Home అనువాద సాహిత్యం “తెలంగాణ బతుకమ్మ పాట”

“తెలంగాణ బతుకమ్మ పాట”

by Sabbani Laxminarayana

( అప్పటి పది జిల్లాల వెనుకబాటు తనాన్ని తెలియచేస్తూ , 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరి రాసిన బతుకమ్మ పాట )

రచనా కాలం : 20-6- 2001 నుండి 23-6- 2001)               

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

హరి హరి ఓ రామ ఉయ్యాలో హరియ బ్రహ్మ దేవ ఉయ్యాలో

నెత్తి మీది సూర్యుడా ఉయ్యాలో నెల వన్నెకాడ ఉయ్యాలో

పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకోమారుడా ఉయ్యాలో

ముందుగా నినుదల్తు ఉయ్యాలో ముక్కోటి పోచవ్వ ఉయ్యాలో

అటెన్క నినుదల్తు ఉయ్యాలో అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో 

భక్తితో నినుదల్తు ఉయ్యాలో బాసర సరస్వతి ఉయ్యాలో

ఘనంగాను గొల్తు ఉయ్యాలో గణపతయ్య నిన్ను ఉయ్యాలో

ధర్మపురి నరసింహ ఉయ్యాలో దయతోడ మముజూడు ఉయ్యాలో

కాళేశ్వరం శివ ఉయ్యాలో కరుణతో మముజూడు ఉయ్యాలో

సమ్మక్క సారక్క ఉయ్యాలో సక్కంగ మముజూడు ఉయ్యాలో

బద్రాద్రి రామన్న ఉయ్యాలో  భవిత మనకు జెప్పు ఉయ్యాలో

యాదితో నినుదల్తు ఉయ్యాలో యాదగిరి నరసింహ ఉయ్యాలో

కోటి లింగాలకు ఉయ్యాలో కోటి దండాలురా ఉయ్యాలో

కోర్కెతో నినుదల్తు ఉయ్యాలో కొమురెల్లి మల్లన్న ఉయ్యాలో

కొండగట్టంజన్నఉయ్యాలో  కోటి దండాలురా ఉయ్యాలో

కోర్కెమీర దల్తు ఉయ్యాలో కొత్తకొండీరన్న ఉయ్యాలో 

ఎరుకతో నినుదల్తు ఉయ్యాలో ఎములాడ రాజన్న ఉయ్యాలో

ఓర్పుతో నినుదల్తు ఉయ్యాలో  ఒదెలా మల్లన్న ఉయ్యాలో

ఐలేని మల్లన్న ఉయ్యాలో ఐకమత్యమియ్యి ఉయ్యాలో

…………………………………………….

