Home ఇంట‌ర్వ్యూలు దళిత సాహిత్య కేతనం

దళిత సాహిత్య కేతనం

by Vemula Ellaiah

“బేగరి కథలు, దగ్ధం కథలు, మా పల్లె కథలు, బుగాడ కథలూ వంటి కథలను, మాలచువమ్మ , ఇగురం వంటి నవలలను, కులాత్కమ్ నాటకాన్ని , మారవారి చరిత్ర నూ రచించి అస్తిత్వానికి చిహ్నమైన రచయితగా ప్రసిద్ది పొందిన కవి, రచయిత భూతం ముత్యాలు సాహిత్య ప్రస్తానాన్ని మయూఖ పత్రిక ముఖాముఖి లో తెలుసుకుందాం….

జ:కథా, కథన, శిల్ప, ధృక్పదం గూర్చి మీ ప్రశ్నలోనే సమాధానముందు. ఇక నా రచనలకు మూల సూత్రం అంటారా? అది ఊరిలోని దళిత వాడ జీవితం, వాడ జీవితాలను దగ్గరగా చూసి, స్వీయనుభవంతో, రచనలు చేస్తున్న నారచనలకు మూలాలు వాడ బతుకు చిత్రమే. మట్టి మనుషుల వెతలు, ఆకలి, అంటరానితనం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, నిరుద్యోగంతో కునారిల్లుతున్న దళితులే నా (ఇన్స్పిరేషన్ప్రేరకులు), అందునా నేను ఒక దళితుడను కావడం, నా బాల్యం నుంచి పైన చెప్పిన అంశాలు నన్ను ఏదో ఒక సందర్భంలో పీడనకు గురిచేశాయి. నా మూలాల్లోకి నేను తొంగి చూసి నిజాల్ని నిర్భయంగా నికార్సుగా చెప్పే ప్రయత్నం చేశా…., చేస్తూనే వుంటా….

జ:మీరన్న దాంట్లో కొంత నిజముంది. నేను 2000సంవత్సరం లో తెలుగు సాహిత్యంలోకి అడిగిడే నాటికి దళిత సాహిత్యంలో కొంత స్తబ్దత ఏర్పడింది కాని పూర్తిగా ఆగిపోలే, ఆరిపోలే… దళిత సాహిత్యం ” నివురుగప్పిన నిప్పులా “.చాపకిందనీరులాప్రవహిస్తు ” నాలాంటి వారి మస్తిష్కాలలో నిక్షితమైంది. 2002లో నల్గొండలో దళిత సాహిత్య సదస్సు జరిగింది. ఆ వేదిక నాతోటివర్తమాన కవులకు దిశానిర్దేశం చేసింది. అలా నా అస్తిత్వ ములాల్లోకి వెళ్ళాను. గోవును పవిత్రంగా భావించి పూజించే సంస్కృతి అగ్రవర్ణాలది. దాని కంటే ఎక్కువ శ్రమజేసి ఎక్కువ పాలు ఇచ్చె బర్రె, తన సలుపు రంగు వర్ణం కారణంగా వివక్షకు గురైంది. అందుకే దానిని నా జాతికి చిహ్నంగా భావించి” బర్రె కవిత రాశా. వివక్ష మనుషులోనే కాదు జంతువులలో ఉంది. అనేది నిజం… ఆ కోణంలో వచ్చిందే ” బర్రె” కవిత….

జ:స్థబ్దత కాలంలో దళిత సాహిత్య సదస్సు నాకు దిశానిర్దేశం చేయగా, అంతకు ముందు నేను భావవాద, అభ్యుదయవాదం, ప్రణయ కవితల ఊహాల్లోతేలియడే నాకు వేముల ఎల్లయ్య (కక్క నవలాకారుడి) సూచనలు నన్ను ప్రభావితం చేసిదళితవాదంవైపు మళ్లించాయి. ” పాయిదా” (గుడిపాటి వ్యాసాలు) కూడ నాలో నూతన జవసత్యాలు నింపాయి. నేను చేయాల్సింది, రాయాల్సింది నా మూలాల్లోకి వెళ్లి శోధన చేశా.. అందుకు ” ఏడుతరాలు ” నవల, బోయ జంగయ్య రచనలు అందుకు దోహదం చేశాయి. వాటికున్న శక్తి అటువంటిది. అలా మొదటదుగిలి ” దళిత కవిత్వం వెలువడింది.

