భువనచంద్ర సినిగేయ సాహిత్య పై డా॥ గుమ్మడి (కె) రామలక్ష్మి పరిశోధన చేసి చెన్నై మూనివర్సిటినుండి డాక్టరేట్ పొందినారు. వారి పరిశోధనలో వెల్లండిచిన
వన చంద్రపాటల్లోని సాహిత్యాన్ని రామలక్ష్మి గారు వివరించిన విధానము తెల్సుకుందాము. భువనచంద్ర చలన చిత్ర సాహిత్య వనంలో సౌకుమార్యం, సౌందర్యం, సౌగంధ్యం లాంటివి కలిసి వున్న పూలు చాల వున్నాయి. సుతిమొత్తని పదాలతో సుందకరంగా పాటను అల్లటం దానికి భావపరిమళంతో ఊపిరిపోయటం లాంటి మెళకువలన్నీ క్షుణ్ణంగా తెలిసిన కవి అంటారు రచయిత్రి. అంతేకాదు సంగీతం, సాహిత్యం, నాట్యం కూడా భువనచంద్ర చలన చిత్రగీతాల్లో త్రివేణి సంగమంగా కొన్ని సార్లు ఉరకలేత్తిస్తు మరోసారి మౌనగానంలా, ఇంకోసారి ఉవ్వెత్తగా ఎగసిన కెరటాంగా కల నుండి జాలువారి సీని జగత్తులో చెదరని ముద్రను ఆవిష్కరించారు. ఇలాంటి వన్నీంటిని శ్రమించి అక్షర బద్దం చేస్తూ అన్ని కోణాల్నీ స్మృశించి పాటల్లోని మర్మాలను తేట తెల్లంచేశారు. రచయిత్రి రామలక్ష్మి.
భువన చంద్ర వ్యవహార భాషలో పాటల్ని మీటటంలో ‘కలం’ కారీ అద్దకం తెలిసిన వారు. టైటిల్ సాంగ్ విషయంలో వీరికి ప్రత్యేక ముద్ర వుంది. తెలుగు, ఆంగ్ల భాషల్లో అక్షరమాలలుగా రాసిన పాటలు ఎన్నింటినో ఆవిష్కరించారు. డబ్బింగ్ పాటల మాతృకలలోని భావం చెడకుండా పెదవుల క దలికకు సరిపోయేలా పాటను అనువదింటం, మాతృకభాష అనువాద భాషలమీద గట్టిపట్టుండాలి.
“గర్భాన పెరిగే పాపాయికి ఆగర్భమే ఓజైలురా, ఉయ్యాల వదిలిని బుజ్జాయికి అడుగడుగూ ఓ జైలురా” “నువు నాకు నచ్చావ్” లాంటి పద బంధపారిజాతం లాంటి భావబంధురమైన ఒకగొప్ప వాక్యం ఈ గ్రంథంలో మనం చూడవచ్చును.
వెండి తెరకు బంగారు పూత పూసిన గీత రచయితల్లో భువన చంద్రకు సముచిత స్థానం ఉంది. వీరి పాటల్లో సరిగమలు సరాగాల్ని మీటుతూ శ్రవణానందం కలిగిసై మరికొన్ని శృంగారానుభూతుల్ని పండించిన పాటల ద్వారా అమృతం కురిసిన రాత్రుల్ని చూపించారు. “ఆమ్మో నీ అమ్మగొప్పదే అందంపోగేసికన్నదే” (అంజి) సినిమా కోసం రాశారు. భువన చంద్ర రాసిన ఐటమ్ సాంగ్స్‌లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులకు మంచి సాహిత్యాన్ని సమకూర్చారు. వీరు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లకు రాసిన పాటలు అనేకం. ఇవి దర్శక నిర్మాతలకే కాక సినీ బయ్యర్లకు లాభాలను చూకూర్చటమే కాక సినిమా విజయాలకు కారణమ్యాయి. 1987వ సంవత్సరము నుండి నేటి దాక నిర్విరామంగా పాటలు రాస్తున్న సినీగేయ చరిత్రలో యుగకర్తగాను, పాటల విస్తృతిని పెంచిన కాలాన్ని భువన యుగంగా భావిస్తాను అంటారు రామలక్ష్మి. భువనచంద్ర డబ్బింగ్ పాటలు రాయడంలోను నేర్పారి వీరి డబ్బింగ్ పాటన్నీ ఒరిజినల్ పాటలుగానే అనిపిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.
