప్ప సాధనమని అందరికీ తెలిసిన విషయమే . బెంగాలీ భాషతో సమానముగా మనదేశములో అభివృద్ధి చెందుచున్న రెండవ భాష మహారాష్ట్రము .మీకే దేశ చరిత్ర కావలసిన ను ఈ భాష యందు దొరకగలదు .ప్రకృతి శాస్త్రవుల అనేకములు వ్రాయించబడినవి ఇట్లు మన ఇరుగుపొరుగు వారు తమ తమ దేశ భాషలను అభివృద్ధి చేసుకొని ,అవిశ్రాంతముగా స్వార్ధమునందును దృష్టి ఉంచక , పాటుపడుచున్న మన తెలుగు సీమ వారు మాత్రము ఇతర అన్ని విషయములందువలె భాషాభివృద్ది విషయమునను గాఢ నిద్రపోవుచున్నారు .ఇది మిక్కిలి శోచనీయము .”
“విద్య రాని వాడు తోక కొమ్ములు లేని పసరమని మన పెద్దలన్నారు . మాతృభాషనేరుగ ని వాడు తెలివి లేని పసరమని చెప్పవలెను .మనకు ఇంగ్లీషు , హిందీ భాషలపై కలవ్యామూహము మన మాతృభాష పై లేదు . పరభాషలన్ని నేర్చిన కులవిద్యకు సాటి లేదు గువ్వలచెన్న అని ఆ మహానుభావుడు ఆనాడే ఉర్దూ హిందీ ఇంగ్లీష్ వెలువలు మనలను ముంచుకొని పోకముందే బోధించి ఉండెను.”
“మన ప్రాచీనాంధ్ర వీరుల గాధలను తెలుపు గ్రంథాలు మనము వ్రాయకున్నా , తందాన (జంగం) కథలు చెప్పు పిచ్చిగుంట వారిలో ఆ చరిత్ర లింక నిలిచి ఉన్నవి .అవి అంతరించక ముందే వాటిని సమకూర్చి ,ముద్రించ వలెను . సోమనాద్రి ,రామేశ్వరరావు ,సదాశివరెడ్డి , తిమ్మరాజు , కుంభం పుల్లారెడ్డి , మెదక్ శంకరమ్మ , కుంభం చెన్నయ్య , సర్వాయి పాపడు మొదలగు వారి కథలు కొల్లలుగా అనాధృతమై , ఆముద్రిత మై ,విస్తృత పధ మందు లీనమై పోవుచున్నవి .మనము మన జంగం కథలను సవరించి ,సంస్కరించి ,చారిత్రక పీఠికలతో ముద్రించి ,ప్రచారం చేయుట అవసరము .”
“మనకు ఏ విషయమైనా తెలుసుకొనే అవసరము కలిగితే , ఇంగ్లీషు వాంగ్మయాన్ని ఆశ్రయిస్తున్నాము . మన భాషలో వివిధ పరిశోధనలకును , విజ్ఞానానికి పనికి వచ్చు ఉద్ గ్రంథాలను వ్రాయించి ప్రచురింపవలెను .
“ఇంగ్లీషు వారికి తమ భాషపై కల అభిమానములో సహస్రాంశము కూడా మనకు లేదు . ప్రతి జాతికిని తన మాతృభాషపై అభిమానం ఉన్నట్లు సర్వత్ర వ్యక్తమైనది .అరబ్ తన భాష అమృతం అనియు తక్కిన భాషలంతా తన ఒంటె కాలి క్రింది దుమ్ముతో సమానమనియు అంటాడు . ఆర్యులు తమ భాష దేవ భాష అనేది తక్కినవి భాషలనా గ రికము లు ,తమదే నాగరిక భాష అన్నారు . ప్రాకృతము విజృంభించిన వాడు సంస్కృతాన్ని గురించి కూడా ఈ మాటలే అంటాడు .
మీ మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉన్నాయ ని నాకు తెలుసు . నేను అలాగే అనుకున్నాను .ఇంకా ఇంకా చాలా అనుకున్నాను . ఎందుకంటే ఈ మాటలు 80 సంవత్సరాల క్రితం చెప్పినవి .
ఈ మాటలు శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు ఓరుగల్లు లో చేసిన అధ్యక్షపన్యాసం లోనివి .
( 28 -12-1944)
ఎలా ఈ సమస్యను పరిష్కరించడం ?
నాకు తోచిన కొన్ని సూచనలు .మీ స్వబుద్ధితో మరికొన్నింటిని జోడించి , ప్రయత్నించండి .మొదటగా మంచి పుస్తకాలు చదవండి .ప్రముఖుల ప్రవచనాలను వినండి . చాలామంది ప్రవచన కారులు ఆంగ్ల పదాలు వాడకుండా , గంటల తరబడి ,సులువైన సరళమైన భాషలో విషయాన్ని అందిస్తున్నారు . ఈనాడు పేపర్ చదవండి . అందులో నేను మొదట చదివేది సంపాదకీయాలు ,హెడ్డింగులు .
రోజు ఓ పది నిమిషాలు ఇంగ్లీషు పదాలు వాడకుండా మాట్లాడే ప్రయత్నం చేయించండి పిల్లలతో .పాత సినిమాలు చూడకున్నా పర్వాలేదు డైలాగులు వినండి .కొత్త పదాలు -పదబంధాలు- సామెతలు-నానుడులు -జాతీయాలు తెలుస్తాయి .మీ పనులను చేసుకుంటూనే ఈ పని చేయవచ్చు .
వివిధ పత్రికల్లో వచ్చే గళ్ళ నుడి కట్టు సరదాగా ప్రయత్నించండీ . చివరగా ప్రస్తుతం వస్తున్న యాంకర్ల (వ్యాఖ్యాతల) మాటలు వినండి .అయితే ఓ మాట . పై పనులన్నీ కొంతకాలం చేశాక , చివరిది ఆచరించండి .చూడకండి .మళ్లీ చెప్తున్నాను . వీళ్ళు గురువులే .ఎలా పలకవచ్చో , ఎక్కడ ఒత్తులు అవసరమో ,ఎక్కడ అనవసరమో ,తెలుసుకునే ప్రయత్నాలు చేయండి . .
కాటుక కంటినీరు చనుకట్టు పయిం బడనేల …. త్రి శుద్ధి గ నమ్ము భారతీ .తెలుగు సాహిత్యంలో
ఇది పోత నా మాత్యు ని ప్రసిద్ధ చాటువు .తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న ఆణిముత్యం . ఇందులో శారదా దే వి కవి కళ్ళముందర దీన వదనంతో ప్రత్యక్షమైంది . చలించి పోయాడు పోతన . తన జీవితా వసరాలకోసం అమ్మనమ్మనని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేశాడు .
మన కీనాడున్న సమస్యలు అలాంటివి కావు . ఆకలి వే ళలు లేవు . రాజ్యస్థానాల అదలింపులు , బెదరింపులు కనుచూపు మెరలో లేవు . రావు . ఐనా తెలుగు భాషకు ఈ దుస్థితి ఏల ?
ప్రభుత్వాన్ని నిందించి మన భాధ్యతను వదిలించుకుందామా ?
మనవైపు నుంచి నిశ్శబ్దం సబబేన ?
మన నరనరాల్లో ,అణువు అణువున జీర్ణించిన జాతి సంపదను చేతు లా రా జా రవిడుచుకుందామ ?
కొంతకాలానికి తరు వాతి తరా లు తెలుగు గొప్పదనాన్ని ఇ తర దేశీయుల ద్వారణో ,పర భాశీయుల ద్వారానో తెలుసుకుని మనల్ని క్ష మి స్తారా
మనమేం చేద్దాం
ఆలోచించండి .
తెలుగు భాష గొప్పదని మనం కొత్తగా చెప్పనక్కరలేదు .వెనకటి వారెందరో ఎప్పుడో చెప్పేశారు .ఆ భాష గొప్పదనాన్ని తెలుసుకోండి .తర్వాత తరాలకు దాని మీద ఆసక్తి కలిగేలా ప్రోత్సహించండి . ఇప్పటి తల్లిదండ్రులు మీకు ఆసక్తి కలిగితే ,తప్పనిసరిగా అది మీ పిల్లలలో ప్రతిఫలిస్తుంది . చదవడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మన భాషా జ్ఞానం పెరుగుతుంది . వేగంగా చదవడం అలవాటు అవుతుంది .మన ఆలోచన పరిధి విస్తరిస్తుంది .
మన మనసులోని భావాలను ఇతరులకు అందించడానికి ఇతరులు చెప్పిందాన్ని గ్రహించడమే భాషకు పరమావధి . అది చేతగానప్పుడు తెలుగువారు అని చెప్పుకోవడం సమంజసమేనా ?నాకు జవాబు అవసరం లేదు మీ మనసును మీరే ప్రశ్నించండి .సమాధానం మీకే తెలుస్తుంది .
మానవ జీవితంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్క నిమిషం రంగులు లేని ప్రపంచాన్ని ఊహించుకోండి .మన వల్ల కాదు . ప్రకృతిలో ఎన్నో వర్ణాలు ఉన్నాయి .అవన్నీ మన వ్యక్తిత్వంపైమనకు తెలియకుండానే చెరగని ముద్ర వేస్తాయి . వేసాయి .వేస్తున్నాయి . మానవ ప్రవర్తన పై రంగుల ప్రభావాలను గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి .ఆ వివరాలను గురించి మరోసారి చెప్పుకుందాం. ప్రతి రంగుకు ఓ ప్రత్యేకత ఉంది . ప్రతి మనిషికి ఉన్నట్టుగానే .అయితే రంగుల గురించి ఎక్కడ చెప్పినా , ఎప్పుడు చెప్పిన ఎవరు చెప్పినా , మనసులో మెదిలే తొలి రంగు తెల్లని తెలుపు .
అందరూ ఇష్టపడేది తెలు పే . పిండార బోసినట్లు వెన్నెల ,పౌర్ణ మి చంద్రుడు , మల్లెలు , ఐరావతం ,పాలు ,నందివర్ధనం , పారిజాతం ఎవరికి ఇష్టం కాదు చెప్పండి . తెలుపు రంగులో ప్రత్యేకంగా ఉండే కొన్నింటిని గురించి చెప్పుకుందాం . వాటి గురించి మీకుచాలా తెలుసని నాకు తెలుసు . అయితే అరుదుగాకనిపించి , మురిపించి మనల్ని ఆలోచింపచేసే కొన్ని విశేషాలను రేఖామాత్రంగా గుర్తు చేసుకుందాం.
మనిషి ఎప్పుడు మొదట తన గురించి ఆలోచిస్తాడు . తెలుపు రంగును బాగా అభిమానించే వారితో మొదలు పెడదాం. తెలుపు రంగును ఇష్టపడేవారు పరిశుభ్రతను , పరిపూర్ణతను , నిరాడంబరతను ఇష్టపడతారు .వీ రు నిజాయితీగా , అమాయకంగా ఉంటారు . అన్ని రంగులు తెలుపులో దాగినట్లుగా వీరి భావాలు అంత త్వరగా బయటపడవు . శాంతి ప్రియులు . ఎవరిపైన ఆధారపడి ఉండడం వీరికి నచ్చదు. ఎవరిని నొప్పించడం కూడా నచ్చదు . జీవితంలో వచ్చే కష్టసుఖాలను బ్యాలెన్స్ చేసుకోవడంలో నేర్పరులు .ఏ విషయంలోనైనా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ,ఆత్మవిశ్వాసంతో మెలుగుతారు . ఇవన్నీ అధిక శాతం వారిలో కనిపించే అంశాలు .
ఇక్కడ నుంచి మెల్లగా జంతు లోకంలోకి అడుగుపెడదాం.
