17 వ శతాబ్దికి చ ేందిన ఉత్తమ వాగ్గేయకారులలో సదాశివ బ్రహ్మేంద్రరల వారొకరు. వీరి ఋషిత్ులుుల ైన పదాలలో ఆధ్ాుత్మమక , భకిత భవనాలు నేండారి ఉనాాయి. ఎననా యజ్ఞా లు చేసిన పవిత్ర మూరుత లు వీరు. అేంతేకాద్ర, దారుకావన విలాసము, ఉత్సవ మేండపము అనర మేండపములు కట్టేంచిన విత్రణ శీలురు.వీరిది పరసిదిికెకిిన శీీ శివా ద ైైత్ మతానకి చ ేందిన సేంపరదాయేం అయినపపట్కీ సేంగ్ీత్ కచేరీలలో వీరి కీరతనలు పాడడేంవిదాైేంసరలకు అలవాటే.సదాశివ బ్రహ్మేంద్రర ల పెరు చ పపగ్ానే “మానస సేంచరరగ “ అనా కీరతన గురుత కు వసరత ేందిఎవరికెైనా. వీరి కీరతనలలో సగుణోపాసన, నరుేణో పాసన రెేండు భావనలు కనపసరత నాయి. ద్క్షిణ భారత్ేంలో అనేక ఆశ్రమాలలో వీరి కీర్త నలు అక్షర్ బద్ధ ం చేయబడి ర్క్ష ంపబడుతున్నాయి. దాని ఆధార్ంగా వీరు పర యోగంచిన రాగాలు తెలుస్తు న్నాయి. కంతలవరాళి, స్తర్టి,కంభోజి, మోహన, తోడి, ధనశ్రర,ఆనంద్ భై ర్వి మొద్లై న రాగాలను వీరు ఉపయోగంచారు. భగవంతుని నిరాకరునిగా భావించి కీరిత ంచిన కీర్త నలను గాని, సగుణునిగా భావించి కీరిత ంచిన కీర్త నలను గాని గమనించినట్ల యితే వీరి భక్త గాఢత, తతపర్త అర్థ మవుతాయి. పర్మేశ్వరుని పట్ల వీరిక్ గల అపరిమిత విశ్వవసం తెలుస్తు ంది. అయితే కీర్త నల లో ఏ లౌక్కమై న కోరికలు కోరుతునాట్లల కనిపంచదు.నిర్మలమై న భక్త విశ్వవసాలు తపప ఇంకో భావన ఈ కీర్త నలలో గోచర్ం కదు. వీరిది పర్మహంస ముద్ర. మృదువై న భాషతో కూడిన వీరి కీర్త నలు సంగీత చరితర లో ఒక పర తేేక సాథ న్ననిా కల్గి ఉన్నాయి. ఒక ఉదాహర్ణ చూడండి. పలల వి: చింతా న్నస్తు ఖిలం తేషం చర్ణం: శ్మద్మ కరుణా సంపూరాా న్నం సాధు సమాగమ సంకీర్ాన్నం చర్ణం: పర్మహంస గురు పద్ చితాున్నం బర హ్మమ నందా మృత మతున్నం . ఇదీ మన వాగ్గి య కరుల సంక్ష పు చరితర. ఒక్కొకొ వాగ్గి య కరుని గురించి తెలుస్తకోవ లస్తంది ఎంతో ఉంది. వారు మనక ఇచిిన సందేశ్వనిా అర్థ ం చేస్తక్కని ముందుక సాగడం మన కర్త వేం.వారు జనిమంచిన దేశ్ంలో మనం పుట్ట డం ఎంతో అద్ృషట ం. ఈ అద్ృషట నిా మన స్తకృతంగా భావించి కర్త వాేనిా పాల్గంచినట్ల యితే మన జీవితాలు ధనేం అవుతాయి.
Krishna Kumari Yagnambhatt
Krishna Kumari Yagnambhatt
Dr. Y. Krishna Kumari
Retd.Professor -Department of Telugu < br>
పుస్తకాలు:
వసుంధర -ఇది ఇంగ్లీషు ,హింది భాషలలో అనువదించ బడింది
ఓ స్త్రీ ఇవ్వాళ్ళే రా-ఇది స్త్రీ స్వీయ శక్తి తో ముందుకు పోవాలన్న అభిప్రాయం తో రాసినది.
స్వరాంజలి-సంగీతంతోనే ఆ పరాశక్తి కి చేసిన పూజ.
రసథుని-కర్నాటక ,హిందూస్థాని,పాశ్చత్య సంగీతాల తులనాత్మక పరిశీలనా వ్యాసాలు
జాషువా-పరిశోధక వ్యాసాల
9885451914
Krishnayagnambhatt@gmail.com
ముత్తుస్వామి దీక్షితులవారు సంగీత శాస్త్ర రహస్యాలు ఇమిడ్చి కీర్తనలు రచించారు. అంతేకాదు, వీరు ఇతర శాస్తాల నెన్నింటిలోనో అపారమైన జ్ఞానం ఉన్నవారు. ఈ జ్ఞానమంతా వారి కీర్తనలలో గమనించవచ్చును. “గురు గుహ” ముద్రతో వీరు రచించిన కీర్తనలు సంస్కృతంలో ఉన్నప్పటికీ తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.
వెంకట మఖీ సంప్రదాయాన్ని అనుసరించి రాగ నామాలు కీర్తనలో వచ్చేవిధంగా రచించడమే కాకుండా సూళాదిసప్త తాళాలతో నవావరణ కీర్తనలు, నవగ్రహ కీర్తనలు రచించారు. ఇటువంటి అపూర్వ రచనలు ఏ వాగ్గేయకారుడు కూడా చేయలేదు. ప్రపంచంలో అన్ని రకాల సంగీతం కంటే భారతీయ సంగీతం ముఖ్యంగా రాగానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఒక్కొక్క రాగం, దాని స్వరసమూహాలు, స్వరప్రస్తారాలు ఎంతో ప్రత్యేకంగా పేర్కొనదగినవి. అటువంటి ప్రత్యేకత కల్గిన “రాగం” పట్ల దీక్షితుల వారి అవగాహన అద్భుతం. అందువలననే వారి కీర్తనలకు ఒక ప్రత్యేకత కల్గింది. రచన ఎంత ప్రౌఢంగా ఉన్నప్పటికి, మంత్రపూరితములైనప్పటికి, వారి రచనలు ప్రాచుర్యాన్ని పొందడానికి కారణమైంది వారి రాగ పద్ధతి. దీక్షితులవారి కీర్తనలు శ్రేష్ఠమైన సంస్కృతి పాండిత్యము, స్వరరాగ పద్ధతిపాటు భక్తి, ధ్యానము కూడా కలిసి శాస్త్రసమ్మతిని రచింపబడ్డాయి. ఈ ఉదాహరణ చూడండి.
ప్లల వి:
నీలోత్పలాంబికే నిత్య శుద్ధాంబికే మామవ!
అనుప్లల వి:
త్రిలోక జననీ త్రిభువన మోహిని
త్రైలోక్య చక్రలాసిన
సత్ గురుగుహ విశ్వాసిని!
చరణం :
మాయా ప్రభంజాతీత సవరూపిణీ
ముచుకంద బాకట పాలిని వరదాయిని
“ఛాయా గౌళ” రాగ రంజని నిరంజని
సాయుజ్యాది దాయిని సచ్చిదానంద రూపిణి !
ఈ నాటికి కూడా చాలా మంది విద్వాంసులు సంగీత సభ ప్రారంభంలో దీక్షితుల వారి కృతి అయిన హంసధ్వని రాగంలోని వాతాపి గణపతింభజే ఆలపిస్తారు.
వీరి కీర్తనలలోని మంత్రశాస్త్ర తత్త్వంవారి మంత్రశాస్త్ర సమర్థతని, వైదుష్యాన్ని తెలియచేస్తాయి. వైదిక సంస్కృతం, లౌకిక సంస్కృతంలో చాలా వైవిధ్యం ఉంది కానీ, దీక్షితులవారి కృతులలో అతి సహజంగా సంస్కృత భాష ఒదిగిపోయింది.
దీక్షితులవారు తమ భక్తిని అనేక రకాలుగా ప్రదర్శించలేదు కానీ ఏ దైవాన్ని అర్పించినా అమేయమైన సమర్పణ భావనతోనే రచనలు చేశారు. భగవంతుడు– భక్తుడు అన్న సంబంధం తప్ప ఇతర ప్రక్రియలను వారు ఉపయోగించలేదు. ఇది వారి అనన్య భక్తి తత్పరతకు తార్కాణం.
ఈ కీర్తనను చూడండి
ప్లల వి:
శ్రీ మహా గణపతి రవతుమాం
సిద్ధి వినాయకో మాతంగ్ ముఖ: !
