అనగనగా భాను మరియు వీరు అనే ఇద్దరు సోదరులుండిరి. వారి బాల్యంలోనే వారి తల్లిదండ్రులు స్వర్గస్థులయిరి. భాను తమ్ముడు వీర్ ను ప్రేమతో మరియు జాగ్రత్తగా పెంచెను. భానుకు యుక్తవయసు వచ్చాక భారతిని వివాహం చేసుకున్నాడు. ఆమె చాలా నమ్రత కలది. ఆమె వీర్ ను భర్తను చూచినంత జాగ్రత్తగా ప్రేమతో చూస్తుండేది.

ఎప్పుడైతే వీర్ 20 ఏండ్ల వయసువాడైనాడో, రాజు తన సైన్యంతో సైనికులను భర్తీ చేస్తున్నట్లు తెలుసుకొని రాబోయే యుద్ధంలో చేరదలచాడు. ఓహ్, అన్నా మరియు వదిన తమ వెంటనే ఉండమని ఎంతో నచ్చచెప్పారు. తాము ఎంతో ప్రేమతో పెంచిన అబ్బాయివారి నుండి చాలాదూరం వెళ్ళిపోవడం అనే ఆలోచనే వారు తట్టుకోలేక పోయారు. కాని వీర్, సైనికుడు కావాలనే కోరికను బట్టి వారు ఎంతో మనోబాధతో కన్నీటితో అతడిని పోనిచా్చరు.

చాలా రోజులవరకు అతడి గురించిన వార్తలు తెలియలేదు. రాజు యుద్ధానికి వెళ్ళాడు,  తన శత్రువును ఓడించి తిరిగి వచ్చాడు. అతడితో వెళ్ళిన సైనికులు ఇంటికి తిరిగి వచ్చారు. కాని వీర్ గురించి ఏ జాడ తెలియకుండెను. ప్రతిదినం అన్న వదినె అతను ఇంటికి వస్తాడని ఎదిరి చూస్తుండిరి. కాని అతడు రాలేదు. తరువాత ఒకరోజు సైనికుల గుంపు వారి గ్రామంగుండా యుద్ధం నుండి తిరిగి ఇండ్లకు వెళ్ళుతుండిరి. భాను అతని తమ్ముణ్ణి గురించి వారిని అడిగాడు. వీర్ ఓహ్ అవును, చాలా విచారం, అతను చనిపోయాడు మీకు తెలుసా? యుద్ధభూమిలో అని ఒకతను అన్నాడు. తన తల ఆడిస్తూ. కాదు కాదు, అతను గాయపడినాడు, మరియు తేరుకునా్నడు. అతను ఇంటికి రాలేదా? అని ఇంకొకతను అన్నాడు. అతను అనారోగ్యంతో ఇంటిదారి పట్టాడు, అని మూడవతను తెలిపాడు.

ఇటువంటి భయంకర వార్తలు విని భాను చాలా రంధి పడినాడు. అతను తన తమ్ముడి రాక కొరకు ఎదిరిచూస్తూ ఇంటివద్ద వుండలేనని నిశ్చయించుకున్నాడు. అతను తమ్ముడి కొరకు వెతుకుతూ బయలుదేరాలని నిశ్చయించాడు. ఎప్పుడైతే అతని భార్యతో చెప్పాడో భారతి కూడా అతనితో వెళ్ళుటకు నిశ్చయించుకుంది. ఓ రోజు వారిద్దరు కలిసి తప్పిపోయిన వీర్ ను చూచి ఇంటికి తీసుకురావాలని బయలుదేరాడు.

వారు, రాజు యుద్ధభూమిలో ఎక్కడైతే వీర్ ను చివరకు చూచామన్న అతని కంపెనీవారు చెప్పారో అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఆ స్థలం చాలా దూరం. వీరం వెళ్ళిన దారిలో అడవి గుండా, లోయల గుండా, గుటు్టలు మరియు ఎడార్ల గుండా పయనించాలి. వారిద్దరు నడిచారు మరియు నడిచారు, ఎన్నో మైళ్ళు. కాని భారతి తగిన బలం లేకుండెను. ఒకరోజు, దట్టమైన అడవి గుండా నడిచాక వారు ఒక చిన్న కుగ్రామానికి చేరారు. భారతి అలసిపోయి కూర్చుండిపోయింది. అక్కడ అట్లె మరణించింది. అప్పుడు భానుకు తీవ్రమైన మానసిక బాధ కలిగి అతను కూడా అక్కడే ప్రాణం వదిలాడు.

చాలా ఏండ్ల తరువాత ఎక్కడైతే ఆ జంట చనిపోయిందో, ఆ స్థలంలో రెండు చెట్లు మొలిచాయి. ఒకటి చాలా పొడుగాటి చెట్టు మరియు వేరొకటి తీగ, ఆ చెట్టును చుట్టుకుంది. అది భాను మరియు భారతి మరణంలో కూడా కలిసి ఉండిరని తోస్తుంది.

