Home అనువాద సాహిత్యం వారందరిలో ఎక్కువ సంతోషి ఎవరు?

వారందరిలో ఎక్కువ సంతోషి ఎవరు?

మీను చికాకు పడింది. కోపంతో మూతి ముడుచుకొని నాయనమ్మతో మాట్లాడనంది. కాని ఎక్కువసేపు నాయనమ్మతో కోపంగా ఎవరుండగలరు? నాయనమ్మ అందరితో చాలా ప్రేమగా ఉండేది. ఎవరి తప్పులు మనసులో పెట్టుకోకండి.

నాయనమ్మా, మూడురోజులు అయింది. నువ్వు ఒకరాజు కథ ఇంకా చెప్పక అంటూ మీను గులిపింది.

నాయనమ్మ తల ఊపింది, అవును నిజమే, మీనూ. అది నా తప్పే. నీకు రాజు గురించన కథ వెంటనే చెప్పవలసి యుంటిని.

ఇప్పుడు నేను ఒక మంచి రాజు కథ చెబుతాను విను కానీ నాయనమ్మా ఎవరైతే ప్రజలకు మేలు చేస్తాడో, మంచి పనులు ప్రజల కోసం చేస్తాడో, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టడో, శిక్షలు వేయడో, జైల్లో పెట్టడో, అతని గురించి మాత్రమే చెప్పమని మీను సవరించుకొని కూర్చొని అడిగింది.

మంచిది పాప, ఇక్కడ ఒకరాజు మీరు కోరుతున్నట్లే ఉన్నారు అంటూ నాయనమ్మ కథ మొదలుపెట్టింది.

అమృత్ అనే ఒకరాజు ప్రజలను ప్రేమగా చూచుకునేవాడు, మరియు రాజ్య వ్యవహారాలు కూడా మంచిగా చూచుకునేవాడు. అతని మంత్రి “చందన్” చాలా తెలివైనవాడు, అతను విరామం లేకుండా రాజ్యవ్యవహారాల్లో రాజుగార్కి సహాయ పడేవాడు.

ఒక రోజు రాజు అమృత్ మరియు మంత్రి చందన్ రాజుభవనంపై డాబాలో ఇటూ అటూ నడుస్తుండిది. అక్కడి నుండి దూరం వరకు అన్నివైపుల మంచి దృశ్యాలు కనబడుతుండెను. ఒకవైపున అంగడిలో జనులు కూరగాయలు, పండ్లు, ఫలాలు, అందమైన దుస్తులు వేసుకున్నవారు –కొనేవాళ్ళను, అమ్మేవాళ్ళను చూచి వారి సంతోషాన్ని గమనించి, రాజు చాలా సంతోషించాడు. ప్రజలవద్ద కొనేందుకు చాలినంత డబ్బుఉండటం రాజుకు తృప్తినిచ్చింది. చూద్దామన్నా బీదలు కనిపించలేదు. రాజ్యంలోని సుభిక్షతో రాజుకు ఎంతో తృప్తి కలిగించింది.

ఇతర మంచి పాలకుల వలెనె తన ప్రజలతో తను కూడా ఎంతో సంతోషంగా ఉంటుండేవాడు.

అతను చందనంవైపు చూసి ఇలా అన్నాడు, చూడూ మన ప్రజలు ఎంత తృప్తిగా ఉన్నారో, కాని నేను రేపు స్వయంగా వారితో మాట్లాడి వారి సంతోషానికి కారణం తెలుసుకోదలచాను. రేపు ప్రతి వృత్తివారిని మన దర్బారుకు పిలిపించండి మంత్రిగారు. చందన్ కు రాజు విచిత్రమైన కోరికలు వినడం పరిపాటే, కాబట్టి తల ఊపి రాజాజ్ఞ అమలు చేయడానికి వెళ్ళారు.

మరునాడు రాజు సంతోషంగా కూనిరాగం తీసుకుంటూ దర్బారులోకి వచ్చారు. గుమికూడిన ప్రజలనందరిని చూచి చాలా సంతోషించాడు. గొంతు సవరించుకొని లాశిగా అన్నాడు. మీ అందరిని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగటందుకు పిలిపించాను. మీ రాజుగా మీరందరూ తృప్తిగా ఉన్నారాయని తెలుసుకోదలచాను. మీ అవసరాలకు చాలినంత ఉందా? మీకు ఎవరైనా సంతోషం లేనివాడు తెలుసా? ప్రజలు ఒకరి ముఖం చూసుకొని నెమ్మదిగా జవాబు చెప్పుటకు ముందుకు వచ్చారు. ఒకరి తరువాత ఒకరు, వారు ఎంతో సంతోషంగా ఉన్నారో చెప్పారు. వారి వంటశాలలో సమృద్ధిగా సరుకులు ఉన్నాయి, వాళ్ళ వ్యపారాలు సజావుగా జరిగిపోతున్నాయి. రైతులు మంచి పంటలు పండిస్తున్నారు. నదులు, చెరువులు చేపలతో నిండి ఉన్నాయి. రాజును కోరవలసినది ఇంక ఏమున్నది?