అనుప్లల వి:
కామ జనక విధీంద్ర సన్నుత
కమలాలయ తట న్నివాసొ
కోమలధర పల్లవ పద ఖర
గురుగుహోగ్రజ శివాత్మజ!
చరణం:
సువర్ణా కర్ణణ విఘ్న రాజో
పాదాం బుజో గౌర వర్ణ వసన ధరో
బాలచంద్రో నరాది వినుత లంబోధరో
కువలయ స్వ విషాణ పాశాంకుశ
మోదక ప్రకాశ కరో భవ జలధి నావో
మూల ప్ర కృతి సవభావ సూకతరో
రవి సహసర సన్నిభ దేహో
కవి జననుత మూషిక వాహో
అవనత దేవతా సమూహో
ఆవినాశ కైవల్య గేహో !
సంగీత త్రయంలో శ్రీ ముత్తు స్వామి దీక్షితుల వారు రెండవవారు .వీరి కీర్తనలు అత్యంత ప్రౌఢమైనవి.1775 వ సంవత్సరంలో తిరువారూర్ లో జన్మించిన దీక్షితుల వారు సకల శాస్త్ర పారంగతులు. మనాలీ జమీందారు ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళిన వీరు అక్కడ వినిపిస్తున్న పాశ్చాత్య సంగీతం విన్నారు. ఆ సంగీతపు వర్ణ మెట్టు మీద ఆసక్తి పెరిగి,అక్కడే కొన్నాళ్ళు ఉంది ఆ సంగీతపు సంప్రదాయాలను నేర్చుకొని అందులో ప్రావీణ్యత సంపాయించారు. వీరు తర్వాతి కాలంలో రచించిన కొన్ని కీర్తనలలో పాశ్చాత్య సంగీతపు ఛాయలు కనిపిస్తాయి. ఉదాహరణకు ‘సంతతం పాహిమాం సంగీత శ్యామలే’ అన్న కీర్తన ‘god save the king’ అన్న పాశ్చాత్య గేయపు వర్ణ మెట్టు ఆధారంగా చేసినదే. దాదాపుగా 50 వరకు కీర్తనలలో ఈ ప్రభావం కన్పిస్తుంది.
చిదంబర నాథ యోగి శిష్యులైన వీరు గురువుతో కలిసి కాశీ నగరానికి వెళ్ళి అక్కడ 6 సంవత్సరాలు సంగీత విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఒకసారి గురువు ఆజ్ఞ మేరకు గంగా నదిలో దిగి కళ్ళుమూసి ధ్యానం చేస్తుండగా విచిత్రంగా వారి చేతిలోకి ఒక వీణ వచ్చింది. దాని పై శ్రీ రామ అని రాసి ఉంది. భగవంతుని అనుగ్రహంగా భావించి ఆ వీణను వారు తీసుకొన్నారు. అంతేకాదు ,జీవితాంతం వారు దాని సహాయంతోనే గానం చేశారు.
తర్వాత దీక్షితుల వారికి గురువు అనుగ్రహం వలన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కల్గింది. ఆ క్షణమే వారి నోటి నుండి మొదటి కీర్తన వెల్వడింది. వీరి కీర్తనలు మంత్ర పూరితాలు. సంగీతానికి తగిన సాహిత్యం, సాహిత్యానికి అనువైన దేవ భాష , ఈ రెండింటికీ తగిన రాగ తాళాదులు –ఇది వారి కీర్తన స్వరూపం. వీరి కృతులలో వేదాలు, వేదాంగాలు,శాస్త్రాలు,ఇతిహాస పురాణాలు,ఆగమాలు,మంత్ర శాస్త్ర రహస్యాలు మొదలైనవి ఎన్నో కన్పిస్తాయి. అంతేకాదు , వీరి జటిలమైన సమాస రచన అద్బుతం. ఎన్నో సార్లు తన వాక్శుద్ది తో మహిమలు చూపించారు కూడా. సాహిత్యానికి తగిన రాగం ఎన్నుకోవడమే కాకుండా రాగం పేరు సాహిత్యంలో ఇమిడ్చి రచనలు చేశారు. నిజానికి ఈ లక్షణమే వారిని ఒక ప్రత్యేక వాగ్గేయకారునిగా నిలబెట్టింది.
ప్రపంచంలో అన్ని రకాల సంగీతాల కంటే భారతీయ సంగీతం రాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కన్పిస్తుంది. ఒక్కొక్క రాగం, దాని స్వర సమూహాలు, స్వర ప్రస్తారం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది భారతీయ సంగీతంలో. అటువంటి ప్రత్యేకత కల్గిన ‘రాగం” పట్ల దీక్షితుల వారికి గల అవగాహన అద్భుతం. అందువల్లనే వారి కీర్తనలకు ఒక ప్రత్యేక స్థానం కల్గింది. అందుకే ఎంత ప్రౌఢ రచన అయినా, మంత్ర పూరితమైనా వారి రచనలు ప్రాచుర్యాన్ని పొందడానికి కారణమైంది వారి రాగ పద్ధతి.
దీక్షితుల వారు తమ భక్తిని అనేక రకాలుగా ప్రదర్శించారు తమ రచనలలో. ఏ దైవం మీద వారు రచనలు చేసినా సమర్పణ భావంతోనే రచించారు. ఒక ఉదాహరణ చూడండి.
గౌళ రాగం. త్రిపుట తాళం.
పల్లవి-
శ్రీ మహా గణపతి రవతుమాం
అనుపల్లవి-
కామజనక విధీంద్ర సన్నుత, కమలాలయ తట నివాసో
కోమల ధర పల్లవ పద ఖర ,గురుగుహోగ్రజ శివాత్మజః !
చరణం-
సువర్ణాకర్షణ విఘ్న రాజో ,పాదాంబుజో గౌర వర్ణ వాసన ధరో
బాలచంద్రో నరాది వినుత లంబో దరో ,కువలయ స్వవిషాణ పాశంకుశ
మోదక ప్రకాశ కరో భవ జలధి నావో ,మూల ప్రకృతి స్వభావస్సూకతరో
రవి సహస్ర సన్నిప దేహో ,కవి జన నుత మూషిక వాహో
అవనత దేవతా సమూహో ,ఆవినాశ కైవల్య గేహో !
వీరిది గురుగుహ ముద్ర.
త్యాగయ్య గారు నవవిధ భక్తి మార్గాలలో రచించిన కీర్తనలు కొన్ని పరిశీలిద్దాం. 1)శ్రవణం ..
పల్లవి - రామకథా సుధారస పానమొక రాజ్యము చేసునే!
ధర్మాద్యఖిల ఫలదమె మనసా -ధైర్యానంద సౌఖ్య నికేతనమే
కర్మబంధ జ్వలన ఆబ్ది నావయే -కలిహరమే త్యాగరాజ వినుతుడగు!!
ఈ కీర్తనలో రామనామ మహిమ చెప్పబడింది.
2)కీర్తనం..
పల్లవి-
రామాభిరామ మనసు రంజిల్ల బల్కరాదా!
బంగారు మేటి పాన్పు పై భామామణి జానకి
శృంగారించుకొని చెలువొంద నినుగని
పొంగుచు మల్లె విరుల పూజించు వేళ శ్రీ హరి
సంగీతము పాడుచును త్యాగరాజు నితో!!
త్యాగయ్య ప్రతి కీర్తనలో రామ కీర్తనం వివరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదో ఒక కృతిని ఉదహరించడం కొంత కష్టమే.
” ఏలావతార మెత్తు కొంటివి -ఏమి కారణము రాముడై “ అను కీర్తనలో
“యోగులను జూచుటకా భవ రోగులను బ్రోచుటకా శత
రాగ రత్న మాలికను రచించిన త్యాగరాజు నకు వర మోసంగుటకు’
అని తన శత రాగ రత్న మాలిక నంగీకరించి వరమిచ్చుటకై అవతరించి నాడని రామచంద్రుని కీర్తించుట ఎంతో మనోహరమైన భావన.
3 )స్మరణము..
“ శ్రీపతే నీ పద చింతనే జీవనము’
అను కీర్తనమున భగవంతుని స్మరించుటయే తన జీవిత లక్ష్యమని అట్టి చింతనే ఇంద్రాదులు గొప్ప మహిమను పొందారని చెప్పుచు
‘రామ నామ స్మరణము వల్ల నామ రూపమే హృదయము నిండి ప్రేమ పుట్ట జేయగలేదా’
అంటూ స్మరణ విశిష్టతను తెలిపారు.
4 )పాద సేవనం..
‘శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తానికి రావే!
