Home కథలు బన్నూఫ్యాషన్స్

బన్నూఫ్యాషన్స్

క్ష్మి ఏవెన్యూలో రెండు బ్లాకులు.. ధనలక్ష్మి.. వరలక్ష్మి.. ఒక్కో బ్లాక్లో వంద ఫ్లాట్స్.. రెండు బ్లాక్స్కు కలిపి ఓ లేడీ స్క్లబ్.. భర్త నారాయణ రిటైర్కావడంతో వారం రోజుల క్రితం వరలక్ష్మి బ్లాక్ లోకి అద్దెకి వచ్చింది అలివేలు. అంతకు ముందే భర్త కూతురి ఆలోచనతో ప్రోత్సాహంతో ఇంట్లో వుంటూనే బట్టలు అమ్మే బిజినెస్ చేయాలి అనుకుంది.. ఓ సాయంత్రం లేడీస్ క్లబ్బుకు వెళ్లి తన గురించి తాను పరిచయం చేసుకొని ఫలానా అని చెప్పుకుంది. నాలుగు రోజుల తర్వాత విజయ అనే ఆవిడ అలివేలు ఇంటి తలుపు తట్టింది.. అదృష్టం ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుంది కరెక్ట్గా ఆ టైం లోనే తలుపు తీయాలి అన్న వీరలెవెల్లో తలుపు తీసింది అలివేలు.

‘రండి రండి రండి దయ చేయండి.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అన్న పాట లెవెల్లో విజయను ఆహ్వానించింది అలివేలు.. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.

“ఇప్పటికి ఎంత మంది వచ్చారు”?

“ఒకరు వచ్చారు.. మీరు సెకండ్.. మీరు నాకు చాలా చాలా నచ్చారు.. నేను ఎప్పటి నుంచో మీకు పరిచయమైన  వ్యక్తి లా మీరు మాట్లాడుతుంటే నాకు భలే హ్యాపీగా ఉంది.. మీకో చీర ఫ్రిగా ఇస్తాను.. దయ చేసి ఎవరితో మాత్రం అస్సలు అనకండి.. నేను ఇలా అందరికీ ఇవ్వలేను కదా” అలివేలు అలా అనేసరికి విజయ తెగ ఆనంద పడిపోయి తాను ఆమెకు నచ్చేలా మాట్లాడి నందుకు తనని తానే గొప్పగా మౌనంగా అభినందించుకుంది.. పైకి మాత్రం చాలా బింకంగా మెయింటెయి న్చేసింది.

“ఏ అవసరం పడినా ధనలక్ష్మి బ్లాక్లో ఉండే ప్రతిమ దగ్గరే బట్టలు కొనాల్సి వచ్చేది.. విపరీతంగా ధరలు పెంచుతుంది.. అందరం కాస్త తగ్గించాం..మీరు  క్లబ్కు వచ్చి చెప్పారు కదా.. చీరెలు మిగతా వెరైటీస్ ఎలా వున్నాయో చూసి పోదామని వచ్చాను” అంది విజయ.

“మెనీమెనీ థాంక్స్అండి.. ఎవరో మంజుల గారు అట.. ఆవిడే మొదట వచ్చారు.. నాలుగు చీరలు కొన్నారు ఈ రోజు ఇద్దరిని తీసుకొస్తామన్నారు కొత్తగా వచ్చాం.. మీరూ పది మందికి చెప్పి సహాయ పడండి.. రేట్స్ కాస్లీ  ఉంటాయి ముందు రెండు వాయిదాల్లో చెల్లించేలా అనుకున్నాను.. కొత్త కాబట్టి  మూడు వాయిదాల్లో ఇద్ధామనుకున్నాను. కాశీ నుండి పట్టు చీరలు తెప్పిస్తాను డిమాండ్ని బట్టి సొంతంగానే యిస్తున్నాం కూడా.. మీరు ఏవైనా కొత్త కొత్త సలహాలు ఇస్తే తప్పక పాటిస్తాను.. మీరు నాకు చాలా మంచిగా అనిపిస్తున్నారు.. మీలాంటి వాళ్ల ప్రోత్సాహమే మాకు అండ..బలం” అలా చాలాసేపు ఆమెను ఆపి ఆపి పోనివ్వకుండా మాట్లాడింది అలివేలు.

అలివేలు మాటల తాకిడికి మూడు వెయ్యి రూపాయల చీరలతోపాటు ఒక ఫ్రి

కూడా  పట్టు కెళ్ళింది  విజయ. అలివేలు ఆ చీరెధర కూడా టోటల్లో కలిపి వేసిందన్న వూహ విజయకు రాలేదు..అలివేలుకు రావాల్సినంత వచ్చింది.