జ:నాగరికత చలనశీలమైంది. నిత్యం నూతన మార్పులు చోటుచేసుకుంటాయి. అది ఒకనాడు దళితుల, ఆదివాసలు, అయిన ఈ దేశ మూల వాసుల సోత్తు.అసలు ” సంస్కృతిని శ్రామికులు, కళాకారులు, శాస్త్రవేత్తలు నిర్మిస్తారని గోర్కి తన వ్యాసాలలో పేర్కొన్నారు”. అలా దళిత, ఆదివాసుల శ్రమతో నిర్మితమైన సంస్కృతి నేడు అగ్రవర్ణాల చెప్పుచేతుల్లోకి వెళ్లింది. ఒకనాడు శూద్రులు అయిన ఆధిపత్య కులాలు నేడు శాసనకర్తలైరి, సంస్కృతి పేరకల్చర్ని దళితులపై రుద్ది అదే దేశ సంస్కృతి అనిచలామనిచేస్తుండ్రు అగ్రవర్ణాలు, కాని ప్రతి జాతికి తమదైన చరిత్ర సంస్కృతి ఉందన్న విషయం మరవరాదు.

జ: నేను దళిత కవిని, ముందుగా దళిత పక్షం. పీడుతులు, అణచబడిన, అణగారిన, అట్టుడుగు వర్గాలు, అస్పృశ్యల జీవన సంవేదనలు. వారి ఇతిభాదలకు అక్షర రూపాలే నా రచనలు. నేను కథ రాసినా, నవల రాసినా అందులో వారే నా కథవస్తువులు, ప్రపంచంలోని ఏ కవి అయినా పీడిత జన పక్షంవైపు నిలవాలి. అలా నిలబడకుండా వారి జీవతాలను సృజించకుండా ఉండేకవి, రచయిత, రచయితగా మనలేదు. నేడు ప్రసిద్ధ కవులుగాపేరెన్నికగన్న కవులు  రచయితలు దళితుల జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని దళిత స్పృహతో రచనలు చేసారుపేరుగడించారు శ్రీపాద పుల్లంరాజు కథ,లేదా ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల, కారా మాస్టారు యజ్ఞం కథ, పాలగుమ్మి పద్మరాజు గాలిగాన కథ ఆ కోవలోనివి.

జ:నేను బాల్యం నుంచే పీడనకు, విపక్షకు, ఆకలి, కడుదారిద్య్రం, మూఢనమ్మకాల కు, గురైన బాధితున్ని, అందుకు ప్రధాన కారణం కులం. ఈ దేశంలో కులం ఉన్నంత వరకు వివక్ష ఉంటంది. అంబేద్కర్ఆశయమైన కుల నిర్మూలన ” జరగాలి. నేను ఎంచుకున్న పాత్రలతో రచయితగా సంతృప్తి ఉంది. కులాలు లేని -సమసమాజాన్ని కాంక్షించడమే నా ఫిలాసఫీ…

జ: ఉత్పత్తి కులాలలో కళాత్మక సౌందర్యం ఉన్నప్పటికి అది శ్రమ నుంచి ఆవిర్భవించింది. ఇక బెగరికులాందైయనీయమైన జీవితం. మిగతా ఉత్పత్తి కులలకురోజువారి పని లభిస్తుంది. వారికి జీవనౌపాధి ఉ ంది. కుల వృత్తి ఉంది. కాని మాల బేగరికిఊరిలో ఎవరో ఒకరు చనిపోతేనే పని ఇది దుర్భరమైంది. ఇంతటి దర్భురమైన స్థితి ఏకులానికి లేదు. దీనికి ప్రధాన కారణం అగ్రవర్ణ ఆధిపత్య కుల వ్యవస్థ.

