“అక్క మీనాక్షి ఇంట్లో ఉండి ఉద్యోగం వెతుక్కుందామని వచ్చాడు మధు ..
తమ్ముడిని చూసి వెక్కి వెక్కి ఏడవసాగింది మీనాక్షి” .
నేను ఉండడానికి వచ్చానని తెలిసిందేమిటి ?
ఊరకే ఏడుస్తున్నావ్ …వెటకారంగా అన్నాడు మధు.
అది కాదురా, తమ్ముడూ..
“నా గుండెల్లోఅగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి ” ..
నిన్ను చూసి దు:ఖం ఆపుకోలేక పోయాను వెక్కిళ్ళు
పెట్టింది మీనాక్షి.
“అయ్యో ।అదేమిటే ,అక్కా …
వెతికి వెతికి అప్పులు జేసిమరీ ,మంచివాడని , ఆఫీసరని ,సుందరుడని కదా ,వెతికితెచ్చి. బావకినిన్నిచ్చి పెళ్ళిజేసాం.
బావ బాధలుపెడుతున్నాడా?ఆవేదనగా అడిగాడు మధు.
“ఏమి చెప్పనురా ,తమ్ముడూ ! ఆపల్లెలో ఉన్నంతవరకూ పద్ధతిగానే ఉన్నాడు.ఊరు వదిలి పట్నంలో అడుగు పెట్టేసరికి, ఆయనలో దాగిన, అసలుగుణాలు ఒక్కొక్కటీ బయిటపడసాగాయిరా..
“అగ్నికిఆజ్యం పోసినట్లు” ఆయనకి “శకారి” ఒక స్నేహితుడు ఉన్నాడు.”వికారి “అనిపేరుపెట్టలేక “శకారి”అని పేట్టారేమో ?
వాడు సప్తవ్యసనాల సమ్మిళితం అనితర్వాత తెలిసింది.
“మీబావ నన్నయినా వదిలేస్తారు గాని. వాడిని వదలరు”.
వాడు “ప్రజలవద్దకు పాలనలా,మీ బావ వద్దకు అన్నీ తెచ్చి అందిస్తాడు .ఇంటినే ఒక పబ్బుగా ,క్లబ్బుగా మార్చేసారు .. అదిగో! ఆమేడమీది గది వీళ్ళ సామ్రాజ్యం….
వాడిస్నేహం ఆయన బలహీనత ..వాడు పూర్తిగా తన అవసరాలకు ఈయన్ను వాడుకుంటాడు.
మీబావ ఎవరికీ తెలియకుండా, నాలుగు గోడల మద్యనే, ఉన్న నాలుగు వ్యసనాలనూ నాణ్యంగా పోషిస్తున్నాడు.
మీబావను వదులుకుంటే, పబ్బం గడవదని వాడు
ఈయననుఅంటి పెట్టుకుని తిరుగుతాడు.
వాడి ధర్మమా! అని నన్ను చెల్లెమ్మ అంటాడు.
ఆ విషయంలో మర్యాదగా ఉంటాడు లే .
చెల్లమ్మఅంటునేమనింటినే.క్లబ్బుచేలి నీవిట రాకమ్మా,
బరువుగల ఇంటి పిల్లవు.. నన్ను చెడ్డ చేస్తున్నాడు .అంటూనే……పేకాటలోబావదగ్గర డబ్బులు ఊడ్చేస్తాడు.ఆ పరిస్ధితిలో సేవలు చేస్తాడు ..
మీ బావచే బాగా తాగించి, కక్కుకున్నాసరే తుడిచి ,
తనే పట్టుకుని తీసుకొచ్చి ,సోఫాలో పడుకోబెట్టి వెళ్తాడు”.
“నేను ఏమిటిదని అడిగానంటే! నేను బ్రహ్మచారిని ,
నీకు లక్షణమైన భార్యుంది.వద్దురా! వద్దని చెప్పినా వినడమ్మా..వాడికి నేనురానంటేకోపం..