****                         ****

“అక్కడ రేట్లు తక్కువగా ఉన్నాయి అంటున్నారు”

“సరితా మేడం..  మీరు కూడా ఇలా అంటే నేను ఎవరికీ చెప్పుకోవాలి? మీరు ఎన్నిసార్లు ఎన్ని చీరెలు నాదగ్గర కొన్నారు? అయినా  మన బ్లాక్వాళ్ళు నాకు అండగా ఉండరా? మనం మనం ఒకటి కదా.. నా గురించి ఎవరో పుకారు లేపారు.. అందుకే ఇలా కాస్తా డౌన్ అయ్యాను.. అయినా ఏం పర్వా లేదు మేడం మీలాంటి వాళ్ళ అండ నాకు చాలా ఉంది” చెప్పిందే ఇంకోసారి మరోసారి గంటసేపు చెప్పింది ప్రతిమ. సరిత ప్రతిమ మాటల ప్రవాహానికి తల్లడిల్లిపోయింది. ఒక్కో చీర పదిహేను వందల రూపాయల చొప్పున మూడు చీరలు.. వెయ్యి రూపాయల చొప్పున రెండు డ్రెస్సులు మొత్తం ఆరు వాయిదాల్లో చెల్లించేట్లు మాట్లాడుకుని వెళ్ళిపోయింది.. ఆ రోజు క్లబ్లో అలివేలు ప్రతిమల టాపిక్లు మెయిన్గా అయ్యాయి.

****                         ****

పదిహేనురోజులు గడిచాయి.. అలివేలు నోట్చేసుకున్న పేపర్లోని వివరాలు ఏవరో ఇచ్చిన కొత్త డైరీ లోకి  ఎక్కించాడు నారాయణ.

“ఇదిగో.. అన్ని ఇలా నోట్చేసుకో.. విడి పేపర్ల మీద రాయకు..ఇంకో విషయం. వచ్చిన వాళ్ళతో నీకు మాట్లాడడం అంత బాగా రావటం లేదు.. నువ్వు ఏదన్న తప్పుగా మాట్లాడితే నేను ఒక స్పూనో.. ఒకగరిటో.. ఓ ప్లేటో.. క్రింద పడేస్తాను.. నువ్వు అర్థం చేసుకుని లోపలి కన్నారా.. లేదా జాగ్రత్తపడు”

“అలాగే”

“చాలా మంది వాట్సాప్ లో బట్టలు డ్రెస్సులు ఫోటోలు పెట్టమంటున్నారుకదా.. ముందు మనం ఈ బిజినేస్కు ఒక మంచి పేరు పెట్టాలి”

“ఇంట్లోనే కదా అమ్మటం..పేరు ఎందుకు”?

“ఫ్యూచర్లో ఇలాగే ఉంటామా ఏంటి? ఒక మంచి పేరు అయితే ఉండాలి”

“చిన్ను..జున్నూ..గున్నూలాగా మన మనవడి పేరు బన్నూ ఫాషన్స్ అని పెడదామా”?

“బాగుంది బాగుంది.. బిజినెస్ లోకి రాగానే నీబుర్ర కూడా బాగానే పనిచేస్తుంది”

కాలింగ్బెల్మోగింది..”సరే.. నా బుర్ర ఎంత బాగాప నిచేస్తుందో ముందు ముందు మీకే తెలుస్తుంది గాని.. మీరు వంట ప్రయత్నం మొదలు పెట్టండి” నవ్వుకుంటూ ముందు గదిలోకి వెళ్ళింది అలివేలు.

****                             ****

నెల రోజులు గడిచాయి.. వరలక్ష్మి బ్లాకులో అలివేలు బట్టల బిజినెస్  జోరుగా సాగుతుంది.. బట్టల బండిల్ రావటం అయిపోవడం.. రావటం అయిపోవడం.. “నిత్య ఖరీదులు.. పచ్చ నోట్లలా” ఉంది వ్యాపారం.. ఆనందంతో  కూతురికి ఫోన్చేసింది అలివేలు.

“అమ్మా..ఎలా ఉన్నారు”?

“బాగున్నాం”

“అల్లుడు ఊరెళ్తా అన్నారు..వెళ్లారా”?

“వెళ్లారు.. నాన్న ఏం చేస్తున్నారు”?

“నాన్న..కూర చేస్తున్నారు..వచ్చిపోయే వాళ్ళు ఎక్కువయ్యారు”

“అన్నిజాగ్రత్తగారాసుకుంటున్నావా”?

