అనగనగా ఒక రాణి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆమె గోడపైనున్న పటాలు, గదిలోని ప్లేట్లు కిందపడే వరకు బిగ్గరగా నవ్వేది. చాలా చిన్న విషయాలకు కూడా ఆమె నవ్వేది. ఆమె నవ్వు ఎంత బిగ్గరగా ఉండేదంటే న్యాయస్థానంలో ఉన్న వారందరు, నౌకర్లు, కింద అంతస్తులో ఉన్నవారు కూడా వాళ్ళ చెవులు మూసుకోవాల్సి వచ్చేది. వారు మొదటగా వారి చేతివేళ్ళను వాడేవారు, చివరికి చెవిలో దూది పెట్టుకొని పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఎవరికి కూడా రాణి పేరు తెలియదు. ఎందుకంటే ఆమెను అందరూ హర్ మెర్రీ మెజస్టీ అంటే దొరసానిగా పిలిచేవారు. చాన్సలర్ రాజ్యం అప్పులపాలు అవుతుందని ఆమెకు తెలియగానే గిలిగింతలు పెట్టినట్టై అతిగా నవ్వుతూ మెట్ల మీది నుండి జారిపడి కాలు విరగ్గొట్టుకుంది. భూకంపం వచ్చినపుడు బంగ్లా మొత్తం ధ్వంసం అయ్యింది. అప్పుడు ఆమె పక్కటెముకలు నొప్పి పుట్టేవరకు నవ్వింది. పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసేందుకు వచ్చారు. కానీ ఆమె చేతి సైగతో వాళ్ళను రానివ్వలేదు. నవ్వు ఆరోగ్యదాయకం అంటూ ఆమె కండ్లల్లో నీళ్లు ముఖంపైకి కారే వరకు నవ్వింది. కానీ నవ్వు జీవితంలో మంచి అలవాటు. దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఆమెకు ఇష్టం కానిది, ప్రజలు ఆమెతో ఏకీభవించకపోవటంతో ఆమె చాన్సలర్ ను చంపేసింది. ఇది ఎంత హాస్యమో…. ఈ సారి ఆమె నవ్వు ఆపుకోలేక నవ్వీ నవ్వీ శ్వాస ఆడక చనిపోయింది. చివరికి దర్బారులోని వారు దేశీయులు కొంత శాంతి, నిశ్శబ్దము, సంతోషంగా అనుభవించగలిగారు. అతి సర్వత్రా వర్జయేత్.
ఒద్దిరాజు మురళీధరంరావు
ఒక వెచ్చని గూటినుండి ఐదు పక్షి పిల్లలు పొదిగిన గుడ్ల నుండి బయటికి వచ్చాయి. వాటి తల్లిదండ్రులు అవి ఎదిగేందుకు వాటికి పగలు రాత్రి ఆహారం తెచ్చి తినిపించేవి. కొద్ది రోజుల్లోనే అవి ఎంత ఎదిగాయంటే, ఆ గూడు వాటికి ఇరుగ్గా అయ్యింది. వాటి రెక్కలు బలపడగానే ఎలా ఎగరాలో తల్లి చెప్పింది. మీ తండ్రి, నేను మీ ఐదుగురికి ఆహారం అందించేందుకు బాగా తొందరపడేవాళ్ళం. ఇక మీద మీరు మీ కొరకు ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోవాలి. అందువల్ల ఒకరోజు తల్లి ఆ ఐదు పిల్లలు ఎగిరేందుకు రెడీ స్టడీ గో అంది. కానీ కేవలం వాటిలోని నాలుగు పిల్లలే చెట్ల కింది కొమ్మలపైన వాలాయి. తర్వాత అవి మళ్లీ గూటికి చేరాయి. మళ్ళీ అవి కిందికి వాలాయి, పైకి ఎగిరాయి. ఆ రకంగా అవి కిందికి మీదికి ఎగురసాగాయి సంతోషంగా. కానీ అన్నిటికన్న చిన్నపక్షి తన కండ్లు మూసుకుని భయంకరంగా ఉన్న కిందికి చూడకుండా ఒదిగి గూటిలోనే కూర్చుంటూ ఉండేది.