నట్టనడిమి సీమ ఉయ్యాలో నా తెలంగాన ఉయ్యాలో 

నెత్తురోడింది ఉయ్యాలో  నేల తెలంగాణ ఉయ్యాలో 

తల్లడిల్లింది ఉయ్యాలో  తల్లి తెలంగాణ ఉయ్యాలో 

బతుకులో చీకట్లు ఉయ్యాలో భవిత కష్టమాయే ఉయ్యాలో 

పల్లె పల్లెను జూడు ఉయ్యాలో పట్నవాసం చూడు ఉయ్యాలో 

కరువులిక్కడచ్చె ఉయ్యాలో  కష్టాలు వచ్చెను ఉయ్యాలో 

సదువులూ సందెలూ ఉయ్యాలో  సక్కంగ లేకుండె ఉయ్యాలో 

బంజరు భూముల్తో ఉయ్యాలో  బతుకు భారమయ్యె ఉయ్యాలో 

కూలీల బతుకుల్లో ఉయ్యాలో  కూటిక్కస్టమచ్చేఉయ్యాలో 

కన్నీటి కావ్యాల ఉయ్యాలో  కడలి తెలంగాణ ఉయ్యాలో 

ఆర్తితో బతుకులూ ఉయ్యాలో ఆగమయ్యె చూడు ఉయ్యాలో 

మంజీర మానేర్లు ఉయ్యాలో  మన మధ్య నుండగా ఉయ్యాలో 

మూసీలు మున్నేర్లు ఉయ్యాలో  ముచ్చ్చటగా పారే ఉయ్యాలో 

గోదారి క్రిష్ణలూ ఉయ్యాలో గొప్పగానూ పారే ఉయ్యాలో 

సింగరేణి గడ్డ ఉయ్యాలో  సిరులు ఉన్న గడ్డ ఉయ్యాలో 

నల్ల బంగారమూ ఉయ్యాలో నాణ్యమైన బొగ్గు ఉయ్యాలో 

షాబాద్ రాళ్ళలో ఉయ్యాలో  సక్కనీ ఈ సీమ ఉయ్యాలో 

పాడి పంటలందు ఉయ్యాలో  పాటైన నేలరా ఉయ్యాలో 

వనరులన్నీ ఉన్న ఉయ్యాలో వజ్రాల గడ్డరా ఉయ్యాలో 

అన్ని ఉన్ననేమి ఉయ్యాలో  అంతటా కరువాయే ఉయ్యాలో 

కాలమహిమ చూడు ఉయ్యాలో  కష్ట కాలమచ్చె ఉయ్యాలో 

………………………… 

అదిలాబాదు జూడు ఉయ్యాలో   అడవి తల్లిని చూడు ఉయ్యాలో  

గోండుల  బతుకుల్లో ఉయ్యాలో   గోడులను జూడు ఉయ్యాలో  

శ్రీరాం సాగర్లు ఉయ్యాలో   సిన్నబోతున్నాయి ఉయ్యాలో  

బాసర క్షేత్రం ఉయ్యాలో   భాసిల్లిన చోట ఉయ్యాలో  

సదువు సందెలు లేక ఉయ్యాలో  సట్టువడే బతుకు  ఉయ్యాలో   

సర్ సిల్క్ నేతలూ ఉయ్యాలో   సరిపోని బతుకులూ ఉయ్యాలో  

అదిలాబాదు జూడు ఉయ్యాలో అన్నిట్లో వెనుకుండె ఉయ్యాలో  

అంగట్ల అన్ని ఉయ్యాలో అల్లున్నోట్లే శని ఉయ్యాలో  

అమ్మవోతే అడవి ఉయ్యాలో  కొనబోతే కొరివి ఉయ్యాలో  

……………………………..

చక్కెర పొలాలు ఉయ్యాలో  సక్కంగ ఉండంగ ఉయ్యాలో    

నిజాం షుగర్లు ఉయ్యాలో  నిలువ కష్టమాయే ఉయ్యాలో  

ఈ నేల, ఈ నీరు ఉయ్యాలో ఇక్కడీ వారియీ ఉయ్యాలో  

జగ్గర్త మరి లేక ఉయ్యాలో జాగ లెట్లబాయే ఉయ్యాలో  

పని పాటల్లేక ఉయ్యాలో  పాడువడే బతుకు ఉయ్యాలో  

దుబాయి, మస్కట్లు ఉయ్యాలో    దూరంగ పోవట్రి ఉయ్యాలో  

వ్యాధులా బాధలూ  ఉయ్యాలో  వారనుభవించిరీ ఉయ్యాలో   

ఇందూరు భారతీ ఉయ్యాలో ఇటు జూడు తల్లి ఉయ్యాలో  

నిజాంబాదలూ ఉయ్యాలో  నిట్టూర్పు బతుకులూ ఉయ్యాలో  

బీడీల బతుకులూ ఉయ్యాలో  బీడైన బతుకులూ ఉయ్యాలో  

………………………………….

కైనారం జూడు ఉయ్యాలో కష్టాల ఇల్లు ఉయ్యాలో 

రాజకీయపు జిల్ల ఉయ్యాలో రాణించే జిల్ల ఉయ్యాలో 

కరినారం జిల్ల ఉయ్యాలో కదలికున్న జిల్ల ఉయ్యాలో 

మానేరు పరుగులూ ఉయ్యాలో  మరి చిన్నవైపాయే ఉయ్యాలో 

సిరిసిల్ల బతుకులూ ఉయ్యాలో  సిరి  లేని బతుకులు ఉయ్యాలో 

ఆకలీ చావులూ ఉయ్యాలో  ఆత్మహత్యలు చూడు ఉయ్యాలో 

వలస బతుకులు జూడు ఉయ్యాలో  వట్టిపోయిన బతుకు ఉయ్యాలో 

బొంబాయి భీమండి ఉయ్యాలో  బోసిపోయిన బతుకు ఉయ్యాలో 

నాగళ్ళు పట్టేటి ఉయ్యాలో  నా రైతులార ఉయ్యాలో  

కూలికి నాలికీ ఉయ్యాలో  కూడ వెళ్ళుటాయె ఉయ్యాలో 

బతుకులూ బరువాయె ఉయ్యాలో  భవిత కష్టమాయే ఉయ్యాలో 

సింగరేణి బొగ్గు ఉయ్యాలో  సిరిగల్ల సీమరా ఉయ్యాలో 

ఎన్టిపిసీలు ఉయ్యాలో  ఎఫ్ సి ఐ కంపిన్లు ఉయ్యాలో 

ఎఫ్ సి ఐ కంపిన్లు ఉయ్యాలో ఎమైపాయెరా ఉయ్యాలో 

కరెంటు పుట్టిల్లు ఉయ్యాలో కరువెట్ల వచ్చింది ఉయ్యాలో 

అంతర్గాం మిల్లులూ ఉయ్యాలో  అంతరించి పాయే ఉయ్యాలో 

సిరిసిల్ల స్పిన్నింగ్ ఉయ్యాలో  సిక్కుల్లో ఉండే ఉయ్యాలో 

రామగుండమ్ములూ  ఉయ్యాలో  రాణించక పాయె ఉయ్యాలో 

గోదారి దారుల్లో   ఉయ్యాలో గోసకచ్చె బతుకు ఉయ్యాలో 

కన్నీళ్ళ బతుకాయె ఉయ్యాలో కష్టాల బతుకాయె  ఉయ్యాలో 

………………………………  

ఒరంగల్లు జూడు ఉయ్యాలో  ఒర్పుతోని వినుము ఉయ్యాలో

సమ్మక్క సారక్క ఉయ్యాలో సత్యమైన సీమ ఉయ్యాలో

బమ్మెర పోతనల ఉయ్యాలో భవ్యమైన సీమ ఉయ్యాలో

కాకతీయుల జూడు ఉయ్యాలో కావ్యసీమల జూడు ఉయ్యాలో

కాకతీయుల కోట ఉయ్యాలో కడపటీ చిహ్నము ఉయ్యాలో

పాకాల రామప్ప ఉయ్యాలో పారుదలను జూడు ఉయ్యాలో  

ఇచంపల్లిలూ ఉయ్యాలో ఇప్పుడే మంటున్నయి ఉయ్యాలో

కాకతీయులనాటి ఉయ్యాలో కాలమేది నేడు ఉయ్యాలో

పరిశ్రమలేవి ఉయ్యాలో పని పాట లేవి ఉయ్యాలో

ఆజంజాహి మిల్లు ఉయ్యాలో అంతరించిపోయే  ఉయ్యాలో 

………………………………..