అను కృతిలో పాదాభివందన మొక్కటే అన్ని దురితాలను అపహరించగల సామర్థ్యం ఉందని చెప్పుతూ అహల్య వృత్తాంతాన్ని నిదర్శనంగా పేర్కొని, బ్రహ్మాదుల చేత పూజింపబడే ఆ పాదాలు తన మనస్సులో నిరంతరం స్థిరంగా నిలవాలని ప్రార్థించాడు. సందేహమును దీర్చవయ్య సాకేత నిలయ’అను కృతిలో
‘వర మౌను లెల్ల జరణమ్ములను,స్మరియింప నీడు పద మొసంగెనో
భరతార్చనచే బాదుకలు ,ధర నిన్నొసంగె త్యాగరాజ భాగ్యమా!!
అంటూ శ్రీ రామ చంద్రుని చరణాల కన్నా ,వాటిని సేవించిన పాదుకలు మరింత గొప్పవని భరతుని వృత్తాంతాన్ని నిదర్శనంగా పేర్కొని కీర్తించారు.
‘రఘునాయక !నీ పాద యుగ రాజీవముల నే విడ జాల’ అను కీర్తనలో భవ సాగరమును దాటగోరు వారికి శ్రీ రాముని తప్ప వేరుగతి లేదని తెలిపారు.
‘శ్రీ మానినీ మనోహర ! చిరకాలము మాట యొక టేరా ‘ అను కృతిలో భక్తులు తమ సర్వస్వాన్ని భగవంతుని చరణాల యందు సమర్పించి పాద సేవచే ధన్యులవుతారు అంటూ ప్రశంసించారు.
5 )అర్చన..
. రార సీతా రమణీ మనోహరా’ అను కృతిలో
‘బంగారు వల్వలు నే బాగుగా గట్టెద మరి
శృంగారించి సేవ చేసి కౌగిట జేర్చేద
సారెకు నుదుటను కస్తూరి తిలకము బెట్టేద
సారమైన ముక్తా హారములు నిక దిద్దేద ‘
అంటూ అనేక విధాలుగా పరమ భక్తితో భగవంతుని సేవ చేసి తరింతు నని
పేర్కొన్నారు.
‘తులసీ బిల్వ మల్లికాది జలజముల పూజలు గైకొనవే ‘అనే కృతిలో
‘ఉరమున ముఖమున శిరమున భజమున
గరమున నేత్రమున చరణ యుగమ్మున
గరుణతో నెనరుతో పరమానందముతో ‘అంటూ వివిధములైన పుష్పాలతో శాస్త్రవిధిని పాదాది శిరః పర్యంతము ప్రత్యంగ పూజ చేసే విధానాన్ని వివరించారు. 6 6 )వందనము..
‘వందనము రఘు నందన’అనే కృతిలో పరమ భక్తి భావము మనసులో ఉప్పొంగు చుండగా భగవంతునకు నమస్కరించు పద్ధతి తెలియ చేశారు.
7 )దాస్యము..
‘తవ దాసోహం తవ దాసోహం దాశరథి’ అను కృతిలో త్యాగరాజు దాసత్వమే సరియైన తరణొ పాయమని విశ్వాసంతో పలికారు.
8 )సఖ్యము..
‘సామికి సరి జెప్ప జాల వేల్పుల’అనే కీర్తనలో
‘తన కంటి కెంతో ముద్దు తప్ప దాడిన వద్దు చనువు చేయునొ పొద్దు చల్లని చూపు కద్దు
అన్నీ వేల్పుల లోన అతనికి సరిగాన
తన్ను బ్రోచిన ఘన త్యాగరాజు సఖు డైన’
ఆంటూ శ్రీ రాముని పట్ల తనకు గల స్నేహ భావాన్ని ప్రకటించారు.
9 )ఆత్మ నివేదనము..
‘కాలహరణ మేలరా హరే’ అన్న కృతిలో
‘చుట్టి చుట్టి పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి
భువిని పుట్టగానే నీ పదముల బట్టుకొన్ననన్ను బ్రోవ
దినదినమును తిరిగితిరిగి దిక్కు లేక శరణు జొచ్చి
తనువు ధనము నీదే యంటి త్యాగరాజ వినుత రామ’
అంటూ అనన్య గతికత్వముతో శరణు కోరారు త్యాగయ్య ఈ కృతిలో.
‘నన్ను విడిచి కదలకురా’ అనే కృతిలో కూడా మనసు కరిగే విధంగా శరణు వెడుతూ తన సర్వస్వాన్ని రామ చంద్రునికి సమర్పించారు.
ఈ రకంగా ఎన్నో విధాల తమ కవితా శక్తిని ప్రదర్శించి తమ భక్తిని అనేక కృతులలో వర్ణించారు. ప్రాచీన కవులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ,భక్తా గ్రేసరులైన నారదాది ఋషుల లాగా తమ భక్తి ప్రపత్తులను వెల్లడి చేసిన ఉత్తమోత్తమ వాగ్గేయ కారులు త్యాగయ్య గారు.
**************************************
ఈ వ్యాసంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి గురించి తెలుసుకుందాం. 18 వ శతాబ్దం సంగీత విద్యకు ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి సువర్ణ కాలం.అత్యంత ప్రతిభావంతులు, శారదా మాత అనుగ్రహనికి పాత్రులైన సంగీత త్రిమూర్తులు జన్మించిన కాలమిది. ఆ ముగ్గురిలో కూడా తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న త్యాగరాజ స్వామి వారు తిరువరూరులో 1767 వ సంవత్సరం జన్మించారు. విచిత్ర మేమిటంటే రాజ్యం తమిళులది,రాజ్యాధికారం మహా రాష్ట్ర రాజులది. కాని తెలుగు వాడైన త్యాగయ్య మీద ఈరెండు భాషల ప్రభావం ప్రసరించలేదు. తేట తెలుగులో, తేనె లొలుకు మధురమైన భాషలో,పండిత పామర రంజకంగా రచింపబడ్డ వీరి రచనల వైశిష్ట్యం న భూతో న భవిష్యతి. అటు సంగీతానికి ఇటు సాహిత్యానికి వీరు చేసిన కృషి అనన్య మైనది.
శొంటి వేంకట రమణయ్య గారు ఆ కాలంలో పేరెన్నిక గన్న గొప్ప విద్వాంసులు. అటువంటి వారికి శిష్యుడైన త్యాగయ్య గురువును మించిన వాడై వందలాది మందికి గురువు అయినాడు. త్యాగయ్య గారి శిష్యులమని చెప్పుకోవడం ఆ నాడు గర్వ కారణంగా ఉండేదిట.
లౌకిక సంపదలకు దూరంగా ఉన్న వీరికి రామభక్తి అనే సంపద పుష్కలంగా లభించింది. భోగాల వెంట తిరిగే వారిని ఉద్దేశించి “నిధి చాలా సుఖమా!రాముని సన్నిధి సేవ సుఖమా!’అంటూ ప్రశ్నించారు.నిరంతర రామ సేవతోనే వారికి మనశ్శాంతి కలిగేది.ఆ సమయంలోనే వారి నోట అప్రయత్నంగా కీర్తనలు వచ్చేవి. సాహిత్యంలోని అంతర్గత భావాన్ని ప్రస్ఫుటం చేసే రాగం అదంతట అదే ఏర్పడేది.
రాగ సంచారంలోని కొన్ని ప్రత్యేక ప్రయోగాల ద్వారా రాగ భావాన్ని సాహిత్య భావంతో రంగరించి విస్తరింపచేయడం వీరి ప్రత్యేకత. ఈ ప్రక్రియ బహుశః వీరితోనే మొదలైంది అనవచ్చు.అయితే ఇది కూడా వారికి అలవోకగా వచ్చిందే తప్ప దానికోసం కష్టపడింది లేదు. కృతి అన్న ప్రక్రియ కూడా త్యాగయ్య సొంతమే. అంతవరకు కీర్తనల ద్వారా భగవంతుని కొలవడమే తప్ప సన్నివేశ చిత్రీకరణ అన్న ప్రక్రియ లేదు. దీనికి స్వామివారే ఆద్యులు. సన్నివేశ చిత్రీకరణే కృతిగా ఆవిర్భవించింది.వీరి కృతులలో అంతర్గతంగా రామాయణం కథ ఉంటుంది.పరంపరగా వస్తున్న కథను బట్టి నారద మహర్షి స్వయంగా స్వరార్ణవ మనే గ్రంధాన్ని ఇచ్చారు. అందులోని సంగీత మర్మాలను అవగాహన చేసుకొన్న త్యాగయ్య అంతవరకు ప్రచారంలో లేని ఎన్నో రాగాలకు ఒక స్పష్టమైన ఆకారాన్ని, భావాన్ని కల్పించి, దానికి లక్ష్యంగా ఎన్నో కృతులను రచించారు. సాహిత్యంలోని లోతులను సుస్పష్టం చేయడానికి రాగ సంచారాలలోని ప్రత్యేక ప్రయోగాల ద్వారా రాగా భావాన్ని సాహిత్య భావంతో మేళవించి విస్తరించి తద్వారా ‘సంగతి’అనే నూతన ప్రక్రియను ప్రచారం చేసిన ధాతు కల్పనా దక్షుడు త్యాగయ్య. వీరు నాద యోగ ప్రధానాలు అయినప్పటికీ లోకం పట్ల విరక్టులు కాదు. ఎంతో అనుభవ పూర్వకములైన లోక న్యాయాలను తెలిపి, మంచి చెడుల విచక్షణను ప్రజలకు తెలియ చేశారు.నారదాంశ సంభవుడుగా ప్రసిద్ధి పొందిన త్యాగయ్య తన మనోమందిరంలో రామచంద్రుని ప్రతిష్టించి ఆతని లీలలు వివిధములైన కృతుల రూపంలో ఆరాధిస్తూ భక్తినే ఒక తపసుగా ,యజ్ఞంగా జీవితాన్ని గడిపి రామ సాక్షాత్కారాన్ని పొందారు. తన కీర్తనల ద్వారా తాను అనుష్టించిన ధర్మాన్నే, భక్తి విధానాన్నే లోకులకు ఉపదేశించారు.
