సాహిత్యం సమాజానికి దర్పణం వంటిది . కవి మనసు అద్దం అయితే ఇక తీక్షణ కాంతిపుంజలై కవిత్వంగా భావాలు జాలువారుతాయి. ఎందరో కవులు కవయిత్రులు కవితా సిరులు పండిస్తున్నారు .ఎందరో రచయితలు రచయిత్రులు భాషా సాహిత్య సేవ చేస్తున్నారు.పరిశోధనా రంగం లో తమదైన ప్రతిభను చాటుతున్న వారందరూ ఎంతో కృషి చేస్తున్నారు. మీరందరినీ ప్రోత్సహించే ఎన్నెన్నో పత్రికలు మనకు ఉన్నాయి. లిఖిత రూపంగా తమ తమ రచనలను పత్రికలలో చూసుకొని ఆనందపడుతున్నారు. అంతర్జాలంలోనూ ఆధునికంగా కనిపిస్తూ సంతోషిస్తున్నారు ఇటువంటి కళలకు మయూఖ పత్రిక ఒక చక్కని అంతర్జాల వేదిక గా ఉన్నది.ఎన్నో రచనలు గత ఏడాదిన్నరిగా మయూఖ ప్రచురిస్తూ తన వంతు సాహితీ సేవ చేస్తున్నది . ఈ క్రమంలోనే కవితల పోటీని నిర్వహించాలని నిర్ణయించుకుంటున్న వేళ , నా సెల్ ఫోన్ కి
“నా దేశం రా నాదేశం !నా దేశం నా భారతదేశం!
మన్ను బంగరౌ మాన్యాలున్నా, సాలెల్ల పారే సెలయేరులున్నా
మడిలో మొక్కకు తడి లేదన్నా,” అంటూ ఉర్రూతలూగించే గొప్ప కవిత్వాన్ని రాసి, ఆనాడు ఈ గేయంతో మమ్మల్ని ఉత్తేజపరిచిన పెండ్యాల రాఘవరావు గారు మీకేం అవుతారు?’‘ అంటూ నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ని పంపినవారు
గౌరవనీయులు, పెద్దలు , కవి ,రచయిత నెల్లుట్ల నవీన చంద్ర గారు. తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నాం. వారు కెనడాలో ఉంటారు . నేను అమెరికాలో ఉన్నాను. ఒక జూమ్ మీటింగులో నా గురించి విని ఈ మెసేజ్ పెట్టారట. ”మీరెవరో తెలుసుకుందామని” అని అన్నారు . అలా పరిచయమయ్యారు.
ఆ రోజు ఆ మెసేజ్ లో మా బాపు పెండ్యాల రాఘవరావు గారి పేరును ఆ గేయాన్ని చూడగానే ఆనందం పట్టలేకపోయాను అందుకే వెంటనే మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టి ఫోన్ చేశాను. ఆ మెసేజ్ ఎంత బాగున్నదో, ఎంత హుందాగా ఉన్నదో అంతకంటే ఎక్కువ రెట్లు వారి సంభాషణ ఉన్నది. అంతటి భావాత్మకమైన కవిత్వాన్ని గేయాన్ని రాసిన పెండ్యాల రాఘవరావు గారి కన్నబిడ్డను నేను! నా హృదయం సంతోషంతోను గర్వంతో నూ తేలిపోయింది. వారి కూతురుని అని తెలిసి నవీన చంద్ర గారు కూడా ఆశ్చర్యపోయారు. నా హృదయంలో కలిగిన భావాలకు ఏమాత్రం తగ్గకుండా ఎంతో ఉన్నతంగా ఆనాటి తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలు , నాయకుల నిస్వార్ధ పోరాటాలు చెబుతూ ఈ గేయం ఆనాడు అందరి నోళ్ళల్లో నానిన గేయమని, రాఘవరావు గారు అంటే మా యువతరానికి ఆనాడు గొప్ప స్ఫూర్తి అని, ఎప్పటివో 60 ఏళ్ల క్రింది ముచ్చట్లు అన్నీ చెప్పారు.