అందుకే నాకు తప్పడం లేదు అంటాడు .
“నాకేదో మహోప కారం చేసినట్లు ఫోజులు వాడూ”
.కోపంగా అంది మీనాక్షి” ..
మరి, మీ అత్తా మామా ? అనుమానంగా అడిగాడుమధు . పాపం, వాళ్లు మాత్రంఏమిచేస్తారురా?పరువుగలవాళ్ళు.
ఈ పాపిష్టి పనులు చూడలేక ,పాపం కుమిలిపోయారు .
ఇంత పెద్దఇల్లు కష్టపడి కట్టించి కూడా !ఈయన తీరు భరించలేక, ఊరిలోనే ఎలాగోలా గడుపుకొని ఉంటామని వెళ్ళిపోయారు.. ఈవిషయాలేవీ ,మాకు చెప్పలేదేమిఅక్కా ?
“ఏమిచెప్పనురా? ఆమ్మకి హార్ట్ ప్రాబ్లం. నాన్నకు డబ్బు ప్రోబ్లం. నీకింకా ఏఉద్యోగం రాలేదని బెంగలో వాళ్ళున్నారు …
పిల్ల సుఖపడుతుందని గవర్నమెంటు ఉద్యోగస్తుడని, అప్పుచేసి మరీ ఇతడికి ఇచ్చి పెళ్ళిచేసి అవస్థలలో ఉన్నారు” .
“చెల్లని కాణీలాంటి ఈ స్నేహితుడు, మా బ్రతుకుకు చిల్లు పెట్టాడు”.ఇవన్నీచెప్పి మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక
అనుభవిస్తున్నాను అంది కళ్ళొత్తుకుంటూ మీనాక్షి.
“మీ బావ,ఇంకా బయిటకు వెళ్ళి రభస చేయడం లేదు.
దొరికిపోతే. పోలీసుల దెబ్బలు తినలేమని, ,గౌరవం పోతుందని ,కేసులుంటే ఉద్యోగము పరువుపోతుందని, భయాలున్నాయి కాబట్టి ఇంట్లోనే వాడి సాయంతో వ్యసనాలు సాగిస్తున్నారు . మీ బావ స్వతహాగా మంచి వాడే.
ఆదరిద్రుడే! మీ బావని, వాడుకొని పబ్బం గడుపుకోడానికి ఇంటికొచ్చిమరీ పాడుచేస్తున్నాడురా! మళ్ళీ బావురుమంది మీనాక్షి. “మన నువ్వులలో నూనె లేకపోతే నూనెఆడించిన వాడిని అని లాభమేంటి” ?బావకు బుద్ధి లేదు. అనవు.
“నామాటవిని ఏడుపు ఆపు”. నేనున్నాను బాధపడకు . బావకి నేనొచ్చిన సంగతి చెప్పకు.బావ రాకముందేవెల్తాను.
నీకు సాయంగాఉంటాను .నీసమస్య పరిష్కరిస్తాను ,
నన్ను నమ్ము .. బావని మామూలు మనిషిని చేస్తాను “
“నువ్వు కొన్నాళ్లు నాకు ఆర్ధిక సమస్య రాకుండా ఆదుకో”. అమ్మా నాన్నలకు నీదగ్గరున్నట్లే చెప్పు ..
బావవాళ్ళతో నాగురించి మాటాడకుండా చూడు” .
ఏడవకు .ఇలాచెయ్యని చెవిలో చెప్పి వెళ్ళాడు మధు” ..
.. నా కాపరం నిలబెడతానంటే నువ్వు చెప్పినట్లే చేస్తాను తమ్ముడిని దిగ బెడుతూ అంది మీనాక్షి .
************.
“లాన్లో కూర్చుని. పేకాట ఆడుతున్న. సుందర్, శకారీలు
మే ఐ. కమిన్. అన్న పిలుపుకి. తలెత్తిచూసారు “ఎదురుగా.ఎంతో అందమైన. అమ్మాయి”. వ్హాట్. కెన్ .ఐ .డూ. ఫర్. యూ. .? అని వంకర్లు తిరిగిపొతున్న“శకారి” వికారాలు పట్టించుకోకుండా,సుందర్ దగ్గరకెళ్ళి నిలబడి .
