Home కవితలు పిడికెడు అటుకులు ! !

పిడికెడు అటుకులు ! !

పిడికెడు అటుకుల గురించి
కలుపు గొలుపుగా దోసెడు మాటలు 

మునుపు తాత ముత్తాతలు సంచారం పోతే
మూటలోని అటుకులే తోవలో కడుపుకు ఆసరా 
 తియ్యని వాగూ నీళ్లే గొంతులో 
అమృత ధారాపాతం !
ఆగని నడకకు అటుకులే 
బల అతిబల మహాబల !

సామాన్యుల అసామాన్య ఆహారం అటుకులే
కొద్ది కొద్దిగా కాదు నమిలినా కొద్ది
ఆస్వాదనగా రుచి రుచి !
దంపుడు అటుకులైతే 
ఎంత తిన్నా దంగేవి కావు !

అంచుకు ఊరగాయ ముక్క 
ఊరించే ఉల్లిపాయలు 
ఎర్ర కారం కలుపుకుని 
పిడికెడు అటుకులు తింటే 
పొట్టకు కంచం నిండా పట్టనంత భోజనమే !

అటుకులే కదా అని తీసిపారేయకండి
శ్రీ కృష్ణుడు ప్రీతిగా పిడికెడు అటుకులు తింటే 
కుచేలునికి జోలెలో పట్టలేనంత ఐశ్వర్యం 
బ్రాండెడ్ అటుకులు !

ఇప్పుటికీ అటుకులు తక్కువేం కాదు
తింటే కడుపు నిండారా ఆయాసంగా ఎక్కువే 
బ్రేవ్   బ్రేవ్   బ్రేవ్

You may also like

Leave a Comment