ఓటేద్దాం ఓటేద్దాం ఓటేద్దాం!
స్వార్ధము లేనటువంటి సమర్థులకు ఆచి తూచి !ఓ !
1.ప్రజలయొక్కబాగోగులపట్టింపేధ్యేయంగా
నిజాయితీ నిబద్ధతలు లక్ష్యమైనపక్షానికి
మసిపూసీ మారేడని మాయలు మోసం చేయని
మానవత్వ విలువలున్న మంచి మనసు
కలవారికి !!ఓటేద్దాం !!
2.ప్రజాస్వామ్యవిలువమరచిబమ్మినితిమ్మినిచేయని ,అవినీతీబంధుప్రీతికాసన మేయనివారికి.చెప్పేదీఒకటైతేచేసేదీవేరొకటై
తీరందాటినవెంటనెతెప్పనుకాల్చనివారికి !!ఓటేద్దాం !!
3.ఉద్యోగుల,ఉపాధ్యాయఉన్నతులనుగౌరవించి,ఉత్సాహాన్నందించిఉరకలేసిపనిచేయగ,ప్రోత్సాహాలందించి పోషణచేసే వారికి- రైతన్నల సంక్షేమమె రామరక్షయ న్నోరికి !!ఓటేద్దాం !!
4.సంప్రదాయసంస్కృతులకుసాదరసా కారమిచ్చి,చెప్పి నట్టి ప్రమాణాలు తూ చ తప్పక చేసి ,పట్టంగట్టించినోరిప్రాణాలకుప్రాణమిచ్చి
ప్రగతిపధంలోప్రభుతనుపరుగెత్తించే వారికి !!ఓటేద్దాం !
5.మద్యానికి ఆశపడి మానవతనువిడనాడీ -డబ్బుకు దాసోహమనిధర్మాన్నీమరవకుడీ ,ప్రతిఓటు పవిత్రమనీ
భవితకిదిపునాదియనీ- యోధులమై మనమంతాయోచించీఅడుగులేసి!!ఓటేద్దాం !!
A. Venugopal
A. Venugopal
విద్యార్హత : ఎం.ఏ. బిఎడ్ ఉద్యోగం: ఉపాధ్యాయ 28.1.1981 జన్మతేదీ : 18.1.1955 స్వగ్రామం : నల్లొండ జిల్లా, కేతేపల్లి మండలం, గుడివాడ గ్రామం. పాటలు, పద్యాలు వ్రాయడం, పాడడం. పదవి విరమణ : 31.01.2013 (58 సం.లు) 8th class నుండి పద్యరచనకు ప్రయత్నం, శ్రీకారం, గోదాదేవి 30 పాశురాలను పాత చలన చిత్ర పాటలబాణీలో వివరణకు అనుకూలంగా వ్రాసి, (నా శ్రీమతి కీ.శే. అరుణ కోరికపై) పుస్తకం ప్రింట్ చేయించి ఆమె సంవత్సరీకం రోజున బంధువులకు, భక్తులకు అందించడమైనది – ప్రస్తుతం వాట్సప్ గ్రూప్ లోనూ
ఏటి భారతం – ఈనాటి భారతం
మాటల పోటీల బ్రతుకె నేటి భారతం
రాజ ధర్మ పరిరక్షణె నాటి భారతం
ఓటు సీటు, నోట్ల కొఱకె నేటి భారతం
సోదర, ప్రేమలు పంచుట నాటి భారతం
ఉదర పిండ విధ్వంసం నేటి భారతం
గీత బోధ జరిగినదలనాటి భారతం
హితుల కీడు నెంచేటి నేటి భారతం
విదురగీతి నాదరించె నాటి భారతం
అవినీతికి, పట్టమొసగె నేటి భారతం
మానవత్వమున కర్థం నాటి భారతం
అమానుషం, అన్యాయం నేటి భారతం
మనిషిలోనె దేవునిగనె నాటి భారతం,
మనిషికి, మనిషే శతృవు నేటి భారతం
అర్థ, స్వార్థముల నిండెను, అహంకారమే హెచ్చెను
అమాయకపు జనులనెల్ల ‘మాయ’లోనె ముంచేసెను నేటి భారతం
శాశ్వతమేదీ కాదనె నాటి భారతం
అంతా శాశ్వతమని యెంచెను నేటి భారతం….
ప్రగతి పథంలో పయనిస్తున్నది భారత మిది మనదీ
జగతి కంతటికి ‘మార్గదర్శి’యై చరిత ఘటించినదీ
**
కాశ్మీరయోధ్య జఠిల సమస్యల పరిష్కరించినది
రశ్మివోలె తా నేటితరానికి రక్షణ నిచ్చింది…1
**
ప్రపంచ క్రీడా మైదానంలో ప్రభవము నందినది
అపురూపంగా అందరి దృష్టిని ఆకర్షించినదీ
**
కరోన- రక్కసి కోరలు విరిచే ‘టీక’ కనుగొన్నదీ
హీరోలౌ మన శాస్త్రవేత్తలను ‘ఇతి’ మెచ్చకున్నది
**
మన సంస్కృతినీ, సంప్రదాయమును ‘మహి’ కందించినదీ
మనః పూర్తిగా నమస్కార – బహుమానము నిచ్చినదీ
**
ఋషులందించిన యోగ ప్రక్రియను రూఢిగ / రూలుగ జేసినది
దేశ విదేశమందు ‘ధ్యాన’ మను దీప్తిని నింపినదీ….
**
అంతరిక్ష గమనానికతివలకు అండగ నిల్చినదీ,
అంతులేని విజయాలు పొందుటకు అడుగులేస్తున్నదీ ||ప్రగతి||