ఆ రకంగా రోజులు గడుస్తున్నాయి. ఆ చిన్న పక్షి యొక్క అన్నలు, అక్కలు వాటి ఆహారం అవే సంపాదించుకోగలిగాయి. కానీ ఆ చిన్నది మాత్రం కిందకి చూసేందుకే భయపడుతూ గూటిలోనే ముడుచుకొని కూర్చొని ఉండేది. అప్పుడు తండ్రి పక్షికి ఒక ఆలోచన వచ్చింది. పిల్ల పక్షికి కింద కొమ్మపై వాలే భయంకన్న ఇంకా ఎక్కువ భయం కలిగే దృశ్యం చూపించడం మంచిదనుకుంది. అప్పుడు క్రింద చెట్టు వెంబడి ఒక పిల్లి నడుచుకుంటూ వెళ్తుంది. చాలాకాలం వరకు పిల్ల పక్షికి ఆహారం బాగా తినిపించడం వల్ల లావుగా తయారయ్యింది. ఒకరోజు దాన్ని పిల్లి తినేయడం ఏమంత విచిత్రం కాదనుకుంది. తెలివి తక్కువ పిల్ల పక్షి తనను తినేందుకు తను గూటిలో పిల్లి కోసం ఎదురు చూస్తున్నట్లున్నది. కానీ ఆ కింద పోయే పిల్లి దీన్ని చూడలేదు. దాని పదునైన కోరలు, పొడవాటి కాలిగోర్లు, భయం గొలిపే పసుపు పచ్చని కంటిగుడ్లు చూసి భయపడి పిల్లపక్షి గూటి అంచునుండి కిందికి జారింది. కానీ దానికి ఏం జరిగిందో తెలియకముందే, అది దాని ప్రాణాలను కాపాడుకోవడమే కాక కింది చెట్టు కొమ్మ మీద వాలింది. ఆ కొమ్మపై నుండి ఇంకో పై కొమ్మ మీద వాలింది. ఇలా మూడు నాల్గు సార్లు ఎగురుతూ సంబరపడింది. ఇది గూటిలోనే భయపడి కూర్చునేదానికన్న వెయ్యి రెట్లు మంచిదనుకుంది. ఇన్నాళ్ళు బుద్ధితక్కువగా గూటిలో కూర్చోవడమే, అన్నలు, అక్కల వలె తెలివిగా ఎగరకపోవడం చాలా తప్పు. ప్రయత్నమే ఫలితానికి మూలం.
ఒక ముదుసలి వాసిల్ తను సముద్రములో ఒక మూలకు వేసిన వలలో ఏవైనా చేపలు పడ్డాయో చూద్దామని వెళ్లి చూసాడు. ఆ వలను బయటికి తీసి చూసేసరికి దాంట్లో ఒక బంగారు చేప కనిపించింది. దాన్ని బయటికి తీయబోయేవరకు ‘నన్ను నీళ్ళలోనే వదిలిపెట్టు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా’నంది. నాకు ఏమి కావాలో తెలియదు. నా భార్యను అడిగి చెప్పగలను అని ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిన సంగతి చెప్పాడు. భార్య నాల్గు చీవాట్లు బెట్టి వెంటనే వెళ్ళి తనకు మంచి దుస్తులు కావాలని అడుగు. నాకు కేవలం ఈ చిరిగి పోయిన పాత జాకెట్ ఒకటే వుంది.
అతను వెళ్ళి కొత్త బట్టలు తేగానే తనకు బంగారు బండి కావాలని చెప్పి వెంటనే చేప వద్దకు పంపించింది భర్తను. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అటువంటి దాంట్లో కూర్చోలేదు. ఆ ముదుసలి వాసిల్ వెంటనే వెళ్ళి బంగారు బండి తెచ్ౘ్ాడు. కానీ ఆ ముసలమ్మకు అది కూడా తృప్తి కాలేదు.
ఇప్పుడు ఆమె కోరిక సముద్రపు ఒడ్డున ఒక మంచి బంగ్లా, చుట్టూ మంచి మంచి చెట్లు, తోటలు మరియు గుంపెడు నౌకర్లు కావాలని కోరింది. కానీ అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు. చివర్లో ఆమెకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆమె ఆ బంగారు చేప వచ్చి తనకు సేవలు చేయాలని తలచింది. ఈ విషయం తెలియగానే ఆ చేపకు కోపం వచ్చింది. వెంటనే ఇచ్చినవన్నీ గుంజుకున్నది. అప్పుడు ఆ ముసలమ్మ తన గుడిసె ముందు చిరిగిన బట్టలతోనే వల అల్లుకుంటూ నిలబడింది. తెలిసిందా ఇప్పుడు? ఒకవేళ నువ్వు అతి ఆశకు పోతే నీవు ఏమీ లేకుండా అయితావు.