”ఎందెందు జూచిన ఎందెందు పలికిన
ఎందెందు సేవించిన ఎం దెందు పూజించిన
అందందు నీవని తోచే టందుకు నీ
పాదార విందమును ధ్యానించిన దెందుకని?”
అన్న త్యాగరాజ స్వామి భక్తి అనన్య సామాన్యమైనది.
రాగ స్వరూపాని కైనా, సాహిత్య సౌకుమార్యాని కైనా త్యాగయ్య కృతులు దర్పణాలు. త్యాగయ్య కీర్తి దేశమంతటా వ్యాపించడం వలన తంజావూరు పాలకుడైన శరభోజి ,తిరువానకూరు ప్రభువైన స్వాతి తిరునాళ్ తమతమ ఆస్థానాలకు ఆహ్వానించారు. కానీ సాత్త్విక భక్తుడైన త్యాగయ్య రామ పాదాలే తనకు సామ్రాజ్యమని వారి ఆహ్వానాన్ని సున్నితంగా నిరాకరించాడు.
త్యాగయ్య కృతులలోని సాహిత్యం ఎంతో విశిష్టమైనది. భక్త కవి పోతన ఛాయలు వీరి సాహిత్యంలో గోచరిస్తాయి. ముఖ్యంగా శబ్దాలంకారాల మీద వీరికి గల అధికారం చెప్పుకోదగ్గది. ఉదాహరణకు “నిధి- సన్నిధి, విదులకు-కోవిదులకు,దాంతునికైనా-వేదాంతుని కైనా,దరి -సుందరి,దేహి-వైదేహి,గ్రహ-అనుగ్రహ”వంటివి మచ్చుకి కొన్ని. కృతులలో వారు ఉపయోగించిన సమాసాలు గమనిస్తే వారి సంస్కృత భాషా వైదుష్యం అర్థమవుతుంది. ఉదాహరణకు “సామ నిగమజ సుధా మయగాన విచక్షణ , మోదకర నిగమోత్తమ సామవేద సారం, అమరతారక నిచయ కుముద హిత పరిపూర్ణ ,దధి పయోధి వాస హరణ, సద్యో జాతాది పంచ వక్త్రజ’మొదలైనవి కొన్ని.
నిజానికి త్యాగయ్య కృతులన్నీ నాద యోగ ప్రధానాలు. నాదోపాసనలో ముక్తి పొందిన త్యాగయ్య తన భక్తిని అనేక రకాలుగా ప్రదర్శించారు.
వచ్చె వ్యాసంలో త్యాగయ్య కృతులలోని విశేషాలు చూద్దాం.
స్వరాంజలి-7
డా. కృష్ణ కుమారి
9885451014
ఈ వ్యాసంలో రామదాసు గురించి తెలుసుకుందాం. రామదాసు సహజ కవి. ఈతని కీర్తనలు సహజ భక్తి భావవేశంతో, తన్మయత్వంతో ,సుకుమార భావనలతో రచింపబడ్డాయి. అందుకే రక్తి కట్టించే రామదాసు కీర్తనలు భజన గోష్టులలో స్థానం సంపాయించుకున్నాయి. ఆనంద భైరవి రాగాన్ని సంగీత చరిత్రలో మొదటిసారి ఉపయోగించిన వాగ్గేయకారుడు రామదాసే. ఈతని సంగీత రచనలను బట్టి రామదాసు ఆశయం పాండిత్య ప్రకర్ష కాదని, సంగీతం ఆతని భక్తి సాధనకు ఉపకరణ మాత్రమే అని అర్థమవుతుంది. అయితే కీర్తనలలోని వివిధ ఛందో రీతులను గమనిస్తే ,దేశీయ గేయ రీతుల పట్ల ఈతనికి గల అవగాహన అర్థమవుతుంది. అన్నమాచార్యుల వారి తర్వాత రచన ద్వారా నవవిధ భక్తిని ప్రదర్శించిన వాగ్గేయకారుడు రామదాసే.
తర్వాతికాలంలో భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి కెక్కిన ఈతని అసలు పేరు కంచర్ల గోపన్న. ఈతను 17 వ శతాబ్దికి చెందిన వాడు. సంస్కృతాంధ్ర భాషలలొ ప్రావీణ్యం కలవాడు. అంతే కాకుండా గోల్కొండ రాజ్యంలోఉద్యోగం చేసిన కారణంగా ఉర్దూ పారశీక భాషలలొ కూడా ప్రవేశం ఉంది. ప్రహ్లాద, పరాశర,నారద,పుండరీకాదులతో రామదాసు సమానుడని త్యాగరాజ స్వామి ప్రశంసించారంటే స్వామి వారి కాలానికే రామదాసుకు గల కీర్తి ప్రతిష్టలు అర్థం చేసుకోవచ్చును. ప్రసిద్ధమైన సప్త తాళా లలోనూ, సుమారు 25,30 రాగాలలో రచింపబడ్డ వీరి రచనలలోని పాండిత్యం లోక విదితమైనప్పటికీ రామదాసు మనసు మాత్రం భక్తి కే పెద్ద పేట వేసింది అనడంలో సందేహం లేదు.సహజ భక్తి భావనతో అప్రయత్నంగా పెల్లుబికిన రచనలు ఇవి. అందుకే ఎంతమంది కలిసి పాడిన ఒకే గొంతులాగా ,శ్రావ్యంగా వినిపిస్తాయి. ఆ లక్షణమే భజనలలో రామదాసు కీర్తనలు భజనలలో ఎక్కువగా వినిపించడానికి కారణం। చెరిగిపోని కీర్తితో,తరగని భక్తితో అమరజీవి అయ్యాడు రామదాసు. అయితే జీవితపు తొలి నాళ్లలో ఈతను ఏ రచన చేసినట్లు అన్పించదు. తర్వాతి కాలంలో ఉద్యోగం లో వచ్చిన కష్టాల వలన కల్గిన ఆవేదనతో ,అప్రయత్నంగా , ఆశువుగా వచ్చిన రచనలు ఇవి. మనలాంటి వారికి కూడా బాధలో ఈ కీర్తనలే నోటివెంట పలుకుతాయి కదా!ఆ కీర్తనలలో గల ఆర్తి అటువంటిది మరి. రామదాసు భక్తి భరిత రచనలలో కొన్ని ఉదాహరణలను గమనించండి.
శరణాగతి:
పల్లవి:రామదైవ శిఖామణి
సుర రాజ మహోజ్వల భూమణి ||
చరణం:నాడే మిమ్ము వేడుకోంటి గా
శరణా గత బిరుదని వింటిగా
వేడుకై మిము పొగడ గంటిగా
నన్ను దిగవిడ నాడ వద్దంటి గా||
శరణా గత వత్సలుడని పేరు పొందిన రామ చంద్రుని కరుణ తనపై ప్రసరింప చేయమని వేడుకుంటున్న ఈ కీర్తనలో శరణాగత భావం కన్పిస్తుంది.
