కేవలం ప్రశ్న
కుట్టూరావ్ కి విపరీతమైన కోపం వస్తోంది.
ఇవాళ రాత్రి ఆయన తన కుమారుడికి ఎలాగైనా ఒక గుణపాఠం నేర్పాలని, బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.
ఆయన భార్య సరస్వతి. ఆమెకి తన భర్త కోపం గురించి బాగా తెలుసు. ఆమె తన చిన్న కుమారుణ్ణి నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తోంది. నాడు నిద్రకు ఉపక్రమించాడు. ఆ తల్లి మనసు తన పెద్ద కుమారుడి భవిష్యత్ గురించి ఆలోచించసాగింది. నిజానికి ఆమె మనసు తప్పే చేస్తున్నది.
‘ఛెళ్’ మన్న చెంప దెబ్బ విని సరస్వతిరావు ఆలోచన్లల నుంచి హఠాత్తుగా బయటపడింది. దానితోబాటే ఆమె భర్త మాటలు వినబడసాగాయి. ఆమె భర్త గొంతు చించుకుంటూ అరవసాగాడు.
“ఒరేయ్! నువ్వో వెధవ్విరా. త్రాగి ఇంటికొచ్చావ్! ఎంత ధైర్యంరా నీకు? పో! నీ మొహం నాకు చూపించకు. ఇక నా ముందుకి ఎప్పుడూ రావద్దు.”
పెద్దబ్బాయి వాళ్లనాన్నని విచిత్రంగా చూసాడు. తరువాత పడుకోడానికని లోపలికి వెళ్ళాడు. కాని చిన్నబ్బాయి ఇంకా మేలుకునే ఉన్నాడు.
“ఏంటమ్మా! అన్న తాగొచ్చాడా ఏంటి? నాన్న అలా అరుస్తున్నాడు?”
సరస్వతి ఏమీ జవాబివ్వలేదు.
చిన్నబ్బాయి మళ్ళీ అడిగాడు – “దీనికోసమని అన్నని నాన్న ఎందుకు కొడుతున్నాడమ్మా? మరి…. ఆయన కూడా ఇంటికి అప్పుడప్పుడు త్రాగివస్తాడు; మనమీద అరుస్తాడు కదా! ఆయన్నెవరూ ఏమీ అనరా?”
“అంతే! ఆ రోజున మొదటిసారిగా కుట్టూరావ్ తన చిన్నబ్బాయి మీద కూడా చెయ్యి చేసుకున్నాడు.
ఆలోచన
నిన్ననే జరిగిన సంఘటన. నేను నా స్కూటర్ తో సహా ఒక ట్రాఫికంలో చిక్కుపడిపోయాను. బండిని మెల్లిగా చాలా మెల్లిగా నడుపుతూ వెళ్తున్నా, నాకెదురుగా ఒక గుర్రబ్బండి (టాంగా) ఉంది. దానిపై కొంతమంది స్కూల్ పిల్లలు కూర్చుని ఉన్నారు.
నిజానికి ఇతరుల సంభాషణ వారికి తెలియకుండా వినడం అనేది సభ్యత కాదు కదా! అయినా… ఇప్పటి నా పరిస్థితి ఎలా ఉందంటే…. ఆ పిల్లల మాటలు, వాటంతట అవే, నేను వినాలని అనుకోకపోయినా… నా చెవుల్లో పడసాగాయి.
వాళ్ళంతా 8-9 సంవత్సరాల వయసున్న ఉన్న పిల్లలు. ఓ పది మంది దాకా ఉండి ఉంటారు. “మా అన్న గడిచిన ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం వెదకుతూనే ఉన్నాడు. ఎం.ఏ. పాసయినాడు. ఓ గోల్డ్ మెడలు కూడా వచ్చింది అని ఒకడనగా – ఇంకొకడు – “అవును! అందుకే ఈ చదువులవల్ల మనకే లాభమూ ఉండదని, దండగని నేను అంటూ ఉంటాను. మా అన్న ఉన్నాడు. పదో క్లాసు తప్పాడు. అయితే నేం….? వాడి బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తోంది. ప్రతినెలా “దాదాగిరి”తో చాలా డబ్బు సంపాదిస్తాడు”. ఇప్పటికే చాలా డబ్బు వెనకేశాడు.”