అతి ఆశ కొంపకు చేటు.
ఒక చెరువు దగ్గరలో ఒక కొంగ మరియు దానికి దగ్గరలోని అడవిలో ఒక నక్క ఉండేవి. అవి మనమిద్దరం దగ్గర దగ్గర ఉండేవాళ్ళం కదా, కాబట్టి మనం ఒకరికొకరం పిలిచి విందు చేసుకుందాం అని అనుకున్నాయి. మొదటగా నక్క విందుకు పిలిచింది. ఎంతో మర్యాదగా నక్క కొంగను తన ఇంటికి పిలిచి ఒక ప్లేటులో రుచిగల పదార్థాలు పెట్టి ఇక తినుమని ప్రేమతో కోరింది. కొంగ తన పొడుగు మూతితో ఎక్కువగా తినలేకపోయింది. కానీ నక్క మాత్రం గబగబా తినేసింది.
తర్వాత రోజు కొంగ తగిన విధంగా మర్యాద చేయాలనుకుంది. ఎంతో మర్యాదగా నక్కను కొంగ తనింటికి విందుకు పిలిచింది. ఒక టేబుల్ మీద ఒక సన్నమూతి కూజాలో పాయసం పోసి నక్కను తినమని కోరింది. కొంగ తన సన్నని పొడవైన మెడతో కూజాలో మూతిపెట్టి పాయసం మొత్తం తినేసింది. కానీ నక్క ఆ కూజాలో మూతి పెట్టలేక టేబుల్ చుట్టూ తిరిగి తిరిగి కొంచెం కూడా పాయసం తినలేకపోయింది. ఈ విధంగా కొంగ, నక్కకు సరైన గుణపాఠం నేర్పింది.
ఇదే అవి ఒకరికొకరు విందుకు ఆహ్వానించడం చివరిసారి అయ్యింది.
నీవు ఇతరులకు ఎలా మర్యాద చేస్తావో, అదే తీరు మర్యాదను నీవు పొందుతావు.
(ఈ కథ 365 గుడ్ నైట్ స్టోరీస్ లోని 23 జనవరి ది)
తెలివికల్ల చిన్న కోడిపుంజు
రేనార్డు అనే నక్క ఆకలితో ఉంది. వాతావరణం వసంతం వలె వుంది నిజమే, కానీ అది డిసెంబరు. ఆ నక్క తన ఆహారం కోసం అడవిలోకి వెళ్ళాలని అనుకోలేదు. సూర్యోదయానికి ముందే అది లాక్ వుడ్ వాకిలిలోకి దూరి దగ్గరలోనే ఉన్న కోడిపెట్టను మొరటుగా నోట కరుచుకుని వెళ్ళిపోయింది. ఆ కోడిపుంజు నిద్రావస్థలో ఉండి కనులు మిటకరిస్తూ ఆ నక్కను చూసింది. మరుసటి రోజు ఆ నక్క మరో కోడిపెట్టను పట్టుకుపోయింది. మూడవరోజు ఇంకొకదాన్ని. అక్కడ మిగిలిన కోడిపెట్టలు కోడిపుంజును కోపంగా నువ్వు దీని గురించి ఏదైనా ఎందుకు చేయవు అన్నాయి. ఆ రైతు ఆ స్థలంలో కొన్ని వలలు ఏర్పాటు చేసాడు. కానీ అవి నక్క చిక్కడానికి అంత పెద్దగా ఉపయోగపడలేదు. కానీ నాల్గవ రాత్రి కోడికి ఇష్టంలేని నక్క రాక కోసం తగిన ఏర్పాటు చేసింది. అది ఒక గుడ్ల గంప కొమ్మ మీద పెట్టి ఎదురు చూస్తుంది. నక్క వచ్చి నోరు తెరవగానే కోడి గంపను దాని మీద పెట్టింది. ఆ గుడ్లు నక్క ముఖం మీద పడి చితికిపోయాయి మరియు ఆ గంప దాని తలమీద పడింది. ఆ నక్క గంప నుండి తల బయటికి తీసుకోకముందే కోడిపుంజు పిచ్చిదానిలా అరవటం మొదలెట్టింది. నన్ను ఇంతముందే లేపటం ఎందుకోసం అని రైతు గులుగుతూ మంచం మీదినుండి లేచిండు. వెంటనే అతను నక్క తన తల గంపనుండి తీసే ప్రయత్నంలో గుడ్ల సొనతో కండ్లు మూసుకుపోయాయి. వెంటనే నక్క చర్మపు ముక్కలు కింద పడ్డాయి. కోడిని యజమాని ఎప్పుడు కూడా కోడికూర వండనని వాగ్దానం చేసాడు. అందువలన అది జీవితాంతం కోళ్ల గూటికి యజమానిగా ఉండిపోయింది.