స్మరణం:
పల్లవి:హరిహర రామ నన్నరమర జూడకు
నిరతము నీ నామ స్మరణ మేమరను||
చరణం:దశరథ నందన దశముఖ మర్ధన
పశుపతి రంజన పాప విమోచన||
దాసత్వం :
పల్లవి:రామ చంద్రులు నాపై చలము చేసినారు
సీతమ్మ చెప్పవమ్మా||
చరణం:కటకట వినడేమి సేయుదు
కఠిన చిత్తుని మనసు కరుగదు
కర్మము లెటులుండునో కద
ధర్మమే నీకుండు నమ్మా||
యజమానుడైన భగవంతుని కరుణ లేకపోతే దాసుడైన తనను ఎవరు రక్షిస్తారు అన్న దాసత్వ భావన ఈ కీర్తనలో కన్పిస్తుంది.
చింతనం:
పల్లవి:నారాయణ అనరాదా
మీ నాలికపై ముల్లు నాటి ఉన్నదా||
చరణం:కలుష వారధికి నావ నిన్ను
గలిసే టందుకు చక్కని బాట త్రోవ
ఇలలో తెలివికి దేవదేవ
నరహరి నామ కీర్తనములే లేవా||
ఆత్మలో ఎరుక:
పల్లవి:తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓ రన్నా ||
చరణం:ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన
ఈ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము
సత్యం బిక పుట్టుట సున్నా||
భగవంతుని గురించిన జ్ఞానమే మోక్ష ప్రదాయిని అని భావం.
సఖ్యత:
పల్లవి: తక్కువేమీ మనకు
రాముడు ఒక్కరుండు వరకు|
చరణం:భూమి స్వర్గమును పొందుగా గొలిచిన
వామనుండు మనవాడై యుండగ|
భగవంతుని స్నేహితునిగా భావించి , ఆ స్నేహం వలన తన జీవితం ధన్య మైందని తలచడం.
సంకీర్తనం:
పల్లవి: ఏ తీరుగా నను దయ జూచెదవో
ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను
నళిన దళేక్షణ రామా |
చరణం:శ్రీ రఘు నందన సీతా రమణా
శ్రిత జన పోషక రామా
కారుణ్య లయ భక్త వరద
నిను కన్నది కానుపు రామా|
ఈ భవ సాగరాన్ని దాటాలంటే భగవంతుని సంకీర్తనమే సరైన దారి అని చెప్పడం.
అర్చనం:
పల్లవి:అమ్మా !నను బ్రోవవే రఘురాముని
కొమ్మా నను బ్రోవవే !
చరణం:అమ్మా !నను బ్రోవవే సమ్మతి తోడ మా
యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద |
అక్షరాల మాలతో దైవాన్ని అర్చించడం ఇందులో కన్పిస్తుంది.
పాదసేవనం:
పల్లవి:రామ నీదయ రాదుగా పతిత పావన
నామమే నీ బిరుదుగా శ్రీ రామా |
చరణం:ఈవులడగ జాలగా శ్రీ పాద
సేవ మాకు పదివేలుగా రామ
భావజనక నీ భావము తెలిసియు
నీవు దైవమనుచు నీ నమ్ముతున్నాను|
రామచంద్రుని పాదసేవకు మించిన పూజ ఇంకొకటి లేదని భావం.
వాత్సల్య భక్తి:
పల్లవి:బూచివాని పిలువ బోదునా ఓ గోపాల కృష్ణా!
చరణం:బూచివాని పిలువ బోతే వద్దు వద్దు వద్దనేవు
ఆ చిచ్చి జోల పాడి అయి ఉంచిన నిదుర పోవు |
భగవంతుని శిశువుగా భావించుట.
వందనము:
పల్లవి:వందనము రఘునాయక
ఆనందము శ్రీ రఘునాయకా
పొందుగ పాదారవిందము
కనుగొందునా రఘు నాయకా|
చరణం:ఎవరేమన్నారు రఘు నాయకా
నే వెరువ జాల రఘు నాయకా
నవనీత చోర నీ నామమే గతి యని
నమ్మితి రఘు నాయకా|
ఈ విధంగా అనేక రకాలైన భక్తి మార్గాలలో తన భక్తి ప్రపత్తులను రామదాసు ప్రదర్శించాడు. ఆహ్లాదకరమైన భక్తి రచనలకు ప్రసిద్ధి గాంచిన ఉత్తమ వాగ్గేయ కారుడు రామదాసు అనడంలో సందేహం లేదు.
క్షేత్రయ్య సంగీత్ రచన నభూతో న భవిష్యతి. పద రచనకు సంబంధించినంత వరకు ఈతనికి ముందు సాహిత్యానికి ఉన్న స్థానం, విశిష్టత సంగీతానికి లేదు. ఒక్కొక్క రాగం, అది పలికే తీరు, ఆ స్వరాల కున్న శక్తి, ఆ స్వర సమూహంవల్ల కలిగే మధురిమ, ఆ స్వరచిత్రం వల్ల ఏర్పడే ఆనందం, మన కళ్లముందు తిరుగాడే ఛాయా చిత్రం లాగా ఒక సమగ్ర స్వరూపమును అందిస్తుంది క్షేత్రయ్య సంగీతపు బాణి.
ఏ రాగం ఉపయోగంచడం వలన ఒక రచన మనోజ్ఞంగా భాసిస్తుందో, ఏ రాగం ఉపయోగంచడం వలన ఆ రచన మరింతగా భావభరితం అవుతుందో బహుశః క్షేత్రయ్యకు తెలిసినట్లు ఇంకొక పద కవికి తెలియదు అన్నది అతిశయోక్తి కాదు. రస నిర్వహణకు కావలసిన అంగ నిరూపణలో సున్నితమైన, సుకుమారమైన భేదాలను కల్పించడమే గాక వాటిని చిత్రించడానికి కావలసిన భాష, సంగీత రచన ఇతనికి కరతలామలకం. ఏ స్వర సంగతుల వలన రాగంలో భావోద్రేకం కలగడానికి వీలు అవుతుందో తెలిసిన ప్రౌఢ కవి కాబట్టే దానికి తగిన సాహిత్యం కూడా అప్రయత్నంగా రాగ భావంలోని ఆవేశంతోపాటు కలిసి సుకుమారమైన తీగలుగా సాగి సువాసన భరిత పుష్పాలను రసికులకు అందించింది.
ఆయా రసభావాల తీవ్రత లోని వ్యత్యాసాలు, అక్కడ ఉపయోగించిన రాగ వైవిధ్య ప్రయోగ జ్ఞానం కల ఈతని పాండిత్యం శ్లాఘనీయం. ప్రత్యేకించి విషాద భరిత సమయంలో ఉపయోగించిన పున్నా గవరాళి, కాంభోజి, నాద నామక్రియ, ముఖారి, నవరోజు వంటి రాగాలలోని అతి సూక్ష్మ ప్రయోగాలు, విన్నప్పుడు ఆర్ద్రతతో కూడిన గుండె చిత్తడి కావడంతోపాటు కంట తడి కాకమానదు. సంగీతం ముఖ్యంగా మనసుమీద చాలా ప్రభావం చూపుతుంది. అది మనలో ఎందరికో అనుభవమే కదా! ముఖ్యంగా హుస్సేన్, కాంభోజి, తోడి వంటి రాగాలలో క్షేత్రయ్య చూపిన వైవిధ్యం ఇంతవరకు ఇంకొక వాగ్గేయకారుడు చూపలేదు అనడం సాహసం కాదు.
హిందుస్థానీ సంగీతంలో ఒక ప్ర్రకియయైన టుమ్రీలలో రాగభావం పలికించడానికి ప్రత్యేక సాధన చేస్తారు. రాగంలోని జీవస్వరం, రాగఛాయ గొంతులో స్పష్టంగా, శ్రావ్యంగా పలకడానికి కృషి చేస్తారు. క్షేత్రయ్య పదాల్లోని సంగీత విశేషాలు గమనిస్తే ఇతనికి హిందుస్థానీ సంగీతంతో పరిచయం ఉందేమో అని సందేహం కల్గుతుంది. ఎందుకంటే పల్లవి నుంచి అనుపల్లవికి, అనుపల్లవి నుంచి చరణానికి, రెండు చరణాల మధ్యన, తిరిగి చరణం నుంచి పల్లవికి సాగిన రాగప్రస్తారం క్రమంగా విస్తరించి కోరక దశ నుంచి వికసించిన పుష్పం లాగా చిత్తరంజకత కల్గిస్తుంది. అందుకే తరువాతి కాలంలోని సంగీతజ్ఞులు ఈతని రాగ సంచారం గమనించి ఆశ్చర్యపోయారు. ఈతని పదాలు రాగ సంచారానికి నిఘంటువు వంటివి అని ప్రశంసించారు.