జ:నామొదటి కథల సంపుటి “బేగరికథలు” (2007) ఇది తీసుకురావాడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ కథలకు ఆపేరు పెట్టడానికి నేను మాలబేగరి కావడమే. కులం కూడుపెట్టక పోవడంతో నిరక్షరాస్యులు అయినా నా తల్లిదండ్రులు హైదరాబాదుకు వలస వచ్చారు. అది 70వ దశకం, నాబాల్యంలో కొంత పట్నంలో గడిపిన. చిన్ననాటి నుండి నాకుంటుంబం పడిన కష్టాలు వర్ణణాతీతం. అవి పగవానికి కూడ రావద్దని కోరుతా. చదువులేని మూఢ నమ్మకాలు హెచ్చు. దానితో వారి కష్టం అంతా (సంపద) మంత్రతంత్రాలు చేసే భూత వైద్యుల పాలు అయ్యింది. ఆ సంఘటన తల్చుకుంటే దుఃఖం వస్తది. అ.. కులాన్ని, అ… వృత్తిని ఈసడించుకొని అందులో నుంచి బైటపడి కూలీ జీవనం సాగించడం కొంత మెరుగునిపించె అందుకే అస్తిత్వాన్ని తెల్పుతుబేగరి కథలు …

జ:మనుషుల ప్రస్థావన రాక పూర్వం పురాణాల్లో దేవతలు రాక్షసులు, దాయాదులు(అన్నదమ్ములు), పక్షులు, జంతువులు ఈ నాలుగు సృష్టించినాక దాయాదుల పోరులో దేవత కుట్రలు కుయుక్తులతో ఆధిపత్యం దేవతల వశం అవుతుంది.తర్వాత మనిషి పుట్టక మానవకళ్యాణం లోకహితం జరగాలంటెముందుగాశివపార్వతులు కళ్యాణం జరగాలి, అటుతరువాత దేవతలు తమ కృత్యాలతోటి మోసాలు చేస్తేశపించబడిన దేవతలు భూమిపై రాక్షసులుగా పంచమలుగా పుట్టారని పురాణగాథల ద్వారా తెలుస్తుంది. ఇదంతా అదివాసులను, దళితులను ఒక్కవైపుఅణగదోక్కుతూ, పీడినకు గురి చేస్తునే శాపం నేపంతో దళితులను అక్కున చేర్చుకొనే ప్రయత్నం హిందు వర్ణ వ్యవస్థది. అందులో భాగమే దళితులు…

జ:నాడైనా, నేడైనా పాలకులు, కవులు, పాఠకులు పట్టం గట్టేది దళిత జీవితాల నేపథ్యం ఉన్న సాహిత్యానికే అని మరవరాదు. చాసో ” ఎంపు”, “కుంకుడాకు “, రావిశాస్త్రి “రత్తాలు రాంబాబు”, పాలగుమ్మి పద్మరాజు”గాలివాన. “, కాళీపట్నం రామారావు” యజ్ఞం ” కథా శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు “నన్నుగుర్చి రాయవు, చివరకుమిగిలేది “, గోపిచంద్ ” అసమర్ధని జీవయాత్ర”, త్రిపురనేణి రామస్వామి, చెరబండరాజు, వట్టికోట ” ప్రజల మనిషి “, బి.ఎస్. రాములు ” బతుకు పోరు, పాలు, సదువు”, బోయ జంగయ్య ” ఎచ్చరిక. చీమలు . గొర్రెలు, నా పేరు రాయోద్దు. కుండబద్దలుకొడతా, దొరసాని, తొడపాము, జాతర, జగడం ” వేముల ఎల్లయ్య “కక్క సిద్ధి” చిలుకూరి దేవపుత్ర” సోము, శిఖామణి, మువ్వలచేతికర్ర, ఎండ్లూరి సుధాకర్ “గోసంగి, కుసుమ ధర్మన్న” హరిజన శతకం, మాకు కొద్దునల్లదొరతం” మొదలగు దళిత, దళితేతర కవులు, రచయితల రచనలు దళిత నేపధ్యం ఉన్న సాహిత్యమే ననిగుర్తెరగాలి.

