బతుకులో దుఃఖాన్ని దాచుకున్నా
మనిషిగా సంతోషాన్ని అందించాను
లోకానికి
కానీ మూఢుడు విషం చిమ్మిండు
తనలోని రాక్షసత్వం నిద్ర లేచినప్పుడు
మనసు వెన్నలా ధారపోసింది అంతా
రాయిలాంటి నిన్ను వెన్నంటి నడిచా
హాయిగా నిద్రలోకి జారావు నిండుగా
రాయి కరిగింది మంచి మాటకు
కానీ మనిషే మారలేదు అసలు రూపుకు
బహుశా ప్రకృతిలో మట్టి మారిందేమో!
నేను మనిషిగానే బతుకుతా
ఎవరు పొగిడినా మరి తెగిడినా
కవరూ కలరింగూ పనిలేకుండా
పవరూ పొగడ్తల యావలేకుండా
మెత్తని చేతులు రాసే కొత్త కవిత్వంలా
గుండె హత్తుకుంది నిండుగా గొంతును
నునువెచ్చని ఎర్రనదిలా
నడక సాగుతూనే ఉంది నాలో
ఆకుపచ్చని తోట పిలుస్తుంది
నా మిత్రుల తడార్పే ఎడారి నీటికై
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
9849305871
1 comment
బాగుందండీ. ఆచార్యుల వారికి వందనములు.