Home కవితలు ‘నమో! నా దేశమా!!’.

‘నమో! నా దేశమా!!’.

by Peddurti Venkatadasu

నిప్పులు చిమ్ముతూ నింగికెగిసే ఉపగ్రహ  ప్రయోగం మంచి తిథి ఎంపిక తో మనదైన నమ్మకం తో

విజ్ఞాన శాస్త్ర కేతనాన్నెగురవేస్తున్నది

ఆధ్యాత్మిక మహిమకు,మన సంఖ్యాశాస్త్ర శక్తికీ ఇది

ఎదురులేని  నిదర్శనం

ప్రపంచవ్యాప్తంగా

ప్రచండ వేగంతో

ప్రజాభిప్రాయమై వెలుగుతున్నది

ప్రాణ రక్షణ పాత్రోల్మీనమై

ఆరోగ్యానికిస్తున్న

ప్రాముఖ్యత

ఎన్ని కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నా

మన ఆధ్యాత్మికత అంటుకట్టుకున్నా

యోగా విశ్వవ్యాప్తంగా జనాదరణ పొందిన యుక్తి కి

మన భక్తికి ఇది బలమైన తార్కాణం!

అవనిని జనని గా కొలిచే దేశంలో

పారే నీరైనా

పీల్చే గాలైనా

భక్తితో

భగవంతుని ప్రసాదమని

ఇక్కడి

జనం గుండెల్లో గూడు కట్టుకున్నది నమ్మకం!

అదే మనకు అనువంశికంగా అబ్బిన గుణం

అందుకే మాది కర్మభూమి అంటున్నారు ఈ దేశజనం!

నిండైన ఈ భావనతోనే సౌభ్రాతృత్వం

పరిఢవిల్లుతుంది

ఇక్కడ అనుదినం!!!

  ——– పెద్దూరి వెంకటదాసు

You may also like

Leave a Comment