రాజు ఇది విని ఇంకా చాలా సంతోషించాడు. అతని మంత్రి చందన్ మాత్రం అసంతృప్తితో ప్రజలు చెప్పిన మాటలు విన్నాడు. ఎందుకు అసంతృప్తి ఏం జరిగింది? వెంటనే అతను రాజుగారి దగ్గరకు వెళ్ళి వారి చెవులో ఏమో చెప్పారు. రాజుగారి కనుబొమ్మలు ఆశ్చర్యంతోపైకి లేచాయి. చందన్ మాత్రం మామూలుగానే ఉన్నాడు.

రాజుగారు దర్బారువైపు తిరిగి ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. మీరంతా సంతోషంగా ఉన్నారని చెప్పినందుకు నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను. కాని నేను దీన్ని పరిరక్షించదలచాను. రేపు ఉదయం సంతోషంగా వున్న ప్రజలందరు అంటే మీరందరు రాజ్యపు రాజుగారి తోటవద్దకు వచ్చి నన్ను కలువాలి. కానీ ఒక నిబంధన (షర్తు), మీరంతా  తోట ముఖ ద్వారం నుండి (Main gali) లోపలికి ప్రవేశించాలి. తోటంతా తిరుగుకుంటూ తోట వెనుక గేటు నుండి యటికి వచ్చి నన్ను కలువాలి. మీ కోసం నేను అక్కడ ఎదిరి చూస్తుంటాను. మీరు ప్రవేశించేపుడు మీకు ఒక సంచీ (Bag) ఇవ్వబడుతోంది. తోటలో మీకు నచ్చిన ఫలాలు, పుష్పాలు మీరు తినవచ్చు, సంచల్లో నిండా నింపుకోవచ్చు, గుంపులో అందరూ సంతోషంగా మన రాజు మంచినాతని కేరింతలు గొట్టారు. సామాన్యంగా రాజుగారి ప్రత్యేక తోటలోకి ఎవరికి ప్రవేశం కూడదు. ప్రపంచంలోని అందమైన మరియు విచిత్రమైన చెట్లను ఆ తోటలో పెంచారు.

మరుసటి రోజు నిర్ణయించిన సమయానికి అందరూ తోటముఖద్వారం వద్దకు చేరారు. ఆ సమయంలో తోట గేటు కీపర్లు గేటు తెరిచి అవలా ఒక సంచి ఇచ్చారు. మగవారు, ఆడవారో, పిల్లలు తోటలో అందమైన చెట్టు తీగల చుట్టూ తిరుగనారంభించారు. వారికి సేబులు, దానిమ్మలు, సపోటాలు, మామిడిపండ్లు మొదలుగునవి ఆకర్షణీయంగా కనబడినాయి. రాజుగారి ఆజ్ఞ ఉంది కాబట్టి తిన్నన్ని తిని, సంచుల నిండా నింపుకున్నారో, వారు ఇంతకు ముందు చూడని పూలుచూచి జడల్లో సంతోషంగా తిరుగుతున్నాడు.

అక్కడి నుండి కొంత ముందుకు పోగానే వారికి చెట్లమీద బంగారు సేబులు వెండి మామిడి పండ్లు చాలా ఆకర్షణీయంగా కనబడినాయి. తీగలు వజ్ర వైరుధ్యాలతో చెట్లకు చుట్టుకొని కనబడినాయి. ఇవి చూచి అందరు వారు సహజమైన పండ్లను కింద కుమ్మరించి బంగారు పండ్లతో ఆశ కొద్ది సంచులు నింపుకున్నారో. తోటంతా సహజమైన పండ్లతో నేంతా నిండిపోయి కుళ్ళిపోవునట్లయింది. బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు ధనం కాలం ప్రజలు ఆశపడినారు.

ఆ బరువైన సంచులతో వెనుక గేటు వద్దకు చేరాడు. అక్కడ రాజుగారు ఉన్నారు. అంతా చూస్తున్నారు. అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే వారి ఆశ్చర్యానికి అక్కడ వేగంతో ప్రవహించే నీళ్ళ కాలువ ఎదురయింది. అది దాటుటకు పడవలు లేకుండెను. అది వారి బరువైన సంచులతో దాటటం వీలవదని అక్కడనే కాలువపక్కన తలకాయలు గోక్కుంటు ఆగిపోయారు, చాలాసేపు వరకు, ఇంతలకు వారిలో నుండి ఒక యువకుడు పేరు వేణుబాయి. తన సంచీని నది పక్కనే వదిలేసి కొంతదూరం కాలువలో నడిచి తరువాత ఈదుకుంటూ కాలువ దాటాడు.