సృశించిన ప్రతిభావంతుడు సాహీతివేత్త, బహుభాషా కోవిదుడని, ఇతర గీత రచయితలను మించిన ఘనుడని, నిరూపించే యత్నం చేశారు రచయిత్రి. ప్రాచీన ఆధునిక సాహితీ సంప్రదాయాలను, విలువలను తన పాటల్లో కాపాడుకుంటూ, నిలుపుకుంటున్న భువనచంద్ర అన్ని ప్రక్రియలను అన్ని కోణాల్లో సాహితి దృక్పథంతో సృజించిన కవిగా అక్షరసత్యాన్ని సిద్ధాంత గ్రంథం ద్వారా రచయిత్రి నిరూపించారు. భువన చంద్ర సినీసాహిత్యాన్ని వస్తువైవిద్యాన్ని బట్టి ప్రణయక, జానపద, సామాజిక, హస్య, సందేశాత్మక, అనుబంధ, సంప్రదాయ దోరణి గీతాలు వర్గీకరించారు అందుకొన్ని:- అంజి చిత్రంలో “చిరుగాలి వీచింది చివురాకు వొణికుంది” అనే పాటలో పల్లెటూరి జానపద ధోరణిలో శృంగార కవ్వింపుల్లో హస్యజోడించి కవి రచించారు. మరో పాట అచ్చం జానపద దోరణిలో ఇలా మిరపకాయ బజ్జి లిస్తవా… రాసోళ్ళరాణి సత్తుపల్లి సంతకొస్తవా, రాసోళ్ళరాణి కొర్రమీను లొండిపెడతవా… నాసోకురాణి తాటికల్లు ముంత బెడతవా అంటూ సహజ దోరణిలో జానపద పాటలు ఎన్నో రాశారు అంటారు కవయిత్రి.
భువన చంద్ర రాసిన పాటలు కొన్ని త్యాగజీవనం, ఆశయం, ఆశావాదం స్త్రీ స్వాతంత్ర్యం, ఆదర్శ వాదం, చదువుప్రాముఖ్యత, సంతోషం ప్రాధాన్యత అంశాలకు అణిముత్యాల వంటి సందేశాత్మక విలువలతో కూడిన పాటలు రాశారు. “కొండపల్లి రాజా గుండెచూడరా బసవన్నా… ఓ బసవన్నా గుండెలోన పొంగె ప్రేమనీదిరా… వినరన్నా.. ఓ బసవన్నా లాంటి పాట రాసిన “విలువైన ప్రాణం కన్నా స్నేహమే మిన్న, స్నేహం ల ఏని బతుకేసున్నా” అని స్నేహం యొక్క గొప్పతనాన్ని సందేశించారు. నిరాశ, శోకరి, ఆవరించినా వాటిని అధిగమించి ఆశావాదం వైపు దృష్టి సారించాలని “నేస్తమా… అనంతయాత్రలో ఏకాంత రాత్రిలో నిరాశలో శోకమే… నీ నీడలాగ వెంటనంటిసాగితే డోంట్ వర్రి బిహాప్పీ కదులుతున్న యిక్షణం, మరలిరాదు ఏక్షణం తెలుసుకో” అంటూ యువతరానికి సందేశం ఇస్తారు. స్త్రీ మానసికంగా, శారీరకంగా గాయపడినపుడు ఆమెలో ధైర్యం నింపెలా ఈ పాట “క్షణం క్షణం సంఘర్షణ…. జయించు మా భయం నిరంతరం అన్వేషణం…. లభించదాఫలం.. ఎదురేలేదని ఏనాటికి… ఎదురీదాలి ఈ నాడు అంటూనే మరోచోట “లైఫ్ ఈస్ ఏ చాలెంజ్… ఫెస్ ఇట్, లైఫ్ ఈస్ గేమ్ ప్లేయిట్ వీరిసె ఉదయం, విధిలో సమరం నీదే విజయం అంటూ గుండె ధక్ష్మర్యాన్ని ఇస్తారు భువన చంద్ర తన పాటలద్వారా, “మహిళ ఇక నిదుర నించి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో భలో ముందుకు భయా లెందుకు స్వశక్తి చూపి సాగు ముందుకు అంటు స్త్రీ స్వాతంత్ర్యం గూర్చి పాటల ద్వారా స్పూర్తి నింపుతారు.