భద్రాద్రి రామన్న ఉయ్యాలో భవ్యమైన సీమ ఉయ్యాలో

పాల్వంచల చూడు ఉయ్యాలో పసిడి వెలుగెవరికీ ఉయ్యాలో

కొత్తగూడెం చూడు ఉయ్యాలో  కొత్త వెలుగుల జూడు  ఉయ్యాలో

సింగరేణి గనుల ఉయ్యాలో సిరులెటు బాయెరా ఉయ్యాలో 

బొగ్గుపుట్టిన చోట ఉయ్యాలో బోసిపోయిన బతుకు ఉయ్యాలో

ఎండినా బతుకుల్తో ఉయ్యాలో ఎల్లదీసుకస్తే ఉయ్యాలో

మొండి కుంటలతోటి ఉయ్యాలో

మొత్తుకుంటుంటె ఉయ్యాలో  ఖమ్మంమెట్టు సీమకు ఉయ్యాలో

కలుసేతులచ్చె ఉయ్యాలో  గోదారి దారుల్లో ఉయ్యాలో

కొత్తవెలుగులచ్చె ఉయ్యాలో అయ్యయ్యో ఓ రామ ఉయ్యాలో

హరియ బ్రహ్మ దేవ ఉయ్యాలో    

………………………………….

నట్టనడిమి సీమ ఉయ్యాలో నల్లగొండను జూడు ఉయ్యాలో 

కమ్యునిస్టుల గడ్డ ఉయ్యాలో కష్టజీవుల గడ్డ ఉయ్యాలో

నందికొండ పేరు ఉయ్యాలో నాగార్జున సాగర్ ఉయ్యాలో      

నాగార్జున సాగర్ ఉయ్యాలో నల్లగొండలుంటె ఉయ్యాలో 

కటకట నీళ్లకూ ఉయ్యాలో కరువెట్ల వచ్చేరా ఉయ్యాలో

తాగునీరు లేక ఉయ్యాలో తండ్లాట కావట్టె ఉయ్యాలో

ఫ్లోరైడ్ నీళ్ళల్లో ఉయ్యాలో  పాడయ్యెను బతుకు ఉయ్యాలో     

సాగునీళ్ళ కరువు ఉయ్యాలో  సరిపోని బతుకులు ఉయ్యాలో

కష్ట కాలమచ్చె ఉయ్యాలో  కరువు కాలమచ్చె ఉయ్యాలో 

పరుగులిడే కృష్ణమ్మ ఉయ్యాలో పక్షపాతమేమి ఉయ్యాలో 

……………………………………

పాలమూరి కూలి ఉయ్యాలో  పాపమెవరిది జెప్పు ఉయ్యాలో

ఆకలి చావులకు ఉయ్యాలో ఆలుబిడ్డలనమ్మి ఉయ్యాలో

ఆలుబిడ్డలనమ్మి ఉయ్యాలో ఆర్తితో బతికిరి ఉయ్యాలో 

పైసల్లేక బతుకు ఉయ్యాలో పసిపిల్లలను కూడా ఉయ్యాలో

యాతనలు బడి ఉయ్యాలో  యంత్రానికి బలి ఇచ్రి ఉయ్యాలో

అయ్యయ్యో  బతుకు ఉయ్యాలో ఆగమైన బతుకు ఉయ్యాలో 

కష్టజీవుల బతుకు ఉయ్యాలో కడివెడూ కన్నీళ్లు ఉయ్యాలో 

తినడానికి తిండి ఉయ్యాలో తీరుగా లేపాయె ఉయ్యాలో

తాగడానికి నీరు ఉయ్యాలో  తనదే కాదాయె ఉయ్యాలో 

పారేటి కృష్ణమ్మ ఉయ్యాలో  పాలేది తల్లి ఉయ్యాలో 

……………………………….

మెదక్ సీమ జూడు ఉయ్యాలో మెతుక్కు కరువాయె ఉయ్యాలో

మేతమేసే గొడ్లకు ఉయ్యాలో మేతనే కరువాయె ఉయ్యాలో

ఎడ్ల గొడ్ల బతుకు ఉయ్యాలో  ఎల్లనీ బతుకాయె ఉయ్యాలో

కోతకూ గోదల్ని ఉయ్యాలో  కొంటబోవట్టిరి ఉయ్యాలో 

గోమాతల జూడు ఉయ్యాలో  గోపాలుల జూడు ఉయ్యాలో 

పాడిపంటల జూడు ఉయ్యాలో పశుపక్షుల జూడు ఉయ్యాలో 

మంజీర సాహితీ ఉయ్యాలో మరి ఏమి జెప్పు ఉయ్యాలో 

పటాన్ చెరువులూ ఉయ్యాలో పర్యవరణం జూడు ఉయ్యాలో

కాలుష్యం కోర ఉయ్యాలో  కాటేస్తున్నదీ ఉయ్యాలో 

ఈ నేల ఈ గాలి ఉయ్యాలో ఈతి బాధలు జూడు ఉయ్యాలో

………………………………….

