Home కథలు పైలట్‌రమ

పైలట్‌రమ

by Narayana Rao

”ఈరోజు బాగా అలసిపోయాను రమా! వేడి వేడి టీ తాగాలి” అంటూనే నాగయ్యను పిలిచి రెండు కప్పులు టీ చేసుకురమ్మన్నారామె.” నాగయ్య టీ తెచ్చి టేబిల్‌మీద పెట్టి నిలబడ్డాడు. అతనిని పంపించేసి ఒక కప్పు తన చేతిలోకి తీసుకుని ”నువ్వు కూడా తాగు రమా!”అని పురమాయించింది. ఆ అమ్మాయి సంకోచిస్తుండటంతో, ”ఫర్వాలేదు. నువ్వూ బాగా అలసిపోయా”వనడంతో ఆమె భయం భయంగా రెండవ కప్పు తీసుకుని కొంచెం దూరంగా నిలబడి సిప్‌చేయసాగింది. ”కూర్చొని తాగు రమా!” ”ఫర్వాలేదు మేడమ్‌!” ”ఇది ఆఫీస్‌కాదు. ఇల్లమ్మా!” ”అయినా ఇది మీ అధికార నివాసమే కదా మేడమ్‌!” దాంతో ఆమె నవ్వేసి ఊర్కొన్నారు.

మరుసటిరోజు సాయంకాలం కూడా దినమంతా టూర్లతో ఆమె బాగా అలసిపోయారు.

రమా! రేపు నాకు బయట ప్రోగ్రామ్‌లేమీ లేవు. నువ్వు సెలవు తీసుకో. ఉండు ఒక్క నిమిషం”. నాగయ్యను పిలిచి అమ్మాయిని తీసుకెళ్ళి వసతి చూపించుఅని ఆజ్ఞాపించారామె. రమకేమీ అర్థం కాలేదు. నాగయ్య ఆమెకు రెండు గదుల వసతిని చూపించి, ”ఈరోజే కలెక్టర్‌మేడం ఆదేశంతో ఇదంతా శుభ్రం చేశారు. నివాసయోగ్యంగా మార్చారుఅని వివరించాడు. ఆశ్చర్యంతో రమ తిరిగి రాగానే, ”రమా! రేపు నీకు సెలవు ఇచ్చాను గదా! నీ సామానులన్నీ సర్దుకుని సాయంకాలానికల్లా ఇక్కడికి షిఫ్ట్‌అయిపో!అని మేడమ్‌ఆదేశించారు.

మేడమ్‌! అమ్మాయికిదంతా నమ్మశక్యంగా లేదు.

ఏం బాగాలేదా? ఇక్కడయితే నువ్వు మీ అమ్మను కూడా పిలిపించుకోవచ్చు!” ”అది కాదు మేడమ్‌!

అయితే ఇంకేమీ చెప్పకు. నేను చెప్పినట్లు చెయ్యి”.

ఒక్కసారిగా అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు నిండాయి. కృతజ్ఞతా భావంతో ఆమె కలెక్టరమ్మ కాళ్ళకు దండం పెట్టబోయింది. వెనుకకు జరిగి ఆమె దాన్ని వారించింది. దినమంతా ఆఫీసు పనుల్లో బిజీగా ఉండి సాయంకాలం 8 గంటలకు తన నివాసానికి చేరుకొన్నారు ఉషారాణిగారు. విశ్రాంతికోసం కుర్చీలో వాలిపోయి టీకి ఆర్డరిచ్చారు. వేడివేడి టీ ఘుమఘుమలు ఆస్వాదిస్తూ రమను పిలుచుకురమ్మని నాగయ్యను పంపారు. అమ్మాయి ముఖంలో సంతోషం, హుషారు గమనించాడు నాగయ్య.

ఎలా ఉంది రమా! ఇక్కడ?” ”మేడమ్‌మీకు కృతజ్ఞతలు ఎట్లా చెప్పుకోవాలో తెలియటం లేదు. మా అమ్మకు తెలిస్తే ఎంత సంతోషిస్తారో!

ఆమె నిక్కడకు రప్పించుకో!” ”దానికి కొద్దిరోజులు పడుతుంది మేడమ్‌!

సరే, నీ ఇష్టం. రోజు నువ్వు ఇక్కడే తిను. నేను వాళ్ళకు ముందే చెప్పాను.” ”నేను వంట చేసుకుంటాను మేడమ్‌!” ”రేపటి నుండి చేసుకుందువులే!అని చెప్పేసి ఆమె తన గదిలోకెళ్ళిపోయారు.

ఒక సాయంకాలం రమకు నాగయ్య ఎదురుపడ్డాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా!అన్నాడు. ఎందుకు నాగన్నా?”

మేడమ్‌కు నీ మీద మంచి అభిప్రాయమేర్పడింది. అందుకే నిన్ను చేరదీశారు. నమ్మకాన్ని కాపాడుకోవాలి. నమ్మకస్తులకు ఆమె అన్నివిధాలా సహాయం చేస్తారు. ఎప్పుడూ మిడిసిపడకూడదు. తోటి ఉద్యోగుల ఎదుట జాగ్రత్తగా ఉండాలి. అసూయపడతారు. ఇబ్బందులు కల్పిస్తారుఅంటూ ఎవరి ఎదుట ఎట్లా ఉండాలో మెళకువలు చెప్పాడు. రమ జీవితంలో సలహా మార్గదర్శనంలా పనిచేసింది.

రెండవ శనివారం, తర్వాత ఆదివారం ఆఫీసు పనులన్నింటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు ఉషారాణి. శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్టు ముగించుకుని కూర్చొన్నారు. ఆమె ఏదో చిరాకుగా ఉన్నట్లు గమనించి అక్కడే నిలబడి ఉన్నాడు నాగయ్య. అతనివైపు చూస్తూ, ” అమ్మాయి కేదో సహాయం చేయాలని చూస్తే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నది! ఆమె నడవడిని కాస్త గమనిస్తూండుఅన్నారు.