జ: “సూర ” నవల “గ్యోబాక్ టు విలేజ్” సూత్రాని అమలు చేసే ప్రయత్నం, చదువుకున్న యువత ఉ న్నఊరిని వదిలి పట్టణాలకు వలస వెళ్లితే గ్రామాలు అలాగే నిర్జీవంగా (ఎలాంటి అభివృద్ధికి నోచుకొక, అంధ విశ్వాసాలతో) ఉంటున్నాయి, మార్పు పల్లెల్లో జరగాలి, వాడలలో జరగాలి. అందుకే సూర నవలలో చదువుకున్న సూరడు తన ఊరు చేరి, ఊరిని ఉద్దరించాలని సంఘసంస్కరణకునడుంబిగాస్తాడు. అందులో భాగంగా వాడలో “ఫూలే అంబేడ్కర్ పాఠశాల పెట్టి పల్లె, వాడజనానికిఅక్షరజ్యోతిలు వెలిగించి నిరక్షరాస్యత నిర్మూలన, మూఢనమ్మకాలనను పారదోలాలనే ఆశయంతో ముందుకుసాగుతాడు.

జ:నవ్వుతూ…… ఈ తెలుగునేలపై ఎందరో ప్రజాకవులు, ప్రజా వాగ్గేయకారులు ఉండ్రు. వారిని చూసి నేను గర్వపడుతా.. నావంతుగా పీడిత జాతి జనం గొంతుకనైయి సాహితీ సేద్యం చేస్తున్నా. సాహిత్యంలో కొనసాగే కవులు తన రచనలలో ” నిక్కమైన నీలమొకటి చాలు” అన్నట్టు ఒక రచన వారిని కవిగా సాహితీ క్షేత్రంలో చిరస్థాయిగా నిలుపుతాయి. నా రచనలలో అలాంటిది ఒక్కటి ఉన్న చాలు. తాలు గింజల రచన కాలంతో కొట్టుకపోతాయి. నేనన్నా. నా రచనలన్నామింగుడుపడని వారికి అది బుగులు రేపితే దానికి నేనేంచేయను. వారు స్వతహాగా తమ రచనలతో పైకి రావాలి, అంతేగాని ఒక్కరిపై ఒక్కరు ఈర్షపడితే, లేదా పొగిడితే ఒచ్చెదేంలేదు.వారి రాతలు  వారు సృజించిన సాహిత్యమే వారిని నిలబెడుతుంది. ఎవ్వరైనా ఎదుటివారి ప్రతిభ గుర్తించాలి.

జ:నిజానికి గ్రామాలు ధ్వంసం కావాలని నేను ఆకాంక్షిస్త… ఎందుకంటే గ్రామాలలోనే మితిమీరిన అందవిశ్వాసాలు, కులకట్టడలు, ఆచారాలు, మూఢ నమ్మకాలు, అంటరానితనం, నిరక్షరాస్యత అధిక్యం, నన్నేతీసుకొండి…. నేను నిమ్నవర్గం…. నా బ్యాలం నుండి నా ఊరిని వదిలి చదువు నిమిత్తం పట్టణానికి వలస వచ్చా. ఇక్కడనే వసతి గృహాలలో చదువుకొని ఇక్కడ నుంచే ఉపాధ్యాయునిగా స్థిరపడ్డా. నా ప్రవృత్తి రచన, వ్యాసంగం. ఇపుడు ఊరి వైపు చూస్తే నాకే జాలి కలిగింది. నా తరువాత తరం నుంచి నేటికి ఒక్క  ఉద్యోగి నా వాడ నుంచి రాలేదు… అది మారని ఊరికి నిదర్శనం…. అందుకే నేను గ్రామాలు ధ్వంసం కావాలని కోరుకుంటునే, గ్రామాలను ఉద్దరించాలన్న తపనతో ” సూర” నవల రాయడం జరిగింది…

