అది నిన్నటి నీటిని,
ఈనాటి కన్నీటిని
పీల్చుకొని ఊపిరి పోసుకుంది.
ఆటంకాలని చీల్చుకొని,
చీకటి తొడుగుని
విప్పుకొని మొలకెత్తింది.
కొండగాలి కొంటెగా
హార్మోనియం వాయిస్తుంటే
అడుగుల్లో అమ్మోనియం నైట్రేట్
రైట్! రైట్! అంటుంటే
శ్రవణానందకరంగా
ఆకులు అల్లరి చేస్తాయి
నయన మనోహరంగా
కొమ్మలు ఊయలలూగుతాయి
కిరణజన్య సంయోగ క్రియతో
పరిసరమంతా
పత్రహరిత నర్తనమౌతుంది.
దాని వేర్లలో
నల్లని జాడలు ఇంకా ఉన్నాయి.
అయినా
ఆత్మీయతా వెలుతురు సోకినప్పుడల్లా
ఆకుపచ్చని ఆశలను కలగంటుంది
2 comments
కవిత చాలా బాగుంది.ముగింపు వాక్యాలు కవితను బాగా ఎలివేట్ చేశాయి.మంచి కవితను అందించిన మీకు అభినందనలు 💐💐💐
కవిత బాగుంది.
ఆకుపచ్చని ఆశలను కలగంటుంది💕