విషయంలో అమ్మా?” ”తను నాకు చాలా దగ్గరని, ఏదైనా పని కావాలంటే చేయిస్తానని చెప్తున్నదట”. ”అలా ఎప్పుడూ జరుగదు అమ్మగారూ! ఆమెకు మీరు ప్రత్యక్షదైవం. మీ ఫోటో పెట్టుకుని పూజ చేస్తుంది”. ”మరి అతను ఎందుకలా చెప్పాడు?” ”ఎవరు అమ్మగారూ?” ”వెంకట్రావు”. ”అతనికి చాలా దురలవాట్లున్నాయి. ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని తిరిగి చెల్లించడు. అమ్మాయిని కూడా వేయి రూపాయలు కావాలని అడిగితే ఇవ్వలేదు. అందుకే ఆమె మీద చాడీలు చెప్పి ఉంటాడు. ఆమె చాలా మంచి పిల్ల అమ్మగారూ!” ”ఒకసారి ఆమెను నా దగ్గరకు పంపించు”.

నమస్తే మేడమ్‌!అంటూ చిరునవ్వుతో కలెక్టర్‌గారి ఎదుట నిలబడింది రమ. కొద్దిసేపటి తర్వాత, ”ఎక్కడికైనా వెళ్ళాలా మేడమ్‌? ఇప్పుడే డ్రెస్‌వేసుకుని వస్తాఅంటూ వెనుకకు తిరిగింది. అవసరం లేదు రమా! అయినా నువ్వు ఆఫీసు పనుల మీద వెళ్ళినప్పుడే యూనిఫాం ధరించు. వేరే అప్పుడు మామూలు దుస్తుల్లో రావచ్చు”. ”అలాగే మేడం”. ”ఇప్పుడు వెళ్ళు. నీ పనులు చూసుకో. సాయంకాలం అయిదు గంటలకు రా! నేను లాన్‌లో కూర్చుంటా”, అని రమను పంపించి ఆమె నిండుగా ఊపిరి పీల్చుకున్నారు.

రమ వచ్చి మేడమ్‌కాళ్ళ దగ్గర కూర్చున్నది. తన పక్కన కుర్చీ చూపించి అక్కడ కూర్చోమంటే ఆమె ఒప్పుకోలేదు. మేడమ్‌! మీరెప్పుడూ ఇలా అనకండి. ముఖ్యంగా ఇతరుల ముందర”. కాసేపు మౌనంగా ఉండి ఆమె మేడమ్‌కళ్ళలోకి చూసింది.

మేడమ్‌! మీరు ఉదాసీనంగా కనబడుతున్నారు. మీ కళ్ళల్లో విషాదం అగుపడుతున్నది. ఎందుకు మేడమ్‌?” అకస్మాత్తుగా ఆమె కళ్ళు వర్షించసాగాయి.

సారీ మేడం! నన్ను క్షమించండి”. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చాలాసేపు నిమురుతూ ముభావంగా ఉండిపోయారు ఉషారాణిఅప్పుడు తేరుకుని కళ్ళు తుడుచుకుని, ”రమా! ఈరోజు పదేపదే నా చెల్లె గుర్తొస్తున్నదిఅన్నారు.

ఆమెకేమయింది మేడమ్‌?”

అది ప్రపంచంలో లేదిప్పుడు. అమ్మను, నన్నూ శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది”. ”అదెలా జరిగింది మేడమ్‌?”

ఇంకా టీనేజరేపందొమ్మిదేళ్ళు కూడా నిండలేదు. అది ప్రేమలోపడి మోసపోయింది. దాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నది.అది విని రమకు దుఃఖం పొంగివచ్చింది.

ఎందుకు రమా! నువ్వెందుకింతగా ఏడుస్తున్నావు?” ”ఏం చేయను మేడమ్‌? అక్క విషాదగాథ విని తట్టుకోలేకపోయాను. బహుశా నాకూ ఇలాగే జరిగి ఉండేదేమో! అక్క బాధ స్వయాన నా బాధే అనిపించిందిమేడమ్‌ప్రశ్నార్థకంగా చూసేసరికి తనకు సంభవించిన ఘటనను ఇలా వివరించింది: కొంచెం అటూ ఇటూ అక్క వయసులోనే ఒక అబ్బాయి నా వెంట బడ్డాడు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మూర్ఖంగా ప్రవర్తించాడు. రోజు నా దారి కెదురు తిరిగాడు. చీవాట్లు పెట్టినా, బతిమాలినా వినలేదు. తర్వాత రోజు నా వెంట వెంట నడుస్తూ అతని మోటర్‌సైకిల్‌తో నాకు డాష్‌ఇచ్చాడు. పక్కనే ఉన్న రాయి మీద పడటంతో నా ఎడమ తొడ ఎముక ఫ్రాక్చర్‌అయింది. మంచానపడి ఆర్నెల్ల దాకా నడవలేకపోయాను. ఒక సంవత్సరం చదువు కోల్పోయాను. మా కాలేజీ ప్రిన్సిపాల్‌, నా వెనకటి క్లాసు టీచర్‌నాకు అండగా నిలిచారు. నా ఫీజులు మాఫీ చేశారు. నా ట్రీట్‌మెంట్‌ఖర్చులు భరించారు. పుణ్యాత్ముల మేలు జన్మలో మరువలేను మేడమ్‌!