జ:ఉన్న ఊరు కన్న తల్లిలాంటిది అంటారు. అందుకే ఊరిపై మమకారంతో చాలామంది కవులు తమ కవితలలో, పాటలలో ఊరును ఊరు మట్టి వాసనలను వెదజల్లుతుఊరినికీర్తిస్తు రచనలు చేశారు. కన్న తల్లి, తండ్రి, ఒక రైతు కూలి, ఒక పాలేరుగా ఊరిజన జీవితాలు మట్టితో మమేకమైతాయ్.” అమ్మయాది “, ” నాయనమనాది ” కవితలలో (దుగిలిసంకలనంలోవి) మట్టివాసనలు పుష్కలంగా కనిపిస్తాయి. అసలు మనిషి మట్టిలో నుంచి వచ్చి చివరకు మట్టిలో కలవాల్సిందే. పల్లె మట్టివాసనల పరిమళసుగంధాలు ఆస్వాదించాలంటే పల్లె వాడ జీవితాలను తడిమి చూస్తె గాని అది భోదపడదు.

 జ:మీరన్నది నిజమే…. వారిది కడుపునిండిన కవిత్వం, వారికి శ్రమైకజీవనసౌందర్యం అంటే ఎట్ల తెలుస్తుంది. ఆకలి కేకలు, అప్పుల బాధలు బాంచెను బతుకులు, బతుకుఎతలు, అస్పృశ్యత, పీడన, దళిత కవుల సొంతం. దళిత కవుల బలహీనతలైన ఆకలి, పేదరికం, నిరుద్యోగం వీటి ఆసరాతో వారు దళితుల మధ్య చీలికలు తీసుకొచ్చి తమ పబ్బం గడుపుకుంటుండ్రు. దళితులను ఉద్దరిస్తున్నమని చెప్పుకునే పాలకులు, అగ్రవర్ణకవులు వారికి అనుంగులుగా మారిన ఒకరిద్దరు దళిత కవులకు బిక్షవేసినట్టు పదవులో, పురస్కారాలో ఇచ్చి దళిత కవులు ఉద్దరిస్తునమనిఉపన్యాసాలిస్తరు. భీమన్న, జాషువా, జంగయ్య, కుసుమ ధర్మన్న, జయంతులు, వర్ధంతులు జరిపి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారి గుర్చి ఎక్కడ కూడ సరిగా గుర్తు చేయకపోవడం అందరికీ తెలిసిందే. దీనిని దళిత కవులు గమనించి అంబేద్కర్ ఆశయంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా……

జ:స్వాతంత్రానికి పూర్వం నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలు, దొరలు, దేశముఖ్ లు, నాడు కులమతాలకు అతీతంగా దురాగతాలు సాగించారు. నాటి ప్రపంచ విప్లవాల ప్రభావం మనపైపడడటంతో ఇక్కడి ప్రజలు నల్లగొండ కేంద్రంగా సాయుధ పోరాటం సాగించిండ్రు. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఘట్టం కాని స్వాతంత్య్రనంతర పరిస్థితుల వేరు అధికార మార్పిడి జరిగింది కాని ఈ ప్రాంత దళితుల జీవితాలు మారలే, అదే సమయంలో అంబేద్కర్ భావజాలం దేశ నలుమూలల విస్తరించింది. ఈ నేలపై మెదరిభాగ్యరెడ్డి వర్మ సంఘసంస్కరణకు పూనుకున్నాడు. అక్షరం అంటరాని వాడకు నడిచివచ్చింది. ఆ క్రమంలో అనేక మంది ” అంబేద్కరిస్టుదృక్పధంతో ముందుకు సాగిండ్రు “. ” అంబేడ్కర్ కుల నిర్మూలన సిద్ధాంతానికి ” పీడిత ప్రజలు జేజేలు పలికారు…. వాస్తవిక దృక్పధం నాటి ఆధిపత్య కవులు దళిత సానుభూతి రచనలు చేశారు. అలా ఈ ప్రాంతంలో అంబేద్కర్ భావజాలం పురుడుపోసుకుంది.