ఆదర్శవాదం, చదువు, సంతోషం, అనుబంధగీతాలు, అమ్మ ఔన్నత్యం, భార్యభర్తల బంధం లాంటి ఎన్నో విషయాలను సాహిత్య మేళవిపుతోను ఆర్తి, అర్తనాదాల కలయికగా అనేకమైన గీతాలను భువన చంద్ర గారి కలం నుండి జాలువారాయి. ఇంక గల, గల పారే సెలయేరులా వస్తునే వుంటాయి అని రామలక్ష్మి తన సిద్ధాంత గ్రంథంలో రాశారు.
1980వ దశకంలో పాటల రచయితగా భువన చంద్ర “నాకు పెళ్ళాం కావాలి” చిత్రంతో సినీబయ్యర్లకు వసూళ్ళు తెచ్చిపెట్టిన అలుపెరుగని సవ్యసాచి. 12కు పైగా ఉత్తరాది భాషలు నేర్చుకున్నారు. పుస్తక పఠనం, చర్చలు, సమావేశాల్లో పాల్గొంటూ విజ్ఞానాన్ని పొందారు. 18సంవత్సరాలకీ ఎయిర్పోర్స్లో చేరి శిక్షణ పొంది 18 సంవత్సరాలపాటు విధుల నిర్వహించారు. భువనచంద్ర పాటలేకాదు, నవల, కథలు, శీర్షికలు వ్యాసాలు, కవితలు వంటి అన్ని సాహితి ప్రక్రియలను సృజించారు. వ ఈరు కథలు కూడా రాసి తెలుగుతేజం, స్వప్న, నది వంటి మాస పత్రికల్లోన, స్వాతవారపత్రికల్లోను ప్రచురితమై బహుమతులు గెలుచుకున్నాయి. ఇందు ముఖ్యంగా స్త్రీ ఔన్నత్యం, స్త్రీ ఆదర్శంగా నిలిచే, స్త్రీ విద్య, స్త్రీ స్వేచ్ఛ, విదవా పునర్వివాహం వారి జీవనగమ్యంతో పాటు సంసారంలోని ఆటు, పోట్లు, పుల్లవిరుపు, పెడసరపు మాటలు, ఎత్తిపోడుపులు, దెప్పుళ్లు, హేళన, భార్యభర్తల మధ్య ఉన్న అంతరాలు, మారుతున్న వివాహ వ్యవస్థ లాంటి విషయాలను కథల్లో ప్రతిబింబించారు.
భువన చంద్ర అసలు పేరు ఊకకరణం పూర్ణనంద ప్రభాకర గురురాజు వారి అమ్మ పేరు చంద్రమౌళీశ్వరి దేవిలోని ‘చంద్ర’ ను కాగా కవిగార్కి ఒకసారి కామెర్లు వచ్చినపుడు రక్తం ఇచ్చిప్రాణదానం చేసిన అమ్మకాని అమ్మ భువనేశ్వరిలోని “భువన”ను కలిపి ఇరువురి గుర్తుగా తన కలం పేరును భువన చంద్రగా మార్చుకున్నారు. తొలి పాట నుండె భువన చంద్రగా అందరికి పరిచయం అయ్యారని తన పరిశోధన ద్వారా రామలక్ష్మి తెలియజేశారు. ఈ గ్రంథం సాహితీ ప్రముఖులతో పాటు పాఠకులకు, అభిమానులకు ఉపయుక్తంగా ఉంది.
vanaparti padma
బాంచన్ బతుకుల బంధుకి పోరాట బాటలో పాటల తూటా వెలివాడల్లో పొడిచే పొద్దు కార్మిక కర్షక విప్లవ జ్వాల ఆకలి కేకల పోరుగానం దోపిడీ వర్గాలపై యుద్ధ గీతము అణగారిన ప్రజల ఆయుధం నల్ల నేలలో ఉదయించిన సూర్యుడు తెలంగాణ సాంస్కృతిక విప్లవ సేన త్యాగాల తొవ్వే మరువలేని మట్టి మనిషి అలుపెరగని పోరాట కెరటం గద్దర్.