నిన్ను చూసినప్పుడల్లా నా చెల్లె గుర్తొస్తున్నది. ఒక్కొక్కప్పుడు దాన్నే చూస్తున్నానా అనిపిస్తుంది. నీకేమనిపిస్తున్నది? ‘మీ చెల్లెనే అనుకోండిఅని నీ మనసులోనూ అనుకోలేదా నువ్వు?” రమ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.

తేరుకోగానే, ”మేడమ్‌! మీరు బాగా అలసిపోయారు. మీ కోసం టీ చేసి తీసుకొస్తానుఅని వెళ్ళిపోయింది రమ. తన గుండెలమీద నుండి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్లున్నది ఉషారాణి గారికి. తర్వాత తీరిక దొరికినప్పుడల్లా సాయంకాలాల్లో  లాన్‌లో కూర్చొని సేదదీరడం, రమను అక్కడికి పిలిపించుకోవడం పరిపాటయింది. రమ ఆమె పాదాల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పేది. ఇద్దరూ టీ తాగుతూ చాలాసేపు ఎంజాయ్‌చేసేవారు. నాగయ్య ఇదంతా గమనిస్తున్నాడు. అమ్మగారు సంతోషంగా, హుషారుగా ఉండడం అతనికి ఎంతో తృప్తినిచ్చింది.

ఓరోజు ఉషారాణిగారి మనసు ఏదో భావుకతలో విహరిస్తూన్నది. మేడమ్‌! పిలుపు ఆమెను లోకంలోకి దింపింది.

రమా! నువ్వు నన్ను అక్కా!అని పిలువచ్చు గదా!కొంచెం సవరించుకుని కనీసం ఇంట్లోనైనాఅన్నారు.

మేడమ్‌! నా మనసులో మిమ్మల్ని అక్కగానే ఆరాధిస్తాను. కాని ఇంటా, బయటా మేడంఅనే పిలుస్తాను. లేదంటే ఎప్పుడైనా పొరపాటు జరగవచ్చు. నన్ను క్షమించండి. మీరు నన్ను చెల్లెగా భావించటమే నాకు పదివేలు. ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న మీ చేత గుర్తించబడటమే  నా అదృష్టము. అమ్మా నాన్నలు ఏం పుణ్యం చేసుకున్నారో నాకు ఇంత గొప్ప వరం దొరికింది. సదా మీ నమ్మకానికి, విశ్వాసానికి పాత్రురాలనై ఉండాలిఅని కోరుకుంటానుఅని ఆమె పాదాలను తాకి కళ్ళకద్దుకున్నది.

క్రమంగా కలెక్టర్‌మేడమ్‌, రమ మధ్య విశ్వాసం పెరిగి ఆత్మీయతా బంధం దృఢపడసాగింది. టూర్లలో అప్పుడప్పుడు క్యాంప్‌క్లర్క్‌ను తీసుకెళ్ళడం మానేసారు. మేడమ్‌వెంట ఒక తెలివైన అటెండర్‌, రమ మాత్రమే ఉండేవారు. ఆమెనే మేడమ్‌కవసరమైన కాగితాలను, ఫైళ్ళను అందించేవారు.

అది మార్చి నెల. శనివారం రోజు. కలెక్టర్‌మేడమ్‌ఓ ప్రముఖ మహిళా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి బాగా లేటయింది. రమను తనతోపాటే  భోంచేయమన్నారు. అవసరమైనవన్నీ టేబిల్‌పైన అమర్చిన తర్వాత అందరినీ పంపించి వేశారు. డ్రెస్‌మార్చుకుని వచ్చింది రమ. అమ్మాయి, తను మాత్రమే ఉన్నారు టేబిల్‌దగ్గర. మొదట ఒప్పుకోకపోయినా మేడమ్‌తో పాటు కూర్చుని ఒకే టేబుల్‌మీద తినక తప్పలేదు రమకు. రమా! దేనికదే, ఉద్యోగ ధర్మం వేరు. ఇంట్లో పద్ధతి వేరు. ఇక్కడ నువ్వు నాకు చెల్లెలివే” ”ఎవరైనా చూస్తే బాగుండదు మేడమ్‌!

ఇప్పుడు ఎవరూ లేరులే. దాన్ని వదిలెయ్యి. రోజు నీకేమి నచ్చిందో చెప్పు”.

వాళ్ళు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌బాగున్నది. మీ స్పీచ్‌ఎంతో ఉత్తేజకరంగా ఉండే. అమ్మాయిల నృత్య ప్రదర్శన కూడా బాగా నచ్చింది”. మేడమ్‌ఓసారి రమ వంక చూసి, ”నాకైతే నువ్వే ఆకర్షణగా నిలిచావనిపించింది. ఫుల్‌యూనిఫాంలో డైరీ చేతబట్టి ఠీవిగా నా వెంట నడుస్తుంటే, అమ్మాయిలంతా నన్ను కాకుండా నిన్నే కుతూహలంగా చూస్తున్నారు. అందుకే నా స్పీచ్‌లో సైతం పరోక్షంగా నీ రోల్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పాను.

రమ కొంచెం సిగ్గుపడింది. అది చెల్లె మీద మీకున్న అనురాగం మేడమ్‌! మీరెక్కడ, నేనెక్కడ?’మీ  విశ్వాసాన్ని నిలబెట్టుకోగలనా?’ అని అప్పుడప్పుడు నాకు భయమేస్తుంది. నాకాశక్తి నివ్వమని ఎప్పుడూ దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాను!అమ్మాయి గొంతు గద్గదమైంది. మేడమ్‌సున్నితంగా ఆమె చేతిని నొక్కింది.

ఆదివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ముగించుకుని లాన్‌లో కూర్చొన్నారు మేడమ్‌. వెంటనే రమకు కబురుపెట్టారు. ఆమె వచ్చి మేడమ్‌పక్కనే గడ్డి మీద కూర్చున్నది.