నక్కను పట్టించిన లాక్ వుడ్ కోడిపుంజు తను చేసిన పనికి గర్వపడుతూ, ఇకనుండి తను ఎందులోనైనా తన అభిప్రాయం తెలుపవచ్చు అనుకుంది. పెట్టెలకు ఏ ఆహారం ఇవ్వాలో, టీవీలో రైతు ఏ ప్రోగ్రామ్ చూడాలో ఏ ప్రోగ్రామ్ చూడవద్దో తన అభిప్రాయం తెలిపింది. మొదట్లో లాక్ వుడ్ కోడిపుంజు సలహా వినాలనుకున్నాడు. ఎందుకంటే కోడిపుంజు ధైర్యం కలది, మంచిది. నక్కను కూడా పట్టించింది కాబట్టి. అది తన పక్కింటి యజమాని కూతురు వూలీతో ప్రేమలో పడింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందర ఆమెను వివాహమాడాలి అనుకున్నాడు, కానీ ఈ వివాహానికి పుంజు ఇష్టపడలేదు. చూడు ఇక్కడ ముసలి కొడుకు, అతను రైతుతో బదులుగా విల్ కిన్స్ కూతురును ఎందుకు వివాహం చేసుకోవు? ఆమె చాలా అందగత్తె మరియు మంచి గుణవతి మరియు ఆమె కోళ్ళ పెంపకంలో దిట్ట. నా అభిప్రాయం ఏమిటంటే ఆ పక్కింటి అమ్మాయి చాలా చెడు లక్షణాలు కలది అని నీవు తెలుసుకోవాలి. ఆ రైతు అటువంటి వారితో ఉండాలనుకోలేదు. అతను అతను నోరు మూయకుంటే తన మాట మార్చి పుంజును పులుసు పెడతానని భయపెట్టినాడు. పుంజు అందుకు భయపడలేదు. ఇంకా చెప్తూనే ఉంది. ఆమె ఇంటిని శుభ్రంగా వుంచుకోదు మరియు గ్రామంలో తెలివైన అమ్మాయి కూడా కాదు. ఒకవేళ అతడు శాశ్వతంగా వెళ్ళిపోతే, కానీ లాక్ వుడ్ అందువల్ల పాట్టీ విల్ కిన్స్ కు బదులుగా వివాహమాడుతానని వాగ్దానం చేశాడు. కావున వివాహం జరిగింది. రైతు మరియు అతని కొత్త భార్య ఎంతో సంతోషంగా తృప్తిగా ఉన్నారు. వారు తెలివిగల పుంజుపై గౌరవంతో ఉన్నారు. అందువల్ల పుంజు గర్వమునకు అంతు లేకుండా పోయింది.
