Home బాల‌సాహిత్యం సారమేయుడు

సారమేయుడు

మూగజీవాల పరిరక్షణ చెయ్యా లి అని ఈ రోజుల్లో అందరూ ముక్త కంఠంతో చెపుతున్నారు. దీని కోసం జీవకారుణా దినోత్సవాలు చేస్తూనే ఉన్నా రు. కానీ ఈ విషయం మహాభారతం ఆదిపర్వంవల్లనే  వేదవ్యాసుడు “సరము” అనే దేవ శునకం ద్వారా మూగజీవాలను పరిరక్షించాలనే సందేశాన్ని తెలిపాడు. మూగజీవాలకి వాటి భావాలను వ్యక్తం చేసే భాష లేదు కానీ వాటికి కూడా బాధలు ఉంటాయి. సంతోషం, దుఃఖం, పుత్ర వాత్శల్స్యం అన్నీ ఉంటాయి అని తెలిపేదే ఈ సరమ కథ.

పరీక్షణ్మ మహారాజు కుమారుడు, అర్జునుని మునిమనవడు, అభిమన్యుని మనవడైన, జనమేజయ మహారాజు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ఒక యజ్ఞం తలపెడతాడు.  ఆ యజ్ఞ ప్రాంగణంలోకి వచ్చి న ఒక కుక్క ని, జనమేజయ మహారాజు తమ్ముళ్ళైన ఉగ్రసేనుడు, భీమసేనుడు, శ్రుత సేనుడు అనే వారు తీవ్రంగా గాయపరిచి తరిమి కొడతారు. ఆ కుక్క పేరు సారమేయము. అది దేవతా శునకమైన సరమ కుమారుడు. సరమ అతి కోపం తో యజ్ఞ భూమికి వెళ్ళి, జనమేజయున్ని నిలదీసింది…  “నా బిడ్డ ను నీ తమ్ముళ్లు అకారణంగా చావబాదారు, నీవు చక్రవర్తివి, సర్వ జీవాలకు అధిపతివి, ధర్మరాజు మనవడివి, నీకు ధర్మం తెలియదా?” అంటూ

తగునిది తగదని యెదలో

వగవక సాధులకు బేధవారెలకెగ్గుల్

మొగిజేయు ధుర్వి నీతుల

కగునని మిత్తాగమంబులై న భయంబుల్

అమాయకులను, మూజీవులను, దీనులను, అబలలను, స్త్రీలను, పిల్లలను హింసిస్తే వారి ఉసురు శాపమై తగులుతుందని, మావంటి దీనులను

బాడపెట్టిన పాపం  ఊరికే పోదు! అని శపించింది.

ఇలా కుక్క కి జరిగిన అవమానంతో భారత్ కథ మొదలవుతుంది. ఇక కుక్క ని సన్మానించిన ఘట్టం మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో కనిపిస్తుంది. శునక సన్మానంతోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని ముగుస్తాడు.

వ్యాసమహర్షి ఆదేశానుసారము, పాండవులు ద్రౌపదీ సమేతంగా స్వర్గానికి బయలుదేరగా వారి వెనుక ఒక కుక్క కూడా ప్రయాణవుతుంది. ఆ ప్రస్థానంలో వరుసగా ద్రౌపదీ, నకుల, సహదేవులు, భీమార్జునులు పడిపయి ప్రాాలు వదులుతారు. ధర్మరాజు మాత్రం వెనుదిరిగి చూడకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కుక్క కూడా అనుసరిస్తూనే వుంటుంది. ఇంద్రుడు వచ్చి ధర్మరాజుని రథం ఎక్కుమన్నాడు. నా వారంతా నన్ను వదిలి వెళ్ళారు, కాని ఈ కుక్క మాత్రం నాతో యే సంబంధం లేకపోయిన నన్నే అంటిపెట్టుకొని నాతోనే వచ్చింది. ముందు ఈ శునకాన్ని రథం ఎక్కించమన్నాడు. సాధువులను హింసించడం బ్రహ్మహత్యాపాతకం  అని బోధించాడు. ఇంద్రుడు చేసేది లేక, కుక్కకి కూడా ఉత్తమ గతులు కల్పించాడు.

ఇలా మహాభారతాన్ని కుక్క తో మొదలు పెట్టి, కుక్కతో ముగించాడు వ్యాసమహర్షి. సరమ కథలో మానవీయ విలువలు కోల్పోకూడదనీ, విధ్వంస

కాండ చేయరాదని, నీతి మార్గాన్నిఅనుసరించాలని సందేశం ఇవ్వ బడింది. అదే విధంగా స్వర్గారోహణపర్వం వల్ల ధర్మరాజు ద్వారా

మూగజీవాలని పరిరక్షించాలని, వాటిని చులకనగా చూడరాదని సందేశం ఇవ్వ బడింది.

You may also like

Leave a Comment