ఈ పరిచయం మరింత ముందుకు సాగి నేను ప్రారంభించిన మయూఖ పత్రిక విషయాలు తెలుసుకొని మయూఖ పత్రిక పక్షాన వారి సోదరులు నెల్లుట్ల ఈశ్వరచంద్ర గారి స్మృత్యర్థం కవితల పోటీని నిర్వహించమని దానికి సంబంధించిన వ్యయాన్ని భరిస్తానని చెప్పారు. వారి మాటతో ఈ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తిచేసాను. 153 కవితలు పోటీకి వచ్చాయి. కవితలపై కవి పేరు లేకుండా కేవలం శీర్షిక మాత్రమే ఉంచి ఆ కవితలన్నీ ఇద్దరు న్యాయనిర్ణేతలకు పంపించాను. అందులో మూడు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు , మూడు ప్రోత్సాహక బహుమతులు ,20 సాధారణ ప్రచురణార్థం ఎంపిక చేయమని అడిగాను.ఇద్దరు న్యాయ నిర్ణేతల సహకారంతో ఎంపిక చేసాం. ఏనుగు నరసింహారెడ్డి గారు నెల్లుట్ల రమాదేవి గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
నేను అమెరికాలో ఎక్కువ కాలం ఇవ్వడం వలన ప్రకటనలో ఇచ్చినట్టు ఇండియాలో ప్రత్యక్షంగా సభను నిర్వహించలేకపోయాను. కానీ ZOOM మీటింగ్ ద్వారా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కవితా వేదిక ద్వారా నవీన చంద్ర గారు ఈ బాధ్యతను తీసుకున్నారు. సమర్థవంతంగా నిర్వహించారు, ఇంకా నిర్వహిస్తున్నారు . అంతేకాదు ఎంపిక చేసిన కవితలను “కొత్త పాతల మేలు కలయిక” అనే పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురిస్తున్నారు. ప్రకటనలో ఇచ్చినట్లుగా నగదు బహుమతులను సర్టిఫికెట్ల ను తొందరలో విజేతలకు త్వరలో పోస్టు ద్వారా అందజేస్తాం.
ప్రకటనలో చెప్పినట్లే మయూఖ పత్రికలో బహుమతులకు ఎంపికైన కవితలను ప్రత్యేక సంచికగా ప్రచురిస్తున్నాను. మిగతా కవితలను కూడా తరువాత వీలును బట్టి ప్రచురిస్తాను. ఆలోచననాత్మకమైన ,సందేశాత్మకమైన చక్కని ఈ కవితలను చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
_ డా. కొండపల్లి నీహారిణి, మయూఖ సంపాదకురాలు.
mayuukhathemagazine@gmail.com
గమనిక
మయూఖ పత్రిక ప్రత్యేక సంచిక మీ ముందు ఉంది. ప్రకటనలో ప్రకటించినట్లే బహుమతి గ్రహీత ల కవితలు ఈ ప్రత్యేక సంచిక లో వేస్తున్నాం .
మయూఖ ద్వైమాసిక పత్రిక కదా! ఆగస్టు మయూఖ వచ్చింది , అక్టోబర్ మయూఖ వస్తుంది. ఈ రెండు నెలల మధ్య ఇలా కవితా వేదిక పోటీ కవితలను ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ప్రత్యేక సంచిక గా తెస్తున్నాం.
అక్టోబర్ మయూఖ పత్రిక అక్టోబర్ మొదటి వారంలోనే యథావిధిగా వస్తుంది.
మయూఖ వచన కవితల పోటీ ఫలితాలు-
మయూఖ , కవితా వేదిక (కెనడా ) సంయుక్తంగా నిర్వహించిన వచన కవితల పోటీకి 155 కవితలు రాగా , ఆ వచ్చిన కవితలపై కవితా శీర్షిక మాత్రమే వుంచి కవుల పేర్లు లేకుండా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఏనుగు నరసింహారెడ్డి, నెల్లుట్ల రమాదేవి గార్లకు అందజేసాము.