ఒక కృతజ్ఞత లేని రాకుమారుడు
గోల్డన్ లాక్ అనే రాకుమారుడికి ఒక బిడ్డీ అనబడే నర్సు ఉన్నది. ఆమె అతడిని ఊయలలో ఊపేది, నిద్ర పుచ్చేందుకు శ్రావ్యమైన పాటలు పాడేది. తన చంకలో ఎత్తుకొనేది. బంగారు తల వెంట్రుకలను దువ్వేది. ఆమె అతనికి మొదటి మాటలు మరియు పాటలు నేర్పింది. తోటలోకి తీసుకొని పోయి ఆహ్లాదకరమైన ఆటలు చూపేది. వారు ఒకరికొకరు అలవాటైనారు. కానీ ఆ యువరాజు ఎప్పుడైతే యువకుడైనాడో, అతనికి చదువు ప్రొఫెసర్లతోనే నేర్పించాలని అతని తండ్రి నిశ్చయించాడు. బిడ్డీ ఇక అవసరం లేదు, ఆమె ఎక్కడికైనా, ఇష్టమొచ్చిన చోటికి పోవచ్చు. కానీ రాజభవనంలో ఇక ఆమె అవసరం లేదు. ఆమె మునుపటి వలె యవ్వనంలో లేదు, ఉల్లాసంగా లేదు. ఇది వాస్తవం. కానీ కానీ ఆ యువకునికి ఏ ఇబ్బంది కలిగినా ఆమె హృదయం ద్రవించి పోయేది. అతనికి ఇబ్బంది కలిగినపుడు అతడిని ఓదార్చేది, మంచి విషయాలు చెప్పి సుఖ పెట్టేది.
కానీ ఆ రాకుమారుడు ఆమె దయను త్వరగానే మరచిపోయాడు. అతను వెంటనే పెరగాలని అనుకున్నాడు. ఆమె ఆ ఇంట్లోనే వుండేందుకు తండ్రితో ఒక్కమాట కూడా చెప్పలేదు. వారు ఆమెను బయట చలి, అననుకూలమైన వాతావరణంలోకి పంపేశారు. ఆమె రాచ తోటలు దాటి ముందుకు పోలేక పోయింది. ఆమె అక్కడ బాధతో మెత్తని కొమ్మలు కలిగిన వృక్షముగా (Crooked Willow)మారిపోయింది. వెంటవెంటనే రాకుమారుడు ఏదో తనకు బాగా ఇష్టమైనది కోల్పోయినట్లు అనుకున్నాడు. అతను తన ముదుసలి నర్సును చూసేందుకు బయటకి పరుగెత్తాడు. కానీ ఆమె కనబడలేదు. కానీ అప్పటినుండి తన అన్ని బాధలను ఆ విల్లో చెట్టుకు రహస్యంగా చెప్పేవాడు. అతనికి ఎప్పటికి ప్రపంచంలో తనను అర్థం చేసుకున్నది ఆ వంగిపోయిన ముసలి చెట్టు మాత్రమే నని అనుకునేవాడు.
ఆమె అవసరం తీరాక ఆమెను దయాదాక్షిణ్యం లేకుండా బయటికి పంపడం క్షమించరాని నేరం కదా!
ఒక చెరువు దగ్గరలో ఒక కొంగ మరియు దానికి దగ్గరలోని అడవిలో ఒక నక్క ఉండేవి. అవి మనమిద్దరం దగ్గర దగ్గర ఉండేవాళ్ళం కదా, కాబట్టి మనం ఒకరికొకరం పిలిచి విందు చేసుకుందాం అని అనుకున్నాయి. మొదటగా నక్క విందుకు పిలిచింది. ఎంతో మర్యాదగా నక్క కొంగను తన ఇంటికి పిలిచి ఒక ప్లేటులో రుచిగల పదార్థాలు పెట్టి ఇక తినుమని ప్రేమతో కోరింది. కొంగ తన పొడుగు మూతితో ఎక్కువగా తినలేకపోయింది. కానీ నక్క మాత్రం గబగబా తినేసింది.
తర్వాత రోజు కొంగ తగిన విధంగా మర్యాద చేయాలనుకుంది. ఎంతో మర్యాదగా నక్కను కొంగ తనింటికి విందుకు పిలిచింది. ఒక టేబుల్ మీద ఒక సన్నమూతి కూజాలో పాయసం పోసి నక్కను తినమని కోరింది. కొంగ తన సన్నని పొడవైన మెడతో కూజాలో మూతిపెట్టి పాయసం మొత్తం తినేసింది. కానీ నక్క ఆ కూజాలో మూతి పెట్టలేక టేబుల్ చుట్టూ తిరిగి తిరిగి కొంచెం కూడా పాయసం తినలేకపోయింది. ఈ విధంగా కొంగ, నక్కకు సరైన గుణపాఠం నేర్పింది.
ఇదే అవి ఒకరికొకరు విందుకు ఆహ్వానించడం చివరిసారి అయ్యింది.
నీవు ఇతరులకు ఎలా మర్యాద చేస్తావో, అదే తీరు మర్యాదను నీవు పొందుతావు.