మీఇంట్లో మేడమీద పోర్షన్ ఉందని తెలిసివచ్చాను.
అద్దెకు ఇవ్వడానికి వీలవుతుందా ? వయ్యారంగా అడిగింది
ఆ అందాల సుందరి” .. ఆ !.. ఓహ్ ..అని చెయ్యి ముందుకి జాపిన సుందర్ చేరువగా వచ్చి నిలబడి ,ఐయాం మిస్. మయూరీ।అంది.
“అయినా ! మీకెవరుచెప్పారు? మామేడమీద అద్దెకు గదిఉందని? పై వాళ్ళకి ఇవ్వం అన్నాడు సుందర్.
“పకపకా నవ్వుతూ! నేను పైదాన్ని కాదండీ!
మీ ఆవిడకు చిన్నాన్నకూతురిని అవుతాను .
మాదీ ఆ ఊరే .మీ పెళ్ళికి ఊర్లోలేక నేను రాలేదు ..
ఇక్కడ కొత్తగాఉద్యోగంలో చేరాను.
“అప్పుడు కోవిద్ వలన హొస్టల్ ఖాళీచెయ్యమంటే
వెళ్ళి పోయాను”.కంపినీ వాళ్ళు రమ్మంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను..ఫ్రెండ్ తో ఉంటున్నాను అది
రూమ్ ఖాళీ చేసింది..ఒంటరిదాన్ని .. మా వాళ్ళుఛెప్తే మీ మేడమీది గది ఖాళీ అని తెలిసివచ్చాను ..
అయినా ! అక్క మా అక్కేగాని మీరు ఒప్పుకోవాలిగదా?
మీకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఇబ్బందిపెట్టను,బావగారూ.. అక్క తో చెప్పనే లేదు .ఫోన్లోనే ముభావంగా మాటాడింది. ఏమంటుందో డౌటు?దానికి నేనుండడం ఇష్టముండదేమో ?
మీకు మాట రానివ్వను..పొందికగాఉండి నాపని నెరవేరగానే వెళ్ళిపోతాను ..ప్లీజ్! బావగారూ !
మీరే ఆదుకోవాలి. “ముందరికాళ్లకి బంధంవేస్తూ” మెలికలు తిరుగుతూచెప్పింది మయూరి. . ……….
ఆశ్చర్యంగా చూస్తున్న సుందర్ తో ,ఒరే,ఓకే! అనేయరా।..అని ఫ్రెండు వికారి పొడుస్తుంటే, అతనిని ఆశ్చర్యంగాచూస్తూ.ఇతనెవరు బావగారూ ?
మధ్యవాళ్ళ ప్రమేయం నాకిష్టముండదు .మీరే చెప్పాలి ..
మీకుఇష్టంలేకపోతే చెప్పండి అంది అతన్ని చిరాగ్గాచూస్తూ
మయూరి. .. వాడి స్నేహీతుడు అంటుంటే,
అక్కను కలిసి వస్తాను అని ముందుకు కదిలింది వయ్యారంగా మయూరి..
“ ఒరే। నువ్వు మధ్యలో దూరకురా..మయూరీ।ఎంతమాట.నువ్వునిరభ్యంతరంగాఉండవచ్చు… హామీ! ఇచ్చేసాడు సుందర్…
సరేగాని ,బావగారూ ,ఒకసారి అక్కని అడగండి .
అని దీర్ఘాలుతీస్తూ అంది మయూరి.
మబావగారిళ్ళు మీది అనుకోండి..మంచి పనిచేసావురా ! అంటున్న, బావ స్నేహితుని,విసుగ్గాచూసి…. ,
ఇతనెవరు బావగారూ ? మీకు ఇతని సలహాలు కావాలా? మీకు వ్యక్తిత్వం లేదా ? సారీ బావగారూ …నేను మీ ఇంట్లో ఉండలేనంటూ బయిటకు నడవబోయింది మయూరీ ..
