Home కవితలు పాదరక్ష

పాదరక్ష

by Radhika Suri

అందరి పాదాలకు రక్షణ కవచమై నిలుస్తూ

అలరించబడే ఓ పాదరక్షా! నిన్ను అవసరార్థం

ధరించేవారు కొందరైతే దర్పంగా భావించేవారు

ఇంకెందరో కదా! కరకు పాదాలకింద కర్కశంగా నలిగినా

సున్నిత పాదాలకు అందమైన అలంకారంగా బాసిల్లినా

తర తమ భేదాలెరుగక అందరి కాలిలో పొందికగా

ఒదిగుండే ఓ పాదరక్షా! రంగుల కలయికతో భిన్న ఆకృతులలో

అందంగా మలచి నీ కొక విలక్షణ స్థానమిచ్చిన ఆ చర్మకారుడెంత

కళాహృదయుడో కదా! ఆపద్భాంధవుడైన ఆ దాశరథి పాద పద్మాలలో

వినయంగా ఒదిగిన నీకు పట్టంగట్టి ప్రాభవం ఒసగిన ఆ భరతుడెంత

ధర్మాత్ముడో కదా! అరుదైన గౌరవంతో అలరారిన నీ జన్మ చరితార్థమాయె కదా!

You may also like

Leave a Comment