రమా! ఏమైనా తిన్నావా లేదా?” ”తిన్నాను మేడమ్‌!

అయితే లంచ్‌గురించి విచారించకు. నా దగ్గరే నాతోపాటే చేద్దువు. లోపలికెళ్ళి రెండు టీలు పట్టించుకురా!

టీ సిప్‌చేస్తూ, ”నీ గురించి, నీ కుటుంబం గురించి చెప్పు రమా!అంటూ ఆమె వైపు కుతూహలంగా చూశారు మేడమ్‌.

మాది అతిసాధారణ నిరుపేద కుటుంబం. దానికి విశేషాలే ముంటాయి మేడమ్‌!

సాదా కుటుంబాల నుంచే నీ లాంటి, నాలాంటివాళ్ళు ఎదిగి వస్తారు. అందుకే అడుగుతున్నాను చెప్పు

ఇంకా నాకు సరైన ప్రాపంచిక స్పృహ రాకముందే, నా ఏడవ ఏట నాన్న మరణించాడు. అప్పటినుంచి మా కష్టాలు ఎక్కువయ్యాయి. అమ్మకు కుట్టుపని వచ్చుఆమె రాత్రింబవళ్ళు గుడ్డలు కుట్టేది. దానికి వాళ్ళిచ్చే కొద్దిపాటి కూలీ డబ్బులతో కష్టంగా ఇల్లు గడిచేది. నాన్నపోగానే నన్ను బడికి పంపడం మానేస్తుండొచ్చని భయమేసింది. ఓనాడు స్కూల్లో చెట్టుకింద కూర్చొని ఏడుస్తున్నాను. అది మా క్లాసు టీచర్‌గమనించారు. నన్ను చేరదీసి విషయం తెలుసుకొన్నారు. ఓదార్చి సాయంకాలం నాతో పాటు ఇంటికి వచ్చి అమ్మను కలిసారు. నన్ను ఎప్పటివలె బడికి పంపాలని అమ్మకు చెప్పారు. ఫీజూ, ఇతర ఖర్చులు తాను భరిస్తానన్నారు. అప్పటినుండి పదవక్లాసు వరకు నా ఫీజులు, యూనిఫాం, అన్నింటి బాధ్యత ఆమే తీసుకున్నారు. పదవక్లాసులో నాకు మంచి మార్కులు వచ్చాయి. టీచరే స్వయంగా ఇంటర్మీడియట్‌కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‌ను కలిసి అడ్మిషన్‌ఇప్పించారు. ఫీజు మాఫీ చేయించారు. నాకు ఆక్సిడెంట్‌అయినప్పుడు ప్రిన్సిపాల్‌గారు, టీచర్‌ఇద్దరూ నన్ను ఆదుకున్నారు. ఎక్కడున్నారో? వారికి నా ప్రణామాలుఅని చేతులెత్తి దండం పెట్టింది.

ఇంటర్‌తర్వాత ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాను. కాని నా ప్రయత్నాలేవీ ఫలించలేదుచివరికి రెండు ఇళ్ళల్లో పిల్లలకు ట్యూషన్‌చెప్పే పని దొరికింది. ఆర్నెల్లలోనే అది మానేయాల్సి వచ్చింది. అక్కడ చురకత్తుల్లాంటి కొందరి కళ్ళు నా శరీరానికి తూట్లు పొడిచేవి. కాని అప్పుడే అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది. అస్తమా జబ్బుతో ఆమె పూర్తిగా నీరసించిపోయింది. అదే సమయంలో మా మేనమామ  అమ్మను చూడడానికి వచ్చారు. అతను ఒక ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించారు. ఉదయం 8 నుండి 12 గంటల వరకు, పగలు 2 నుండి 6 వరకు తీరిక లేకుండా పనిచేయాల్సి వచ్చేది. ఉద్యోగం ఆర్నెల్లు చేశాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడి ఆమె మళ్ళీ బట్టలు కుట్టడం ప్రారంభించింది. అదే సమయంలో మామయ్య మళ్ళీ వచ్చాడు. ఎట్లైనా నాకు డ్రైవింగ్‌నేర్పించమని ప్రాధేయపడ్డాను. ఆయన నా మొరను ఆలకించి తనతోపాటు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళారు. అక్కడ తనకు తెలిసిన ఒక వెహికిల్‌ఇన్స్‌పెక్టర్‌దగ్గరకు నన్ను తీసుకెళ్ళారు. ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. నీలో తెలివితేటలు, పట్టుదల ఉన్నాయి. ఇది చాలా టఫ్‌జాబ్‌. అమ్మాయిల కనుకూలమైన   రంగాలు ఎన్నో ఉండగా ఇదే ఎందుకెంచుకున్నావమ్మా?” అంటూ ఆశ్చర్యంగా అడిగారు. నేను చెప్పిన జవాబులు, నా మొండి పట్టుదల చూసి నవ్వారు. వెంటనే ఒక ట్రైనింగ్‌ఇనిస్టిట్యూట్‌కు ఫోన్‌చేసి కారు డ్రైవింగ్‌లో నాకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అక్కడ రెండు నెలలు శిక్షణ తీసుకుని సర్టిఫికెట్‌సంపాదించాను. మిడ్‌సైజ్‌కార్లు గూడా అవలీలగా నడిపే నేర్పును స్వంతం చేసుకున్నాను. తిరిగి వెళ్ళి ఇన్‌స్పెక్టర్‌గారికి కృతజ్ఞతలు చెప్పాను. ఆయన స్వయంగా నా డ్రైవింగ్‌స్కిల్స్‌పరీక్షించి ఒక టెస్టిమోనియల్‌ఇచ్చారు. అది మీరు చూశారు మేడమ్‌!”.