రంగారెడ్డి జిల్ల ఉయ్యాలో  రంగేమిటయ్య ఉయ్యాలో

బతుకమ్మ కుంటలా ఉయ్యాలో  బతుకుదెరురువులేవి ఉయ్యాలో

మొండికుంటలన్ని ఉయ్యాలో మొదటికే పోయినయి ఉయ్యాలో

ఎండినా చెరువులూ ఉయ్యాలో ఎక్కడికి పాయె ఉయ్యాలో

పల్లెలన్ని పోయి ఉయ్యాలో పట్నమూ పెరిగింది ఉయ్యాలో

ఊర చెరువులన్నీ ఉయ్యాలో ఊడ్చుక పోయినయి ఉయ్యాలో

రియల్ ఎస్టేట్ల ఉయ్యాలో రీతి ఏమి చూడు ఉయ్యాలో 

పట్టాణా భూములూ ఉయ్యాలో  పట్టుదప్పిపాయె ఉయ్యాలో 

భూబకాసురులు ఉయ్యాలో భూమి చెరబట్టిరి ఉయ్యాలో 

ఈ భూములెవరియి ఉయ్యాలో ఈ జాగ లెవరియి ఉయ్యాలో  

భూములూ బాయెనూ ఉయ్యాలో భుక్తి కూడా బాయె ఉయ్యాలో  

కంపిన్లు పెట్టిండ్రు ఉయ్యాలో  కాలుష్యం నింపిండ్రు ఉయ్యాలో

ఉన్న ఉద్యోగాల్లో ఉయ్యాలో  ఊరివారియెన్ని ఉయ్యాలో

కాలుష్యం జూడు ఉయ్యాలో  కష్టాలు వచ్చెను ఉయ్యాలో

జీడిమెట్ల జూడు ఉయ్యాలో  జీవులా బతుకులు ఉయ్యాలో

రోగాల బారినా ఉయ్యాలో రోధించె బతుకులూ ఉయ్యాలో 

పొగ గొట్టాలలో ఉయ్యాలో  పొగచూరె బతుకులూ ఉయ్యాలో

అల్ కబీర్ల ఉయ్యాలో అంగళ్లు చూడు ఉయ్యాలో 

పశువులా రక్తం ఉయ్యాలో  పారుతుండె చూడు ఉయ్యాలో

ఎర్రని నీళ్ళల్లో ఉయ్యాలో ఏమి బతుకులివిర ఉయ్యాలో 

…………………………………..

మన పట్నం చూడు ఉయ్యాలో మన హైదరాబాద్ ఉయ్యాలో 

సికింద్రబాద చూడు ఉయ్యాలో సిత్రములు చూడు ఉయ్యాలో

మన జంట నగరాల్లో ఉయ్యాలో మనకేమున్నదీ ఉయ్యాలో

కులీ కుతుబ్ షాలు ఉయ్యాలో కుతుహలం తోడ ఉయ్యాలో

పల్లె పల్లెను గొట్టి ఉయ్యాలో  పట్నమూ గట్టిరి ఉయ్యాలో

నిజాం రాజులా ఉయ్యాలో  నిర్మాణం తోడ ఉయ్యాలో

నాల్గువందలేళ్ళ ఉయ్యాలో నవీన పట్నమూ ఉయ్యాలో

బద్ది పోచమ్మలూ ఉయ్యాలో బతుకమ్మ పండుగలు ఉయ్యాలో 

……………………………………     

హైదరాబాద్ ను చూడు ఉయ్యాలో హైదరబాధను చూడు ఉయ్యాలో

ఆఫీసుల జూడు ఉయ్యాలో  అంతటాను జూడు ఉయ్యాలో 

తెలంగాణా ఉయ్యాలో  తెరమరుగేనురా ఉయ్యాలో

కార్ఖాన్ల జూడు ఉయ్యాలో కచ్చీర్ల జూడు ఉయ్యాలో

మన పట్నం జూడు ఉయ్యాలో మనకేమిస్తుంది ఉయ్యాలో

ఆకాశవాణీలు ఉయ్యాలో

Telangana Bathukamma Song Telugu Origin : Smt Sabbani Sharada English Translation : Dr.Sabbani Laxminarayana
( Telangana Bathukamma song, written for the formation of Telangana state, showing the backwardness of the 10 districts of that time.
Written in the Period of 20-6- 2001 to 23-6- 2001)
Rama Rama Rama Uyyalo Ramane Sri Rama Uyyaalo. Hari Hari O ! Rama Uyyaalo. Hariya Brahma Deva Uyyaalo
Sun on the head Uyyaalo
He gives light Uyyaalo Forehead moon Uyyaalo My little son Uyyaalo Mukkoti Poshavva Uyyaalo Worship you first Uyyaalo Then worship you Uyyaalo Mother Parvathamma Uyyaalo
Pray with devotion Uyyaalo Bhasara Saraswati Uyyaalo
We worship you greatly Uyyaalo
Lord Ganapathi Uyyaalo
Dharmapuri Narasimha Uyyaalo
Show your Kindness Uyyaalo
Kaleswaram Shiva Uyyaalo
Show your kindness Uyyaalo Sammakka Sarakka Uyyaalo
Serve your blessings Uyyaalo Badradri Ramayya Uyyaalo
He tells our future Uyyaalo
Yadagiri narasimha Uyyalo
We pray with memory Uyyaalo
Koti Lingaala Uyyaalo One crore prayers Uyyaalo
Komrelli Mallanna Uyyaalo
We pray with desire Uyyaalo Kondagattu Anjanna Uyyaalo
Crores of prayers Uyyaalo Kotthakonda Veeranna Uyyaalo
Crores of prayers Uyyaalo
Vemulada Rajanna Uyyaalo
We pray with memory Uyyaalo
Odela Mallanna Uyyaalo
We pray with patience Uyyaalo Aileni Mallanna Uyyaalo
Give us unity Uyyaalo. …………………………………………………………