స్వాతంత్రానికి పూర్వం నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలు, దొరలు, దేశముఖ్లు, నాడు కులమతాలకు అతీతంగా దురాగతాలు సాగించారు. నాటి ప్రపంచ విప్లవాల ప్రభావం మనపైపడడటంతో ఇక్కడి ప్రజలు నల్లగొండ కేంద్రంగా సాయుధ పోరాటం సాగించిండ్రు. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఘట్టం కాని స్వాతంత్య్రనంతర పరిస్థితుల వేరు అధికార మార్పిడి జరిగింది కాని ఈ ప్రాంత దళితుల జీవితాలు మారలే, అదే సమయంలో అంబేద్కర్ భావజాలం దేశ నలుమూలల విస్తరించింది. ఈ నేలపై మెదరిభాగ్యరెడ్డి వర్మ సంఘసంస్కరణకు పూనుకున్నాడు. అక్షరం అంటరాని వాడకు నడిచివచ్చింది. ఆ క్రమంలో అనేక మంది ” అంబేద్కరిస్టుదృక్పధంతో ముందుకు సాగిండ్రు “. ” అంబేడ్కర్ కుల నిర్మూలన సిద్ధాంతానికి ” పీడిత ప్రజలు జేజేలు పలికారు…. వాస్తవిక దృక్పధం నాటి ఆధిపత్య కవులు దళిత సానుభూతి రచనలు చేశారు. అలా ఈ ప్రాంతంలో అంబేద్కర్ భావజాలం పురుడుపోసుకుంది.

జ: ప్రత్యేక తెలంగాణ నినాదంతో సాయుధ పోరాటం 1969లోజరిగిన తెలంగాణ ఉద్యమ ఫలితంగా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరుస్తూ సాహిత్యంలో తమ గొంతుకను వినిపించారు. మరి ముఖ్యంగా గత రెండు దశాబ్దల నుండి ప్రాంతీయ అస్తిత్వ వాదం పుంజుకుంది. ఈ ప్రాంతపు రచయితలు బి.ఎస్. రాములు, అల్లం రాజయ్య, బోయ జంగయ్య, వేముల ఎల్లయ్య. తుమ్మెటిరఘోత్తమ రెడ్డి, ముదిగంటి సుజాత రెడ్డి, జాతశ్రీ, భూతం ముత్యాలు, పెద్దింటి అశోక్ కుమార్, దేవరాజు మహారాజు, కాలువ మల్లయ్య తదితరలు తెలంగాణ అస్తిత్వ వాదనతో కథ రచనలు చేశారు. వీరు ఈ ప్రాంత జనజీవితాలను కుంగదీసిన గ్లోబలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలు దోపిడి, పీడన నేపథ్యంలో కథలు కొత్త పుంతలు తొక్కాయి. యదార్థ, వ్యధాభరిత దృశ్యాల్ని సంఘటనలను కథలుగా మలిచి తెలంగాణ అస్తిత్వవాదం పేరిట కథలు, కథసంకలనాలు తీసుకొని వచ్చారు. ఉద్యమకాలంలో హోరు, బద్లలా తదనంతరం అనేక కథలు వచ్చాయి.