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల తో పాటు
ప్రోత్సాహక బహుమతుల కోసం 3 కవితలను, సాధారణ ప్రచురణ కోసం 20 కవితలను ఎంపిక చేశారు .
1.ప్రథమ బహుమతి:- ‘ఆట‘ పెళ్లూరు సునీల్,నెల్లూరు. 2.ద్వితీయ బహుమతి:- ‘ శ్వేత వర్ణ యమపాశం‘ _ జాబేర్ పాషా, సిద్ధి పేట్ (నివాసం-మస్కట్).
- రక్షా రేఖలు- చొక్కాపు లక్ష్ము
నాయుడు, విజయనగరం. ప్రోత్సాహక బహుమతులు - విశాలంగా పారే దే -చందలూరి నారాయణ
2 నీరు మింగిన నేల- గిరి ప్రసాద్ చల్ల మల్ల, మియాపూర్ – హైదరాబాద్. - హోమ్ టూర్ – దాసరి మోహన్,బోడుప్పల్- మేడ్చల్.
సాధారణ ప్రచురణకు ఎంపికైనవి-
1.వచ్చి పో మిత్రమా- కే . కౌండిన్య తిలక్,అల్వాల్-సికింద్రాబాద్.
- రాగమాలిక- బి.వి. శివప్రసాద్, విజయవాడ.
- అసలు రంగు- సాంబమూర్తి లండ, శ్రీకాకుళం.
4.లసుము- రమేష్ నల్గొండ, ఆసిఫాబాద్ జిల్లా.
5.నేనో నదిని -లేదాళ్ళ రాజేశ్వరరావు, మంచిర్యాల. - నాగరకత-సుంకర గోపాలయ్య, నెల్లూరు
- యుద్ధ మేఘం – ఎస్ .నరేష్ చారి,రావిరూకల-సిద్ధిపేట్ జిల్లా.
8.ఒక్క సంతకం – గొర్తి వాణి శ్రీనివాస్, విశాఖ పట్నం.
9.పదండి ముందుకు -స్వాతి శ్రీపాద, హైదరాబాద్. - అమ్మ నన్ను మన్నించు- మధుకర్ వైద్యుల, హైదరాబాద్.
11.సందేశం -రాపోలు సుదర్శన్, హైదరాబాద్.
12.ఆమె -కోరాడ అప్పలరాజు, అనకాపల్లి-విశాఖ జిల్లా.
13.శిధిలనది – యములపల్లి నర్సిరెడ్డి, అనంతపురం.
14.బతుక్కి మెతుక్కీ – వురిమిళ్ళ సునంద, ఖమ్మం.
15.అతడు- ఎస్ .ముర్తుజా , కర్నూల్.
16.సమాయుత్తం కావలసిన వేళ- కళా గోపాల్, నిజామాబాద్.
17.మూగబోయిన వసంతం – కిరణ్ విభావరి - ఆమె లేకుంటే – వారణాసి నాగలక్ష్మి, హైదరాబాద్.
- మగ హత్య- అమూల్య చందు, విజయవాడ.
20.మృత్యు వాంగ్మూలం- మానాపురపు చంద్రశేఖర్.
“విజేతలకు త్వరలో హైదరాబాద్ లో జరగనున్న సభలో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది.” అని ప్రకటనలో చెప్పాము . కాని , నేను అమెరికాలో చాలా కాలం ఉండవలసి రావడం తో ‘కవితా వేదిక ‘ పైన అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహించారు పెద్దలు నెల్లుట్ల నవీన చంద్ర గారు. ప్రత్యక్ష సభను జరపలేకపోయిన కారణాన! ఈ 26 కవితలతో పాటు పోటీ కి వచ్చిన మరో 20 కవితలను , కవితా వేదిక కవుల కవితలను కలిపి కవితా సంపుటి ని తెస్తున్నారు. తొందరలో పుస్తకం, సర్టిఫికేట్ , నగదు బహుమతి పొందిన వారికి నగదు బహుమానం అన్నీ పోస్ట్ చెయ్యబడుతాయి.
3 comments
zn9sfy
01ezz2
8ruvkx