Midst of the country Uyyaalo
Our Telangana Uyyaalo.
Drenched in blood Uyyaalo.
Soil Telangana Uyyaalo.
It was troubled Uyyaalo.
Mother Telangana Uyyaalo.
There is darkness Uyyaalo. Future is difficult Uyyalo.
Look at the villages Uyyaalo.
Look at the cities Uyyaalo. Drought areas Uyyaalo.
Difficult lives Uyyaalo Education here Uyyaalo Enormous troubles Uyyaalo Lands are barren Uyyaalo Life is burdensome Uyyaalo
Lives of laborers Uyyaalo
Life long troubles Uyyaalo
Tears of poetry Uyyaalo
Land of Telangana Uyyaalo
Live with hardships Uyyaalo
Difficulties followed Uyyaalo
Manjeera, Maners Uyyaalo
Rivers here are Uyyaalo Moosees, Munners Uyyaalo
Rivers are flowing Uyyaalo Godavari, Krishna Uyyaalo Great rivers here Uyyaalo Singareni land Uyyaalo Land of wealth Uyyaalo Black gold it is Uyyaalo Quality coal it Uyyaalo Shabad stones Uyyaalo
Smooth and fine Uyyaalo Farm lands here Uyyaalo
Fertile lands Uyyaalo Land of resources Uyyaalo Land of treasures Uyyaalo
Despite everything Uyyaalo Drought problems here Uyyaalo Different problems Uyyaalo Difficult lives Uyyaalo …………………………………………………………… Adilabad life Uyyalo Mother of forest Uyyalo
Lives of Gonds Uyyalo
Difficult times Uyyalo
Sri Ram Sagar Uyyalo
Water scarcity Uyyalo
Basara temple Uyyalo Mother Saraswati Uyyaalo
Studies no here Uyyalo
Backwardness Uyyalo
Sir silk workers Uyyalo
Problematic live Uyyalo
Adilabad life Uyyalo
All is backward Uyyalo
All resources Uyyalo
Though it backward Uyyalo
Life of forest Uyyalo
How can they live Uyyalo
…………………………….
Sugar fields Uyyalo
Fertile lands Uyyalo
Nizam Sugars Uyyalo
Why not stand up Uyyalo
This soil, this water Uyyalo
Belongs to our Uyyalo
With our ignorance Uyyalo
We lost lands Uyyalo
No work no pay Uyyalo
Poverty life Uyyalo
Dubai, Muscat Uyyalo
They are going Uyyalo
Diseases, problems Uyyalo They have faced Uyyalo Indoor Bharathi Uyyalo Look here once Uyyalo Nizambad problems Uyyalo
Real hardships Uyyalo
Live with beedees Uyyalo
Health Problems Uyyalo
……………………………….
Karimnagar life Uyyalo
House of hardships Uyyalo
Political district Uyyalo
Flourishing district Uyyalo
Karimnagar district Uyyalo Active district Uyyalo
Maneru river Uyyalo
Little flowing Uyyalo Long live Sirisilla Uyyalo
Where is your wealth Uyyalo
Hungry deaths Uyyalo Suicide lives Uyyalo
Migrant lives Uyyalo
How they survive Uyyalo Bombay Bhimandi Uyyalo
They are going Uyyalo
Farmer brothers Uyyalo
Where is plowing Uyyalo You are doing Uyyalo
Daily wage work Uyyalo
Life is very heavy Uyyalo Future is difficult Uyyalo
Singareni Coal Uyyalo
Black gold it is Uyyalo
NTPC Uyyalo
FCI company Uyyalo
FCI company Uyyalo
Where has gone Uyyalo
Electricity birthplace Uyyalo
Why draught here Uyyalo
Anthargam mills Uyyalo
Why not exist Uyyalo
Sirisilla spinning Uyyalo
Where has gone Uyyalo
Ramagundams Uyyalo
Progress nothing Uyyalo
Godavari ways Uyyalo
Growth nothing Uyyalo Life of tears Uyyalo Life with hardships Uyyalo
……………………………… Look at Warangal Uyyalo Listen patiently Uyyalo
Sammakka Sarakka Uyyalo
Truthful story Uyyalo
Bammera Pothana Uyyalo
Poet of the land Uyyalo Kakateeya dynasty Uyyalo
Art and literature Uyyalo
Kakateeya fort Uyyalo
Heritage symbol Uyyalo Pakala Ramappa Uyyalo
Irrigation system Uyyalo
Ichampalli Uyyalo
What it saying Uyyalo
Kakatiya glory Uyyalo
Where is it now Uyyalo
Where are the Industries Uyyalo
There is no work Uyyalo
Azam jahi Mill Uyyalo
Where is it now Uyyalo
……………….
Bhadradri Ramanna Uyyalo Tells our future Uyyalo
Look at the Palvancha Uyyalo
To whom that lights Uyyalo Look at the Singareni Uyyalo To whom that new lights Uyyalo Singareni Mines Uyyalo
Where is the wealth Uyyalo
Coal birthplace Uyyalo Where is the progress Uyyalo Life with dryness Uyyalo They are living Uyyalo Land of dried ponds Uyyalo Pollution problems Uyyalo Godavari ways Uyyalo New migrations Uyyalo Hari Hari O Rama Uyyalo Hari O ! Brahma Deva Uyyalo. …………………………………………..
In the midst Uyyalo Look at Nalgonda Uyyalo.
Communists here Uyyalo.
Land of sacrifice Uyyalo.
Nandikonda name Uyyalo.
Nagarjuna Sagar Uyyalo
Nagarjuna Sagar Uyyalo
It is in Nalgonda Uyyalo
Water problem Uyyalo. Why is there Uyyalo.
Drinking water Uyyalo.
It is difficult Uyyalo.
Fluoride water Uyyalo.
Health problems Uyyalo.
Irrigation water Uyyalo.
Inadequate level Uyyalo