జంతు ప్రపంచం
తెలుపు రంగులో అనగానే గుర్తొచ్చేవి తెల్ల పులి ,తెల్ల ఏనుగు ,తెల్ల నెమలి ,కుందేలు .ఒక్కొక్క దాని గురించి కాస్త చెప్పుకుందాం. మీకో విషయం తెలుసా? జులై 29 నాడు ఇంటర్నేషనల్ టైగర్ డే గా జరుపుకుంటారుప్రపంచవ్యాప్తంగా . తెల్ల పులులు .తెల్లటి బొచ్చు ,నల్లని చారలు ,తెల్లటి చర్మం ,నీలి కళ్ళతో ఆకర్షిస్తాయి . ఇవి బెంగాల్ పులి యొక్క ఉపజాతి. జన్యుపరమైన అమరికల వలన పులికి ఇలాంటి తెల్ల రంగు వస్తుంది . అరుదైన రకం .ఎందుకంటే జన్మించిన ప్రతి పదివేల పులులలో ఒక్కటి మాత్రమే తెల్లనిది . ఎదిగిన తెల్ల పులి 570 పౌండ్ల వరకు తూ గుతుంది .సాధారణ పులుల కన్నా పొడవు ఉంటుంది .పది అడుగుల కంటే ఎక్కువ పొడవు .గంటకు 60 మైళ్ళ వరకు పరిగెత్తగలవు . అంటే హైవే మీద పరిగెత్తే కారుతో సమానంగా ప్రయాణిస్తాయి .ఒక తడవకు దాదాపు 18 కిలోల మాంసాన్ని తింటాయి . ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాయి .కానీ మంచి పెంపకం దారులు .
పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాయి . వీటికి ఎక్కువ స్థలం కావాలి .దాదాపు 20 చదరపు కిలోమీటర్ల విశా ల ప్రాంతం అవసరం . . ఉండడానికి ,తిరగడానికి ,వేటాడ్డానికి కనీసం ఉండాలి .నీటిలో బాగా ఈదుతాయి . పంజాలు ఈదడం లో సహాయపడతాయి .7 మైళ్ళ వరకు ఒక తడవ వెళుతుంది ఈదుకుంటూ .దేశంలో 1561లో తొలిసారిగా తెల్ల పులి గుర్తించబడింది. ఈ విషయం అక్బర్ నామాలో రాసి ఉంది . అడవుల్లో కనిపించడం అరుదు . ఎందుకంటే వీటి రంగే వీటిని శత్రువులకు సులువుగా పట్టిస్తుంది .ఎక్కువగా జూలలో ,థీమ్ పార్కులలో ఉంటాయి .
పులి తర్వాత గుర్తొచ్చేది తెల్ల ఏనుగు .దీన్నే వైట్ ఎలిఫెంట్ అంటారు .వైట్ ఎలిఫెంట్ అంటాం కానీ ,నిజానికి వీటి చర్మం లేత రంగులో ఉంటుంది . కళ్ళు తెలుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి. థాయిలాండ్ లో ఎక్కువగా కనిపిస్తాయి . రాజరి కానికి హోదాకు చిహ్నం .భారతీయులకు తెల్ల ఏనుగు అనగానే ఐరావతం గుర్తుకొస్తుంది .అష్ట దిగ్గజాలలో ఇది ఒకటి . తూర్పు దిక్కుకు ప్రాతినిధ్యం వహిస్తుంది .ఇంద్రుని వాహనం కూడాను .
దీని రంగు గురించి ఒక ప్రాచీనమైన కథ ఉంది .ఒకసారి దుర్వాస మహర్షి వెళ్తూ ఉండగా ఏనుగు ఎదుర్పడింది . అయితే మహర్షిని చూసి నమస్కరించకుండా అహంకారంతో ,వెళ్ళిపోయింది . ఆయనను గుర్తించనట్టుగా అన్నమాట . .చూసిన మహర్షికి కోపం వచ్చి . దాని నలుపు రంగులో మారిపొమ్మని శపించారు .దాంతో దానికి చాలా బాధేసింది . దుఃఖ మ్ వచ్చేసింది . తెల్లటి ఏనుగు కాస్త నల్లగా మారి పోయింది .ఏం చేయాలో తెలియలేదు . బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంది . బ్రహ్మదేవుడు నావల్ల కాదు .ఈ పని కేవలం శివుడు మాత్రమే చేయగలడు .వెళ్లి శివుడి గురించి తపస్సు చేయి అని చెప్పాడు .అలాగే చేసింది . శివుడు ప్రత్యక్ష మై , ఇక్కడ ఒక పుష్కరిణి ఉంది .అందులో వెళ్లి ,స్నానం చేసి , దాని పక్కన ఉన్నదేవాలయంలో పూజ చేయి . నీ రంగు నీకొస్తుంది అని వ రమి చ్చాడట .అంతే అది పుష్కరిణిలో మునిగి లేవగానే ,ఆ నలుపు రంగు పోయి తెల్లటి తెలుపు మళ్ళీ వచ్చేసింది . అందుకని ఆ పక్కన ఉన్న దేవాలయాన్ని ఐరావతేశ్వర ఆలయం అంటారు .ఇది దారాసురం అనే గ్రామంలో ఉంది . ఈ గ్రామం శ్రీరంగానికి చాలా దగ్గరలో ఉంది .
చతురంగబలాలలో ఏనుగుది ముఖ్యమైన పాత్ర .వీటిని పెంచడం చాలా ఖరీదైన వ్యవహారం . ప్రత్యేకమైన ఆహారం , శిక్షణ వైద్యం అవసరం .ఒక కార్యక్రమం లేదా ప్రాజెక్ట్ ఖరీదు అయింది లేదా ఆ ఖర్చుకు తగినంత ఉపయోగం ఉండదు అని చెప్పడానికి వైట్ ఎలిఫెంట్ అనే పదం వాడతారు . గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెత్తగలదు . అందాన్ని ఇచ్చే దంతాలే దీనికి శత్రువులు . వీటి కోసం వేటాడే వారు ఎందరో .
అనేక సంస్కృతులలో ఏనుగులు బలానికి ,అదృష్టానికి ప్రతీక . వేల సంవత్సరాలుగా ఇవి మానవ సంస్కృతిలో ఒక భాగం .మనకైతే ఏనుగు తల ఉన్న దేవుడు గణాలకు అధిపతిగా , తెలివితేటలకు ,జ్ఞానానికి మూల కారణంగా కొలవబడుతున్నాడు . అదే గణపతి లేదా వినాయకుడు .
మయూరం
అందరికీ ఇష్టమైన పక్షి నెమలి. పించం నెమలికి అందం . అందంగా హుందాగా మహారాణిలా పురివిప్పిన తెల్ల నెమలి మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంది , ధవళ కాంతులతో మనసు దోచుకుంటుంది . తెల్ల నెమలి నెమలి జాతిలో అరుదైన రకం . జన్య పరమైన లోపం వల్ల తెల్లగా ఎదుగుతుంది . ఈ కారణంగా ఈకలు ,చర్మం తెల్లగా ఉంటాయి . ఇంకో వింత సంగతి చెప్పనా ! తెల్లనెమలి పుట్టుకతో పసుపు రంగులో ఉంటుంది .పెరిగే కొద్దీ పసుపే తెలుపు రంగుగా రూపాంతరం చెందుతుంది . ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుం ది . అడవుల్లోఇవి కనిపించడం అరు దు .ఎందుకంటే అక్కడ మరింత సులువుగా పట్టుబడిపోతాయి. బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం .ఇంకో సమస్యతెల్ల నెమలి తో కలవడానికి ఆడ నెమళ్ళూ త్వరగా ఇష్టపడవు. అందుకని వీటిని ప్రత్యేకంగా పెంపక కేంద్రాలలో సిద్ధం చేస్తారు .
సుబ్రమణ్య స్వామి వాహనము నెమలి .క్రిస్టియానిటీలో తెల్ల నెమలిని ఏసుక్రీస్తు ప్రతీకగా నమ్ముతారు . బౌద్ధమతంలో ఇది నిర్వా ణానికి గుర్తు. ప్రపంచవ్యాప్తంగా నెమళ్లు అదృష్టానికి , అభివృద్ధికి చిహ్నాలని నమ్ముతారు . మన జానపద కథల్లో అందానికి గర్వానికి గుర్తు . ఇవి సర్వభక్షకులు . కీటకాలు ,పువ్వులు,విత్తనాలు ,చిన్న పురుగులు , ఎలుకలు ,బల్లు లు అన్నీ తింటాయి . హానికరమైన కీటకాలను తినడం వల్ల రైతుకు మంచి నేస్తం . మనదేశంలో నె మళ్లను వేటాడు నిషేధం .ఈసారి హైదరాబాద్ లోని zoo కి వెళ్ళినప్పుడు చూడండి . అక్కడ తెల్ల నెమ ళ్ళు మిమ్మల్ని పలకరిస్తాయి .
ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ జన్యుపరమైన మార్పులతో పుట్టిన ప్రాణులు . అలా కాక సహజ సిద్ధంగా ఎక్కువ శాతం తెలుపురంగుతో అప్పుడప్పుడు గోధుమరంగు మచ్చలతో ,మనల్ని మరిపించి ,మురిపించే బుల్లి ప్రాణి మరొకటుంది .అది అందరికీ ఇష్టమైనది కూడా .
కుందేలు
అదే కుందేలు .తెల్లని పాలలాంటి రంగు ,పట్టుకుచ్చు లాంటి వెంట్రుకలు దీనికి పె ట్టని సొమ్ములు .కుదురుగా ఒకచోట ఉండక ,హడావుడిగా ,సందడిగా తిరిగే చిరు ప్రాణి . శేషము , బన్నీ ,శశకం ,కో ని అని కూడా పిలుస్తారు ,వన్యప్రాణి .శాకా హారి . చిన్న సైజువి ఐదు సంవత్సరాల వరకు జీవిస్తే ,కొంచెం పెద్ద రకంగాఉండేవి 12 సంవత్సరాల వరకు బతుకుతాయి ,సంఘజీవులు .గుంపుగా ఉండడానికి ఇష్టపడతాయి .ఇంట్లో పెంచాలనుకుంటే కనీసం రెండింటినైనా ఎంచుకోవాలి .
ప్రత్యేకతలు
వీటి దంతాలు జీవితమంతా పెరుగుతాయి .తినకపోతే ,అవి మరింత పెరిగి దంత సమస్యలు వస్తాయి . నీళ్లు బాగా తాగుతాయి. ఇంట్లో పెంచేవారు తప్పనిసరిగా వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసి ఉంచాలి. తరచూ వాటిని మార్చాలి .చాలామందికి కుందేలు ఆహారం అంటే క్యారెట్లు అని నమ్మకం .కానీ ఇది పొరపాటు .క్యారెట్ లలో చక్కెర శాతం అధికం కాబట్టి ,అప్పుడప్పుడు ఇవ్వాలి .కానీ రోజు కాదు . వీటికి బాగా వ్యాయామం అవసరం . అందుకు విశాలమైన స్థలం కావాలి. అక్కడ అవి ఎగురుతాయి . దూకుతాయి ,పరిగెత్తుతాయి , కాళ్ళను విశాలంగా సాగదీస్తాయి .ఇవన్నీటికి స్థలం అవసరం కదా !చెవులు బాగా పెద్దవిగా ఉంటాయి .అందుకని చెవుల పిల్లి అని కూడా అంటారు వీటి వినికిడి శక్తి సా టి లేనిది .ఈ చెవుల ఆధారంగా తలను 180 డిగ్రీల వరకు తిప్పి చూడగలవు .
ఒక U K లోనే రెండు మిలియన్లకు పైగా పెంపుడు కుందేలు ఉన్నాయని అంచనా. రెండు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు వరకు ఎగర గలవు . పిల్లులవలే వీటికి లిట్టర్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. వీటి జీర్ణశక్తి ప్రత్యేకమైనది . పీచున్న పదార్థాలను ఎక్కువగా తింటాయి . చాలా జంతువులకు ఆహారం మనుషులతో సహా .
