Home బాల‌సాహిత్యం పెద్దల మాట చద్ది మూట

పెద్దల మాట చద్ది మూట

నీతి కథ

ఒక అడవి లో ఒక  జామతోట నోరూరించే చక్కని ఫలాలతో ఎప్పుడూ రకరకాల పక్షులతో సందడిగా ఉండేది. ఆతోటలో అన్ని పక్షులతో పాటు రామచిలుక లు కూడా ఉండేవి. ఆకలి వేసినప్పుడు చెట్టు పండ్లు తింటూ ఏ చీకూచింతా లేకుండా ఉండేవి. తోటలో పండ్లు కోయడానికి వచ్చే తోటపని  వాళ్ళు జామ పండ్లను దగ్గరలో ఉన్న నగరం లో అమ్మితే చాలా గిట్టుబాటు అవుతుంది అంటూ” నగరాన్ని అక్కడి వాతావరణాన్ని గొప్పగా చెప్పుకునే వారు. “

ఆ పక్షుల గుంపు లో ఉన్న సోమూ ,భీమూ అనే రెండు రామచిలుక లు వారి మాటలు విన్నాయి.

వాటికి నగరాన్ని చూడాలని ఆశ కలిగింది.

ఒక రోజు ఆపక్షుల తల్లిదండ్రి పక్షులు మేము అలా బయటకువెళ్ళొస్తాము అని సోము,భీమూ లను “జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండండి తోట దాటి బయటకు వెళ్ళొద్దని  చెప్పి విహారానికని వెళ్ళాయి.”

వాటికి ఇదే మంచి సమయం అనుకున్నాయి.

“మనం ఈ పనివాళ్ళు వెళ్ళే దిశగా మనమూ వెళ్ళి నగరమంతా చుట్టి వద్దామనుకుని

జామకాయలు తీసుకుని వెళ్ళే వాహనంపై కూర్చుని వెళ్ళాయి.”

*

పెద్దపెద్ద మేడలు, క్షణం తీరిక లేకుండా తిరిగే వాహనాలు, పెద్దపెద్ద సెల్ఫోన్ టవర్లు, ఎక్సిబిషన్ లో తిరిగే చక్రాల వాహనాలు,అన్నీ చిత్రవిచిత్రంగా కనిపించాయివాటికీ.

ఎగురుతూ వెళ్ళి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని అన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ మైమరచిపోయాయి. కాస్తా చీకటి పడేసమయానికి

సోము, భీముతో ” నాకు ఆకలేస్తుంది భీము …” అంది. నాకు కూడా ఆకలేస్తుంది సోము అని భీమూ అంది, చుట్టూ చూసాయి.

అప్పుడు కానీ వాటికి గుర్తుకు రాలేదు. అవి ప్రయాణం చేసి వచ్చిన వాహనం దరిదాపుల్లో కూడా లేదని …. వాటికి ఏం చేయాలో పాలుపోలేదు.

కిందికి చూసాయి.

ఆ రెండు పక్షులు కూర్చున్న చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.అతని ముందు ఒక  పంజరం దాని ముందు కొన్ని కార్డు లు వేసి ఉంచాడు.

పక్కనే రెండు జామపండ్లు ఉన్నాయి. ఎవరో కొందరు వ్యక్తులు ముందు కూర్చుని ఏవో అడుగుతుంటే పంజరం లోని చిలుక బయటకు వచ్చి కార్డు తీసి లోపలికి వెళ్తుంది. చిలుక తీసిన కార్డులోని విషయం ఆ వ్యక్తి చదివి వాళ్ళకు చెప్తున్నాడు. పరిహారాలు కూడా చెప్పి పాటించమని సలహా ఇస్తున్నాడు.

భీమూ,సోము లు  మాత్రం ఏమీ ఆలోచించకుండా పక్కనున్న జామకాయలు చూసి అవి మనవాళ్ళవే కాబోలు వెళ్ళి తిందాం అని ఎగురుతూ కిందికి వాలాయి.

****

జామకాయ ను కొరుకబోతున్న సోము ను జ్యోతిష్యుడు  ఒడుపుగా పట్టి తన పంజరం లోని ఒక అరలోకి నెట్టాడు.

“ఒక్కసారి గా అతని చేతికి చిక్కిన సోము భయపడిపోయి వణకసాగింది.

బయట ఉన్న భీము ” రక్షించండీ రక్షించండీ” అని అరుస్తుంది.

“దాని భాష అర్థం కావడానికి ఎవరైనా వచ్చి రక్షించడానికి అది తన నివాసం దగ్గర ఉందా…?”మానవారణ్యంలో ఉంది.

ఇక్కడున్నవారందరూ మనుషులు.

లోపలున్న సోము మాత్రం” మిత్రమా ఇతను చిలుక లను బందించి పంజరం లో పెట్టిన జోస్యం చెప్పుకుని బ్రతికేవాడు మనం మోసపోయాం.

నేను వీడికి బందీగా చిక్కి ఇలాగే ఉండవలసిందే అన్నది  ఏడుస్తూ…!!