ఔను. శభాష్‌!అంటూ ఆమె రమ భుజం తట్టింది.

మీ మామయ్య చాలా సంతోషించి ఉంటారు?”

ఔను మేడమ్‌! ఆయన ఎప్పుడూ నన్ను ఎంకరేజ్‌చేసేవారు. ఆయన భార్య అందుకు వ్యతిరేకం. శిక్షణ వాళ్ళ ఊళ్ళోనే కాబట్టి నా తిండి, ఉండటం వాళ్ళ ఇంట్లోనే. ఆమె రోజూ నా ఉత్సాహాన్ని నీరు కార్చేది. వెక్కిరింపులు, వెటకారాలు చేసేది. అసభ్యంగా అవమానకరంగా మాట్లాడేది. ఎన్ని చేసినా ఎదురు చెప్పకుండా నేను అన్నింటినీ సహించాను. అనుభవం నాకు చాలా నేర్పింది.

వెరీగుడ్‌రమా! పన్నెండయింది కదా. నేను స్నానం చేసి ఫ్రెష్‌అయి వస్తా. లంచ్‌చేద్దాం. తర్వాత సాయంకాలం మళ్ళీ కలుద్దాం!

అలాగే, థాంక్స్‌మేడమ్‌!

డోంట్‌బీ సో ఫార్మల్‌రమా!అని ఆమె లేచారు.

* * * *

లాన్‌లో సేదదీరుతూ టీ సిప్‌చేస్తూ, నువ్వు నా పక్కన కూర్చుని చెప్పే మాటలు వింటూ నేను ప్రపంచాన్నే మరచిపోతున్నాను. మరో ప్రపంచంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. పరిసరాల ప్రభావమా? నీ ఆత్మీయతా? మరింకేదైనానా? తెలియటం లేదు. ఇంత కొద్దిసమయంలో  నాకింత దగ్గర ఎలా అయ్యావు రమా? నా హృదయాన్ని గెలుచుకున్నావు నువ్వు”.

మేడమ్‌!నిజంగానే తను మరో లోకం నుండి మాట్లాడుతున్నట్టే ఉంది. భావుక ప్రపంచం!

పిలుపుతో తేరుకుని, ”చెప్పు రమా! ఉద్యోగంలోకెలా వచ్చావు? నా దగ్గర కెలా చేరావు?”

కారు నడపాలి. పెద్ద కార్లు నడపాలి అనే కోరిక క్రేజ్‌లాగా నన్ను వెంటాడింది. ట్రావెల్‌ఏజెన్సీలకు వెళ్ళాను. వాళ్లందరూ రిజెక్ట్‌చేశారు. ఎవరో చెప్తే ఎంప్లాయిమెంట్‌ఎక్సేంజ్‌లో పేరు నమోదు చేసుకున్నా. ఆర్నెల్లు ఖాళీగానే ఉన్నా. త్వరగా ఉద్యోగంలో చేరి అమ్మ మీద ఆర్థికభారం తగ్గించాలనే ఆరాటం ఎక్కువయింది. అలాంటి స్థితిలో ఒక మహానుభావుడు సలహా ఇచ్చాడు: జిల్లా కలెక్టర్‌గారు చాలా మంచివారు. వారి దగ్గరకు వెళ్ళు. ఏదో ఒకటి చూపిస్తారు.”  ‘అబ్బో! కలెక్టర్‌గారేఅని బెదిరిపోయాను. నువ్వు ప్రయత్నించు. నీ వివరాలతో చీటీ పంపు. మేడమ్‌తప్పక నీకు ఇంటర్వ్యూ ఇస్తారు వెళ్ళుఅని ప్రోత్సహించాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. కాని రోజు నేను మీ సన్నిధిలో కూర్చోవడానికి అతనే కారకుడు”.

నీ పట్టుదల, నీ ఆత్మవిశ్వాసమే అలా అనుకూల పరిస్థితులను కల్పించాయిరమా! నువ్వు ఇంకా పైకి ఎదగాలి. ఎల్లప్పుడూ నీకు నా ఆశీస్సులుంటాయి.

థాంక్స్‌మేడమ్‌!అని ఆమె పాదాలను స్పృశించింది రమ.

అలా చేయకు రమా!

లేదు మేడమ్‌! మీరు నాకు అన్నీను. యజమాని, శ్రేయోభిలాషి, గురువు, నా ఆదర్శము”.

చాలాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దమేలింది. దాన్ని ఛేదిస్తూ, ”మేడమ్‌! అమ్మగారిని ఇక్కడకు రప్పించండిఅని రమ విన్నవించింది.

ఆమె రారు రమా! ఆమెకీ ప్రపంచంలో ఆసక్తిలేదు. ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉంటారు. ఇదివరకటి ప్రయత్నాలన్నీ విఫలమయినవి. కనీసం అక్కడి పరిసరాలు ఆమెకు సుపరిచితము. వాటికి అలవాటు పడి ఉన్నారు. ఇక్కడ మళ్ళా అంతా కొత్త. ఇక్కడ ఆమెకు టైమెవరు ఇస్తారు?”

నేనున్నానుగా మేడమ్‌! నేనిస్తాను అమ్మగారికి టైం. నా మాట వినండి. నన్ను తీసుకెళ్ళండి. అమ్మగారిని ఇక్కడకు రావడానికి ఒప్పించే బాద్యత నాది మేడమ్‌!ఉషారాణి కాశ్చర్యం వేసింది. ఏమి ఆత్మవిశ్వాసమీ పిల్లది!