ఒరేయ్ ! ఆటక్లోజ్ చేద్దాం.నువ్వెళ్ళుఅంటూ లేచాడు సుందర్…అదికాదురా ! అంటుంటే ,వెళ్ళరా !వెళ్ళు అని,
అదేంటిరా !. అన్న శకారి తో ,”ఇంకోక మాట .మనం ఇకపై బయిటనే కలిసి మాట్లాడు కుందాం.నీకు ఫోన్చేస్తేనే కలియు. .నువ్వు మాయింటికి రాకు”. ..పాపం। మయూరిని .ఇబ్బంది పెట్టడం ఎందుకు ? అని చెప్పి ,పద మయూరీ అని ,వెనుదిరిగి ,అతని వైపు.చూడకుండా లోపలికి దారితీసాడు ,సుందర్, …
“మరదలిని చూసి మతిపోయిందా”?
నన్ను రావద్దని చెప్తావా? చూస్తానురా ?ఆ అమ్మాయి నీ కొంపలో చిచ్చు పెట్టకపోతే నాపేరు “శకారి”. కాదు ..
అరుస్తున్న స్నేహితుడిని పట్టించుకోకుండా..
పో, ఫోరా ! నా సంగతి నేను చూసుకుంటానని మయూరి
వెనుక వచ్చేసాడు సుందర్ “..
“వరండాలో చాటుగా నిలబడి అంతావిన్న మీనాక్షి విస్తుపోయింది” ..
“మీనా ! చూడు, ఎవరొచ్చారో? సంబరంగా లోపలికొస్తున్న భర్తను ,అతని వెనుకే వస్తున్న అమ్మాయిని ఆశ్చర్యంతో అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది మీనాక్షి “….
“అదేంటే!అలా అయిపోయావు?మీ చెల్లెల్ని పలకరించవా ? అన్న సుందర్ మాటలకు తేరుకొని……
హాయ్ ! అక్కయ్యా ! అంటున్న మయూరితో …
ఎప్పుడొచ్చావే ? ఎలా ఉన్నారు మన వాళ్ళంతా ? అంది . ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ..
బాగున్నారక్కయ్యా ! అంటుంటే ……
మీనా !హొస్టల్ క్లోజయిందట . వర్కింగ్ వుమెన హాస్టల్ ఎందుకు ? మయూరి మనతోనే ఉంటుంది అన్నాడు సుందర్ ..ప్లీజ్ !బ్రతిమాలింది మయూరి ..
మీరు ఒకసారి లోపలికి రండని. భర్తను పిలిచింది మీనాక్షి. …
“అదికాదండీ ! పెళ్ళి కావల్సిన పిల్ల .రేపు ఎటునుండి ఏదొచ్చినా?మనం చిక్కుల్లోపడతాం …మీ ఫ్రెండు కూడా వస్తుంటాడు . అసలే!రోజులు బాగాలేవు. ఇదసలే చాలాచురుకు..ఏక్షన్ ఎక్కువ జేస్తుంది…
అసలే! వాళ్ళ నాన్న గొడ వల. మనిషి ….జాగ్రత్తా !
ఎటునుండి ఏమొచ్చినా మనకు చెడ్డపేరు అంది సందేహంగా మీనాక్షి…
“వాడిని ఇక మనింటికి రావద్దని చెప్పేసానే…
అయినా। ఆ అమ్మాయే,మనిల్లు వెతుక్కుంటూవచ్చింది..
మనం రమ్మనలేదుకదా? సరదాగా ఉంది.నాకు స్వంత మరదళ్ళెలాగూ లేరు సరదా తీర్చుకోనీ మీనా!