తరువాత అందరూ కూడా అతడిని అనుసరించారు రంథిగా. వారు జీవితాంతం సుఖంగా ఉండేంత ధనం ఉందనుకున్నారు. ఆ విలువైన సంచులను కాలువ పక్కన వదిలేసి ఈదుకుంటూ నది దాటుతూ వటి్ట చేతులతో అక్కడి నుండి తడిగుడ్డలతో రంధిగా మరియు కోపంగా కాళ్ళు ఈడ్చుకుంటూ రాజు మరియు చందన్ వద్దకు చేరారు. చందన్ ముఖంపై చిరునవ్వు, రాజుమటుకు రంధిలో ఉండెను. ఎప్పుడైతే వారందరూ రాజుగారి ముందు కలిశారో, అతను అన్నాడు, నిన్న అడిగినపుడు మీరంతా సంతోషంగా, తృప్తిగా ఉన్నామని చెప్పారు గదా! కాని ఈ రోజు తోటలోని బంగారు పండ్ల సంచులను వదిలేసి రంధిగా మాములందు నిలబడినారు. వాస్తవంగా మీరు మీ జీవితంలో సంతోషంగా వుంటే మీరు బంగారు పండ్లతో ఎందుకు సంచులు నింపుకున్నాడు, మరియు ఎందుకు ఈ రోజు ఎంతో రంథిగా ఉన్నారు? అందరూ తాము చేసిన పనిపై సిగ్గుతో తలలోంచుకొని నిలబడినారు.

కేవలం తన సంచిని ఏ మాత్రం విచారించకుండా నది పక్కన వదిలేసి నది దాటిన యువకుడు వేణుబాబు మాత్రం మామూలుగా కనిపించాడు. చందన్ ఇతడిని కనిపెట్టి ముందుకు రమ్మనిపిలిచాడు. అతడిని చందన్ అడిగాడు, చెప్పు నీకు నీ విలువైన పండ్ల సంచీ నది పక్కన వదిలేసి వచ్చినందుకు నీకు రంధి అవుతూ లేదా?

ఆ యువకుడు అన్నాడు, “నేను బంగారు ఫలాలు, పుష్పాలు తెంపుకోలేదు. నేను సహజమైన తినే పండ్లకు తృప్తిగా తిన్నాను. ఇంటివద్ద ఉన్న నా కూతురు కొరకు కొన్ని సంచీలో వుంచాను. అమ్మాయి ఈ తీయని మామిడి పండ్లను తిని సంతోషిస్తుందని, కానీ ఎప్పుడైతే నది దాటే వీలు లేదనుకున్నారో, నేను ఏమి విచారించకుండ నా సంచీని నది పక్కన వదిలేశారు. నా చంటిది ఏదైన వేరే చోటు నుండి మంచి రుచికరమైన పండ్లు పొందవ్చు. కాని రాజు మమ్ముల తన ప్రత్యేకమైన తోటలో సంతోషంగా తిరుగటానికి వీలు కలిగించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. అక్కడ మంచి మంచి వృక్షాలు, మొక్కులు, జంతువులను చూచాను. అతను గొప్ప రాజు, ఇంత అందమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో తిరుగుతూ ఎంతో ఉల్లాసంగా ఉండింది.

చివరగా అమృతరాజు ముఖంపై చిరునవ్వు కన్పించింది. చందన్ రాజువైపు చూచి అంటాడు, ఓ రాజూ, ఇప్పుడు మీరు గమనించియుండవచ్చు, ప్రజల తృప్తి ఆహారం, డబ్బు వుంటే ఉండదు, వారు కూడా మనసులో సంతోష పదాలనుకుంటారు. అప్పుడేవారు ధనం కలిగినా, కోలుపోయినా విచారించదు. ఇదే పాఠం ఎవరికైనా – ఒక రాజైనా, సామాన్యుడైనా గుర్తించుకోవలసింది.

రాజు సంతోషంతో తల ఊపాడు, అతని ప్రజలవలె, పాఠం తొందరలో ఎవరు కూడా మరచిపోరు. వారందరిలో అతిసంతోషి యువకుడు వేణుబాబు.

కథ ఇష్టమైందా మీనూ? రఘు అడిగాడు. ఓహ్ అతను, మీనూ తల ఊపింది. కాని నేను రాజు కన్న మంత్రి ఇష్టపడుతాను. అది నిజమే మీనూ, నాయనమ్మ ఒప్పుకుంది, రాజులకు తెలివైన మంత్రులు అవసరం, సరియైన నిర్ణయాలు తీసుకునేందుకు అక్బరుకు, బీర్బల్, కృష్ణదేవరాయలకు తెనాలి రామకృష్ణుడు ఉండిరి.

రాజులకే కాదు, మనసు కూడా ఎవరైనా తెలివైనవాడు ఉండాలి, మనం తప్పుచేసినపుడు సరియైన వారి చూపేందుకు, మన తల్లిదండ్రులు, తాతలు, నాయనమ్మలు అమ్మమ్మలు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు లేక మంచి స్నేహితులు కావచ్చు. ముఖ్యమైన విషయం అవసరమైనపుడు మనం వారి సూచనలు పాటించడం మంచిది.

 

 

 

 

 

You may also like

Leave a Comment