మేడమ్‌!” ”ఊఁ!” ”రిలాక్సవ్వండి. బయట పరిసరాలను గమనించండి. పచ్చని చేల వైపు చూడండి. అల్లరి చేస్తూ అటూ ఇటూ చక్కర్లు కొట్టే పకక్షులను పరికించండి. వాటి చలాకితనం చూడండి. మీ హృదయం తేలిక పడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది.

కవిత్వం చెప్తున్నావు రమా!” ”అమ్మగారిని చూడడానికి వెళ్తుంటే నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉన్నది.

నువ్వు ఇన్సిస్ట్‌చేయకపోతే నేను అమ్మను చూడటానికి ఇంత త్వరగా వెళ్ళకపోయేదాన్ని. ఆఫీస్‌పనుల ఒత్తిడితో అమ్మను చూడాలనే ధ్యాసే ఉండడం లేదు నాకు.

దగ్గరలో కూడా లేరు కదా మేడమ్‌!” ”ఔను!

అందుకే అమ్మగారిని ఒప్పించి మన దగ్గరకే తీసుకొద్దాం మేడమ్‌!Kudos to your confidence!మనసులోనే అనుకొన్నారు ఉషారాణిగారు.

అమ్మాయిగారు వచ్చారు చూడండిఅని రంగయ్య చెప్పడంతో సరస్వతమ్మగారు ఆనందంతో కుర్చీలోంచి లేచి ముందుకు నడిచారు. తల్లిని అమాంతం కౌగిలించుకున్నారు ఉషారాణి. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగినయి. తిరిగి కుర్చీలో కూర్చోబెట్టి రమవైపు చూపిస్తూ అమ్మాయే పట్టుబట్టి నిన్ను చూడాలని రోజు నన్ను తీసుకువచ్చిందిఅని చెప్పారు.

రమ ఆమె పాదాలకు నమస్కరించి ఆమె చెంతనే నేలమీద కూర్చొన్నది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మిమ్మల్ని మొదటిసారి చూడడం కద అమ్మాగారూ!సరస్వతమ్మ ఆమె బుగ్గలు నిమిరారు. చుబుకమెత్తి కళ్ళలోకి చూసారు. అమాయకప్పిల్ల!మధ్యాహ్నం లంచ్‌తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి తల్లి తన గదిలోకి వెళ్ళగానే మేడమ్‌మరో గదిలోకెళ్ళారు. ఆమె బాగా అలసి ఉన్నారు. అమ్మగారు మెలకువతోనే ఉన్నారు. రమ నిదానంగా వెళ్ళి ఆమె కాళ్ళ వద్ద కూర్చుని మృదువుగా మసాజ్‌చేయసాగింది. పాదాలు, పిక్కలకు. తర్వాత పక్కటెముకలు, వీపు, నడుము భాగాలను సున్నితంగా రుద్దింది. దాదాపు గంటసేపు అలా చేసింతర్వాత అమ్మాయి చేతులను తన చేతుల్లోకి తీసుకుని దగ్గరకు రమ్మని సంజ్ఞచేశారు వృద్ధమాత. నుదుటిమీద ముద్దుపెట్టి ఆశీర్వదించింది. యువ హృదయం ఉద్వేగానికి లోనయ్యింది. రెండు కన్నీటిచుక్కలు ఆమె నయనాల నుండి రాలిపడినయి. కృతజ్ఞతతో అమ్మగారూ!అన్నది. ఎక్కడి తను! ఎక్కడ అమ్మగారు! ఎంత అదృష్టవంతురాలు తను!కాసేపటికి తమాయించుకుని, ”అమ్మగారూ! మిమ్మల్నొకటడుగనా?” అన్నది. అడుగు”.”మరి కాదనకూడదు.ఆలోచనలో పడ్డారామె. నేను అసాధ్యమైనదేదీ అడగను అమ్మగారూ!బతిమాలుతున్న స్వరంతో విన్నవించింది.

సరే చెప్పు”. ”మీరు మేడమ్‌దగ్గరకొచ్చి ఉండండి. నేనక్కడే ఉంటాను! రోజూ పనయిపోగానే మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేసుకుంటాను. మేడమ్‌చాలా మంచివారు. నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉచితంగా వసతి కల్పించారు. తన బంగళా ఆవరణలోనే. నన్ను సేవకురాలిగా చూడరు. చాలా ప్రేమతో ప్రవర్తిస్తారు.

విశ్వాసాన్ని కాపాడుకో బిడ్డా!” ”అట్లాగే అమ్మగారూ!అని తన వినతికి జవాబు కోసం  ఎదురుచూస్తున్నది రమ.

రమా! నాకు కొంచెం టైం ఇవ్వు. చెప్తాను. అప్పుడు నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్దువు”. ”అమ్మగారూ!అని లేచి గంతేసింది రమ.

మరుసటిరోజు తిరుగు ప్రయాణంలో, ”ఏమయింది రమా?” ఉషారాణిగారు ఆమెను పరీక్షించ దలచి అడిగారు. ఫలితం కోసం కొంచెం ఓపిక పట్టాలిగా మేడమ్‌!మేడం స్పందించకపోవడంతో, ధైర్యం చేసి తనే ప్రతిపాదించింది. దయచేసి కొద్దిరోజుల తర్వాత నన్ను మరోసారి పంపండిఅమ్మగారిని తప్పక తీసుకొస్తా”. ”సరే”.

నెలరోజులు కావచ్చింది. రొటీన్‌పనులు, మీటింగ్‌లు, టూర్లతో కలెక్టర్‌గారికి తీరికలేదు. ఒక శనివారం సాయంకాలం. అదను చూసి రమ అడిగింది. మేడమ్‌! నాకు రెండు రోజుల సెలవు, కారు కూడా ఇస్తే అమ్మగారిని తీసుకొస్తా. దారిలో ఒక చోట డాక్‌బంగ్లాలో అమ్మగారు విశ్రమించటానికి ఏర్పాటు కూడా చేయించండి”.