జ:తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో దళిత కవులు పాలుపంచుకున్నారు. బోయ జంగయ్య, గూడ అంజయ్య, జాతశ్రీ, వేమల ఎల్లయ్య, భూతం ముత్యాలు, పసునూరి రవీందర్, గాదె వెంకట్, మన్నెఏలియా, జిలకర శ్రీనివాస్, కొమ్ము సుధాకర్, పిట్టల శ్రీనివాస్, జూపాకసుబధ్ర, జాజుల గౌరి, గోగు శ్యామల, మద్దెలశాంతయ్య, బన్నఅయిలయ్య, గౌరటి వెంకన్న, జయరాజ్, పైల్లం సంతోష్, వరకుమార్, సిద్దెంకి యాదగిరి, ఇక్కడి పరిస్థితలుకు అద్దం పట్టేలా రచనలు చేస్తునేవుండ్రు. ఐతే ఇందులో కొందరు కవులు పాలకులకు అమ్ముడుపోయినట్టు వారి తీరు వారి రచనలలో కనపడది. కాని ప్రలోభాలకు లొంగని కవులు ప్రజాపక్షంవైపు ఉండి జనహితమే… తమ హితంగా రచనలు చేస్తుడండ్రు. దళితులలో చీలికలు తీసుకవచ్చి తమ పబ్బం గడుపుకుంటున్నారు అధిపత్య కవులు. అయితే అది తాత్కలికమని మరవరాదు.

జ: ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ దొరల తెలంగాణగా అవతరించింది. తెలంగాణకై పొరాటాలు చేసి అసువులుబాసి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల కొరుకున్న తెలంగాణ ఏర్పడలేదు. తాత్కాలిక అవసరాలు తీర్చే నేతలు మాటలు నేతి మీర చందం అయినయ్. కాని యువత ఆకాంక్ష అయిన విద్య, ఉద్యోగ, ఉపాధి, కలగానే మిగిలింది. నీళ్లు, నిధులు మాటలకే పరిమితమ్యైంది. కవులు పాలకుల వైఫల్యాన్ని ఎండగుతుఆదిశగా రచనలు మరిన్ని రావాల్సివుంది. వస్తయని ఆశిస్తున్న ఏ ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్ష మేరకే మనగలదు. విఫలమైతే పలాయనం తప్పదు.

పై వారిలో ఒక్కరు ” ముత్యాల సరాలు రాసిన కవి “గురజాడ ” కవితా పాదంలో పేరున్న వాక్యం అది, అతని సంస్కర్త హృదయాన్ని సూచిస్తుంది. అది సానుభూతి రచనగానే చూడాలి అని భావిస్తున్న. ఇక చెరబండరాజు విప్లవ కవి విప్లవంలో కులముంది. శ్రమ జీవుల పక్షం వహించి చెరబండరాజు రచనలు చేసినారు. కాని దళిత పక్షాన రచనలు చేసివుంటే మేము అతన్ని అక్కున చేర్చుకునేవాళ్లం. అలా జరగలేదు. అయినను చెరబండరాజును ప్రజాకవిగా గుర్తింస్తాం.

జ:అది అగ్రవర్ణ కవుల కుట్ర, ఎందుకంటే ఒక ఆధిపత్య కవి ఎలా రచన చేసినా అతను కులం, ప్రాంతం, ఎల్లలు దాటి విశ్వకవిగాచలామనిఅయితడు. “పుల్లంరాజు ” కథ రాసిన శ్రీపాద ” మాలపల్లి ” నవల రాసిన ఉన్నవ, ” ముత్యాల సరాలు రాసిన గురజాడ, చాసో “ఏంపు, కుంకుడాకు” కార మాష్టారు “యజ్ఞం ” కథ, పాలగుమ్మి పద్మరాజు ” గాలివాన ” కథలు తెలుగు సాహితీ ఎల్లలు దాటి విశ్వవిపణిలో పేర్లుగడిచాయి. అదే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని కరువు పెడుతు రచన చేస్తే ప్రాంతీయ వాది అని ముద్ర వేస్తారు. అలాగే దళిత నేపథ్యంలో వాడ బతుకులను చిత్రించి తమ కులం, జాతి ఇతి బాధలను అక్షరబద్ధం చేసి రచనలు చేస్తే దళిత కవులని, దళిత అస్తిత్వవాదులని పేరు పెట్టి పిలవడంను పరిపాటి అయ్యింది ఆగ్రవర్ణ కవులకు. నిజానికి దళిత జీవితాలను కథలుగా మలచినవారువిశ్వకవులు అయ్యారు. తమ్మని తాము ఆర్తితో గోడు వినిపిస్తే దళిత కవులు అని ముద్రవేస్తారు. ఇది కుట్ర కాక మరి ఏమిటి?