కళ్ళు ఎక్కువగా ముదురు గులాబీ రంగులో స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటాయి. ఆహారాన్ని నము లుతూ అటు ఇటు సంచరిస్తూ మనల్ని ఆనందింప చేసే చిట్టి ప్రాణి కుందేలు .
శ్వేత ప్రపంచం శీర్షికలో ఇప్పటిదాకా వనవిహారం చేశాం . జం తువులు మనలా నడవవు. గెంతుతాయి .పరిగెత్తుతాయి. దూకుతాయి . మనమూ అలాగే దూకి వంటింట్లోకి జొరబడదాం. వంటింట్లో బోలెడు దినుసులు అవి దాచుకోవడానికి బోల్డ్ బోల్డ్ డబ్బాలు ఉంటాయి . వెతుకుదాం పదండి .
వంటింట్లో కాలు పెట్టగానే తెల్లనిది . నిత్యావసరమైంది ఏది అనగానే తొluత గుర్తుకొచ్చేది లవణం .అదేనండి రోజు వాడే ఉప్పు .దాన్నే సోడియం క్లోరైడ్ అంటారు .మాకు ఉప్పు గురించి తెలుసు . అది తక్కువైనా కష్టమే ఎక్కువైనా కష్టమే అంటారా ! మీరు అనుకునేది నిజమే .అయితే ఇవాళ మరి కాస్త లోతుగా చెప్పుకుందాం .ఉప్పు ఆహారానికి రుచి మాత్రమే కాదు .ఇంకా ఎన్నింటికో అవసరం .ఉప్పు తక్కువైతే ఆవకాయ చెడిపోతుంది .ఆహార పదార్థాలను నిలవ చేయడానికి ఉప్పునే వాడతాం. ఆహారానికి రుచిని ఇవ్వడంలో ముఖ్యపాత్ర ఉప్పుదె . పచ్చళ్ళు , చేపలను నిలువ చేయడానికి కూడా ఇది అవసరం.
కొన్ని వందల ఏళ్ళ క్రితం ఉప్పును ద్రవ్యంగా వాడేవారు .బ్రిటిష్ వారు ఉప్పుపై విధించిన పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ దండి ఉప్పు సత్యాగ్రహం కూడా చేశారు .ఉప్పు ఎక్కువగా వాడితే ఆహారం రుచి మారుతుంది .తరచు అలా జరిగితే రక్తపోటు ,గుండెజబ్బులు ,మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి . గాయాలై నప్పుడు ఉప్పు నీళ్లతో కడిగితే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు బాగా తగ్గుతాయట .షడ్రుచుల్లో దేని ప్రభావమైనా తగ్గించే శక్తి ఒప్పుకుంది .అందుకే దాన్ని రుచుల్లో రారాజు అన్నారు .
చాలా పిరికివాడని చెప్పడానికి ఫ లా నా వ్యక్తి ఉప్పు పిరి కి అంటారు . పల్లెటూర్లలో ఆడే ఆట పుప్పన బట్టి .ఈ ఆట మధ్య యుగాల్లోనూ ఆడేవారని మనకు ఆధారాలు ఉన్నాయి .ఉప్పు అని కూత పెడుతూ మధ్యలో గీసిన గీతలను దాటుకుంటూ చివరికి వెళ్లి పిడికెడు మట్టిని తెచ్చి స్వ స్థానానికి వస్తే గెలిచినట్లు . అలా తేవడం గెలుపుకు చిహ్నం .తేలేని నివాడు ,భయపడి ముందుకు సాగనివాడు ఉప్పుపిరి కి . అంటే పరమ భయస్తుడు .
దీని గొప్పదనాన్ని చెబుతూ సుమతి శతకకర్త ఉప్పే పసరుచుల కెల్లా అన్నాడు .నిజజీవితంలో ఉప్పు మనకు అత్యవసరం . ప్రపంచంలో చాలామందికి చాలా కాలం వరకు ఉప్పు తయారీ తెలీదు. మధ్యయుగాల్లో టి బేట్ వంటి దేశాల్లో ఉప్పు బిళ్ళలు రూపాయి బిళ్ళలుగా చలామణి అయ్యేవి. ఇంత విలువ గలది కనుకనే వాని ఉప్పు తిని పెరిగాను అనే సామెతపుట్టినది . వేద కాలం లో నుండి మనకు ఉప్పు తయారీ తెలుసు .దాన్ని వాడకమూ తెలుసు .గుర్రం మొదలైన పశువులకు దానాలో ఉప్పు , సైంధవ లవణం కలిపి పెడతారు . మర్చిపోయాను రాత్రి పూట ఉప్పు అనకూడదు . బుట్టలోది .రుచి అని పెద్దవాళ్ళు ఒకప్పుడు చెప్పేవాళ్ళు . ఇప్పుడు అవన్నీ మానేశామనుకోండి
సంస్కృతంలో లవణ శబ్దం నుంచి లావణ్యమ్ ఏర్పడింది . ఉప్పులో కనిపించే మెరుపును స్త్రీలలో కనిపించే నిగారింపుతో పోల్చారు . ఇంత కథ ఉంది మన రోజు వాడే ఉప్పులో.
బియ్యం కాని బియ్యం
బియ్యం కాని బియ్యం అదేనండి . సగ్గుబియ్యం.ఇవి టాపీయోకా అనే మొక్క వేర్ల నుండి తయారవుతాయి . దీని ఉపయోగాలు ఎన్నో .శరీరానికి త్వరగా శక్తినిస్తుంది . తేలికగా అరుగు తుంది కాబట్టి ఉపవాస సమయంలో ఎక్కువగా వాడతారు .పోషకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇతర పదార్థాలతో కలిపి తినడం మంచిది. మహారాష్ట్ర ప్రాంతాల్లో వీటిని వేరుశెనగ గుళ్ళు, బంగాళాదుంపలతో కలిపి వాడుకుంటారు .వండడా నికి ముందు బాగా నానాలి . లేకపోతే త్వరగా అరగదు . రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది కనుక మధుమేహంతో బాధపడే వాళ్ళు తగు మాత్రమే వాడాలి .కడుపుపై మృదువుగా పనిచేస్తుంది.
ఇంకొక విషయం .చరిత్ర ప్రకారం క్రీస్తుశకం 18 00ప్రాంతంలో ట్రావెల్కూర్ రాజ్యంలో గొప్ప కరువు వచ్చిందట .అప్పటి రాజు తిరునాళ్ రామ వర్మ అతని తమ్ముడు తిరుణాల్ మహారాజు ప్రజలు కరువుని ఎదుర్కోవడానికి అనేక చర్యలను అనుసరించారు .అందులో ఒకటి ఆహార వనరుగా ఈ పిండి దుంపను ప్రవేశపెట్టడం .రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజలకు కర్ర పెండలం నమ్మకమైన పోషకమైన జీవనాధారంగా మారింది .బియ్యం ఖరీదైన ఆహారంగా మారిన సమయంలో ప్రజలు వీటిపై ఆధారపడేవాళ్లు ఇది 3000 సంవత్సరాలుగా చైనీస్ వంటకాలలో కీలక పదార్థం .
తర్వాత దేని గురించా అని ఆలోచిస్తున్నారా ?
తర్వాతది బార్లీ . ప్రపంచంలో నాలుగవ ముఖ్యమైన పంట బార్లీ . ఇండియాలో ఆరవ స్థానంలో దీని దిగుబడి . శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది . మంచి పోషకాలు కలిగిన ధాన్యం .మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో వాడిన మొట్టమొదటి సి రియల్ .కనీసం 9000 సంవత్సరాలకు పూర్వమే దీని పండించేవారు అనడానికి చారిత్రక ఆధారాలున్నాయి . ప్రాచీన కాలంలో ఈజిప్టులో పండించేవారు .ఇందులో అధిక శాతం ప్రోటీన్ బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. పండిన పంటలో అధిక భాగం మాల్టుగా మారుస్తారు . పశువుల దానాలో వాడే ముఖ్య పదార్థం కూడా . మాల్ట్ సారాన్ని పసిపిల్లల , వృద్ధుల ఆహారంలో వాడుతారు.
జీర్ణ క్రియలో వచ్చే సమస్యలను సవరించడానికి బార్లీ నీటిని కొంచెం కొంచెంగా దినం అంత తాగా లి . మిగిలిన ఆహారం పరిమాణాన్ని తగ్గిస్తూ ఇలా తాగడం అనేది నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో అలవాటు .బార్లీ ని ఆహారంగా పానీయాలలో పశువుల దానా గా ఉపయోగిస్తారు . ఇందులో ఫైబర్ ఉంది . కొలెస్ట్రాల్ ,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా ఉపయోగం .ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది .మలబద్ధకాన్ని నివారిస్తుంది .క్యాలరీలు బాగా తక్కువ. కడుపు నిండిన భావన కలిగిస్తుంది .ఈ కారణంగా బరువు తగ్గడంలో కూడా ఇది ఉపకారి . గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది .పురాతన రోమ్ లో గ్లాడియేటర్లు బార్లీని ప్రధాన ఆహారంగా తీసుకునేవారుట . దీన్ని సాగు కూడా చాలా సులభం .అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ తట్టుకొని పెరుగుతుంది .
సంపూర్ణ ఫలం
సంపూర్ణ ఫలం అంటే మనకు తెలిసిన కొబ్బరికాయ . కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారు . అంటే చెట్టులోని ప్రతి భాగం మనకు ఉపయోగిస్తుంది . నిజం చెప్పాలంటే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పెళ్లి ,నిశ్చితార్థం నుంచి మొదలైన కొబ్బరితో ప్రయాణం చివరి వరకు కొనసాగుతుంది . హోమాలు, పూజలు, యజ్ఞాలు , పండుగలు ,శుభకార్యాలు అనేక ధార్మిక కార్యక్రమాల్లో కొబ్బరికాయ లేనిదే పని నడవదు.
దక్షిణ భారతదేశంలో చాలా ఇళ్లల్లో కొబ్బరి లేనిదే రోజువారి వంట పూర్తి అవ్వదు . కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం కొబ్బరి ఉత్పత్తిలో కేరళదే 2018 వరకు అగ్రస్థానం ప్రాచీన కాలం గురించి చెప్పాలంటే పురావ స్తు తవ్వకాలలో , ఆయుర్వేదంలో , బుద్ధుని జాతక కథల్లో ,చైనా అరేబియా యాత్రిkuల అనుభవాల్లో దీని ప్రసక్తి ఉంది . ఒకటి రెండవ శతాబ్దల ప్రారంభంలో కొబ్బరికాయ ధార్మిక కార్యక్రమాలకు వాడడం మొదలై ఉండొచ్చని ఒక అంచనా .1958లో ప్రచురించబడిన ఒక పరిశోధన పత్రంలో మనిషి ఆవిర్భావానికి ముందే పురావస్తు శాఖకు లభించిన శిధిలాల ప్రకారం కొబ్బరి చెట్లు ఉన్నాయని వ్యాసరచయితలు కే పి వి మీన న్ , పండలై పేర్కొన్నారు .