Difficult times Uyyalo
Drought areas Uyyalo Flowing river Krishna Uyyalo What would you say Uyyalo …………………………….. Palamooru labour Uyyalo
What is the curse Uyyalo
Starved deaths Uyyalo
Selling babies Uyyalo
Selling babies Uyyalo
Miserable lives Uyyalo With in the poverty Uyyalo They sold the infants Uyyalo What is the agony Uyyalo Sacrificed to machine Uyyalo What a pity life Uyyalo Collapsed life Uyyalo Life of the poor Uyyalo
Tears always Uyyalo
Food for the stomach Uyyalo Not enough there Uyyalo
Drinking Water Uyyalo It is also problem Uyyalo
Flowing Krishna Uyyalo Where is the share Uyyalo . …………. …. Medak District Uyyalo. Food shortage Uyyalo
For grazing cows Uyyalo
Fodder shortage Uyyalo Bulls and oxen Uyyalo Survive Problems Uyyalo Cattle slaughter Uyyalo
Here it is Uyyalo
Look at the cattle Uyyalo
Look at the herdsmen Uyyalo
Dairy farming Uyyalo Cattle and birds Uyyalo Manjira Sahithi Uyyalo
What would say Uyyalo
Patan ponds Uyyalo
See environment Uyyalo
Pollution bite Uyyalo
Killing lives Uyyalo
This soil this wind Uyyalo
Draught everywhere Uyyalo. ……………….. Ranga Reddy District Uyyalo What is it style Uyyalo.
Bathukamma tanks Uyyalo.
Where have gone Uyyaalo Mondi tanks Uyyalo
Where have gone Uyyalo
Dried tanks Uyyalo Where have gone Uyyalo
Villages Merged Uyyalo
City has grown up Uyyalo
Villages tanks Uyyalo
Disappeared now Uyyalo
Real estates Uyyalo
What is their style Uyyalo
Urban lands Uyyalo
We have lost Uyyalo
Land grabbing Uyyalo We lost lands Uyyalo
Who owns lands Uyyalo Who are the owners Lands have gone Uyyalo
Livelihood gone Uyyalo Factories came Uyyalo Pollution also Uyyalo
How many jobs Uyyalo
Here people got Uyyalo
Look at the pollution Uyyalo
Health Problems Uyyalo
Look at Jeedimetla Uyyalo
Living beings Uyyalo
Diseases spread Uyyalo
Polluted life Uyyalo
Smoke with chimneys
Health problems Uyyalo Al Kabir Uyyalo
Look at the scene Uyyalo Cattle blood Uyyalo
See it flowing Uyyalo
Ground water red Uyyalo
How can they survive Uyyalo
………………………………….. Look at our city Uyyalo
Our Hyderabad Uyyalo
Look at Secunderabad Uyyalo
Look it’s manner Uyyalo
In our twin cities Uyyalo
What we have Uyyalo Qutub shahis Uyyalo With their interest Uyyalo They built this city Uyyalo With sweat and blood Uyyalo Of Telangana people Uyyalo Nizam Kings Uyyalo They built this city Uyyalo Four hundred years Uyyalo It is the new city Uyyalo Baddi Pochammas Uyyalo Bathukamma festivals Uyyalo Look at the Hyderabad Uyyalo Look it’s problems Uyyalo Look into offices Uyyalo Look all around Uyyalo Telangana Uyyalo Not in position Uyyalo Look at the factory Uyyalo Look at the office Uyyalo Our Hyderabad Uyyalo What is ours Uyyalo Akashavanis (AIR) Uyyalo Where opportunities Uyyalo Doora Darshans Uyyalo Maintained distance Uyyalo Look at the Cinemas Uyyalo See the strange things Uyyalo Look at language Uyyalo Look our slang Uyyalo Making fun Uyyalo Joking use Uyyalo Alas ! O Rama Uyyalo. Hari O ! Brahma Deva Uyyalo Villains language Uyyalo It is ours Uyyalo Making jokes Uyyalo Look at the scenes Uyyalo Look at papers Uyyalo See the partiality Uyyalo Look at the TVs Uyyalo See their variety Uyyalo Telangana ours Uyyalo See it’s greatness Uyyalo Why discrimination Uyyalo Could you explain Uyyalo Literary editions Uyyalo Anthologies Uyyalo Telangana soil Uyyalo Misplaced life Uyyalo Where are the Singers Uyyalo Where is the Voice Uyyalo Award, committees Uyyalo How many for us Uyyalo …………….…………………..
Not only in Andhra Uyyalo. But also America Uyyaalo
TANAs , ATAs Uyyaalo Who is ours Uyyalo
In all fields Uyyalo
We are backward Uyyalo
Alas ! O Rama Uyyalo
Hari O Brahma Deva Uyyalo
See the Politics Uyyalo
It is cunning Uyyalo
What can we say Uyyalo
How many they are Uyyalo
Language Telangana Uyyalo
Live in Telangana Uyyalo
It is justice Uyyalo
Telangana formation Uyyalo
For Whom benefit it Uyyalo
For whom chair for Uyyalo
We want Telangana Uyyalo
We need Telangana Uyyalo
Betterment of Telangana Uyyalo
Seperate Telangana Uyyalo For good of the this land Uyyalo
We want Telangana Uyyalo
Only name sake Uyyalo Gentlemen they are Uyyalo
Gentlemen agreement Uyyalo
Where is it Uyyalo
Fazal Ali Commission Uyyalo
What it had said Uyyalo
They explained Uyyalo
There would be problems Uyyalo
Seperate Telangana Uyyalo
They said clearly Uyyalo