బంగారు పతకం
రాజీవ్ కి ఇవ్వాళెందుకో పాతరోజులు గుర్తుకొస్తున్నాయం. బంగారు పతకాన్ని చేతిలోకి తీసుకోగానే వళ్ళంతా పులకరిస్తోంది. ఇదే పులకరింత అతనికి. ఆ పతకం ముఖ్య అతిథుల చేతులమీదుగా, చప్పట్ల మధ్య తీసుకుంటున్నప్పుడు కలిగింది. ఆ రోజున “మీ అందరికీ నువ్వు గర్వకారణం చాలూ! నీవల్ల కేవలం నీ గౌరవమే కాదు, ఈ విద్యాలయం ప్రతిష్ఠ కూడా రెట్టింపు అయింది” అని ఆ ముఖ్య అతిథి అన్న ప్రశంసావాక్యాలు తలచుకున్నప్పుడల్లా అతని ఛాతీ విస్తరించేది.
ఇది జరిగి పదేళ్ళయింది. ఈ పదేళ్ళలోనూ ఏమీ జరగలా. రాజీవ్ తండ్రి మరణించాడు, తల్లి మంచం పట్టింది. తనేమో ఈ రోజుకు ఉద్యోగంకై అన్వేషిస్తూనే ఉన్నాడు. ఇవాళైతే అమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. రాజీవ్ దగ్గర పాపం మందులు కొనేందుకు డబ్బులు లేవు. చివరికి ఇవాళ తన బంగారు పతకాన్ని అమ్మకానికి పెట్టాలని నిశ్చయించుకున్నాడు.
నేను మెల్లిగా ఆ టాంగా వెనకే వెళ్తున్నా. నాకు ఆశ్చర్యం, బాధ, జాలి, వాళ్లందరి మీదా కలిగాయి. అసలు వీళ్ళకి విద్య ఉద్దేశ్యం ఏమిటో, దానివల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా ఈ పిల్లలకి అర్థం అవుతున్నాయా అనే ఆలోచనలో మునిగిపోయాను.
మెడలో జేబులో పెట్టుకుని భారమైన గుండెలతో, ఇంట్లోంచి బయలుదేరాడు రాజీవ్. ఈ లోకంలో నీతి, న్యాయం, మానవత్వం, మంచితనాలు లేవని అనిపించింది అతనికి. బంగారు పతకం, అన్ని సర్టిఫికేట్లు, ప్రథమశ్రేణి కేరియరం. కాని ఉద్యోగం హుళక్కు. ఎక్కడా చేసేందుకు పనే దొరకలేదు.
ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడు తను బంగారు నగల దుకాణం దగ్గరికొచ్చాడో తెలియనే లేదు.
“ఏం కావాలి సార్! అనే పిలుపుతో అతడు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.
ఎదురుగుండా యజమాని. పెద్ద నగల దుకాణం ఉంది.
“నా బంగారు పతకం ఒకటి అమ్మాలనుకుంటున్నా సేఠ్ జా! అన్నాడు రాజీవ్.
సేఠ్ గారు మెడలం చేతిలోకి తీసుకున్నాడు. అటూ ఇటూ త్రిప్పాడు. ఏదో రాయికి దాన్ని సరసరా అటూ ఇటూ గీచాడు పరీక్షించాడు.
“బాబూ! నా టైం చాలా విలువైంది. ఇలా వృధా చెయ్యకు. ఇది బంగారం కాదు. పైన పూత ఉంది అంతే. దీని విలువ పది రూపాయలకన్నా ఎక్కువ చేయదు” అని అన్నారు.
