Home కవితలు ఆమె..!

ఆమె..!

by Korada Appala Raju

అండాన్ని పిండంగా మార్చి

గండాలెన్నో అధిగమించి

రుధిరాన్ని చిందించి..

మరణపు అంచున నిలబడి

నన్ను నేలకుపరిచయంచేసింది ఆమె..!

క్షీరాన్నిపట్టి.. సారాన్ని పెంచి..

భారాన్ని మోసి..

బ్రతుక్కిబాసటగా నిలిచింది ఆమె.!

ఉషోదయానికి సలాం కొట్టి

వెలుగు దివిటి చేత పట్టి

వంటింటి గిన్నెల్లో మనోహరమైనసంగీతాన్ని ఆలపిస్తుంది.

ఎద గదిలో ఉబికిన లావా

అక్ష ద్వయం

వెంటపరుగులెడుతుంటే..

చీర కొంగులో

దుఖఃసంద్రాన్ని దాచుకున్న

స్థితప్రజ్ఞతకు చిరునామా ఆమె..!

తన ఆశల్ని త్యాగం చేసి

ఆకాంక్షల్ని  ఆవిరి చేసి

రక్తం పంచిన గువ్వలకు

వెండి బువ్వనందించేందుకు

ఎన్నోవెన్నెల రాత్రుల్నికోల్పోయింది ఆమె.!

బిడ్డల్ని అడ్డాల్లో మోసి

గడ్డాలు వచ్చాక మురిసి

సరి జోడు గువ్వతోజతకలిపి

మొగ్గతొడిగిన

తన  వంశాoకురాన్ని చూసి

పుచ్చ పువ్వులా

స్వచ్చంగానవ్వుతుందిఆమె.

డాలర్ల వేటలో పడి

రెక్కలొచ్చిన గువ్వలు

దిక్కుల్లోకి ఎగిరిపోయి

వృద్ధ విహంగాల గూట్లో తనని బంధిస్తే..

రెక్కలు తెగినజటాయువులా రోదిస్తూ..

కొన్ని మాటల మూటలువిప్పి

మమతలుపంచే తోడు కోసం

బిక్కుబిక్కుమంటూ

దిక్కులేని పక్కిలా

ఎదరు చూస్తుంది ఆమె.!!

You may also like

Leave a Comment