శిలా శాసనాల మీద కూడా దేవాలయ ఆస్తులుగా ఉన్న కొబ్బరి తోటల ప్రస్తావన ఉంది . అంతేకాదు మత్స్య పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , బ్రహ్మ పురాణాలలో కొబ్బరి ప్రసక్తి ఉంది . చరక సంహితలో కూడా దీని గురించి చెప్పబడింది . ఆహారంగా మాత్రమే కాకుండా , దానికి ఉన్న ఇతర ఆరోగ్య – ఔషధ – సౌందర్య ప్రయోజనాల దృష్ట్యా దీని కల్పవృక్షం అని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు .ఆధ్యాత్మికంగా కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా పోలుస్తారు . కొబ్బరికాయలు దిష్టి తీయడానికి కూడా వాడుతారు .నువ్వు నక్షత్రాలను లెక్కపెట్టగలిగితే కొబ్బరితో వచ్చే ప్రయోజనాలను లెక్కించగలవు అనేది ఫిలిప్పీన్స్ సామెత .సంప్రదాయ పద్ధతుల్లో తీసిన కొబ్బరిపాలను డైరీ ఉత్పత్తులకు బదులుగా వాడవచ్చు . కొబ్బరిలో ఉండే కొవ్వు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి .కొబ్బరిలో ఉండే రాగి ,ఇనుము శరీరంలో రక్తం స్థాయిలని నిలిపి ఉంచుతాయి కొబ్బరి కు న్న బహుముఖ ప్రయోజనాల వల్ల సాంఘికంగా ,ఆధ్యాత్మికంగా , ఆర్థికంగా ఈ పంటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
బియ్యం
ఇక మన ముఖ్య ఆహారమైనటువంటి బియ్యం దగ్గరికి నడుద్దాం . కోట్లాది ప్రజలకు ప్రధాన ఆహారం బియ్యం .ఇవి పండినప్పుడు వడ్లు . పొట్టు తీసితే బియ్యం .ఉడికితే అన్నం .ఆసక్తికరమైన విషయాలు ఎన్నో కలిగి ఉన్న ధాన్యం బియ్యం .అన్నం అంటే పోషించేది ఆయుష్షుని ఇచ్చేది సంరక్షించేది మాత్రమే కాదని సంసార జీవితాన్ని సుఖమయం చేసేదని ప్రఖ్యాత వైద్యుడు సుస్రుతుడు 2000 సంవత్సరాల కిందటే చెప్పాడు .వేలాది సంవత్సరాల నుంచి ఈ ధాన్యం మనకు తెలుసని , చైనా , దక్షిణ తూర్పు ప్రాంతాల్లో పండించే వారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మందికి ఇది ప్రధాన ఆహారం .శక్తిని పిండి పదార్థాలని ఇస్తుంది .
చాలా ఆసియా దేశాల్లో ఈ పంటను పవిత్రంగా భావిస్తారు .వేడుకల్లో సంప్రదాయాల్లో తప్పక ఉపయోగిస్తారు . ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మించిన బియ్యం రకాలు ఉన్నాయి .దేనికదే పోషకాలు , రంగు , రుచి లలో విభిన్నం . ఒక అంచనా ప్రకారం ఒక కిలో బియ్యం పండడానికి సగటున 5000 లీటర్ల నీరు కావాలి .
కొన్ని సంస్కృతుల్లో బియ్యం అభివృద్ధికి ప్రజన న శక్తికి ప్రతీక . 9000 సంవత్సరాల ముందు నుంచి దీని పండిస్తున్నాం .సంప్రదాయ సాగు విధానాలు ఒక తరం నుంచి మరో తరానికి అందించబడుతూ వచ్చాయి .ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఉడికించడం , ఆవిరిపై ఉడికించడం ,వేయించడం ,అంతేకాదు వీటిని వాడి అసంఖ్యాకమైన వంటకాలు కూడా చేయొచ్చు.
ఇంకా ఉంది
ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో బియ్యాన్ని వాడుతారు .బియ్యం కడిగిన నీళ్లు కూడా సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు .దక్షిణ భారత దేశంలో పిల్లలకు తినిపించే మొదటి ఆహారం బియ్యమే . అంటే అన్నమే . బియ్యాన్ని వేయించి , రవ్వలాగా విసిరి , ఉడికించి పిల్లలకి తినిపిస్తారు .
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం చేసే అంశాలలో వరి ఉత్పత్తి ఒకటి ఎందుకంటే ప్రతి ఏటా 500 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి కోట్లాది ప్రజలకు ఆహార భద్రతను కల్పించేది వరి పంట మాత్రమే . జవాన్ లో దీని పవిత్రమైన పంటగా భావిస్తారు .సంప్రదాయక వేడుకల్లో , పెళ్లిళ్లలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. బౌద్ధ సంప్రదాయంలోను దీనికి ప్రముఖ స్థానం ఉంది . ఆరోగ్యపరంగా చూస్తే సులువుగా వేగంగా జీర్ణం అవుతుంది .
చివరగా మరొక్క మాట అన్నం తినడానికి వేళాపాళ తప్పనిసరిగా ఉండాలి .వేళకు తింటేనే ఆయువు , వీర్యపుష్టి ,బలం శరీర కాంతి పెరుగుతాయి .
మన వంటింట్లో ఉండే జంట కవుల గురించి చెప్పుకోకుంటే ఈ వ్యాసం అసమగ్రం. అసంపూర్ణం . అవే పాలు పె రుగులు .
క్షీర సాగరం
విశ్వమంతా వ్యాపించిన ముఖ్య ఖాద్య పదార్థం పాలు . ఆరోగ్యాన్ని పెంచేది .ఆరోగ్యం బా లేకుంటే కోలుకోవడానికి సహకరించేది పాలే . ఇది సంపూర్ణ ఆహారం అని చెప్పొచ్చు . కొబ్బరి సంపూర్ణఫలమైతే పాలు నిస్సందేహంగా సంపూర్ణ ఆహారం .అనాది నుంచి పశు సంబంధిత పాలను మానవులు వాడుతూ ఉన్నారు . సాధారణంగా ఆవు, బర్రె ,మేక పాలను వాడుతారు .కొన్ని ప్రాంతాల్లో గుర్రపు పాలు కూడా వాడుతారు .కొన్ని ప్రత్యేక సందర్భాలలో గాడిద పాలను మందులా వాడతారు .
తక్కువ చక్కెరతో తల్లిపాలకు రెండు రెట్ల ప్రోటీన్ తో ఆవు పాలు ఉంటాయి .ఆవు పాలలో కంటే గేదె పాలలో కొవ్వు ఎక్కువ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అత్యవసరమైన విటమిన్లు, అనేక ఖనిజాలు ,కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి ఆవు పాలలో.
ఒక లీటర్ పాలలో ఒక మనిషికి ఒక రోజుకు అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్ మొత్తం లభిస్తాయి. పాలు అరగడానికి గంటన్నర సమయం పడుతుంది. ప్రాచీన వైద్యుడు చరకు ని అభిప్రాయంలో పాలు మనలో బలాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలసటను దూరం చేసి ,శక్తినిస్తాయి .ఆధునిక పరిశోధనలు చరకుని అభిప్రాయాన్ని బ లపరుస్తున్నాయి .పసిపాపల నుండి పండు వృద్ధుల వరకు అందరికీ సరిపోయే ఆహారం . గర్భిణులకు బాలింతలకు సమానంగా ఉపయోగం ఈ పాలే . సన్నగా బరువు తక్కువగా ఉన్న వారికి పాలు గొప్ప ఆహారం . రక్తప్రసరణ సరిగా లేని వారికి ఇవి చాలా ఉపయోగం. ఎసిడిటీకి మంచి మందు చల్లని పాలు .నిద్ర పట్టని వారికి పడుకునే ముందు కొంచెం తేనె కలిపిన గోరువెచ్చని పాలు గొప్పగా పనిచేస్తాయి .జలుబు, గొంతులో గరగర ,టాన్సిలైటిస్ అస్తమా వంటి శ్వాస సమస్యలకు లాభకారి .ఓ గ్లాస్ పాలలో చిటికెడు పసుపు నాలుగు లేక ఐదు నలగొట్టిన మిరియాలు కలిపి మూడు రోజులు వరసగా రాత్రులు తాగితే మంచి ఫలితం ఉంటుంది .
సౌందర్య పోషణలోనూ ప్రముఖ పాత్ర పాలది . పాల ప్రసక్తి లేకుండా మనకు విందులు, పండుగలు, వేడుకలు, వినోదాలు పూర్తి కావు. పూజలోనూ పాలది ప్రముఖ స్థానం .
పాలు అనే మాటను భాగం అనే అర్థం లోను వాడతాం. ఈరోజుల్లో సోయా గింజల నుంచి బాదాం కొబ్బరి లతో సహా అనేక పదార్థాల నుండి పాలను తయారు చేస్తున్నారు .బజార్లో అందుబాటులో ఉన్నాయి కూడా.
పాముకు పాలు పోసి పెంచిన విషమే కక్కుతుంది
పాలలో పంచదార ఒలికినట్లు అని సామెతలు ఉన్నాయి. మేకపాలు అనగానే గాంధీజీ గుర్తొస్తారు. తెల్లని వన్నీ పాలని నల్లనివన్నీ నీళ్లు అనుకుంటాడు అని అమాయకులను గురించి చెప్తూ ఉంటాం. ప్రపంచంలోని పాల ఉత్పత్తిలో 85% ఆవుపాలు 11% గేదె పాలు 2 శాతం మేకపాలు ఉంటాయి. ఉత్తర భారతంలో పాలను అలాగే తీసుకుంటారు . అదే దక్షిణ దేశంలో కాఫీ లేదా టీ ద్వారా తీసుకుంటాం. పెరుగు లేదా మజ్జిగ రూపంలోనూ వాడతాం .
మరి కాస్త
పాలలోంచి తయారయ్యే ఉత్పత్తులు లెక్కలేన న్ని . పెరుగు ,మజ్జిగ, మీగడ ,నెయ్యి అందరికీ నచ్చిన పనీ ర్ గురించి చెప్పే పనేలేదు .మన మిఠాయిల్లో పాల ఉత్పత్తులు ముఖ్యపాత్ర వహిస్తాయి. పూర్వం రోజుల్లో ముఖ్యంగా గ్రామాల్లో అందరి ఇళ్లల్లోనూ పాడి ఉండేది. పాలు పెరుగు అమ్మడం నా మోషిగా భావించేవారు .మజ్జిగ అనగానే నాకు మధురానగరి లో చల్ల నమ్మ బోదు అని చక్కటి అందమైన గీతం గుర్తొస్తుంది దాని గురించి మరోసారి చెప్పుకుందాం.
నాగుల చవితికి నాగుల పంచమికి పుట్టలో పాలు పోయడం తెలుగువారి సనాతన సంప్రదాయం .మనం కొలిచే లక్ష్మీదేవి క్షీరసాగర కన్యక కదా! పాలు పొంగిస్తేనే గృహప్రవేశ వేడుక మొదలవుతుంది .పాలు అనగానే క్షీరసాగర మధనం చవితి చంద్రుని కథ గుర్తు వస్తాయి. పాల ఉత్పత్తుల కథ చెప్పాలంటే మరో భారతం అవుతుంది
పెరుగు
పెరుగు గురించి చెప్పకుండా పాల కథ అసంపూర్ణం .పాలను కాసింత పెరుగు వేసి ,తోడు పెడితే వచ్చేదే పెరుగు .ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేది. ఆ రుచి మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది .యూరప్ అమెరికాలో సాధారణంగా ఆవుపాల పెరుగును వాడితే ,భారతదేశంలో గేదె పెరుగును ఎక్కువగా వాడతారు.రష్యాలో మేక, గొర్రె ,గుర్రం పాలను ఎక్కువగా పెరుగు తయారీలో వాడతారు .పెరుగు నాణ్యత మంచి పాలపై చక్క టి తోడు పై ఆధారపడి ఉంటుంది .వేసవికాలంలో పెరుగు త్వరగా తోడుకుంటుంది .చలికాలంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది .కనుక పైనుంచి పెద్ద గిన్నెనో కంబళినో కప్తారు .వేడి దినాల్లో పెరుగు తయారు కావడానికి 6 నుంచి 8:00 గంటలు పడితే చలికాలంలో 12 నుంచి 16 గంటల కావాలి .ఆహార శాస్త్రాన్ని గమనిస్తే టర్కీలో తొలుత పెరుగు తయారైందని తెలుస్తుంది. మన దేశంలో పాలతోపాటు పెరుగునూ సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.