సంగీత జ్ఞానంతోపాటు తాళ జ్ఞానం ఇతనికి అపారం. అభినయంలో కూడా అందెవేసిన చేయి కాబట్టి ఈతని పదాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా మిశ్రచాపు తాళపు నైపుణ్యం ఇతని పదాలలో విరివిగా కన్పిస్తుంది. అభినయానికి ఈ తాళం చాలా అనుకూలమైంది. మూడు, నాలుగు అక్షరాల కలయిక అయిన ఈ ఏడక్షరాల మిశ్రచాపు
తాళంలోని గతినిగాని, విన్యాసాన్నిగాని, అతి రమ్యంగా ప్రదర్శించాడు. అతి సూక్ష్మ భావాలు కూడా ఈ తాళం ద్వారా అద్భుతంగా ప్రకటించబడ్డాయి. అభినయానికి మరొక్క విలక్షణతను ఆపాదించాయి. రాగాలకు ఇంతటి సమ్మోహన దీప్తి, తాళాలకు ఇంతటి సమ్మోహన దీప్తి, తాళాలకు ఇంతటి మహత్తర శక్తి ఉంటాయి అనడానికి క్షేత్రయ్య పదాలే సరైన ఉదాహరణలు.
ఈతని పదాలు అతి విలంబ గతిలో ఉండడంవలన కొంత క్లిష్టత ఉండడం సహజం. గాత్రంలో విపరీతమైన నియంత్రణ ఉంటే తప్ప ఈతని పదాలు గానం చేయలేరు. అందుకే ఈతని ధోరణిని తర్వాతి పద కవులకు దాదాపుగా అసాధ్యమైపోయింది. అంతేకాదు, క్షేత్రయ్య పదాలు ఆడిపాడడానికిగాని, చూడడానికి కూడా ఎంతో రసజ్ఞత కావాలి. అది లోపించడంతోపాటు అన్నిటా వేగం పెరిగిన నేటి కాలంలో విలంబ గతిలో సాగే క్షేత్రయ్య పదాలకు ఆదరం తగ్గింది అనుకోవాలి. కాబట్టే ఈతనిని ఏ కవి అనుకరించలేదు. అందుకే నేడు ఈతని పదాలు గానంలోగాని, అభినయంలోగాని కొంత కనుమరుగయ్యాయి.
కేవలం పదకవిగా అపార వైదుష్యం కలవాడిగా మాత్రమే కాక ఇతను కృష్ణభక్తుడు. అందుకే ఈతని పదాలన్నీ మువ్వగోపాల ముద్రతో కన్పిస్తాయి. తాను రచించిన పదాలు పాడుకోవడానికి, అభినయించడానికి అన్న భావన క్షేత్రయ్యలో స్పష్టంగా కన్పిస్తుంది.
ఉదాహరణకు
‘‘బాళితో మువ్వగోపాలునిపై వేడ్క పదమైన పాడుకొంటిమా;
పదము పాడగా వినెవో;,
చిటికెన కొనగోరు చిమ్ముకొంచు పలుమారు చిటిపొటి పదములు చేరి పాడుచు;’’
ఇట్లా ఎన్నోసార్లు అంటాడు.
ముఖ్యంగా క్షేత్రయ్య పదాలు ఉద్వేగప్రధానాలు, ఈ పదాలు పాడాలన్నా, అభినయించాలన్నా జోడు గుర్రాల స్వారీ వంటిది. అన్నమయ్య పదాలలో భక్తి ప్రధానంకాగా, ఈతను తన పదాలలో భక్తితోపాటు రక్తిని కూడా రంగరించాడు.
చివరగా అతని మాటలలోనే అతని అభిప్రాయం విందాం.
వెన్నెల బైట సంగీతము విననట్టి వేడుకేటి వేడుకే?
చిన్నెలు మెరయించి చిరునవ్వు నవ్వని చిత్తమేటి చిత్తమె?
సన్ను తాంగిరో! కనుసైగ సేయని యట్టి పదములేటి పదములే?
క్షేత్రయ్య పదాలన్నీ చక్కని జాను తెలుగులో రచింపడ్డాయి. ఆ నాటి తెలుగు భాషా స్వరూపం ఈ పదాల ద్వారా తెలుసుకోవచ్చును. అయినా ఇతను సంస్కృతాంధ్ర భాషలు రెండింటిలో సమాన మైన పాండిత్యం కలవాడు.అన్నమాచార్యుల వారు చెప్పిన సంకీర్తన లక్షణం ఈతని పదాలలో స్పష్టంగా కన్పిస్తుంది.దేశీయ కవిత లో అందె వేసిన చేయి గల ఈతని రచనలో ఎన్నో పలుకుబళ్ళు, సామెతలు అలవొకగా ఇమిడిపోయాయి.పదాలలోని సన్నివేశ చిత్రీకరణ గాని, వర్ణన గాని అత్యంత మనోహరం. జయదేవుని అష్టపదులు కూడా రాధాకృష్ణుల రాసక్రీడల వర్ణనలే కానీ అవి సంస్కృతంలో ఉండడం వలన భాషా పటిమ గల పండితులకే పరిమితమైనవి. కానీ క్షేత్రయ్య పదాలు జాను తెలుగులో ఉండడం వలన పండిత పామర జన రంజకమయ్యాయి.తేట తెలుగు పదాలతో భావ గాంభీర్యాన్నివ్యక్తం చేయగల రచనా చాతుర్యం ఈతని ప్రత్యేకత. పదాల భావ పరిణామమంతా అలంకారిక మయమే. ప్రాచీన మహాకవుల ప్రయోగాలతో సమానమైన అలంకార ప్రయోగం చేయడం ఒక విశేషం. మల్లెలు గుభాళించి నట్లు,వేసవి కాలపు సాయంకాలం చల్లని గాలి వీచినట్లు, గున్న మామిడి తోపుల నుంచి కోయిల కూసినట్లు, నల్లని మబ్బుల నేపథ్యంలో తెల్లటి కొంగలు ఎగురుతున్నట్లు ఉంటుంది క్షేత్రయ్య కవిత. గతంలో సాహిత్యానికి పరమావధి నాటకమని అనేవారు. కానీ అన్నమయ్య క్షేత్రయ్యల తర్వాత సాహిత్య పరమావధి పదం అనవచ్చును. ఎందుకంటే పదంలో ఇమడని భావం లేదు. అణువులో అణువు వంటిది,బ్రహ్మండం లో బ్రహ్మాం డం వంటిది ఈ పదం. క్షేత్రయ్య పద స్వరూపం ఇటువంటిది కాబట్టే దానిని మనసులో ఆస్వాదించడానికి గాని, అనుభవించడానికి గాని మామూలు చదువుతో పాటు ప్రత్యేక మైన సంస్కారం ఉండాలి; లలిత కళలలో ప్రవేశం ఉండామే గాకుండా వ్యుత్పత్తి అభ్యాసం వల్ల , అనుభవం వలన మనసు పరిపక్వత చెంది ఉండాలి. అందుకే క్షేత్రయ్య అక్షరాక్షరం పరమ ప్రమాణ మణి అన్న ముందు తరాల విద్వాంసుల మాటను శిరసా వహించాలే తప్ప నిరసించకూడదు. క్షేత్రయ్య పదాలలో విషయాలు అనేకంగా ఉంటాయి. ఒక్కొక్క పదం చదివినా, పాడినా, అభినయించినా ఆ నాయిక మనోభావాలు, మనో వ్యధలు , బయటకు చెప్పుకోలేని ఎన్నెన్నో భావాలు మనకు స్పష్ట మవుతాయి. ఒక ఉదాహరణ చూడండి.
‘ఉసురని తల యూచునే శయ్యపై నుండి యులికి దిగ్గున లేచునే
కసరి దిక్కులు చూచునే కన్నీరు నించి
కనులెర్రగా చేసునే ఓ లలనరో ‘
ఆన్ ఈ గేయం విరహి నాయిక మనస్థితికి ప్రతిబింబం.
అట్లాగే క్షేత్రయ్య పద చిత్రణ అత్యంత సుందరం.
అన్నమయ్య తర్వాత ఆతని కుటుంబీకులు పెద తిరుమలాచార్యులు వంటి వాగ్గేయకారులు తమ రచనల ద్వారా ఈ సంప్రదాయాన్ని ముందుకు నడిపించారు. ఈ కాలంలోనే సాహిత్య రంగంలో ప్రబంధాల పంట విరివిగా పండింది. అది క్షేత్రయ్యకు అనుకూలించింది. అందుకే క్షేత్రయ్య కవితలో రకరకాల శబ్దాలంకారాలు కన్పిస్తాయి. పదంలో సన్నివేశ చిత్రీకరణ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ ప్రత్యేకత నాటి రసిక జనుల మన్ననలను అందుకొంది.
