Home కవితలు బ్రతుకుటెట్ల…..

బ్రతుకుటెట్ల…..

by Madugula Muralidhara Sharma

బ్రతుకుటెట్లనుచును* భయపడుటేలకో? పక్షిగూడునువీడి* బయలు దేరి! గింజలు వెతుకుచు* గెంతుచు పోవును! వానిజాడనెరుగు* వరకు వేగ! జీవన మందును* చేయూత కోరతు! యత్నమ్ము చేయుము* యాతననక! ఊరపిచ్చుకతీరు* ఉబలాటపడుచుండ! అన్నపానాదులు* నందగలరు! జీవసత్యమ్ముపిచ్చుక* జీవితమ్ము! యత్నమును జేయ తెలియునా* హారపథము! సాధనమ్మున సమకూరు* సత్ఫలితము! జీవితమ్మననిదియెగా* చివరివరకు!

You may also like

1 comment

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 6:24 am

శ్రీ మాడుగుల మురళీధర శర్మ గారి పద్యరచన చాల బాగుంది. పాదాలు విడివిడిగా కూర్చకపోతే కుంచించుకుపోయి పద్యం బాధపడుతుంది.

Reply

Leave a Comment