పెరుగు శక్తి నిచ్చే ఆహారం .అవసరమైన ప్రోటీన్ విటమిన్లు మినరల్లు ఉంటాయి .క్యాల్షియం కూడా దండిగా ఉంటుంది .దీనిలోని ప్రోటీన్లు పాల ప్రోటీన్లకన్నా తేలిగ్గా జీర్ణం అవుతాయి .ఒక అంచనా ప్రకారం తా గిన పాలలో 32 శాతం గంటలో జీర్ణ మైతే అదే గంటలో 91% పెరుగుజీర్ణ మౌతుంది . పేగులపై ,పొట్టపై మృదువుగా పనిచేస్తుంది .మృదువైన చర్మానికి ఓట్స్ పొడిని పెరుగుతో కలిపి ప్యాక్‌లా వాడతారు. సౌందర్య సాధనంగానే కాదు, భారతీయులు చాలా వంటల్లో పెరుగును చేరుస్తారు. కేవలం పెరుగు ముఖ్య పదార్థంగా లస్సీ , దహి వడ ,దధి ఓ ధనం వంటి వంటలు ఎన్నో చేస్తారు. రోజు పెరుగు తినడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి ,గుండె జబ్బులు రావని పలు అధ్యయనాల్లో తేలింది . దీని లోని లాక్టోబర్ బ్యాక్టీరియా శరీరంలో తెల్ల రక్త కణాలను పెరిగేలా చేస్తుంది.
చాలామందికి పెరుగన్న తినకపోతే భోజనం పూర్తయినట్లు కాదు రోజు పెరుగు సేవిస్తే ,వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది . ఆయుర్వేదం గేదె పాల పెరుగు కంటే ఆవుపాల పెరుగు మంచిదంటుంది .అయితే ఈ ప్రయోజనాలన్నీ తాజా పెరుగులోనే లభ్యం .మనదేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో దాదాపు 46% పాల రూపంలో వాడితే తక్కిన 54% పాల పదార్థాల వినియోగిస్తున్నాం.
ఇవన్నీ మనకు తెలిసినవే అంటారా . నిజమే. మరోసారి ప్రేమగా , అభిమానంతో గుర్తు చేసుకోవడమే .
రెండవ , చివరి భాగం త్వరలో .
మళ్ళీ కలుద్దాం .
ఆత్మకథ రాసిన తొలి మహిళ పేరు శ్రీమతి సత్యవతి .ఈ చిరు వ్యాసంలో ఆమె రచించిన ఆత్మ చరితము లోని విశేషాలను , సారాంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం .
ఆత్మకథని స్వీయ చరిత్ర అని కూడా అంటారు .ఒక వ్యక్తి తన జీవితం గూర్చి తా నే రాసుకున్నది ఆత్మకథ లేక స్వీయ చరిత్ర .ఎవరైనా సరే వారి వారి జీవితాల్లో జరిగిన అ ను భవాలను ,సంఘటనలను, జ్ఞాపకాలను భావితరాలకు అందించడానికి చేసే ప్రయత్నమే స్వీయ చరిత్ర.
భారతీయ భాషలలో స్త్రీలు స్వీయ చరిత్రలు రాయడం 19వ శతాబ్దపు మద్యభాగం నుంచి మొదలైంది. తెలుగులో స్త్రీలు రాసిన స్వీయ చరిత్రలు చాలా అరుదుగా కనిపిస్తాయి . మనం ఇప్పుడు తెలుసుకోబోయే సత్యవతి గారి ఆత్మ చరితము మొట్టమొదటగా 1934లో ముద్రించబడింది .ఇది తొలి తెలుగు మహిళా ఆత్మకథ .
మనిషి జీవితం కంటే ఆసక్తికరమైన అంశం మరొకటి ఉండదు .ప్రతి ఒక్కరు వారి వారి జీవితాల్లో అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటారు .ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. అలాగే సత్యవతి గారు కూడా వారి కాలంలో ఉంటే 1934 ప్రాంతంలో జరిగిన సాంఘిక దురాచారాలకు స్పందించి ఈ రచన చేశారు
రచయిత్రి గురించి కొంత
ఈమె సున్నిత మనస్కు రాలు. సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలకు ఎంతగానో బాధపడేవారు. మనసులో ఉన్న ఈ బాధంతా ఆత్మకథ రూపంలో వెలు వరించారు అని చెప్పవచ్చు. అయితే ఇందులో సత్యవతి గారి పుట్టుక ,వివాహం, ఆమె భర్తతో గడిపిన కాలం, అ కాలంగా భర్త మరణించడం మొదలైన వివరాలన్నీ ఉన్నవి. కానీ వీటన్నిటికీ సంబంధించిన సంఘటన ,తేదీలు కానీ సమయాలు ,కానీ ఎక్కడా కనిపించవు. ఆమె వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకోలేదేమో ! అందువలన ఈ పుస్తకం తప్ప దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి మనకి ఇంకా ఏ ఆధారము లేదు .పుస్తకంలో చెప్పబడిన విషయాలను బట్టి , ఆనాటి సాంఘిక పరిస్థితులను సత్యవతి గారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను గురించి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది.
రచయిత్రికి పుస్తక పఠనం బాగా అలవాటుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ గ్రంథం చదువుతూ ఉంటే .చాలా చిన్న పుస్తకమైన అలంకారాలు ,మంచి భాష , చక్కటి సమాసాలను ఉపయోగించారు .పదబంధాలను అలవోకగా వాడారు.ఈ రచన చేయడానికి ముఖ్య కారణం స్త్రీ పునర్వివాహాలు, భర్త చనిపోయిన స్త్రీకి శిరోముండనం , ఒకటే పూట భోజనం, సైను బట్టలనే చీరలుగా కట్టించడం, తద్డి నాలకు సంబంధించిన విధి విధానాలను చాలా లోతుగా చర్చించారు. తనకు తోచిన సమాధానాలు కూడా ఇందులో ఆవిడ సాహసోపేతంగా ప్రకటించారు . పుస్తకాన్ని చదివినప్పుడు ఈ గ్రంథం 1934 ఫిబ్రవరిలో అవనిగడ్డలో రాసినట్లుగా తెలుస్తోంది .దీన్ని చనిపోయిన భర్త శ్రీ సీతారామయ్య గారికి ఆమె అంకితం ఇచ్చారు .ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. అయితే ముందు చెప్పుకున్నట్లుగా ఇది అర్ధాంతరంగా ముగిసింది . మొదటి భాగంలో ఈమె జీవిత కథ రెండవ భాగంలో ఆమె అభిప్రాయాలు ఉన్నాయి .అయితే అభిప్రాయాలు ఎక్కువ శాతం దేవుడు -మతం -సమాజం ఈ మూడు అంశాల పట్ల ఉన్నట్టుగా మనకు పుస్తకం చదివితే తెలుస్తుంది.
సత్యవతి గారు తనను తాను పతివ్రతగా భావించారు .సతీ సావిత్రి వలే తాను కూడా భర్తప్రాణాన్ని వెనక్కి తెచ్చుకోగలను అనుకున్నారు .ఒక వితంతువుగా పతివ్రత స్థానం కోసం వాదించడం నేటికీ విచిత్రంగానే అనిపిస్తుంది. మరి ఆ రోజుల సంగతి చెప్పనవసరం లేదు .ఇందులో ఆమె వెల్లడించిన అభిప్రాయాలు చాలా తీవ్రమైనవి .చాలా ఆచారాల్ని, నమ్మకాల్ని హేతువాదంతో ప్రశ్నించారు .సంతృప్తికరంగా సమాధానం దొరక ఉంటే నిరా ధారమైనవి అని కొట్టివేయడానికి కూడా వెనకాడలేదు .ఇలాంటి దృక్పధం ఏర్పడడానికి గల కారణాలను ఆ పుస్తకంలో ఆవిడ చర్చించలేదు.
నాణానికి మరోవైపు
ప్రఖ్యాత రచయిత శ్రీ చలం గారు 19204లో సావిత్రి నాటకం రచించారు.అందులో ఆయన పురాణ గాధను అంటే సావిత్రి కథను అన్యోన్య ప్రేమను ప్రశంసించేందుకు వాడుకోగా, అదే కథను సత్యవతి గారు పాతివ్రత్యం విలువ కోసం మాత్రమే కాక అన్యోన్య ప్రేమను శ్లా ఘీం చడానికి ,అమ్మాయిలు భర్తల్ని తామే ఎంచు కు నే పద్ధతిని సమర్ధించుకోవడానికి వాడారు .
1934లో ప్రచురించబడిన ఈ గ్రంధంలో అంటే 90 సంవత్సరాల క్రితం తొలి పలుకులో రచయిత్రి లోకమును జరుగుతున్న దురాచారములను నిర్మూలించుటకే నేను ఈ గ్రంథమును ప్రకటించితిని .ముఖ్యంగా అనాధలకు జరుగుతున్న శిరోముం డనాది పరాభవములను తగ్గింపవలెనని నా ముఖ్య ఉద్దేశము అని ప్రకటించుట నిస్సందేహంగా సాహసోపేతమైన చర్య.
సారాంశం
సత్యవతి తండ్రి బెజవాడలో ఓవర్ సీయర్ .ఆమె ఐదేళ్ల వయసులో వాళ్ళ ఊరిలోని బాలి కా పాఠశాలకు పంపించారు. ఆమెకి చిన్నప్పటినుంచి దైవభక్తి ఎక్కువ .పతివ్రత చరిత్రలు ఎక్కువగా చదివేది. పది సంవత్సరాల వయసులో కోరంగి గ్రామంలో జరిగిన ఒక ఉపనయన కార్యక్రమానికి హాజరై, అతనే భర్తగా కావాలనుకున్నది .తర్వాత అతనితోనే ఆమె వివాహం జరిగింది .అతని పేరు సీతారామయ్య అతను ఎఫ్ .ఏ పరీక్షలో ఉత్తీర్ణు డయ్యాక మామగారి ప్రోద్బలంతో కాకినాడ ఉన్నత కళాశాలలో బిఏ చదివాడు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరాడు .శ్రీకాకుళంలో ఆరు నెలలు పని చేశాడు. తర్వాత ఆముదాలవలసకు బదిలీ అయింది. అక్కడ అతను అకారణంగా ఉద్యోగం కోల్పోయాడు. మద్రాసు వెళ్లి పోరాడి, తిరిగి ఉద్యోగం సంపాదించుకున్నాడు .పై అధికారి అతని మీద కోపంతో బమినిగాం అనే ఏజెన్సీ ఏరియాకు బదిలీ చేశారు. అక్కడ నివసించడానికి అనువు గా లేకపోవడంతో సత్యావతి కొద్దిరోజులు భర్త నుంచి దూరంగా ఉండవలసి వచ్చింది. తర్వాత అతనికి దారిగం బాడీ అనే స్టేషన్‌కు బదిలీ అయింది. అక్కడికి తన భార్యతో పాటు ఒక మనిషిని ఇచ్చి పంపమని మామగారికి ఉత్తరం రాశాడు సీతారామయ్య .సగం దూరం వచ్చిన తర్వాత ,అక్కడి పరిస్థితులు చూసి భయపడి తోడుగా వచ్చిన ముసలామె వెనక్కి వెళ్ళిపోయింది .చివరికి దంపతులిద్దరూ దారిగం బాడీలో కొద్ది రోజులు కాపురం చేస్తారు. తర్వాత ఇద్దరు అప్పుడప్పుడు జ్వరం బారిన పడుతూ ఉండేవారు. కొంతకాలానికి సీతారామయ్య ఆ జ్వరంతోనే కన్నుమూశాడు.