అన్నమయ్యలో మొగ్గ రూపంలో ఉన్న అభినయ విద్య క్షేత్రయ్యలో సహస్ర దళ పద్మమై వికసించింది. వివిధ కోణాలలో, వివిధ దృక్పథాలలో, వివిధ తీరుల చతుర్విధ అభినయాలకు క్షేత్రయ్య పదాలు అనుకూలంగా ఉంటాయి. నాట్య శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయని వారు క్షేత్రయ్య పదాల అభినయాన్ని అధ్యయనం చేస్తే చాలు. అన్ని రకాల అభినయాలు పట్టు పడతాయి. క్షేత్రయ్య ప్రతి పదం నృత్య గాన అభినయాలకు నిఘంటువు వంటిది. ఒక్కొక్క పదం ఒక్కొక్క అభినయ వైచిత్రి కల్గి ఉంటుంది. నిజానికి ఈ పదాలను అన్నింటిని గుదిగుచ్చే ఏక సూత్రత లేకపోయినా అంతర్గతమైన కృష్ణ తత్త్వం వలన ఇదొక రస భరిత కావ్యం అనవచ్చును.
అభినయ కళలో శివ తత్త్వం, విష్ణు తత్త్వం అని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. ఈ రెండు తత్వాలను ఒకే పదంలో మిళితం చేసి రచించాడు క్షేత్రయ్య. చూడండి ఈ ఉదాహరణ.
‘చక్కని దయ గలదా యిది నీ జాగా చెవంది లింగా
ఇక్కడికి వచ్చినదేమో హెచ్చు కంచి వరదా!
ఇందున్నావాని యీడ వచ్చితి చెవంది లింగా
అందుకేల యెవరిల్లిదీ యవురా కంచి వరదా!
ఎవ్వడో యీ పడకింటిలో నవ్వేది చెవంది లింగా
మువ్వ గోపాలుడు గాక మరెవ్వరు కంచి వరదా!‘
ఇద్దరు దైవతాలని సంభోదిస్తూ చివరన ఆ ఇద్దరినీ మువ్వ గోపాలునితో సమన్వయించాడు. నృత్యం చేసే నర్తకికి అభినయానికి అపారమైన అవకాశం ఉంటుంది ఇటువంటి రచనలలో.
పలుకు పలుకులో తేనె లొలుకే విధంగా రచనలు చేసిన క్షేత్రయ్య పుట్టుక, బాల్యం చాలా వివాదాస్పదమైన విషయం. ‘శూరుల జన్మంబు, సురుల జన్మంబు నేరుల జన్మంబు నెరుగ నగునే’ అన్నట్లు అతని జన్మ చర్చనీయమే. శ్రీ విస్సా అప్పారావు గారి విశేష పరిశోధన వలన క్షేత్రయ్య జన్మ స్థలం కృష్ణా జిల్లాలోని కూచిపూడి దగ్గర గల మువ్వ గ్రామం అని, 16/17 శతాబ్ది మధ్యకాలంలో జీవించాడని తెలుస్తున్నది. పుట్టుక, బాల్యం మాత్రమే కాకుండా ఈతని పేరు కూడా వివాదాస్పదమే. పలు క్షేత్రాలు తిరిగిన కారణంగా ఈతనికి క్షేత్రయ్య అనే పేరు వచ్చిందని, అసలు పేరు వరదయ్య అనే వాదం కూడా లేకపోలేదు.
మువ్వ పురీ నిలయా, మువ్వ పురీ విభుడైన, మువ్వ పురీ సామి వంటి అనేక పదాలలో క్షేత్రయ్య మువ్వ ను గ్రామవాచిగానే ఉపయోగించాడు. ఈ గ్రామం లోనే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయమున్నది. ఈ స్వామినే క్షేత్రయ్య మువ్వ గోపాలుడని సంభోదించాడు. పైగా మువ్వ కు కూతవేటు దూరంలో నాట్యానికి నెలవైన కూచిపూడి గ్రామం ఉంది. ఆ నాట్యం చిన్నప్పుడు చూస్తూ పెరిగే అవకాశం ఇతనికి ఉంది కూడా. కాబట్టి నాయికానాయక భేదాలన్నీ అతి సూక్ష్మమైనవి కూడా ఈతని రచనలలో కన్పిస్తాయి. నేటికీ కూడా కూచిపూడి వారు క్షేత్రయ్య పదాభినయంలో నిపుణులు.
నిజానికి క్షేత్రయ్య పదాలు అత్యంత శృంగార భరితమైనవి. ముందు చెప్పుకున్నట్లు అది క్షీణ ప్రబంధ యుగం. ఆ కాలంలో ఎవరు రచనలు చేసినా అది శృంగార మయంగానే ఉండేది. తంజావూరు పాలకుడైన రఘునాథ రాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాల వంటి మహిళా కవయిత్రులు ఉండేవారు. వారు రాసినవన్నీ ఈ కోవకు చెందినవే. అటువంటి కాలంలో ఇంకో రసానికి తావు ఉంటుందా.
తాను ఒక మహా కావ్యం రాయక పోయినా తొలి రచన మాత్రం శ్రీకారంతో మొదలు చేశాడు క్షేత్రయ్య. ఈ తొలి రచనలో అందులోని పదాల పొందిక, భావ లాలిత్యం చూడండి.
‘శ్రీ సుతు బారికి నెనోపలేక నిను వేడితే కోపాలా – మువ్వ గోపాలా
ఏ పొద్దు దానింటిలోనే కాపై యుండిన నీ సరస సల్లాపాలా – మువ్వ గోపాలా
చూపుల నన్యుల దేరి చూడని నాతో చేరి కలాపాలా – మువ్వ గోపాలా ..”
ఈ రచనలో గల పద ప్రయోగం గాని, నడక గాని, తాళం గాని తర్వాతి పదాలలో కన్పించవు. దాదాపుగా ప్రతి పాదంలో మువ్వ గోపాలా అంటూ యమక యుక్త ప్రయోగాలున్నాయి.
దీని తర్వాత రాసిన పదాల నడక గాని, పద ప్రయోగాలు గాని స్వభావ రీత్యా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ పదాలన్నీ దాదాపుగా త్రిపుట తాళం లేదా మిశ్ర చాపులో కన్పిస్తాయి. నిజానికి ఈ తాళాలు నృత్యానికి అనుగుణమైనవి. పైగా ఈ పదాలు అతి విలంబితమైన నడక కలవి.
చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతున్న ఈతనిని కృష్ణా తీరంలో జరిగే భజనలు, ఆలయ ప్రాంగణాల్లో అన్నమయ్య పదాలు, సిద్ధేంద్రుల వారి కలాపాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు చేస్తున్న కూచిపూడి నర్తకులు చాలా ఆకర్షించారు. బహుశః వీటి ప్రభావం క్షేత్రయ్యలో చిన్ననాడే బీజప్రాయంగా పడింది. క్రమంగా అది బలపడి, ఒక రూపు సంతరించుకొని యౌవన దశలో సంపూర్ణ వాగ్గేయకారత్వానికి దారి చూపింది. అనేక ప్రదేశాలు తిరిగిన కారణంగా ఈతనికి క్షేత్రయ్య అన్న పేరు స్థిరపడింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు వరదయ్య అని శ్రీ విస్సా అప్పారావు గారి పరిశోధన చెబుతున్నది. దివ్య క్షేత్రాలు దర్శించిన వాడు, క్షేత్రజ్ఞానం కలవాడు క్షేత్రజ్ఞుడు అని పిలువ బడు తాడని వేటూరి ఆనంద మూర్తి గారి అభిప్రాయం.
17 వ శతాబ్దపు సాహిత్య రచనలో అవసరానికి మించిన శృంగారం కన్పిస్తుంది. ఇది కేవలం మన తెలుగు సాహిత్యంలో మాత్రమే కాదు. భారతదేశమంతటా ఇదే పరిస్థితి. ఇవే లక్షణాలు క్షేత్రయ్యలోనూ కన్పిస్తాయి. ఆ నాడు రచన చేసిన స్త్రీ పురుషులందరు మితి మీరిన శృంగారాన్ని వర్ణించారు. ఆది నాటి యుగ లక్షణమనుకుంటే క్షేత్రయ్యలో గొప్ప భక్త కవిగా, వాగ్గేయకారుడుగా దర్శనమిస్తాడు. ఇతను భారత శాస్త్ర నిధి. అభినయ విద్యా విశారదుడు. తేట తెలుగు భాష సౌందర్యాన్ని, మాధుర్యాన్ని ఆసాంతం తెలుసుకొని పలికినవాడు. తనకు తెలిసిన భాషా సౌందర్యాన్ని తనదైన భావ సౌందర్యంతో మేళవించి కమ్మని పదాలను ఆలపించాడు. తనదైన ఒక ప్రత్యేక బాణీ ద్వారా పద కవితా చరిత్రలోనే తనకంటూ ఒక విశేష స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. వివిధ కోణాలలో, వివిధ దృక్పథాలలో, వివిధ రీతుల చతుర్విధ అభినయాలని ప్రదర్శించడం కేవలం ఒక్క క్షేత్రయ్య పదాలలో మాత్రమే సాధ్యపడుతుందని స్వానుభవం ద్వారా చెప్పారు శ్రీ నటరాజ రామకృష్ణ గారు.