వైరం
సాధారణంగా నేను తక్కువగా మాట్లాడుతా. అంతే మితభాషిని. మంచి చెడు అలవాట్లకు దూరంగా ఉంటా… ఇతరులతో కలవడాలు, రాసుకుపూసుకు తిరగడాలు కూడా తక్కువే. ఇలా దూరం దూరంగా ఉండడం వల్ల నా ప్రాణానికి హాయిగా ఉంటుంది.
నిన్న జరిగిన విషయం ఒకటి చెప్తా. మా ఆవిడతో కలిసి జమునాదాస్ గారింటికి వెళ్ళాను. కొద్దిసేపు పిచ్చాపాటీ అయ్యాక, మా వీధిలో ఎవరెలాంటివారు అన్నదానిపై చర్చ మొదలైంది. నేనైతే ఇక తప్పదన్నట్టుగా బలవంతంగా కూర్చుని వాళ్ళ మాటలు వింటూ ఉన్నా.
కొత్త వ్యక్తి అయిన బిహారీబాబు గురించి చర్చ మొదలైంది. జమునాదాస్ ఆయన్ని ఉతికి ఆరేస్తూ, చివరికి అతగాడికి అసలు సభ్యతంటే ఏమిటో తెలీదు. ఎప్పుడూ మనల్ని గుర్తించినట్టే ఉంటాడు. నమస్తే అంటే జవాబుచెప్పడు. ఎటో చూస్తూ ఉంటాడు. రాత్రిళ్లయితే మరీ బడాయిపోతాడు. మనల్నసలు చూడనే చూడడు. బహుశా మత్తులో మునిగి తేలుతూ ఉంటాడేమో”
హఠాత్తుగా నావైపు తిరిగి – “మీరేమంటారు డాక్టర్ గారూ!” అని అన్నాడు.
“ఇక నేను చెప్పక తప్పలేదు. బిహారీ బాబూ పాపం చాలా మంచివాడు. రాత్రిళ్ళు సరిగ్గా చూడలేదు – ఆయనకి విటమిన్ ‘ఏ’ లోపం ఉంది. నా దగ్గరే వైద్యం చేయించుకుంటున్నాడు. కొద్ది రోజుల్లో తగ్గి పోవచ్చు”,
“ఆరోగ్యవంతుడైపోతాడు” అన్నాను నేను.
తర్వాత మాటలన్నీ మరొకరి దోషాల్ని వెదకసాగాయి.
దర్యాప్తు
ప్రజల గగ్గోలు పెడుతూంటే భరించలేక మంత్రిగారు రూపాయల కుంభకోణం వ్యవహారంపై ఒక దర్యాప్తు కమిటీ వేయగా ఆ కమిటీ చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా తన పని ప్రారంభించి ఆ శాఖకి చెందిన అందరికన్నా పెద్ద అధికారిపై దర్యాప్తు ప్రారంభించారు. ఆయనకి ఒక పెద్దమనిషిగా, గొప్ప ధనికుడిగా పేరుంది. మొత్తానికి ఆయన ఆ ఐదు లక్షల కుంభకోణం నిర్దోషిగా బయటపడ్డాడు. తరువాత ఆయన సహచరుడి వంతు వచ్చింది. ఆయన ఈ మధ్యనుంచే గొప్పవాడైపోతున్నాడు. ఆయనో వకీలు కూడా తన తెలివితేటల్తో, ఆయన బయటపడ్డాడు. చివరికి ఆ విభాగం బంట్రోతు వంతు రాగా ఆ కమిటీ మంత్రిగారికి తన నివేదిక అందజేసింది.
మర్నాడు మంత్రిగారు వార్తాపత్రికల్లో చేసిన ప్రకటన ఇలా ఉంది.
“దర్యాప్తు సంఘం తన విచారణ పూర్తి చేసింది. వారి ప్రకటన ఇలా ఉంది-
మేము దర్యాప్తు చేసాక ఈ శాఖ బంట్రోతు ఈ కుంభకోణానికి మూలం అని తేలింది. మేము ఆ వేరుని మొదలంట తొలగించాం. కాండం, ఆకులు పూలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఇక వారు ఈ శాఖని ప్రగతి మార్గంలో పరుగులు పెట్టిస్తారు!!