భర్త మీదనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న ఆమె ఆయనతో పాటు చనిపోవాలని సహగ మనం చేయాలని ప్రయత్నం చేసింది .కానీ చుట్టుపక్కల వాళ్ళు ఆమెను ఆపి తిరిగి తండ్రి వద్దకు పంపేశారు. అక్కడ నుంచి మరణించే వరకు ఆమె భర్తనే తలుచుకుంటూ జీవితం సాగించింది అనే విషయం మనకి గ్రంథం చదివినప్పుడు అర్థమవుతుంది.
ఇప్పుడు సత్యవతి గారి అభిప్రాయాలను గురించి తెలుసుకుందాం దానికి ముందుగా మరొక మాట గుర్తుంచుకోవాలి .ఇది 1934 అంటే 90 సంవత్సరాల క్రితం ప్రచురించబడి. రాయబడినటువంటి గ్రంథం అనే విషయం దృష్టిలో ఉంచుకోవాలి.
- వివాహమైన వెనుక ఎట్టి శ్రీమంతులకు శ్రీమంతునులైనను తమ భర్తను అనుసరింపక తప్పదు .
- చదువుకొని చేతికి అందిన కుమారుడు ఇంట నుండి సంపాదింప కున్న తల్లిదండ్రులు ఊరుకొనరు .
- పోలీసు వారికి విశ్వాసము సున్న . దయాదాక్షిణ్యములు చుక్కకెదురు. సత్యము వీరికి సవ తి .తల్లి వంటిది. లంచం అన్న మరి మంచినీ రు .
- లోకమున భర్తతో పాటు భార్య కూడా కష్టసుఖముల యందు పాల్గొనుట సతి ధర్మము .
- అందరికీ తమ భర్తలను బ్రతికించుకొని, వారితో సుఖముగా ఉండవ లేనని ఉండును. అది సాగనిచో ప్రాణమునకు తెగించి ,సహగమనము చేయుట మంచిది
భర్త పోయిన స్త్రీలకు జరపు వంచనలు ,పరాభవములు పొందుట కన్నా, చావే సర్వోత్తమం అనిపించును .
- దేశము కొరకు ఎన్ని పాట్లు పడుచున్నను గాంధీని కూడా కొందరు దూషించుచునే ఉన్నారు .
- భర్త పోయిన వెంటనే కేశఖండనము చేయించుట,సాయిను గుడ్డ కట్టించి, ముసుగు వేసి ,మూలను కూర్చుండబెట్టుట ,రాత్రులందు తిండిని మాన్పించుట ఇవన్నీ మానవ స్వభావమునకు విరుద్ధములై యున్నవి .
- ముసుగు వేసికొన్న మర్యాదలు, పిండి తినినందున వైరాగ్యము అలవాడు నా ?9)మనదేశమున కన్యాశుల్కము వర సుల్కములు పుచ్చుకొను ఆచారం ప్రభలమైనది .అందుచేతనే అనేక అనర్ధములు వాటిల్లుచున్నవి .
10 ) దంపతుల అనురాగమునకు మనస్సు కలియుటయే ప్రధానము కానీ సూత్రధారణము కాదు .
- భార్యకు పతివ్రతాత్వం ఎంత ఆవశ్యకమో భర్తకు పత్నీవ్రతము అంత ఆవశ్యమే.
- పుణ్య పాపములు చేసిన వారలకు భేధ మేమియు మరణమున కాన వచ్చుటలేదు .
- పుణ్యమన పరోపకారమే అని యు, ఇతరుల హింసించుట, కష్టపెట్టుట పాపమని నా అభిప్రాయము.
ఆమె జీవిత చరిత్రలో కొంతకాలమునకు సంబంధించిన కొన్ని సంఘటనలు మాత్రమే ఇందులో వ్యక్తం చేయబడినవి. నేటికీ కూడా ఆశ్చర్య పడునట్టు అనేక అభిప్రాయం వ్యక్తపరిచిన సత్యవతి గారి సామర్థ్యం ఊహకందని ది .ఆ రోజులలో ఇది ఎంతో దుమారము రేపి ఉండవచ్చు. అందువల్లనే ఇది అజ్ఞాతములో ఉండిపోయనేమో.
90 సంవత్సరాలకు పూర్వము ఇటువంటి అభిప్రాయములను కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ మూర్తి వాటిని తన మనసులో దాచుకొనక ఒక పుస్తక రూపమున ప్రకటించుకొనుట అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజులలో మనము ఊహించినటువంటి కొన్ని భావాలను ఆవిడ ఆ గ్రంథంలో వెల్లడి చేశారు .ఇటువంటి కాలానికి ముందు నడిచిన వాళ్ళు ఎందరో ఉండి ఉండవచ్చు. మనకు తెలుసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తుంది.
ఇదండీ సత్యవతి గారి ఆత్మ చరితము యొక్క చిరు పరిచయం.
ప్రస్తుతం ఏ న్యూస్ పేపర్ చూసిన , వార్తా చానల్ చూసిన ,యూట్యూబ్ ఛానల్ చూసిన కుంభమేళా _నాగ సాధువులు _అఖారాలు ర ప్రముఖుల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు , పిండ ప్రదానాలు , ఆధ్యాత్మిక వాతావరణం మన నలువైపులా ఆవరించింది . ఈ సమయంలో ప్రయాగరాజ్ _ హరిద్వార్ _ఉజ్జయిని _ నాసిక్ ప్రాంతాల నదుల్లోకి అపరిమితమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది అని మన పెద్దలు చెప్పారు . ఆ హరిద్వార్‌లో పుణ్యస్నానాలు చేయడానికి మేము ఆరుగురం కలిసి హైదరాబాదులో బయలుదేరి మరునాటి సాయంకాలం హరిద్వార్ చేరుకున్నాం .
ఢిల్లీ రైల్వే స్టేషన్ లోనే కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ,పక్కగా ఉన్న హల్దీ రామ్ వాళ్ళ హోటల్ గమనించి , టిఫిన్ చేయడానికి వెళ్ళాం . స్టేషన్లో లోపల తినలేము అనుకునే వాళ్లకు , నచ్చిన రుచులు కావాలి అనుకునే వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం . టిఫెన్స్ చాలా రుచిగా ఉండినాయి . చాలా వేగంగా సర్వీస్ ఉంటుంది .ఎన్నో రకాలు మనకు దొరుకుతాయి .బాగా రష్ గా కూడా ఉండింది .టిఫిన్ చేసి కాసేపు సేద తీరి హరిద్వార్ బయలుదేరం. ఢిల్లీలో చలి ఉంటుందని తెలుసు అయితే అంతకంటే ఎక్కువగా హరిద్వార్‌లో ఉండింది . హోటల్లో దిగి ,లగేజ్ పెట్టేసి సాయంత్రం చుట్టుపక్కల తిరిగాము .
తెల్లవారి ప్రొద్దున్నే హ రి కి పౌరీ చేరి అక్కడే స్నానాలు చేశాము . గంగమ్మకు భక్తితో నమస్కరించుకొని ,నీళ్లలో దిగి పసుపు, కుంకుమ రాగి నాణ్యాలు వేసి నమస్కారం చేసుకొని స్నానాలు చేశాము . దగ్గర్లోనే బట్టలు మార్చుకోవడానికి తాత్కాలిక గదులు కూడా ఏర్పాటు చేశారు .
మరో ముఖ్య విషయం నీటి వేగానికి తట్టుకుని స్నానం చేయడానికి వీలుగా ఇనుప గొలుసులు కూడా ఉన్నాయి . చాలామంది ఒక చేత్తో గొలుసు పట్టుకుని ఇంకో చేత నీళ్లలో మునిగి లేచి స్నానా లు చేశారు .

స్నానాఘట్టాల వద్ద రద్దీగా ఉన్నా చుట్టుపక్కల చాలా శుభ్రంగా ఉంది .చెత్తాచెదారం వెంబడి వెంబడే శుభ్రం చేస్తూ వచ్చారు .పూజా ద్రవ్యాలు అమ్మే షాపులు , రంగురంగుల పూసలు ,హారాలు , అలంకరణ సామాగ్రి ,శివలింగాలు , రుద్రాక్షలు కొనాలనుకుంటే ఎన్ని ఉన్నాయో చెప్పలేను . కనులవిందు చేసేవి మరి ఇంకెన్నో . మా హోటల్ నదీ తీరానికి చాలా దగ్గరలోనే ఉండింది . అందువల్ల మళ్లీ హోటల్ కు వచ్చి మానసా దేవి మందిరానికి బయలుదేరాం . ఆ వెళ్లే దారిలో అన్ని ధర్మశాలలే .అవన్నీ ఎంతో ప్రాచీనమైనవి . కనీసం 50 , 60 ఏళ్ల క్రితం కట్టిన వాటిలాగా అనిపించేయి . ధర్మశాలలు అన్నీ కూడా చాలా పాతవి చక్కటి చెక్క పనితనం కనిపించిండి వాటిలో . బాల్కనీలు అవి చూస్తే ఎంత ఆనందంగా ఉండిందో చెప్పలేను మన పూర్వుల భక్తి శ్రద్ధ నైపుణ్యం చూస్తేఆశ్చర్యం తో బాటు ఆనందం కూడా వేసింది .
మానసా దేవి మందిరం ఎంట్రన్స్ మా హోటల్ కి బాగా దగ్గర అక్కడ కొండ మీద గుడి ఉంది . అలాగే మూడు కొండల మీద మూడు దేవాలయాలు ఉన్నాయి . ఒకటి మానసా దేవి మందిరం , రెండవది చండీ దేవి మందిరం . మూడవది అంజనమాత మందిరం . అలా మూడు ఉన్నాయి వీటిని రోప్ వి ల పై చూడడం అపురూపమైన అనుభవం . ఆంజనేయుల గుళ్ళు అనేకం కానీ ఆ తల్లి గుడి ఇక్కడే కనిపించింది . బహుశా నేనే ఇక్కడ మొదటిసారి గమనించి ఉంటాను . ధ్యానం చేసుకోవడానికి ఆ వాతావరణం అనుకూలంగా ఉండింది . ఐదు నిమిషాలు కళ్ళు మూసుకున్న చాలు గొప్ప ప్రశాంతత మన సొంతం .మానసా దేవి మందిరం , చండీ మందిరం కొద్దిగా కో లాహలంగా ఉంటే ఇక్కడ ఒక అలోకి క వాతావరణం ,నిశ్శబ్ద సంగీతం నాకు అనుభవంలోకి వఛాయి .
మూడు చూసుకొని మళ్లీ బయలుదేరి మా బసకు దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని , గంగాహారతిని చూడడానికి వెళ్ళాము .ఎంత బాగుందో ఎదురుగా గంగమ్మ గంగకి ఎదురుగా వరుసగా మెట్ల మీద అశేష ప్రజానీకం చక్కటి భజనలు , సామూహిక జయ జయ డ్వానాలూ కొత్త లోకంలోకి ప్రవేశించినట్లు అనిపించింది .అందరూ కలిసి మనకు జీవన ప్రదాతలైన జలసిరులకు మనసా వాచా కర్మణా నమస్కారం చేసే అద్భుత దృశ్యం అక్కడ చూసాం . ఎందుకంటే మన జీవన విధానం వికసించిందినదీతీరాల్లోనే . భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు గంగ భారతీయ ఆత్మ .
ఎంతో తృప్తితో బయటికి వచ్చి మా హొటెలకు బయలు దేరాము.