నువ్వీమీ! కుళ్ళు కోకు…నాకు బోరు కొడుతోందే …
నీకు తెలుసు .అమ్మాయిలతో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను .అయినా ।నేను నిన్నొక్కతినే పోషించలేక పోతున్నాను .“నిన్ను పెళ్ళాడింది మొదలూ, మనింటికి.
మీ తమ్ముడు తప్ప ,ఒక్క చుట్టమైనా రాలేదు” ….
“సరే! ఆమేడమీద గది . ఆ అమ్మాయి కొదిలేద్దాం.
నేనాదిక్కుకు కూడా రాను .కావలిస్తే నువ్వు వెళ్ళు ..
తనతోనే ఉండు . మనకీ చేంజ్ ఉంటుంది హుషారుగా అన్నాడు సుందర్” ….“మీకు కొత్త మోజు కదా ! నేను చెప్పినా వినరు” ..ఏమి జరిగినా మీదే బాధ్యత.నాకు సంబంధం లేదు అంది మీనాక్షి.లోపలికెల్తూ .
ఇప్పుడు అక్క ఇలాగే అంటుంది .రేపటినుండి చూడండి ఎలా మార్చేస్తానో ? నవ్వుతూఅంది మయూరి
**********************
మర్నాడు వచ్చిన స్నేహితునికి మయూరి వాళ్ళ నాన్నపెద్ద అధికారిని ,లేని పోనివి చెప్పి బెదిరించి పంపించేసాడు సుందర్ ..
మీనాక్షి అంది.ఏమిటో బాబూ ,”సారీ అక్కా ! నేను కరోనా వలన షాపింగ్ చెయ్య లేక పోయానని ,నాచీరలు,వస్తువులు వాడేస్తోంది కోపంగా అంది ..
పోనీవే !చిన్నపిల్ల .దానికి కావలసినవి వాడుకోనీ .
నీకు నేను కొంటానుగా అన్నాడు మయూరిని వెనకేసు కొచ్చి సుందర్” ..
ఏంటే,మీనా! ఈ అమ్మాయి. మాటాడితే,గదిలో దూరిపోయి తలుపులేసుకుంటుంది. ఏమిచేస్తుందంటావ్?ఒక రోజు భార్యనడిగాడు సుందర్ …
“ఏమోనండీ! అందరూ!నాలాగఉంటారా? అసలే ఇదిజాన. ,ఈరోజుల్లో అమ్మాయిలను నమ్మలేం? దీనికే వ్యవహారంఉందో? మీరు ఒవర్అవ్వకండి.జాగ్రత్తా! అందనుమానిస్తూ మీనాక్షి….
“తనలాటిది కాదే! అయినా మీనూ ?
ఈ అమ్మాయిగొంతేంటే ఒక్కో సారి బొంగురుగామగాడు ఆడవేషం వేసినట్లు .మగగొంతులావినిపిస్తుంది ? చాలా అందంగా ఉంది కానీ,,.కాళ్ళూ చేతులు మొరటుగా !.
నెల రోజులతర్వాత అన్నాడు సుందర్,
మగరాయుడిలా పెరిగింది .. కరాటే అవీ నేర్చింది,దీనికీ నాటకాల పిచ్చే. రిహార్సులు వేస్తుందేమో? అది పొలం పనులు కూడా చేసేదండీ. ?అదృష్టం బాగుండి,
పట్టుదలగాచదివి , ఈస్థితికొఛ్చింది .
మీకు తెలుసా ? మావూరిలో దీన్నిమగరాయుడనేవారు..
అంటూ నెలరోజులకే మీకు మోజు తీరిందా ?వెటకారంగా అంది. మీనాక్షి .. ఓహో !అలాగా? ఏదయినా మంచి అమ్మాయి..కలుపు గోలుగా ఉంటుంది అన్నాడు సుందర్.
******************
నేనూ కిచెన్లో పనికి సాయం చేస్తాను .రా !అక్కా !
బావగారిని కార్డ్స్ లో ఓడిద్దామని పిలిచి.ఆటలో ఓడిపోయిన సుందర్ని అల్లరల్లరి చేసేది మయూరి.. .