ప్రజల పాటకు ప్రతిరూపం జీవితాంతం ప్రజా ఉద్యమాల గీతం ఆయన దేహం పాటల మయం ప్రజలు మాట్లాడుకునే సులభ పదాలతోనే ;పాట కట్టగల మేధావి. అలనాటి అన్నమయ్య,త్యాగయ్య పాటలా గద్దర్ సాహిత్యం కూడా నిలిచే ఉంటుంది. ఉద్యమం కోసం పాట కోసం సమాజం కోసం జీవితాన్ని ధారపోసిన గద్దర్ ఈ దేశ సాంస్కృతిక యుగ కర్త గద్దర్ అను పేరును స్వాతంత్య్రo రాక ముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీ కి గుర్తుగా తీసుకోవడం జరిగింది
ప్రముఖ విప్లవ కవిగాను దళిత రచయితగా అందరికి సుపరిచితమైన గద్దర్ గారి అసలు పేరు గుమ్మడి విఠల్ రావు తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలకపాత్ర పోషించి ప్రజా యుద్ధ నౌకగా తుది శ్వాస విడిచారు వీరు 1949లో లచ్చమ్మ శేషయ్య దంపతులకు జన్మించారు వీరిది మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం గద్దర్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యశించారు 1969లో తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను అందరికి తెలియ జెప్పడానికి గద్దర్ గారు బుర్రకథను ఎంచుకున్నారు వీరు ప్రతి ఆదివారం ప్రదర్శనలు ఇస్తూ వాడ వాడలా ప్రజలను చైతన్య వంతులుగా చేస్తున్న క్రమంలో 1971వ సంవత్సరంలో బి.నర్సింగరావు సినిమా దర్శకులు ప్రోత్సాహంతో మొదటి పాట “అపరరిక్ష” పాట రాశాడు. వీరి మొదటి పాటల ఆల్బమ్ పేరు ‘గద్దర్’ ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్ష రాసి కెనరా బ్యాంకులో క్లర్క్ గా చేరాడు. తర్వాత విమలను వివాహం చేసుకుని సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అనే ముగ్గురు పిల్లలకు తండ్రిగా భాద్యత నిర్వహించారు.
1972వ సంవత్సరంలో జన నాట్య మండలి ఏర్పడింది ఇది పల్లెల్లో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ఎదురించేందుకు, దళితులను మేల్కొల్పేందుకు వారిని చైతన్య పరిచే దిశగా పనిచేసింది. ఆ ప్రభావం కూడా క్రమక్రమంగా గద్దర్ పై పడింధీ. మా భువి సినిమాలో సాయుధ పోరాట యోధుడుగా యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన “బండెనక బండికట్టి ” అనే పాటను పాడి ఆడారు. 1984లో సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పిమ్మట జన నాట్యమండలిలో చేరి 1985వ సంవత్సరంలో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఒగ్గు కథ, బుర్రకథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలలో కుడా ప్ర్రదర్శనలు ఇచ్చారు. కింద గోచి, ధోతి, పైన గొంగళి ధరించి పాడిన పాటలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి. గద్దర్ పాటలు కొన్ని వందల, వేల క్యాసెట్లు గాను సిడీలు గాను రికార్డ్ అయి అత్యధికంగా అమ్ముడు పోయాయి. ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానం వాళ్ళ ప్రజాయుద్ధ నౌక అనే పేరు వచ్చింది. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో దాదాపు 2 లక్షల మంది ప్రజలతో హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ భారీ భహిరంగ సభను నిర్వహించారు. 1997 ఏప్రిల్ 6వ తేదీన పోలీసులు గద్దర్ పై విరుచుకు పడ్డారు ఆయన శరీరంలో అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్నింటిని తొలగించారు కానీ ఒక్క బులెట్ మాత్రం ప్రాణహాని ఉన్నందున తొలగించలేదు. నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు పెట్టారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. 2002లో ప్రభుత్వం తో చర్చల కు సమయంలో నక్సలైట్స్ , గద్దర్, వరవర రావును తమ ధూతలుగా పంపారు ప్రత్యేక తెలంగాణ కోరుకున్న నాయకుల్లో గద్దర్ కుడా ఒకరు. గద్దర్ మొదటి నుంచి తెలంగాణ వాడిగానే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్దరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతును తెలపటం ప్రారంభించారు.
గద్దర్ రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా ” అనే పాట ఎంతో ప్రజాధారణ పొందినది. తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది. “నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా ‘నంది ‘ అవార్డు వచ్చింది. “జైబోలో తెలంగాణ” సినిమాలో తెరపై కనిపినిచ్చారు. “పాడుస్తున్న పొద్దు ” మీద పాట రాసి ఆయనే పాడి అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. “అమ్మ తెలంగాణమా ఆకలి కేకలగా నమా ” అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది, ఎన్నో ఉద్యమ గీతాలను రాసి ఆడి,పాడి ప్రజల్లో జ్వాలలను రగిలించిన అమర వీరుడు మన గద్దర్. భౌతికంగా మన మధ్య లేకున్నా వారి సదాశయాలు పాడిన పాటలు జన గుండెల్లో చిరస్మరణీయం.