జ:నాకు చాలా సంతోషమనిస్తది. నేను సజీవంగా ఉండగానే నా రచనలు యూనివర్సిటీలలో పాఠ్యాశాంలుగా ఉండడం నా అదృష్టం. అందుకు కారణం ఆ నవలలోని పాత్రలు, పాత్రచిత్రణ, వాడజనుల, పల్లె జనుల, యాస భాష రచన నేను చేసిన ఆ గొప్పదనం దళిత వాడ జీవితానిదే. మా ఊరిలో ఇప్పటికీ మాది పురిగుడిసె. నాయన (ఇపుడు లేడు ) కూలి, ఓ రిక్షావాలా, అమ్మ కూలి నాలి, వారు కష్టపడి నన్నింతవాన్ని చేశారు. వారు పడిన కష్టాలు, వెదనలు, బతుకు సంవేదనలు నా జీవితంపై చెరగని ముద్రవేశాయి, నాలో సాహిత్యానికి మూలధారం వారే. వారే లేకుంటే నేను లేను. నా రచనలు లేవు. అది వారి చలవ…

జ:నాకు అవార్డులు రివార్డులు అయితే రాష్ట్రస్థాయిలోపొట్టి శ్రీరాములు తెలుగు విద్యాలయం 2017 సంవత్సరానికి నేను రాసిన మొగలి దళిత నవల ఉత్తమ నవల గ్రంథంగా పురస్కారం ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర  ఆవిర్భావ దినమైన జూన్ 02 , 2017 సంవత్సరానికి నల్లగొండ జిల్లా స్థాయి ఉత్తమ కవి పురస్కారంతో జిల్లా కలెక్టర్ మరియు అధికారులు సన్మానించారు.కాని నా రెండు నవలలు సూర దళిత నవల కాకతీయ విశ్వవిద్యాలయంలో 2013 సంవత్సరం నుండి ఎంఏ తెలుగు విద్యార్థులకు సిలబస్ గా ఉంది. అలాగే పురుడు నవల శాతవాహన విశ్వవిద్యాలయంలో 2017 సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. అదే సమయంలో బెంగళూరు విశ్వవిద్యాలయంలో సూర దళిత నవల తెలంగాణ నవలగా ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా అంశంగా చేర్చినారు అది గొప్ప అనుభూతి ఆనందం సంతోషం.అయితే నా రెండు నవలలు (సూర, పురుడు ) యూనివర్సిటీలో పాఠ్యాంశంగా ఉండటమే నాకు లభించిన పెద్ద గుర్తింపు. నేను ఇప్పటి వరకు రాసిన కథలు , నవలలు, కవిత్వం, తెలంగాణ నిఘంటువు పాఠకుల దరి చేరాయి. విమర్శకుల మన్ననలు పొందాయి. నేను రాసిన ” మాలవారి చరిత్ర” ఒకసంవత్సరంలో అయిదు ముద్రణలు పొందింది. రెండు దశాబ్దాల సాహితీ ప్రస్థానంలో పాఠకుల ఆదరాభిమానాలు రచనలు చూరగొన్నయి. ఓపిక ఉన్నంతవరకు రచనలు కొనసాగిస్తా….. నా సాహిత్యానికి పాఠకులు ఉన్నారు. అది చాలు….. అదే పదివేలు….

You may also like

4 comments

Ivy2779 November 25, 2025 - 11:43 pm Reply
Whitney2676 November 26, 2025 - 5:54 am Reply
Hamilton3316 November 28, 2025 - 11:37 pm Reply
Hallie2609 November 29, 2025 - 6:05 am Reply

Leave a Comment