అబ్బ ! బావగారికి , కూల్డ్రింక్ తాగుతునైనా కంపెనీ ఇవ్వొచ్చు కదా !ఆడిన్నర్! సంగతి నేను చూస్తానులే అనేది ఒకసారి ..“అన్నీ అరేంజ్ చేసి. మీనాక్షి ,సుందరేశులను వదిలి తను కిచెన్లో దూరేది మయూరి “…
ఆశ్చర్యంగా.!సుందర్లో చాలా మార్పు వచ్చింది …
తాగుడు ,పేకాట తగ్గాయి .. ముగ్గురూ కూర్చొని .కేరం,జల్దీ ఫైవ్ ,లాన్లో షటిల్ ,లాటివిఆడడం చోటు చేసుకున్నాయి ..
ఇంట్లో ఏడ్పులు ,అరుపులు ,కేకల స్థానంలో
“ఆనందంగా నవ్వులు .కేరింతలు సరసాలువినిపిస్తున్నాయి …యూట్యూబ్ ! చూసి మీనాక్షి రకరకాల వంటలు చెయ్యడం..ఇంటి నుండిపని.మయూరి, సాయం చెయ్యడం బాగుంది సుందర్ కి .
సుందర్. మయూరీ చెరొక లేప్ టాప్ .పట్టుకొని, పగలంతా పని. తీరికైతే ఆటలు ..భలే !బాగా.గడుస్తోంది..
ఆన్లైన్ ఆర్డర్లు. .కొత్తరకమైన,ఆటలు , సుందర్ మీనాక్షులను దగ్గర చేయడం మొదలుపెట్టింది మయూరి.
. ***************
బావగారూ ! రండి మెడిటేషన్. ,యోగా. నేర్పిస్తాను .
నేను యోగా కోర్స్. చేసాను తెలుసా ? లాక్డౌన్ కాదు గాని మీకు పొట్టొచ్చింది తెలుసా ?
అక్కా ! బావగారు ఎంచక్కా యోగా చేస్తున్నారో చూడవే !, నీకేమయిందే. .. సన్నగా చక్కగా ఉండేదానివి,మయూరి సలహా .. మీనాక్షిసుందర్లు, యోగా, మెడిటేషన్, జాగింగ్ ,మొదలు పెట్టారు .
++++++++++++++++++++++.
అదేంటక్కా ? అంతా బాగానే చేసాను గదా!
వామిటింగ్స్ చేసుకుంటున్నావేం ? ఫుడ్ పాయిజనా. అని ..సిగ్గుపడుతున్న మీనాక్షితో ..
ఆహా! ,అదాసంగతి …
ఓహో ! కంగ్రాట్స్. !అక్కా ! బావగారూ ! కంగ్రాట్స్.
మీరు ,తండ్రి కాబోతున్నారుట .సంతోషంగా అంది మయూరి ..“చిన్నపిల్లలా గెంతుతూ మయూరి అంటుంటే ,,,,
“నువ్వు ,మాఇంట అడుగిడిన మాఅదృష్టదేవతవి.
నిజంగా !మయూరీ , నువ్వే ముహుర్తంలో మాయింట్లో అడుగుపెట్టావోగాని! నాజీవితంలోమంచి మార్పు వచ్చింది.. ధన్యవాదాలుమయూరీ,చాలా.చాలామార్పులొచ్చాయి.
మాలో, అన్నాడు సుందర్ .మీనాక్షి అదే మాటంది ..
నాకూ మంచి జరిగింది బావగారు .మీకు చాలా ధన్యవాదాలు..
అర్జంటుగా రమ్మని అమ్మా ! నాన్న ఫోన్. చేసారు .
నాన్న కసలే చాలా తిక్క. బావగారూ !ఏ సమస్యను.
ఎపుడు ఎదురు పెడతారో ?