State Hyderabad Uyyalo
They have mentioned Uyyalo
Our Gentlemen Uyyalo
Changed their opinion Uyyalo Telangana merged Uyyalo With Andra region Uyyalo Very easily Uyyaalo We have given Uyyaalo Gentmen agreement Uyyalo You read it Uyyalo Our employment Uyyalo It has gone Uyyalo Development funds Uyyalo They have gone Uyyalo Students, Employees Uyyaalo They went on Struggle Sixty nine Uyyalo Started movement Uyyalo They gave their lives Uyyalo Made promises Uyyalo Eight point formula Uyyalo It had come Uyyalo Six point formula Uyyalo Very dangerous Uyyalo Mulki rules Uyyalo Broken down Uyyalo Regional Councils Uyyalo Didn’t work out Uyyalo All our lives Uyyalo Ruined it was Uyyalo From the beginning We were deceived Uyyalo Our leaders Uyyaalo What did they do Uyyalo Are you speechless Uyyalo Are you voiceless Uyyalo Seeking posts Uyyalo Holding positions Uyyalo Since then itself Uyyalo You are like thay Uyyalo Pandit Nehru Uyyalo
What did he say Uyyalo. If not adjust Uyyalo Take divorce Uyyalo Who ever what said Uyyalo They are deaf Uyyalo Nursing mother Uyyalo. Do you kill it Uyyalo O ! My brothers Uyyalo O ! My sisters Uyyalo O ! My mothers Uyyalo O ! My fathers Uyyalo For sake of Telangana Uyyalo You think wisely Uyyaalo
You are Voiceless Uyyalo You are innocent Uyyalo Look at the parties Uyyaalo What are they saying Uyyalo Opportunists Uyyalo They enter timely Uyyalo They speak boastly Uyyalo They make Bargains Uyyalo They speak sweetly Uyyalo Escape from life Uyyalo Uyyalo sacrifice histories Uyyalo They misinterpret Uyyalo Acts of Rajakars Uyyalo They are troublesome Uyyalo Brutal deaths Uyyalo Rapes, murders Uyyalo. With union soldiers Uyyalo. We fought seriously Our sacrifices Uyyalo. For whose sake Uyyaalo. Wealth is someone’s Uyyalo Enjoyment other’s Uyyalo Past history Uyyalo Listen carefully Uyyalo In direction of fruit Uyyalo
Bird is singing Uyyalo Useless chitchats Uyyalo Some are telling Uyyalo In the name of unity Uyyalo Telling stories Uyyalo O ! My mothers Uyyalo O ! My fathers Uyyalo Telangana life Uyyalo Know and live Uyyalo SCs, BCs Uyyalo STs and all Uyyalo. Minarity brothers Uyyalo You should not forget Uyyalo Dalit families Uyyalo You come together Uyyalo Hamaali brothers Uyyalo You come together Uyyalo Riksha pullers Uyyalo You come fast Uyyalo Autos, Zeeps Uyyalo O! My brothers Uyyalo Employees and traders Uyyalo Come in procession Uyyalo Adults and children Uyyalo Come with love Uyyalo Whose charity Uyyalo Whose gift it is Uyyalo Our song is ours Uyyalo Our jpath is ours Uyyalo Telangana is ours Uyyalo Telangana song ours Uyyalo To Mother Godavari Uyyalo. We tell our Sorrows Uyyalo To b our Sorrows Uyyalo To Baddipochamma Uyyalo We pray to her Uyyalo Celebrates greatly Uyyalo. Komurelly Mallana Uyyalo Patnaalu decoration Uyyalo Rajanna Yemulada Uyyalo He shows our way Uyyalo Basara Saraswathi Uyyalo Shows our path Uyyalo. Yadagiru Narsimulu Uyyalo Remembers us Uyyalo Sammakka Sarakka Uyyalo Look at us well Uyyalo. Bhadradri Ramanna Uyyaalo Tells our future Uyyalo Aileni Mallanna Uyyaalo Unity gives Uyyalo. Kotilingala Uyyaalo Crores of God’s Uyyalo Our Telangana Uyyalo They bring it to us Uyyalo Telangana land Uyyalo Broken harp Uyyalo Harp of jewels Uyyalo Harp of Royal Uyyalo Make the harp good Uyyalo Keep it well Uyyalo Pearls of harp Uyyalo Keep it nicely Uyyalo We want Telangana Uyyalo We need Telangana Uyyalo My dear young men Uyyalo My dear young women Uyyalo Go with patience Uyyalo
Be with patience Uyyalo. You are like Gandhi Reach your destination Uyyalo Truth , non-violence Uyyalo Tools of yours Uyyalo Ambedkar’s Uyyalo Democratic ambitions Uyyalo As Ganghadhar Thilak Uyyalo Go ahead properly Uyyalo We are for good Uyyalo. We go forward Uyyalo Ocean of hardships Uyyalo Book of tears Uyyalo This is Telangana Uyyalo Song of Telangana Uyyalo Our Mother Batukkaama Uyyalo She seeks our best Uyyaalo Bathukamma Bathukamma Uyyalo Golden Bathukamma Uyyalo Our life Bathukamma Uyyalo Our hope Bathukamma Uyyalo Telangana Bathukamma Uyyalo Our wise Bathukamma Uyyalo Telangana life Uyyalo Telangana Bathukamma Uyyalo Story of Telangana Uyyalo Song of Telangana Uyyalo (Writing Period : 20-3-2001 to 23-6-2001) …………………………………………………………..