అమ్మగారు రాకపోతే?” ”వస్తారు మేడమ్‌”.

తీసుకురాకపోతే ఖర్చులు నీ జీతం నుంచి కోస్తా. సరేనా?” ”మేడమ్‌! మీ ఆజ్ఞ ఏదైనా నాకు శిరోధార్యం.

* * * *

ఊరు చేరుకోగానే సరాసరి అమ్మగారి దగ్గరికి చేరి ఆమె పాదాలకు నమస్కరించి పాదాల చెంతే కూర్చున్నది రమ. తన రెండుచేతులను ఆమె తొడలమీద వేసి తలను మోకాళ్ళ మీద ఆనించింది. పిల్ల తలను ఆప్యాయంగా నిమురుతూ, ”ఏంటి రమా! ఆందోళనగా ఉన్నావెందుకు?” అని అడిగారు సరస్వతమ్మగారు.

అమ్మగారూ! ఈసారి మీరు తప్పక రావాలి. మేడమ్‌కు నేను మాట ఇచ్చాను. మీరు రాకపోతే మేడమ్‌నామీద చర్య తీసుకొంటారు. నా జీతంలో కోత పెడ్తారు.

సరస్వతమ్మ హృదయం కరిగింది. ఏడ్వకు, వస్తాను. రేపు ఉదయమే బయల్దేరుదాం. నిశ్చింతగా ఉండుఅని రమను ఓదార్చారామె. మరుసటిరోజు ఉదయమే బయల్దేరి అనుకొన్న ప్రకారం మధ్యలో ఒక డాక్‌బంగ్లాలో ఆగి బ్రేక్‌ఫాస్ట్‌చేసి సేదదీరారు. తిరిగి ప్రయాణం సాగించి మధ్యాహ్నం రెండుగంటలకు క్షేమంగా తమ బంగళాకు చేరుకొన్నారు.

* * * *

అమ్మగారు బంగళాలో బాగా అడ్జస్టయ్యారు. ప్రేమతో కూడిన కూతురు పలుకులు, రమ రోజూ తన దగ్గరకొచ్చి ఇష్టంగా తనకు సేవ చేయడం ఇవన్నీ కలిసి తన జీవితంలో మార్పు వస్తున్నట్లు తోచిందామెకు. ఇది మాటల పిల్లకాదు. స్వచ్ఛమైన హృదయం గలదిఅని రమ పట్ల ఆమెకు నిశ్చితాభిప్రాయమేర్పడింది. తెలియకుండానే అమ్మాయి తనకు ఎంతో ఆత్మీయురాలనిపిస్తున్నది. అది తన తొడమీద చేయివేసి మోకాళ్ళమీద తల ఆనించి మరో చేత్తో తన పాదాలను, కాళ్ళను మృదువుగా నలుపుతుంటే తన కూతురు కృష్ణతేజను తలపిస్తున్నది.

మేడమ్‌దగ్గర ఒకరోజు పర్మిషన్‌తీసుకొని తమ ఊరికెళ్ళి మరుసటిరోజే తిరిగివచ్చింది రమ. రోజు అమ్మాయి ముఖంలో చిరునవ్వుకు బదులు చిరాకు గమనించారు మేడమ్‌. సాయంకాలం ఆమెను తన దగ్గరకు పిలుచుకుని కారణమడిగారు.

నాకు తెలియకుండానే మావాళ్ళు నాకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏకంగా సంబంధం ఖాయం చేసుకొచ్చాడట మా మామయ్య. ఆయన భార్య తరఫు వాళ్లయి వుంటారు. మామయ్య ఆమె ఒత్తిడికి లొంగి అలా చేసి ఉంటారు. నేను ససేమిరా కాదని వచ్చేశాను మేడమ్‌.రమ తన ఆవేదననంతా వెలిబుచ్చింది.

అంత మాత్రానికే అప్‌సెట్‌అయితే ఎలా రమా! సమస్యల నెదుర్కొనడం నేర్చుకో. నన్ను చూస్తున్నావుగా! రోజూ ఎన్ని ఒత్తిళ్ళు. ధైర్యంగా, స్థిరచిత్తంతో ఎదుర్కొనకపోతే దెబ్బతింటాం.కొంచెంసేపాగి, ”ఒకసారి మీ అమ్మనిక్కడకు పిలువు”  అని ఆదేశించారు మేడమ్‌.

వారం రోజుల్లో ఒక ఆదివారంనాడు ఊరినుండి రమ వాళ్ళ అమ్మ వచ్చింది. ఆమెను పిలిచి మేడమ్‌చెప్పారు: చూడమ్మా! రమ కష్టపడి పైకి వస్తూన్నది. ఆమె ఇంకా ఎదగాలి. ఆమె ఇష్టం లేకుండా పెళ్ళి ప్రయత్నాలు చేయకండి. ఆమె మీరు గర్వపడేలా చేస్తుంది. మీ ఆశలు, ఆకాంక్షలు ఆమెకు తెలుసు. మరో విషయంఊళ్ళో మీరు ఒంటరిగా ఉండడమెందుకు? ఇక్కడికి వచ్చి రమ దగ్గర ఉండండి

సరే మేడమ్‌! దాని కిష్టం లేని పనేమీ చేయం. ఇక నేను ఇక్కడికి వచ్చి ఉండడం గురించి, కొద్ది రోజుల తర్వాతే అది సాధ్యపడుతుందిఅని చెప్పి మేడమ్‌దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయిందామె.