దారిలో వెచ్చదనాన్ని ఇచ్చే అనేక సాధనాలు చూసాం. వేడి వేడి సమోసాలు ,కచోరీలు , పూరీల అమ్మకాలు మరోపక్క స్వెటర్లు బ్లాంకెట్లు స్కార్ఫ్‌లు బ్లౌజులు సాక్సులు ఇంకోపక్క డ్రై ఫ్రూట్ షాప్స్ అంతేనా . అంతేకాదు సుమ ఇంకా…
ఖరీదైన రాళ్లు ,శంఖాలు , రుద్రాక్షలు , స్పటిక రస లింగాలు భగవంతుని పూజకు కావలసినటువంటి అనేకమైన సామాగ్రి కోరినవన్నీ ఒకే చోట దొరికే కన్జ్యూమర్స్ పారడైజ్ అని చెప్పవచ్చు . ప్రతివారికి అవసరమైన వస్తువు అందుబాటు ధరలో దొరకడం ఇక్కడ ప్రత్యేకత .షాపులుకూడా బాగా పొద్దెక్కాక తెరుస్తారు . రాత్రి పొద్దు పోయే వరకు పెద్ద పెద్ద బాణలిలో వేడివేడిగా వేగుతున్న సమోసా , రగడ , కచోరీ , గులాబ్ జాములురారమ్మని అని పిలుస్తూ ఉంటాయి. రోడ్డు మీద నడుస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కష్టమే .ఆ చలికి ఈ వేడివేడి ఆహారం సరి అయిన జవాబు అనిపిస్తుంది చాలాసార్లు .వాళ్ళు ఎంతో మర్యాదగా మనల్ని ఆహ్వానిస్తారు . షాపులోకి రమ్మని చెప్పే విధానం బలే బలే నచ్చుతుంది .
రాత్రంతా అలా విహరించి లాడ్జికి చేరి అలసి సొలసి నిద్రపోయాం . తెల్లవారి పొద్దున్నే ఋషికేశ్ బయలుదేరామ్ . హరిద్వార్ పదహారేళ్ల పడుచు పిల్లలాగా చెంగుచెంగున గంతు లేస్తుంటే , అనుభవాల మంద గమనంతో భారంగా నడుస్తున్న మధ్య వయసు స్త్రీ లా కనిపిస్తుంది రిషికేష్ . అయితే హరిద్వార్ ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు .పెద్ద వాణిజ్య కూడలి . అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ విశ్వరూపం కనిపిస్తుంది .రిషికేష్ లో కూడా త్రివేణి సంగమం ఉందంట . అక్కడికి వెళ్ళాక తెలిసింది . పైన ఉన్న నీలకంఠ మహేశ్వర్ దేవాలయానికి వెళ్ళాం . కొండపైన ఉంది .ఆ కొండలే మన అహంకారానికి అడ్డు కట్టలు . పెద్ద ఘాట్‌రోడ్ .ప్రాచీనమైన మందిరం . క్రిందికి చూస్తే నయనం దకర దృశ్యం . కొండనుండి కిందికి వచ్చి ఋషి కేష్ లో స్నానం చేశాం . అప్పటికే 12:00 అయినట్టుంది అందువల్ల శరీరానికి అంత ఇబ్బంది కలగలేదు .రోడ్డుకు రెండు వైపులా చిన్నచిన్న దుకాణాలు వాళ్ల కళ్ళల్లో మన పట్ల పెద్ద పెద్ద ఆశలు .
మళ్లీ వ్యాన్ లో కూర్చుని ఒక గంట ప్రయాణం చేసి ఇస్కాన్ వారి రెస్టారెంట్లో భోజనం చేసాం .మెల్లిగా నడుస్తూ అక్కడి నుంచి పరమాత్మానంద ఆశ్రమం , గీతా ఆశ్రమం చూసుకుంటూ నడుచుకుంటూ జానకి జుల చేరుకున్నాం . అక్కడ ఫోటోగ్రఫీ నిషిద్ధం . జానకి ఝులా ఫోటో క్రింద ఈఆస్తాను . చూడండి .ఒకప్పుడు లక్ష్మణఝులా వేరే ఎక్కువగా వినిపించేది . చెక్క వంతెన పై ఇప్పుడు చిన్న కంకర సిమెంట్ లాంటిది కలిపి రోడ్డు లా వేశారు . చిన్న కదలిక అయినా అనుభవం బాగుంటుంది

ఇక్కడ అంటే రిషికేశ్‌లో ఒక విషయం గమనించాను . బేరం అనేది ఇక్కడ బాగా తక్కువ . అన్ని షాపుల్లో ఇంచుమించు ఒకే రేట్ చెప్తారు . అయితే ఎన్నిసార్లు అయినా వివరిస్తారు .ఎన్ని వస్తువులు అయినా చూపిస్తారు .
మాయాదేవి మందిరం , దక్షిణేశ్వర్ మహాదేవ మందిరం చూసాము . చాలా బాగుందినవి .ఆరోజు అక్కడ ఎలక్షన్స్ జరుగుతుండె . మా హోటల్ స్టేషన్ కి దగ్గరే .కానీ లగేజ్ ఉంటుంది కదా .సాయంత్రం ఆటో ట్యాక్సీ దొరకడం కష్టమని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు . అందువల్ల చాలా త్వరగా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము . సాయంత్రం నాలుగున్నర గంటలకు బి కానిర్ ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరి కురుక్షేత్ర దిగాము . ఆ రోజంతా కురుక్షేత్ర తిరగాలనుకున్నారాత్రి అయిపోయిన అందువల్ల మా హోటల్ కి దగ్గరలో చుట్టుపక్కల కాస్త చూసుకుంన్నా ము. ఇక్కడ పొద్దుటి పూట చలి ఎక్కువగానే ఉండింది .మొదలు చిన్న బ్రహ్మసరోవరం చేరుకున్నాం. ఇక్కడే దుర్యోధనుడు జల స్తంభన విద్యతో నీటిలో దాగి ఉన్నాచోటని చెప్పారు . స్వచ్ఛంగా శుభ్రంగా నీళ్ళు బావుంది .దానికి ఎదురుగా లక్ష్మీనారాయణ గుడి ఉంది .అది చూసుకొని మళ్లీ బయలుదేరి పెద్దబ్రహ్మ మానస సరోవరం వెళ్ళాము .కనుచూపుమేర నీళ్లు చల్లని గాలి అక్కడ స్థానికులు గోధుమ పిండిని చపాతీ పిండిలా తడిపి పొడి పిండిలో దొర్లించి చిన్న చిన్న గుండ్రెడ్డి బాల్స్ లాగా చేస్తారు .
ఈ చిన్నది గుండ్రటి బాల్స్ ని నీళ్లలో విసిరేస్తే చాలా తక్కువ ఖర్చు తో అపురూపమైన అనుభవాన్ని మన సొంతం చేసుకుంటాం . నీటిలో మునిగి ముక్కుతో పట్టి గుటుక్కున మింగుతాయిబాతులు . చూడడానికి బాగుంటుంది
ఆ తరువాత గీతోపదేశం జరిగిన ప్రదేశానికి వెళ్ళాము . ఫోటోలు క్రింద ఇస్తాను చూడండి . ఆ ముఖాల్లో హావ భావాలు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయో . చివరికి గుర్రాలు కూడా ఓ నిమిషంలో మన మీదికి దుకాస్తయేమో అన్నంత సహజంగా ఉన్నాయి . కదలికలను ,వేగాన్ని కళ్ళ ముందర కళ్ళకు కట్టినట్టు నిలబెట్టిన అజ్ఞాత శిల్ప లకు పాదాభివందనాలు . అంతకుమించి ఇంకేం చేయలేం కదా .
అక్కడే కూర్చుని గీతలో రెండు అధ్యాయాలు మనసులో చదువుకున్నాను . ఆ తర్వాత జ్యోతి సర్ వెళ్ళాం అంటే పాండవులు ఆయుధాలు దాచిన స్థలం . అక్కడ భారీ ఎత్తున కృష్ణ భగవానుని విశ్వరూప దర్శనం మోడల్ ఉంది . అర్జునుడు ఏమో కానీ మేము విభ్రాంతులమై అలా నిలబడిపోయాము . లౌకికమైన అనుభూతికి అందని భావమది .
అక్కడ ఇంకో రెండు అధ్యాయాలు గీత చదువుకుని భీష్మ పితామహుడు అంప శయ్య మీద పడి ఉండిన ప్రదేశానికి వెళ్ళాం .ఆ పక్కనే అర్జునుడు భీశ్ముని కోసం గంగను తెప్పించిన సంఘటనకు గుర్తుగా పాతది మెట్ల బావి కూడా అక్కడే ఉంది . డాన్ని బాణ గంగ అంటారు . అక్కడి నుంచి భద్రకాళి గుడికి వెళ్ళాము . సాధారణంగా మనం చూసేదానికి భిన్నంగా ఇక్కడ అమ్మవారు శాంతంగా ప్రసన్న వదనంతో , చిరునవ్వుతో చక్కగా మనల్ని పలకరిస్తున్నట్టుగా , ఒక తల్లి అక్కడ ఎదురు చూస్తోంది మనకోసం అన్నట్టుగా అనిపించింది చూస్తుంటే . ఆ పక్కనే చిన్న పద్మవ్యూహం టైపులో మెలికలు తిరిగిన దారి ఉంది. అలా తిరుగుతూ వచ్చి దర్శనం చేసుకోవాలన్నమాట .అక్కడ ఒక చిన్న మంటపంలో పద్మవ్యూహం కూడా చిత్రించబడి ఉంది చివరిలో ఫోటో ఇస్తాను చూసుకోండి
ఒక విషయం నా దృష్టికి వచ్చింది యాత్రను ఇక్కడ ముఖ్యంగాఅంటే కురుక్షేత్ర చు ట్టు పక్కల ప్రాంతాల్లో కాళీ దేవాలయాలు ,కాలభైరవ ఆలయాలు చాలా కనిపించాయి .అయితే ప్రధాన ఆలయం లేక ఉపాలయాల రూపంలో తప్పనిసరిగా ప్రతి గుడిలోనూ కా ళీ లేదా భైరవ ఆలయం కనిపించింది ఆ తృప్తిని గుండెల నిండా నింపుకొని కురుక్షేత్రం నుండి ఢిల్లీకి అక్కడి నుంచి హైదరాబాదు చేరుకున్నాము .
ఇక్కడితో కుంభమేళాలో పుణ్యా స్నానం చేయాలన్న నా పన్నెండేళ్ల కల తిరిగి తీరింది .
అయితే యాత్ర విశేషాలు ఎప్పుడు సశేషాలే . ఇదొక అనంత భావ స్రవంతి .మరో ప్రయాణానికి బయలుదేరే వరకు ఈ విశేషాలు మనసులో మల్లెల పరిమళాలను వెదజల్లుతాయి . తృప్తిగా మరికొంత కాలం ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి .
ఇక్కడితో మా కుంభమేళా యాత్ర రెండవ మరియు చివరి భాగం పూర్తయింది .
మరోసారి మరో మంచి అంశంతో కలిసే వరకు సెలవా మరి
మీ విజయకందాళ
13 జనవరి 2025 నుండి మొదలైన మహాకుంభమేళా సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వ్యాసం. మయూఖ పాఠకులకు ప్రత్యేకం..
పరిచయం
మహాకుంభమేళా అనేది కోట్లాది హిందువులు సంస్కృతి సంప్రదాయాలపై అచంచల విశ్వాసంతో చేసే యాత్ర ఈ సంవత్సరం 13 జనవరి నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు సాగే 45 రోజుల యాత్ర.
ఇందులో నాలుగు రకాలు ఉంటాయి. సాధారణ కుంభమేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది . ప్రతి ఆరు సంవత్సరాలకు జరిగేది అర్థ కుంభమేళా పూర్ణకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లలో జరుగుతుంది . ఇలా 12 పూర్ణకుంభమేళాలు జరిగాక జరిగేది మహాకుంభమేళా . అంటే 144 సంవత్సరాలకు జరిగేది .ఇది అలహాబాద్ లో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ రోజులలో 12 సంవత్సరాలకు జరిగే దాన్నే మహాకుంభమేళా అని పిలుస్తున్నారు.