Okkesi Puvvesi Chandamama One flower one time Chandamaama One Jamu ( three hours ) has passed Chandamama Two flowers two times Chandamaama Two Jamus ( six hours ) have passed Chandamama Three flowers three times Chandamaama Three Jamus (six hours) have passed Chandamama Telangana mother Chandamama Called with ceremony Chandamama. Say welcome Chandamama Come and move Chandamama With Nirmal dolls Chandamama. Do your worship Chandamama Pochampally silk Chandamama Golden Sarees Chandamama Gadwal Sarees Chandamama Worship greatly Chandamama Godavari waters Chandamama Grandly worship Chandamama. Krishnamma waters Chandamama Stand with efforts Chandamama Karimnagar came Chandamama. Come with Unity Chandamama Warangal came Chandamama Come with patience Chandamama Khammammet came Chandamama Come together Chandamama Indooru Bharathi Chandamama Loving welcome Chandamama Manjeera Sahithi Chandamama Mindful welcome Chandamama Our Hyderabad Chandamama Inviting all Chandamama Rangareddy district Chandamama Come together Chandamama Telangana calling Chandamama Liveliness land Chandamama With Thangedu flowers Chandamama Mother Telangana Chandamama With marigold flowers Chandamama Golden garlands Chandamama Three crores people Chandamama Come with charm Chandamama Say welcome Chandamama Move forward Chandamama. ( Writing Date : 16-6-2001 )
…………………………………………………………… Telangana Bathukamma book published four times from 2001 to 2014. Some parts of this Bathukamma Song published in ‘Neti Telangana’ weekly 15-21-September 2001 issue edited by Gandham Rajamallaiah from Karimnagar.
Some parts of this Bathukamma song published in “Mana Telangana”, a tri monthly magazine July, August and September 2006 issue, editor Karra YellaReddy, Warangal. This Telangana Bathukamma song was published in full in the three editions of October 1-15, 16-30 and November 1-15 in “Akashik” fortnightly magazine, which was published in Telugu and English languages from Hyderabad under the editorship of Mr. N.Rajesham by putting Bathukamma’s photo on the cover of the magazine . Editor N. Rajesham Garu called Sharada on phone and congratulated her for this Bathukamma song. The entire Bathukamma song was published in “Neti Najim” of 2-10-2008 daily paper edited by Baisa Devadasu from Hyderabad. Thus this Bathukamma song reached wide range of readers and achieved it’s goal.
…………………………………………………………….
Telangana Bathukamma Song, It is the song in long 748 lines, which was composed and written for the cause of Telangana special statehood. It was written in the month of June 2001 (20-6-2001 to 23-6-2001) and released by Late Prof. B. Janardhan Rao, a staunch Telangana activist on 8-7-2001, the very beginning of the second phase of Telangana statehood movement. It’s second publication appeared in September 2008. Third publication appeared in October 2010. Fourth publication appeared in September 2014 after the formation of Telangana State. It depicts the the sorrowful story and the hardships of Telangana of 10 districts of that time, it’s backwardness in education, employment, water resources, funds allocation and development in the combined State of Andhra Pradesh. Bathukamma is the traditional song of Telangana especially for Women. No where in the world play Bathukamma song except the Telangana and the Telangana people where they live on the globe. It’s audio cassettes were released in thousands in number in the early years of 2001 and afterwards. It’s vedeo song released in 2008 in CD form, This song entered into the YouTube in 2010 in four parts acclaimed it’s publicity with lacks of viewers around the globe. This song was published in full or in parts in daily, weekly, fortnightly and monthly papers at that time and was acclaimed wide publicity among the people. Bathukamma means to live with life. In that way this song also lives in the hearts of the people and on the tongue of the people. In addition to this song, there is a welcome song on Telangana in 44 lines ‘Okkesi Puvvesi Chandamama’. This song was also recorded and released along with this song. Bathukamma song , it is the history, it is a the tradition, it is the culture of Telangana. Dr. Sabbani Laxminarayana, # 6-6-302, Sainagar, Karimnagar -505001. Mobile: 8985251271 email: ln.sabbani@gmail.com

You may also like

Leave a Comment