ఒక ఊళ్లో ఒక బాబు జన్మించాడు. అతనికి ఆకలిగా ఉన్నప్పుడు నోరు ఎట్లా తెచ్చుకోవాలో తెలియకుండేది.
తన తల్లి చేతికి ఏది అందితే అది ప్రేమతో అందించేది. ఒక కప్పు పాలు, ఒక స్పాంజ్ ముక్క, ఆలుగడ్డ సూప్, ఓట్ల జావ, కోడి చారు ఇంకా ఎన్నో ఇటువంటి వస్తువులు పదార్థాలు ఇచ్చేది. నీకు ఏది కావాలో అది తీసుకో అన్నది తల్లి .
తనకు పేరు పెట్టకముందే అతని ముందర ఏది పెడితే అది తినేస్తున్నందుకు అతన్ని ‘తిండిబోతు’ అని పిలవడానికి అందరూ నిశ్చయించారు. కానీ , త్వరలోనే అతనికి తిండి పెట్టకముందే ఏది కనిపిస్తే అది తినడం మొదలుపెట్టాడు. అట్లా తింటున్నాడు కాబట్టి అతణ్ణి ‘అత్యాశపరుడ’ని పిలవడం మొదలుపెట్టారు. ఆ పిల్లవాడి జీర్ణశక్తి ఎంత ఎక్కువ అంటే మొత్తం రొట్టె ముక్కను ఓ రాస్ బెర్రీ ఫలాన్ని మింగినట్టు మింగేవాడు . ఇంకా ఎప్పుడైతే ఒక ముక్క కూడా ఇంట్లో లేనప్పుడు, అతను టేబుల్, చైర్లు వాటినే కాకుండా బెడ్ రూంలో బెడ్ వంటివీ మింగేసేవాడు. తర్వాత తోటలోకి పోయేవాడు. అక్కడ చెర్రీస్ ఇష్టపడి మొత్తం చెట్టుని ఇదో లెక్క అన్నట్టు తినేవాడు. గేటును వెదకకుండా ఫ్రెండ్స్ నే మింగేసి , గ్రామం లోకి చేరి దారిలో కనబడినవన్నీ తింటాడు .
గ్రామస్తులను భయకంపితులను చేశాడు . అతడు ఇంకా చంటి బాబు కాదు . అతను చాలా పెద్ద కడుపుతో ఒక పెద్ద ఆజానుబాహుడు. పక్క ఇంటి ద్వారం నుండి లారా అనే ఒక అమ్మాయి ఏమంటుందంటే….అతను అట్లా పోలేడు అన్నది. తను పాఠశాలకు పోవటానికి ఆలస్యం కాకుండా టైం కు లేచేందుకు గడియారాన్ని కి అలారం కు కీ ఇచ్చింది. అతను ఇక ముందు మనను కూడా తినేస్తాడు. అని ఆమె చెప్పింది వాస్తవమే కూడా! ఆలస్యం కాకుండానే ఆ తిండిబోతు లారా ఇంటిని మొత్తం మింగేసాడు
అదృష్టవశాత్తు మర్నాడు ఉదయాన్నే అలారం మోగింది. ఆ ధ్వనికి ఆ తిండిబోతుకు ఎంత షాక్ అయిందంటే…. తను నోరు తెరిచాడో లేదో ఇంటిని తిరిగి వాంతి చేసాడు. దాని తర్వాత అతడు తన ఎక్కువ ఆకలిని కోల్పోయాడు. కొద్ది కాలానికి అతణ్ణి వాళ్లు ఇంకా తిండిబోతు అనేవాళ్ళు . కానీ చివరకు అతనికి ఆల్బర్ట్ అనే పేరు పెట్టారు. అతను కూడా అందరి వలెనే చిన్న బాలుడైనాడు.
ఒక తిండి బోతు
previous post