“డైరీలోనోట్చేశారు నాన్న..నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను.. అయినా ఇంకా కొత్తక దానాకు.. ఈ వ్యాపారం పుణ్యమా అని నాన్నకు బోర్కొట్టకుండా ఉంది.. నాకు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు.. ముఖ్యంగా నాన్నకు వంట పని కూడా అలవాటు అయింది.. నేను వంటజోలికే వెళ్లటం లేదు.. సరే ఉంటానమ్మా.. మళ్లీ మాట్లాడుతానులే.. ఎవరో వచ్చారు” కాల్కట్చేసింది అలివేలు.

****                             ****

రెండు రోజులు గడిచాయి.. అలివేలు లేచి తలుపు తీసేసరికి నాలుగు పెద్దపెద్ద కార్టన్స్ కనిపించాయి. భర్తను కేకేసి వాటిని లోపలికి జరిపించింది. సంవత్సర కాలం గడిచింది.. అలివేలు వ్యాపారం ముప్పయి పువ్వులు అరవై కాయల్లా అయింది. ఫ్లాట్స్లో వాళ్లంతా వాళ్లు కొనుక్కోవడమే కాకుండా బంధు వర్గాలు స్నేహితులతో కూడా కొన్నికొన్ని కొనిపించసాగారు.. అలివేలు మాటకారి తనం అంతగా వాళ్ళను ప్రభావితం చేసింది. మొబైల్మ్రోగింది.

“అమ్మా..చెప్పు” అంది అలివేలు.

“అమ్మా..నీకు మెనీమెనీ థాంక్స్ అమ్మా”

“నాకా? ఎందుకే”

“అమ్మా..నేను పడిపోకుండా నన్ను నిలబెట్టినందుకు”

“నీమొహం.. చాల్లే.. అయినా ఇందులో నేను చేసింది ఏముందే.. అన్ని ఆలోచనలు మీనాన్న గారి వినీవి. .దేనికైనా పోటీ ఉంటేనే కదా లాభం. నాన్న రిటైరయ్యారు.. పెన్షన్ ఫర్వాలేదు.. ఇద్దరం హాయిగా బ్రతకవచ్చు.. నీ పరిస్థితి తెల్సుకుని నీకు పోటీగా నన్ను నిలబెట్టారు.. వచ్చాం..వ్యాపారం వృద్ధిచెందటానికి అల్లుడుగారు సరుకుతెస్తున్నారు. ఎన్నెన్ని వూర్లు తిరుగు తున్నారు? ఎంతెంత సరుకు ఇద్దరికీ తెస్తున్నారు.. అంతా వాళ్లిద్దరి సహకారమే కదా.. డల్ గా ఉన్న నీ వ్యాపారం మళ్లీ పుంజుకుంది. . తల్లి తండ్రిగా మాకు ఇంతకంటే ఇంకేం ఆనందం కావాలి”?

“అమ్మా”

“వ్యాపార మెళకువలు.. మాట్లాడే విధానం నువ్వు నాన్న నాకు నేర్పించారు.. నీతోపాటు మాకు లాభాలు వస్తున్నాయి.. ఖాళీగా వుండకుండా చేదోడు వాదోడు అన్నట్లు ఎంత హాయిగా రోజులు వెళ్ల దీస్తున్నాం.. సరదాగా  ఒక మాట చెప్పనా? నేను నాన్నలా ఉద్యోగం చేస్తున్నట్లు నాన్న నాలా వంట చేస్తున్నట్లుగా వుంది. మళ్ళీ నాన్నతో అనకు ఫీల్ అవుతారు.. నేను అందరికీ తెలిసిపోయాను.. అంతా పెళ్లిళ్లకు కూడా మన దగ్గర కొంటున్నారు. ఇంకేంకావాలి? కానీ ఓ విషయం”

“నేను చెప్తాను నువ్వు ఉండు.. మనం తల్లి బిడ్డలమని బయట చెప్పేద్దాం”

“అదే చెప్పబోతున్నాను.. అప్పుడే వద్దే పిచ్చిమొహమా.. ఇలాగే కొంతకాలం గడవనీ.. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు.. ఇదో బిజినె స్టాక్టిక్స్.. పోటీ ఉంటే లాభం ఎక్కువ.. ఈ మాట ఇదివరకే అనుకున్నాం.. అయినా ఏ ప్లాట్స్లో ఉండేవాళ్ళు అయినా ఎక్కువగా తలుపులు మూసుకునే ఉంటారు.. ఎవరి బిజీ వాళ్ళది.. మన విషయంలో ఎందుకు ఇంట్రెస్ట్చూ పిస్తారు? ఏదో కనుక్కోవాలనే తీరిక ఎవరికి ఉంది”?