కుంభం అంటే సంస్కృతంలో కుండ అని కలశం అని అర్ధాలు ఉన్నాయి . ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం ఒక రాశి కూడా కుంభరాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కలవడం, జాతర అని అర్థాలు, లక్షలాది హిందువులు గంగ ఒడ్డుకు చేరుకొని . చేసే వేడుక ఈ జాతర మరిచాను లక్షలాది ఒకప్పుడు . నేఊ కోట్లాది అనాలి. 2013లో జరిగిన కుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ మేళా జరుగుతుంది . సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉంటే త్రయంబకేశ్వర్‌లో సూర్యుడు మేషరాశిలో ఉంటే హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతుంది .
అలాగే బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉంటే ప్రయాగరజ్ లో బృహస్పతి- సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటే ఉజ్జయినిలో జరుగుతుంది . ఇందువల్లే ప్రతి స్థలంలోనూ బృహస్పతి సూర్యుడు చంద్రుడు స్థానాల ఆధారంగా మేళా తేదీలను నిర్ణయిస్తారు. వాటిని షా హిస్నాన్ లేదా రాజస్నాన్ అని అంటారు.
పౌరాణిక ఆధారాలు
పురాణాల ప్రకారం క్షీరసాగర మధనంలో, భాగవత విష్ణు పురాణాలలో రామాయణం, మహాభారతాల్లో దీని ప్రసక్తి కనిపిస్తుంది. – క్షీరసాగ చిలకడం మొదలు పెడతారు. తీరా అమృతం దొరికాక ఎక్కువ వాటా కోసం గొడవలు పడతారు రాక్షసులు చేతిలో ఆ అమృత కుంభం పడితే వారి అరాచకాలకు హద్దులు ఉండవని తెలిసిన మహావిష్ణువు కుంభాన్ని ఆ ప్రదేశం నుంచి దూరంగా తీసుకెళ్తాడు .అలా వెళ్ళినప్పుడు కొన్ని అమృత బిందువులు ప్రయాగ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయని ప్రజల విశ్వాసం .
ఎన్నో ఏళ్లుగా ప్రయోగరాజ్ లో పురోహిత్యం చేస్తున్న తెలుగు పురోహితుడు శ్రీ ఎడవల్లి చంద్రశేఖర ప్రవీణ్ శర్మ గారి అభిప్రాయంలో ఈ నాలుగు ప్రదేశాలలోనే కుంభమేళా నిర్వహించడంపై భిన్న కథనాలున్నాయి . సామ. అధర్వణ వేదాల ప్రకారం సముద్ర మధనం లో వచ్చిన అమృత కలశాన్ని మొదటగా జయంతుడు అనే కాకి నోట కరచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంలో నాలుగు చుక్కలు ఈ ప్రదేశాల్లో పడ్డాయని, అందువల్లనే ఈ నాలుగు క్షేత్రాలలో కుంభమేళ జరుగుతుంది. అయితే అమృత కలశాన్ని నోట కరుచుకొని వెళ్ళింది కాకి కాదు గరుడ పక్షి అని మరో కథనం..
చరిత్ర ఏం చెస్తోంది ?
క్రీస్తు శకం 629 -645 మధ్యకాలంలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయున సాంగ్ కుంభమేళాను గురించి ప్రస్తావించాడు. ఇతను హర్షవర్ధనుని కాలంలో మన దేశానికి వచ్చాడు.
ఆధునిక కాలంలో దీని గురించిన ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఇంపీరియల్ గజేటి ఆఫ్ ఇండియా లో 1796 లో రెండు మిలియన్ల మంది 1889లో 2.5 మిలియన్ల యాత్రికులు కుంభమేళాకు వచ్చినట్లు ప్రకటించారు.
జ్వర్ కుంభమేళాలో బ్రిటిష్ అధికారి రాబర్ట్ మాంటి గౌరీ మార్టిన్ సందర్శకులలో బుఖారా కాబుల్ తుర్కిస్తాన్ నుండి వచ్చిన గుర్రాల వర్తకులు ఉన్నారన్నాడు. వీధితో బాటు అరబ్బులు పర్షియన్లు గుర్రాల వ్యాపారం కోసం వచ్చారని చెప్పాడు. ఆ మేళాలో రోడ్డుకు ఇరువైపులా ధాన్యం, తినుబండారాలు, బట్టలు, బొమ్మలు అమ్మవారున్నారట. యాత్రికులు నీళ్లలో వదిలే దీపాలు కదలే నక్షత్రాలలో కనిపించేవని కూడా చెప్పాడు. ఎందరో హిందూ రాజులు సిక్కు ప్రభువులు నవాబులు మేళా చూడడానికి వచ్చే వారిని కూడా చెప్పాడు ప్రయాగ లో 1895 లో జరిగిన కుంభమేళాకు వచ్చిన ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేయిన్ దీన్ని చాలా మెచ్చుకున్నాడు . 1938లో లార్డ్ అక్లాండ్ యాత్రికులపై పన్నును రద్దు చేశాడు. అందువల్ల యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రకమైన మేళాలను ఆదాయ వనరు గానే పరిగణించి, ప్రోత్సహించింది. పన్నులు కూడా వసూలు చేసేది . ఈ సందర్భంలో జరిగే అమ్మకాలపై టాక్స్ కూడా విధించేవారు. 1954లో ఐదు మిలియన్ల మంది 1977లో 10 మిలియన్ల మంది 1989లో 15 మిలియన్ల మంది కుంభమేళాను దర్శించుకున్నారు.
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంచనా ప్రకారం 2019 కుంభమేళాలో 200 మిలియన్లకు పైగా యాత్రికులు వచ్చారు. ఇది ప్రపంచంలో Largest People Gadharing కుంభమేళా అధికారులు ఒకేరోజులో అత్యధిkuలు దర్శించిన తేదీలు 10 ఫిబ్రవరి 2013లో 30 మిలియన్లు 4 ఫిబ్రవరి 2019లో 50 మిలియన్లు అని ప్రకటించారు.
అయితే ప్రాచీన వేదకాలం నుండే ఈ ఆచారం ఉన్నట్లు వేద విద్వాంసులు అంటారు .ఈ కుంభమేళా స్నానాలు 850 ఏళ్లకు పైగా జరుగుతున్నట్లు, ఆదిశంకరులు దీనికి ఆద్యుడు అని కూడా చెప్తారు .వీరి తర్వాత శంకరుల శిష్యులు, అనుయాయు లు, సన్యాసులు,అఘోరాలు, నాగ సాధువులు రాజస్నానానికి ఏర్పాట్లు చేసేవారు. ఇలా షాహి స్నానం చేయడం వల్ల గత జన్మల పాపకర్మల నుండి విముక్తి కలిగి, మోక్షం పొందుతారని ఆస్తికుల విశ్వాసం. అందుకే ఒకప్పుడు లక్షల్లో ఉన్న యాత్రికుల సంఖ్య కోట్లల్లోకి పెరిగింది పెరగబోతోంది రాబోయే కాలంలో,
మరి కాస్త ముందుకొస్తే 1982లో అమృత్ కుంటే ర్ సంధానే అనే బెంగాలీ సినిమా కుంభమేళా దృశ్యాలను చిత్రీకరించింది. .2001లో మారజయో యో బెంజో, నిక్ డేలు The Greatest Show on earth అనే డాక్యుమెంటరీ తీశారు. నదీముద్దీన్ KUMBH MELA Songs of the river అని 2004లో మరొక డాక్యుమెంటరీ ని చిత్రించాడు. 28 ఏప్రిల్ 2017 BBC. Greatest Show on Earth Kumbha Mela పేరుతో ఇంకో ఆడియో వీడియో రిపోర్టును కూడా విడుదల చేసింది.
అంతేనా
అంటే కాదు అనే చెప్పాలి కుంభమేళా అంటే కేవలం స్నానాలే అనుకుంటే పొరపాటే . అంతకు మించిన విశేషాలు లెక్కలేనన్ని . తర్పణాలు, పిండ ప్రదానాలు, పితృ పూజలు, దాన ధర్మాలు, సంతలు, విద్యావిషయక చర్చలు, వేద పండితుల వాద ప్రతి వాదాలు సాధువుల సంతుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు You Name It we have it అన్న రీతిలో ఉంటాయి. సామూహిక భజనలు ప్రార్ధనలు, పారాయణాలు అడుగడుగునా కనిపిస్తాయి.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడిపే భోజనశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస ఏర్పాట్లు , స్నానానికి కావలసినటువంటి ఏర్పాట్లతో పాటు బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లను చేశారు .టెంట్ సిటీని నిర్మిస్తున్నారంటే ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆలోచించుకోండి. ఇవన్నీ ఎప్పటికప్పుడే ఔరా అనిపిస్తాయి.
ఈ రోజుల్లో మనలాంటి సాధారణ భక్తులతో పాటుగా, వీఐపీలు, నాగా సాధువులు, ఇతర సాధువులు, కల్పవాసీలు ( నెల రోజులు దీక్షలో ఉండేవారు) పీఠాధిపతులు, మఠాధిపతులు, విదేశీ వార్తా విలేకరులు ప్రసిద్ధిగాంచిన వీడియో గ్రాఫర్లు, స్వదేశీ వార్తా సంస్థల ప్రతినిధులు మరెందరెందరో వీటిని ప్రజలకు అందించడానికి ప్రతీక్షణం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయిపోయిందా
నాగా సాధువుల ప్రసక్తి లేకుండా కుంభమేళా వేడుకలు వ్యాసాలు అన్నీ అసంపూర్ణమే అసమగ్రమే వేలాది నాగ సాధువుల ప్రవేశం వారి అద్భుత విన్యాసాలు మనల్ని నిశ్చేష్టులను చేస్తాయి.
వీరి ప్రవర్తన, వేషధారణ అన్ని ప్రత్యేకమే. వ రు తప్పకుండా ఈ కుంభమేళా వస్తారు ఎలా వస్తారో తెలీదు. మేళా అయ్యాక ఎక్కడికి వెళ్తారో ఎలా వెళ్తారో కూడా తెలీదు. చాలామంది ఒంటినిండా బూడిద పూసుకొని నగ్నంగా ఉంటారు . తలంతా జడలు కట్టి ఉంటుంది . మేళా మొదలయ్యేసరికి సిద్ధం తర్వాత మాయం. కచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు . సడన్‌గా తిట్టడం కూడా మొదలెడ తారు .కసురుకుంటారు .ఏ కాలమైనా, ఎలాంటి వాతావరణమైనా దిగంబరులే బంధాలను ఇష్టపడరు. అత్యంత తీవ్రమైన పద్ధతులలో శారీరక క్రమశిక్షణను పాటిస్తారు . మనసుతో శరీరాన్ని శాసిస్తారు .ఈ యాత్ర సమయంలో మాత్రమే జనాలతో కలుస్తారు.
సభ్య సమాజం వీరిని దూరంగా పెట్టినా, అసహ్యించుకున్న, భయపడ్డా గ్రామీణ ప్రాంతాల వారు, విదేశీయులు బాగా నమ్ముతారు . ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. వారి ఆగ్రహాన్ని భరించి, ఆశీస్సులను పొందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు . సాధువులు, బిక్షకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అధికారులు ప్రభుత్వం సాధారణ భక్తులు, దేశ విదేశీ సందర్శకులు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, చరిత్రకారులు, స్వచ్ఛంద సంస్థలు ఇందరు మరెందరో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కుంభమేళా కొన్ని గంటల్లో మన కళ్ళ ముందుకు రాబోతోంది .రెండు చేతులు చాచి తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు విశ్వాసాలకు భారతీయతకు చిరునామాగా నిలిచిన ఈ కుంభమేళాను ఆనందిద్దాం. ఆహ్వానిద్దాం. మన మధ్యలో రాజకీయాలను చేరనీయకుండా మానవత్వాన్ని పరిమళింప చేద్దాం .ఎందుకంటే ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ ఎందుకంటే ఇది ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ కనుక.
రెండవ మరియు చివరి భాగం కొరకు ఎదురు చూడండి. త్వరలో..