(ఈ కథ 365 గుడ్ నైట్ స్టోరీస్ లోని 23 జనవరి ది)
అనగనగా ఒక రాణి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది . ఆమె ఎంత సేపు నవ్వేదంటే … గోడ పైనుండి పటాలు కింద పడేంత వరకు… ప్లేట్లు గూళ్ల నుండి కింద పడేంత వరకు నవ్వేది. చాలా చిన్న విషయం కూడా ఆమె నవ్వుకు ప్రేరణ అయ్యేది. ఆమె నవ్వు ఎంత గట్టిగా ఉండేదంటే…. ఆస్థానంలో ఉన్న వారందరూ, నౌకర్లూ, కింద అంతస్తులో ఉన్నవాళ్లు కూడా వాళ్ళ చెవులు మూసుకోవాల్సి వచ్చేది.
చెవులు మూసుకోవడానికి వాళ్లు ముందు వాళ్ళ వేళ్ళను వాడేవాళ్లు. కానీ, చివరకు చెవిలో దూదులు పెట్టుకొని పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చేది.
ఎవరికీ కూడా ఆ రాణి పేరు ఏంటో తెలియదు . ఎందుకంటే ఆమెను అందరూ “హర్ మెర్రీ మెజిస్టీ” అని పిలిచేవాళ్లు. అంటే, దొరసాని గా పిలిచేవాళ్లు. ఎప్పుడైతే ఛాన్స్లర్ రాజ్యం అప్పుల పాలు కాబోతున్నదని చెప్పాడో, ఆమెకు చెక్కిలిగిలి పెట్టినట్టై అతిగా నవ్వుతూ మెట్ల మీద నుండి జారిపడి కాలు విరగగొట్టుకుంది. భూకంపం వచ్చింది. బంగ్లా ధ్వంసం అయింది . అప్పుడు ఆమె పక్కటెముకలు నొప్పి పుట్టేంతవరకు నవ్వింది . పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసేందుకు వచ్చారు. కానీ ఆమె చేయి సైగతో వాళ్లను రానివ్వలేదు.
నవ్వు ఆరోగ్యదాయకం అంటూ ఆమె కండ్ల నీళ్లు ఆమె ముఖం పైకి కారేంతవరకు నవ్వేది . కానీ , నవ్వు జీవితంలో ఒక మంచి ఘటన . దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి.
ఆమె అభిప్రాయాలకు ప్రజలు ఆమెతో ఏకీభవించకపోవడం ఆమెకు ఇష్టం అయ్యేది కాదు. అందుకోసం ఆమె చాన్సులర్ నే చంపేసింది.ఇది ఎంత హాస్యము? ఈ హాస్యం ఆమెను నవ్వు ఆపు లేక ఆపుకోలేక పోయి నవ్వి నవ్వి మొస తీసుకోలేక చివరికి చనిపోయింది. చిట్ట చివరకు దర్బారులో ఉన్నవాళ్ళూ, దేశీయులు కొంత శాంతి నిశ్శబ్దాన్ని సంతోషంగా అనుభవించ గలిగారు. అతి సర్వత్ర వర్జయేత్ అని మనం పెద్దలు ఊరికే అన్నారా!!
Too much of everything is bad.
” అతి సర్వత్ర వర్జయేత్ “
*
(గుడ్ నైట్ స్టోరీస్ నుండి – 2025 ఆగస్ట్ 18)
సముద్రంలో చేపలు పట్టే ఒక ముసలతని పేరు వాసిల్. ఎప్పటిలాగే అతడు సముద్రంలో ఒక మూలకు వలవేసాడు. వలలో ఏమైనా చేపలు పడినాయా చూద్దామని వెళ్లి చూశాడు. ఆ వలను బయటికి తీసి చూసేసరికి దాంట్లో ఒక బంగారు చేప కనిపించింది. దాన్ని బయటికి తీయబోయే వరకు
“నన్ను నీళ్ళల్లోనే వదిలిపెట్టు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను” అన్నది చేప.