“ఎప్పుడన్నా బయటపడితే”

“అయ్యో.. మీకు తెలియదా.. చాలామందికి తెలుసు.. అని  నవ్వుకుంటూఅంటాం.. అదే మన సమాధానం”

“అమ్మా”

“అంతగా ఆశ్చర్యపోకు.. ఇది వ్యాపారం.. మనవడు బన్నుఎలా వున్నాడే? నన్ను అడుగు తున్నాడా”?  అలలు అలలుగా నవ్వింది అలివేలు.

“పేరు పెట్టావుగా.. బన్నూ ఫాషన్స్ అని..రేపటిరోజున  వాడి పేరు పెట్టుకున్నందుకు నీ బిజినెస్లో నిన్ను ఎంత పర్సంటేజ్ అడుగుతాడో.. వాడు నీకంటే తెలివికలవాడు.. ఉంటానమ్మా” ఆనందంగా అంది  అలివేలు  కూతురు  ప్రతిమ.

“మంచిదమ్మా.. ఆల్దబెస్ట్.. గుడ్లక్” అంది ప్రతిమ తల్లి అలివేలు.

 

****        సమాప్తం         ****

You may also like

7 comments

K.Raveender August 27, 2021 - 6:32 am

‘ బన్నూ ఫాషన్స్’ కథ బాగుంది.‌ వ్యాపారంలో మాటలతో పాటు తెలివి తేటలు, సమయస్ఫూర్తి ఉంటే చక్కగా రాణించవచ్చని హాస్య భరితంగా తెలియచేశారు రచయిత్రి. పత్రికా సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. చిన్న చిన్న అచ్చు దోషాలు సవరించుకుంటే బాగుంటుంది.

Reply
Kondapalli Surekha August 27, 2021 - 6:58 am

కథా చాలా బావుంది.😀👍బన్నూఫ్యాషన్స్ బంపర్ ఆఫర్లా తల్లీబిడ్డల బిజినెస్ అమోఘం గా సాగుతుందే… 😂
**అందరికీ తెల్సు మీకు తెలియదా అని నవ్వుకుందాం**అనే కొసమెరుపు ఇంకా బావుంది😀👍 సామెతలు చక్కగా నూతనత్వాన్ని సంతరించుకుని ఆహ్లాదకరంగా ఉండి హాయిగా నవ్వు తెప్పించాయి.సున్నితమైన హాస్యంతో బట్టల బిజినెస్ అధ్బుతంగా చేయించావు…చాలా బావుంది..నీ హాస్య కథల పరంపర ఆఘమేఘాల మీద ఇలా దూసుకుపోతూ…అందరినీ ఆనందం డోలికల్లో విహరింప చేస్తూ నీ కథాప్రవాహఝరి ప్రభంజనం సృష్టించాలని కోరుతూ అభినందన మందార మాలలు.నీ కలం(కంప్యూటర్ టిక్కుటిక్కులతో) కలకాలం నిరాటంకంగా సాగిపోవాలని కోరుతూ(✍️)..💻 హృదయపూర్వక అభినందన వందనములు రచయిత్రి సోదరి గారికి.💐🙏🙏😀👍

Reply
అంజనీ దేవి జూపూడి August 27, 2021 - 11:07 am

సీనియర్ రచయితల కథల లో వలె సీరియస్ కథా వస్తువులే కాకుండా హాస్య గుళికల తో ఉల్లాస పరచే మీ బహుముఖ ప్రజ్ఞా పరిణతి నిత్య నూతనంగా వుంటూ సాహితీ కుసుమాల తో సమాజాన్ని పరిమళ భరితం చేస్తున్న కోతమర్తి రాధా హిమబిందు గారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు.

Reply
August 27, 2021 - 11:08 am

కోతమర్తి గారు

Reply
Upender Kondapally August 27, 2021 - 12:12 pm

Very interesting subject and a very wise technique for business improvement with in the walls 👍

Reply
Usharani .N August 27, 2021 - 1:32 pm

‘బన్నూ ఫ్యాషన్స్ ‘ కథ సునిశిత హాస్యంతో చాలా బావుంది. ఏకబిగిన చదివించేలా రాశారు రచయిత్రి. కొసమెరుపు మరీ బావుంది. అస్సలు ఊహించలేదు. 😂😂👌👌👍

Reply
కొండపల్లి రామ కిషన్ రావు . August 29, 2021 - 10:59 am

అమ్మో!బిజినెస్ ఇలాకూడా చెయ్యొచ్చా? బాగున్నది.

Reply

Leave a Comment