* * * *

కలెక్టర్‌మేడమ్‌దగ్గర ఉద్యోగంలో చేరి రమకు మూడేళ్ళు కావస్తున్నది. మేడమ్‌కామె స్వంత ఇంటిమనిషి లాగయిపోయింది. అమ్మగారి హృదయంలో నైతే ఆమె పోయిన కూతురు స్థానం నాక్రమించింది. అయినా అమ్మాయి అణకువలోగాని, విశ్వాసంలోగాని కించిత్తు మార్పు రాలేదు. పదిమంది ఎదుట చాలా జాగ్రత్తగా మసలుకొంటుంది. అంతరంగంలోని భావం బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారే కాని మేడం హృదయంలోను రమ తన పోయిన చెల్లె స్థానాన్ని పూరించింది.

రాత్రిళ్ళు రమ అమ్మగారి గదిలోనే పడుకోవాలి. ఒక్కరాత్రి ఆమె లేకపోతే రాత్రి అమ్మగారి నిద్ర మాయమైపోతుంది. తన పక్కనే మంచం వేయించారామె. రమ మంచాన్ని పక్కకు జరిపి అమ్మగారి మంచం పక్కన నేలమీదనే పరుపు పరచుకుని పడుకుంటుంది.

ఓనాటి రాత్రి రమ అమ్మగారి కాళ్ళకు మసాజ్‌చేస్తున్నది. అమ్మా! రమా! ఇలా దగ్గరకు రాఅని ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకుని అడిగారు: నీకు ఇంకా చదువుకోవాలని ఉంటే నేను నిన్ను  చదివిస్తాను. లేదా ఇంకేదైనా చేయాలనుకుంటున్నావా చెప్పు!

అమ్మగారూ! చిన్నప్పటినుండి నేను కలలు కనేదాన్ని. కార్లు నడపాలని, పెద్ద పెద్ద కార్లు నడపాలని ఉబలాటపడేదాన్ని. ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే వాటిని అలా చూస్తూనే ఉండిపోయేదాన్ని. ఎప్పటికైనా వాటిలాగా నేనూ ఎగరాలని ఉవ్విళ్ళూరేదాన్ని.ఆమె తలను ఆప్యాయంగా నిమురుతూ, ”పైలట్‌కావాలనుకుంటున్నావా?” అని అడిగారు అమ్మగారు. ఔనన్నట్లుగా తలూపిందా అమ్మాయి. నేను అక్కకు చెప్పి దాని కోసం ఏర్పాటు చేయిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు”. ”ఎవరు, మేడమ్‌తోనా అమ్మగారూ?” ఔనని చిరునవ్వుతోనే  చెప్పారామె.

అమ్మగారి కోరిక మేరకు కలెక్టర్‌మేడమ్‌రాజధానిలో ఉన్న ఒక ఏవియేషన్‌అకాడమీ వారితో మాట్లాడి సెలెక్షన్‌కోసం రమను పంపించారు. అన్ని అర్హతలు సరిపోవడంతో ఆమెను మెడికల్‌ఎక్జామినేషన్‌కు రెఫర్‌చేశారు. అక్కడా ఆమె అర్హత సాధించింది. పద్దెనిమిది నెలల C.P.L కోర్సులో చేరి విజయవంతంగా పూర్తిచేసింది. వెంటనే వచ్చి నేరుగా అమ్మగారి కాళ్ళ మీద వాలిపోయింది. నా బిడ్డ రేపో, ఎల్లుండో రెక్కలు కట్టుకొని గాలిలో ఎగిరిపోతుంది. దానితో పాటు నేనూ ఎగిరిపోతా”.

అమ్మా!కలెక్టర్‌మేడమ్‌నవ్వాపుకోలేకపోయారు.

రమ వెనుకకు తిరిగి ఆమెకు పాదాభివందనం చేసి  మేడమ్‌! నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఇది కలయా! నిజమా! మీ ఋణం ఎలా తీర్చుకోగలను చెప్పండి!ఆమె గొంతు జీరబోయింది.

ఇప్పుడైనా అక్కా!అని పిలువు”. చిరునవ్వులు చిందిస్తూ మీరు నాకు ఎప్పుడూ మేడమే!అంటూ సెల్యూట్‌చేసింది రమ.

మరుసటిరోజు సాయంత్రం కలెక్టరాఫీసులో అభినందన సభ ఏర్పాటుచేశారుకలెక్టర్‌ఉషారాణి మేడమ్‌అధ్యక్షత వహించారు. సభకు జిల్లాలోని ఆఫీసర్లు, ఉద్యోగులే కాకుండా పురప్రముఖులనూ ఆహ్వానించారు. అందరూ రమను ఘనంగా సత్కరించి, అభినందించారు. ఆమె తన మెడ నలంకరించిన దండలన్నింటినీ తీసి వినమ్రంగా అమ్మగారి పాదాల చెంత పరిచి సాష్టాంగప్రణామం చేసింది. అమ్మగారు బిడ్డను ఎత్తి ఆలింగనం చేసుకుని కరతాళ ధ్వనుల మధ్య ఆశీర్వదించారు. తనకు బహూకరించిన అభినందన పత్రాలను అమ్మాయి కలెక్టర్‌మేడమ్‌దోసిట్లో ఉంచి ఆమె పాదాలకు నమస్కరించింది. రమను ఎత్తి నిండుసభలో ఆమెను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించి కలెక్టర్‌గారు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. సభికులందరూ ఆశ్చర్యచకితులయ్యారు.

వార్త జిల్లాలో, జిల్లా బయటా ప్రచండ మారుతంలా వ్యాపించింది. స్కూళ్ళలో, కాలేజీల్లో యువతీ యువకులు సంబరాలు చేసుకొన్నారు. ఎవరిని కదిలించినా పైలట్‌రమపేరే వినిపిస్తూన్నది. మారుమూల గ్రామ మహిళా పైలట్‌!

m  m  m

You may also like

Leave a Comment