ఆయిన సంగతి నాకు బాగా తెలుసు ….నేను వెల్తాను .…
ఏదయినా ,మిమ్మల్ని చూస్తే నాకు గొప్ప గౌరవం ..
చిన్న గవర్నమెంటు బడిలోచదివి గ్రూప్ వన్ ఆఫీసరయ్యారు.
కోచింగ సెంటర్ పెట్టి మీ తెలివి బీదవారికి పంచండి బావగారూ .మంచి సమయంలో ఆదుకున్నారని ,ఆదరాబాదరగా బయిల్దేరింది మయూరి .
.మీ అక్క ! ఈ స్థితి లో ఉంది ..నేను నీతో వద్దామంటే! ..కుదరదు..జాగ్రత్తగా ! వెళ్ళివచ్చేయ్. బాధగా అన్నాడు సుందర్ .స్వయంగావచ్చి అన్నీ కొనిచ్చి ,బస్సు ఎక్కించాడు సుందర్.
కాలం ఎంత తొందరగా గడచి పోయిందో ।.
నీ మేలు. జీవితంలో మరచి పోలేను .కన్నీళ్ళ తోఅంది మీనాక్షి ****
ఏమయిందే ! మయూరికి ?వారం రోజులైనా! ఫొన్ లేదు? అంటుండగానే, బావమరిది.మధు ప్రత్యక్ష మయ్యాడు…
ఏమయిపోయావురా, ఈమధ్య ? పలకరిస్తూ అన్నాడు సుందర్ …
మయూరీ ! అని ఏదో అడగబోతుంటే ,
అదో పెద్దగాధ బావగారూ! !వాళ్ళనాన్న దానికిష్టం లేని పెళ్ళి కుదిర్చాడు .ఇది ఒక రాత్రికిరాత్రి చెప్పాపట్టకుండావెల్లి పోయింది ..దుబాయ్ వెళ్లిపోయిందని ఊరంతా గోలగోల ..
వాళ్ళ నాన్న గంతు లేస్తున్నాడు .
మీరు ఇన్వాల్వ్ అవ్వకండి బావగారూ!వాళ్ళసలే పేచీ కోరువాళ్ళు.ఎవరిని ఇరికిద్దామా అని చూస్తారు. .
.మీ అదృష్టం బాగుండి ,అది మీ యింటికి రాలేదు.అన్నాడు మధు .అవునవును, అన్నాడు సుందర్ ..
మధూ! మీసం అవీ తీసేసావేమిటిరా ? అనుమానంగా చూస్తూ. …అదా ! మా ఫ్రెండ్స్ తో కలసి డ్రామా అడాను బావగారూ ..అందుకోసం ..అన్నట్టు నాకు “దుబాయ్లోఉద్యోగం”వచ్చింది .అదిచెప్పడానికే వచ్చాను ఆనందంగా అన్నాడు ..
*********
థేంక్స్ రా.,తమ్ముడూ ! నా!బ్రతుకు నిలబెట్టావు ..
అమ్మా! నాన్నా! నాటకాలాడుతాడు.ఆడవేషాలు వేస్తాడు. ఎలా!బతకుతాడో? అని తిడుతుంటే, అవుననుకున్నాను..
కానీ ! ఆవేషంతోనే అద్భుతంగా నటించి ,నా బ్రతుకు నిలబెట్టావురా! అంది మీనాక్షి. అయినా ! అసలనుమానం రాకుండా ! అద్భుతంగాఎలా?నాటక మాడావురా ? ఆశ్చర్యంగా అందిమీనాక్షి,…
కళా కారులను తక్కువంచనా,వెయ్యొద్దుఅక్కా !
“కళాకారుడు పూర్తి గా మనసు పెట్టి చేస్తే!అది జీవ కళే” .
ఇక నిలబెట్టుకోవడం.నీచేతుల్లో ఉంది. సంతోషంగా ఉండు అన్నాడు మధు..
ఇదిరా,తమ్ముడూ। బంధం అంటే అని నవ్వింది మీనాక్షి….
+++++++++సమాప్తం .++++++