‘ఆంగికం కావలసిన వారికి ఆంగికం, గానం వినదలచిన వారికి గాన మాధుర్యం, భావ యుక్తంగా పాట వినాలన్న వారికి ఆ తృప్తి, భాష యొక్క, ఆ నాద ధ్వని యొక్క ప్రభావం తరచి తరచి వినాలన్న వారికి సంతృప్తి, పద్యంలోని నాయికా సంపూర్ణ స్వరూపం చూడ గోరిన వారిని ఆ నిరూపణం, సంచార విన్యాసాలు తిలకించ గోరిన వారికి ఆ అనుభూతి, శృంగార రసం లోతులు ఎరుగ దలచిన రసజ్ఞులకు ఆ ఆనందం..’ అంటూ క్షేత్రయ్య సంపూర్ణ స్వరూపాన్ని మన కళ్ళెదుట సాక్షాత్కరింప చేశారు రామకృష్ణ గారు.
క్షేత్రయ్య పదాలను కొన్నింటిని తీసుకొని వచ్చే వ్యాసంలో విశ్లేషణ చేసి, అందులోని విశేషాలను తెలుసుకుందాం.
అన్నమయ్య కేవలం వాగ్గేయకారుడు మాత్రమే కాదు. పదానికి లక్షణాలను వివరిస్తూ గ్రంథాలు రచించాడు. వాటికి లక్ష్యాలుగా వందలాది పదాలను రచించాడు. తాను రచించిన పదాలను భక్తి, శృంగార రచనలుగా ఆయన విభజించినప్పటికి పద్యం అంటే ఆ కాలానికి భక్తి రచన అన్న అర్థంలోనే వ్యవహరింపబడింది. శృంగాలు పదాలు క్షేత్రయ్య నాటికి వాడుకలోకి వచ్చాయి. అవే పదాలు త్యాగరాజ స్వామి కాలం నాటికి ఆధ్యాత్మిక కీర్తనలుగా పేరు పొందాయి. ఈ వివరాలు ముందు వ్యాసాలలో తెలుసుకుందాం. పదాల అనంత స్వరూపాన్ని అన్నమయ్య అతి మనోహరంగా ప్రదర్శించారు. వైష్ణవ భక్తిని, సంగీతాన్ని, సాహిత్యాన్ని కలిపి త్రివేణి సంగమం చేశారు. తర్వాత ఈ సంప్రదాయాన్ని వీరి వంశస్థులు అంటే అన్నమయ్య పత్ని తిమ్మక్కతో బాటు వారి కుమారులు పెద తిరుమలాచార్యులు, మనుమడు చిన తిరుమలాచార్యులు కొనసాగించారు. అన్నమయ్య కేవలం తన కుటుంబంలోని వారిని మాత్రమే ప్రభావితం చేయలేదు, తర్వాతి కాలంలో వచ్చిన ప్రతీ వాగ్గేయకారుడు వీరి ప్రభావానికి లోనయినవారే. అందుకే పదం అన్నా, సంకీర్తనం అన్నా అన్నమయ్య మొదటగా గుర్తుకొస్తారు. 12 సంవత్సరాల వయస్సులో శ్రీ వేంకటేశ్ర స్వామిని ప్రత్యక్షం చేసుకున్న వీరు తన జీవిత కాలంలో 32 వేల సంకీర్తనలను రచించారు. ప్రస్తతం అన్నీ కాకపోయినా రాగి ఫలాకాల మీద దొరికిన సంకీర్తనల నాధారంగా పరిశీలించినట్లయితే అన్నమయ్య కవితా వైభవం అర్థమవుతుంది. అన్నమయ్య రచనలలో నవవిధ భక్తి మార్గాలు కనిపిస్తాయి.
తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్ఛనముల్ సేవయు నాత్మలో నెరుకయన్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మీది భక్తి మార్గముల సర్వాట్మున్ హరిన్ నమ్మిస
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్….. అన్న ప్రహ్లాదుని ఈ భక్తి ప్రకటనలో మనకు ఈ తొమ్మది భక్తి మార్గాలు తెలుస్తున్నాయి. భక్తికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఇంకొకటి లేదు. అన్నమయ్య రచనలలో ఈ భావాలన్నీ గోచరమవుతాయి. ఉదాహరణకి చూడండి,
సఖ్యము :
పల్లవి : కూరిమి గలిగితే చాలు కోపించినా మేలువో
అరయ నో రమణుడ అంతాను మేలువో
చరణం : మనసున నీవు నన్ను మరవకున్న జాలు
యేనసి నీ వేడ నున్నా వియ్యకలే పో
ననువు వలపు నీవు నాపై జల్లితే చాలు
వెనుక నీవేమన్నా వేడుకనే పో.
శ్రవణం :
పల్లవి : ఇందు నుండి మీ కెడ లేదు
సందడి చేయక చనరో మీరు
చరణం : నాలుక శ్రీహరి నామంబున్నది
తూలుచు బారరో దురితములు
చాలి భుజంబున చ్రకంబున
తారిమి భవబంధములటు దలవో,
దాసత్వము :
పల్లవి : పాప పుణ్యముల పక్వమీదెరుగను
నా పాలిటి హరి నమో నమో
చరణం : మానస వాచక కర్మంబుల
తానకముగా నీ దాసుడను
పూని త్రీ సంధ్యల భోగ భాగ్యముల
నానా గతులను నమోనమో
వందనం :
పల్లవి : నీ యంత వాడనా నేను నేరము లేమెంచేవు
యీ యెడ నిరుహేతుక కృప జూడు నన్నును.
చరణం : నిరతి నిన్నెరుగను నీవు నన్నెరుగుదువు
ధర యాచకుడ నేను దాతవు నీవు
వరస యాచకుడ నేను వైకుంట పాటివి నీవు
నరుడ నేను నీవు నారాయణుడవు
అర్చనం :
పల్లవి : భావించి తెలుసుకుంటే భాగ్య పలము
ఆవలీవలి ఫలములంగజ జనకుడే
చరణం : దానములలో ఫలము తపములలో ఫలము
మోసములలో ఫలము ముకుందుడే
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము
ఆత్మలో ఎరుక :
పల్లవి : హరి శరణాగతి యాతు మది
సరుస నిదియే పో సతమయ్యేడది.
చరణం : దిన దిన రుచులివి దేహముది
చెనకేటీ కోరిక చిత్తముది
యెనసేటి కాంతలు యింద్రీయంబులు లవి
పనివి యాత్మ కవి పని లేదయ్యా.
సంకీర్తన : వినుడిదే రఘుపతి విజయములు
పనుపడి రాక్షస బాధలుడిగేను.
చరణం : కుల గిరు లదిరెను కుంభిని వడకెను
ఇల రాముడు రథ మెక్కినను
కలగె వారధులు కంపించె జగములు
బలు విలునమ్ములు పట్టినను.
చింతనం :
పల్లవి : వెరపులు నొరవులు వృథా వృథా
ధరపై మరి యంతయును వృథా,
చరణం : తడయక చేసిన దానంబులు వృథా
యెడ యెడ నెరిగిన యెరుక వృథా
ఒడలిలోన హరి నొనరగ మతిలో
దడవని జీవమ తనకు వృథా.
అన్నమయ్య పదాలు లేదా సంకీర్తనలలోని సంగీతం మనకు పూర్తిగా లభించలేదు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి అపార కృషివలన సంగీతబద్ధమైన సాహిత్యంతో కూడిన రాగిరేకులు లభించినప్పటికీ వాటి గురించి సంపూర్ణమైన సమాచారం ఇంకా వెలుగులోకి రాలేదు. అంతవరకు అన్నమయ్య సంగీతపు పోకడల గురించి ఒక అభిప్రాయానికి రాలేము. సాహిత్యానికి సంబంధించినంత వరకు అన్నమయ్య రచనలు ఎంతో లలితమైనవి, సుకుమారమైనవి. అందరికీ అందుబాటులో ఉన్న ప్రజాభాష ఇది. సామాన్యమైన భాషను ఉపయోగించినప్పటికీ ఈ కీర్తనలు అన్నమయ్యను పదకవితా పితామహునిగా చేసినాయి. వచ్చే వ్యాసంలో ఇంకొక వాగ్గేయకారుని గురించి తెలుసుకుందాం.
డా. కృష్ణ కుమారి 9885451014