మనం అమ్మానాన్నలకు చెప్పకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. అని భీమూ ఏడవసాగింది ఏంచేయాలో పాలుపోలేదు వాటికి.

***

పంజరం లోని మరో చిలుక కల్పించుకుని ” నాపేరు రాము ” నేనుకూడా మీలాగే నామిత్రునితో కలిసి అడవిలో తిరుగుతుంటే ఇతనికి దొరికి పోయాను.

అప్పటినుండి ఈ పంజరం లో నన్ను బంధించి రోజుకు రెండు జామపండ్లు పెట్టి నాతో జాతకం చెప్పిస్తూ  రెండు వేలు సంపాదిస్తున్నాడు.

ఇంట్లో చెప్పకుండా వచ్చి వీడి చెరలో చిక్కాను అంటూ బోరున ఏడ్చింది.

ఇప్పుడు ఏం అనుకున్నా ఏం లాభం ఇంకా మన గతి ఇంతేనా ..!!

అనుకున్నాయి.

వాటికి ఆలోచన రావడం లేదు.

మిత్రమా నీవు భయపడకు నీకు నేనున్నాను ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను అంటూ భీము ధైర్యం చెప్పింది.

దానికి ఒక ఆలోచన తట్టింది.

హా ఐడియా…. నీవు ఇలా చేయి అని దూరం నుంచే తన భాషలో చెప్పింది.

లోపలున్న రాము నన్నుకూడా మీతో తీసుకుని వెళ్ళండి .అని బతిమలాడింది. మరి మాకు మా  ఇంటికి వెళ్ళే దారే తెలియదు కదా …?

అంది సోము.

ఈ జ్యోతిష్యుడు రోజూ ఊరిబయట ఉండే ఒక జామతోటమీదుగా వస్తాడు.

అది మీరుండే ప్రాంతమో కాదో నాకు తెలియదు… కానీ అక్కడ చాలా పక్షులు ఉన్నాయి.

 ఆదారి నాకు బాగా తెలుసు అంది.

సరే మరి  నీవు చెప్పినట్లే చేద్దాం అనుకున్నాయన్నీ…!!

***

జ్యోతిషం చెప్పించుకోవడానికి వచ్చిన వారికి చిలుక తో కార్డులు తీయిస్తున్నాడు జ్యోతిష్యుడు.

అది మెల్లిగా కార్డులు కిందిది ఒకసారి పైది ఒకసారి తీస్తూ కన్ఫ్యూజ్ అయినట్లు పరిశీలించసాగింది.

ఎదుటి వారితో జ్యోతిష్యుడు “మీకు ఎంతో కష్టం వచ్చేటట్లు ఉంది” అందుకే మా చిలుక ఏంతీయాలో అర్థం కానట్లు చూస్తుంది అన్నాడు.

బాబ్బాబు ఎంత డెబ్బై నా సరే మంచిగా తీయించండి పరిహారాలు చెప్పండి అన్నారు వాళ్ళు ….!

అంతలోనే సోము గిలగిలా కొట్టుకోసాగింది.

అరరే కొత్త రామచిలుక కు ఏమయ్యింది…?

ఆలా పడిపోయి కొట్టుకుంటుంది… అనుకుంటూ పంజరం సందులోంచి వేలితో కదిపాడు.

అది కదలలేదు. పంజరం తెరిచి చేతితో బయటకు తీసి అంటూ ఇటూ కదిపాడు.

ఇంక లాభం లేదు దాన్ని పక్కనే ఉంచి. నీళ్ళు చల్లి చూద్దామని

తన బస్తాలోని నీళ్ళ సీసా బయటకు తీయడానికి వొంగాడు అంతే ఇదే అదను అనుకుని రాము సోము బుర్రున లేచి తుర్రున ఎగిరిపోయాయి.

****

ఇది మేముండే తోటనే రా రాము అంటూ సోమూ, భీము రాము ను తీసుకుని వెళ్ళి తోటి పక్షులకు పరిచయం చేసి జరిగిందంతా చెప్పాయి.

అక్కడున్న పెద్ద పక్షులు “పెద్దలమాట చద్ది మూట అన్నారు” పెద్దలు మీకింకా లోక జ్ఞానం రాలేదు

ఇప్పటికి తప్పించుకుని బయటపడ్డారు ఎప్పుడూ ఇలాగే ఉండదు.ఇలాంటి పనులు మరెప్పుడూ చేయకండి అని కోప్పడ్డాయి.

దూరపు కొండలు నునుపు అనుకుని అపోహ పడకూడదు అన్నాయి.

తప్పైందమ్మా మరోసారి ఇలా చేయుము మీకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళము మమ్మల్ని క్షమించండి అన్నాయి మూడు చిలుకలు

మరో కొత్త స్నేహితుడిని పరిచయం చేస్తూ……!!

(నీతి:- చెప్పుడు మాటలు విని మోసపోకూడదు , దూరపు కొండలు నునుపు అని గుర్తుంచుకోవాలి.)

You may also like

Leave a Comment