ఈ మధ్య, వీర్, వాస్తవంగా మరణించలేదు. అతను యుద్ధంలో తీవ్రంగా గాయపడి చాలా సంవత్సరాలు కోలుకుంటూ చాలా దూరంలో ఒక చిన్న గ్రామంలో వుండిపోయాడు. ఎప్పుడైతే అతను చివరకు కోలుకున్నాడో అతను, అతని కొరకు తన కుటుంబం ఎంతో ఆవేదనతో ఎదిరి చూస్తున్నారనుకొని అతి త్వరగా తన పాత ఇల్లు చేరాడు.

ఎప్పుడైతే తన ఇల్లు తాళం వేసి వుండెనో మరియు ఎన్నో ఏండ్లు వదిలిపెట్టబడి యుండెనో అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండెను. నెమ్మదిగా ఇరుగు పొరుగువారు గుమికూడి భాను తప్పిపోయిన తమ్ముడి కొరకు వెతుక్కుంటూ పోవాలని నిశ్చయించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పిరి.

ఆ రాత్రి వీర్ తన ప్రియమైన అన్న మరియు వదిన ఎట్లు ఇప్పుడు పొందగలనని బాగా దుఃఖించాడు. తెల్లవారగానే అతను వారికొరకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతని అన్న మరియు వదిన వెళ్ళిన దారిలో పయనించాలని వారిని కలిసేందుకు వెంటనే బయలుదేరాడు.

వీర్ ఒక సైనికుడు, కాని చాలా గాయాలతో ఆలస్యంగా కోలుకున్నారు, కాని తగిన బలంగా లేకుండెను. అతనికి భాను మరియు పయనించిన ప్రదేశం చేరుటకు చాలా రోజులు పట్టింది. అప్పుడు అతను ఒకనాడు అడవికి దగ్గరిలో ఒక చిన్న గుడివద్దకు చేరాడు. ఆ గ్రామస్తులు అతనికి విచారకరమైన ఆ గుడికథ చెప్పారు. ఎన్నో సంవత్సరాలకు పూర్వం ఒక జంట ఎన్నోరోజులు నడిచి అలసిపోయి ఇక్కడికి చేరారు. ఒక కథ ఏంటంటే ఆ జంట వారి తప్పిపోయిన తమ్ముడు కొరకు వెళ్లుతుండిరి. వారి కోరిక తీరక ముందే వారిద్దరు ఇక్కడ చనిపోయారు. అదేచోట రెండు ఆశ్చర్యకరమైన చెట్లు, ఎవరికి అంతకుముందు తెలియనివి మొలిచాయి. ఆ ఆకులు మరియు గింజలు ఆ చెట్ల నుండి వచ్చినవి చాలా తీయగా, రుచిగా మరియు తింటే ఉల్లాసం కలిగించేవిగా ఉండేవి. అప్పుడు అక్కడ గ్రామస్తులు ఒక చిన్నగుడి, ఆ స్థలంలో ఆ జంట జ్ఞాపకార్థం కట్టించాలని నిశ్చయించారు. కట్టించారు గూడా.

వీర్ ఆ కథను ఎంతో రంధిగా విన్నాడు. అతను గ్రామస్తులు చెప్పిన జంట తన అన్న మరియు వదినె తప్ప మరెవరు కారని గ్రహించాడు. ఆ వార్తలు విని భరించలేక తను సున్నపు విగ్రహంగా మారాడు.

మీకు తెలుసా, అప్పటి నుండి వారు ఎట్లు జ్ఞాపకం వుంచుకోబడుతున్నారో? ఆ పొడుగాటి చెట్టు పో చెక్క (అరేకానట్లు) తీగ మొక్క ఆకులు తమలపాకులు మరియ విగ్రహం నుండి వచ్చింది సున్నం పేస్టు. ఈ మూడింటిని పాన్ తయారీలో వాడుతారు.

మరియు ఈ తీరుగ ప్రేమ జంట చనిపోయిన తరువాత గూడా తలచుకోబడుతున్నది. వారు ఈ కథ ద్వారా ప్రజలకు ప్రేమ విలువ, కలిసి వుండటం, మరియు ఒకరిపై ఒకరు విశ్వాసం కలిగి వుండటం గురించి తెలిసినది, పాన్ నములుతున్నప్డు జ్ఞాపకం వస్తుంటుంది.

శరణ తల్లి ఈ కథ విని ఆశ్చర్యపడింది. తనకు గూడా పాన్ తయారీలో ఈ మూడు వస్తువులు ఎల్లప్పుడూ పాన్ తయారీలో వాడుతారని తెలియదు.

ఇప్పటి నుండి నీ కథలు వినటందుకు నేను కూడా వస్తామరి.

అయితే పాన్ మాత్రం దంతాలకు హాని చేస్తుందని జాగ్రత పడాలి.

ఈ కథ సుధామూర్తి కథలలో ఒకటి.

You may also like

Leave a Comment