అతను ఆశ్చర్యపోయి,
” నాకు ఏమీ కావాలో తెలియదు .నా భార్యను అడిగి చెప్తాను .” అని ఇంటికి వెళ్లి భార్యతో జరిగిన సంఘటనంతా చెప్పాడు. భార్య నాలుగు చివాట్లు పెట్టి, వెంటనే వెళ్లి తనకు మంచి దుస్తులు కావాలని అడుగు. నాకు కేవలం ఈ చిరిగిపోయిన పాత బ్లౌజ్ ఒకటే ఉంది ” అని అంటుంది . వాసిల్ వెళ్లి కొత్త బట్టలు తేగానే ఆమె తనకు బంగారు బండి కావాలని చెప్పి వెంటనే చేప వద్దకు పంపించింది భర్తను. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అటువంటి వాటిల్లో కూర్చోలేదు. ఆ ముసలి వాసిల్ వెంటనే వెళ్లి బంగారు బండి తెచ్చాడు. కానీ ఆ ముసలమ్మకు అది కూడా తృప్తి కాలేదు. ఇప్పుడు ఆమె కోరిక సముద్రపు ఒడ్డున ఒక మంచి బంగ్లా కావాలనీ, దాని చుట్టూ మంచి మంచి చెట్లు, తోటలు, గంపెడు నౌకర్లు కావాలని కోరుతుంది . అవన్నీ వస్తాయి . కానీ, అవి కూడా ఆమెను తృప్తి పరచలేదు. చివరికి ఆమెకు ఒక విచిత్రమైన కోరిక కలుగుతుంది . ఆమె ఆ బంగారు చేప వచ్చి తనకు సేవ చేయాలని తలుస్తుంది.
ఈ విషయం తెలియగానే ఆ చేపకు కోపం ముంచుకు వచ్చింది. వెంటనే ఇచ్చినవన్నీ తీసేసుకున్నది . అప్పుడు ఆ ముసలమ్మ తన గుడిసె ముందు చిరిగిన బట్టలతోనే వల అల్లుకుంటూ కూర్చున్నది.
తెలిసిందా ఇప్పుడు? ఒకవేళ నువ్వు అతి ఆశకు పోతే.. నీకు ఏమీ లేకుండా అవుతాయి.
” అతి ఆశ కొంపకు చేటు”*_
ఒకరోజు ఒక కుందేలును తాబేలు దాటి ముందుకు పోయింది. తాబేలును దూషించడం మొదలుపెట్టింది. రోడ్డుపై చాలా జాగా ఉన్నప్పటికీ నువ్వు రోడ్డు మధ్యనే ఎందుకు నిలుచున్నావు?” అన్నది.
తాబేలు తల బయటికి తీసి క్షమాపణ కోరుదామని అనుకొని అన్నది. తను తన మిత్రునితో పందెంలో ఉన్నానని కానీ అతడు చాలా నెమ్మది కాబట్టి అతను నన్ను చేరే లోపల ఒక కూర్పు తీద్దామని అని అనుకున్నాను” అని .
అనగానే,
“ఎట్… అంతా అబద్ధం ! “అని కుందేలు తన వెనుక కాళ్ళ మీద నిలబడి అన్నది .
“ఒక్క మాట కూడా నేను నమ్మను నన్ను కూడా దాటేసి వెళ్తానని అంటావు తర్వాత” అని కూడా అన్నది.
దాని ముందు దారికి అడ్డంగా ఒక గీత గీసింది.” రెడీ…. స్టడీ ….గో ….” అన్నది. అని, అది కూడా పరుగెత్తింది.
తాబేలుకు తెలుసు తను గెలిచే అవకాశం లేదని. కానీ, దాని భుజాలపైన చురుకైన తల కలిగి ఉన్నది.
అది దారి ఏటవాలుగా ఉన్నదని గమనించంది. కాబట్టి ఒక గుండు రాయి కొరకు వెతికింది. దగ్గరలో ఉన్న ఆ రాయిని కుందేలు వెనక దొర్లేటట్టు నెట్టింది . ఆ రాయి కుందేలును దాటి ఎప్పుడైతే పోయిందో తాబేలు గట్టిగా అరిచింది, ” చూడు…. నేను నిన్ను దాటేశాను.” అని .ఆ రాయి జారిపోతున్నప్పుడు చాలా మట్టి అంటింది. దాన్ని చూసి తాబేలు తనను దాటిపోయిందని కుందేలు తన ఓటమిని అంగీకరించింది. అప్పుడు తాబేలు గుట్ట మీద నిలబడి నవ్వింది. తను ఎక్కడికి పోకుండానే పందెం గెలిచినట్టు భావించింది తాబేలు.