తెలుగు భాషలో భావకవితా ప్రపంచానికి అదినేత బావ కవిగా పుట్టి భావగీతాలాలపించి, భావ కవిత్వాన్ని ఉధ్యమంగా స్వీకరించి విశేషప్రచారం చేసి రెండు దశాబ్దాల కాలం ఎదురు లేని తనహొ కవితా లహరిలో తెలుగు పాఠకులను ముంచి తేల్చి అచ్చమైన భావకవిగా గంధర్వలోకాల కేగిన గాన మూర్తి, పద్య కవిత్వాన్ని పండిచారు. పాటల కవిగాను, నాటకాలు, యక్షగానాలు చేశారు. ఎన్నో వ్యాసాలు రాసినప్పటికి వచనంలో కూడ సాహిత్య సౌరభాలు విరజిమ్మారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పాతకొత్తల మేలుకలయిక.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు క్రీ॥శ 1897 సంవత్సరంలో జన్మించారు. తల్లి దండ్రులు శ్రీమతి. శ్రీ సీతమ్మ వెంకటకృష్ణశాస్త్రి గార్లు కృష్ణశాస్త్రి చిన్నతనంలోనే పద్య, మరియు కవితా రచన చేసి కన్న వారి దీవెనలు పొందారు. 1918వ సంవత్సరంలో పిఠాపురం, కాకినాడల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. పెద్దబావగారి కూతురినే వివాహం చేసుకున్నారు. 1919వ సం॥లో తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి స్థాపించిన “సాహితి సమితి” లో సభ్యులైనారు. ఓ సందర్భంలో కృష్ణశాస్త్రి బి.ఎ అనిపించుకోవడం కంటే “సాహితి సమితి సభ్యుడను” అపిపించుకోవడమే తనకిష్టమని చెప్పారు. కాకినాడ పెద్దాపురం హైస్కూల్లో ఉపాధ్యాయులుగా రెండు సంవత్సరాలు పనిచేశారు. కాలం పిలుపులోని కల్మషాన్ని కడిగి వేయడానికి రాసిన ఈయన పాటలు సంప్రదాయవాదులకు గిట్టనందుకు రాజా వారికి చెప్పి సంఘబహిష్కరణచేయించారు. పిఠాపురం రాజావారికి వ్యతిరేకంగా ‘ధర్మసాదన’ అనే పత్రికలో కొన్ని వ్యాసాలు రాయడంతో రాజావారు ఉద్యోగం నుంచి తొలగించటమే కాకుండ తండ్రులకాలం నుండి వచ్చె ‘వార్షికం’ నిలుపు చేశారు. ఇలాంటి క్లిష్టసమయంలోనే శాస్త్రిగారి భార్య మరణించారు. భార్య వియోగం తో శోకతప్త హృదయంతో ‘కన్నీరు’ అనే ఖండకావ్యం రాశారు. గాడేపల్లి సూర్యనారాయణ గారి పెద్దమ్మాయి ‘ రాజహంస’ను వివాహము చేసుకొని మామగారి ప్రోత్సాహంతో సహయం నిరాకరణోద్యమ కార్యక్రమాలలో భాగస్వామి అవడంతో స్కూలుమాష్టారి ఉద్యోగం పోగొట్టుకున్నారు అయిన అదితన అదృష్టంగానే భావించారు ఎందుకంటే దేశ సేవనే గొప్పది అనుకున్నారు.
కృష్ణశాస్త్రిగారు రచించిన ఖండకావ్యాలు చేర్చి 1925లో ‘కృష్ణపక్షము’ అనే పేరుతో సాహితి సమితి తరుపున ప్రచురించారు. తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గారి’సింహవలోకనం’ అనే పరిచయ వాక్యాలతో ఈ కావ్యం పాఠకుల ముందు కొచ్చింది. ఈ కావ్యాన్ని సూర్యరాయ బహద్దూర్ గార్కి అంకితమిచ్చారు. ఇందులో 59 శీర్షికలున్న ఈ గ్రంధం పద్యగేయంమిశ్రమం కాని కృష్ణపక్షమనే మకుటంతో ఏ శీర్షికలేదు. కాని “నాకు మరణమ్ము” అనే శీర్షిక తేటగీతి పద్యాల్లో ఒక చోట ఆపదం కనిపిస్తుంది. 14 చీకటి రాత్రులన్న కృష్ణ పక్షాన్ని తనలో సగమైన, చేయి కలిపి కష్ట సుఖాలు పంచుకున్న అర్ధాంగి తనను అందకారంలో ముంచి వెళ్లిపోయిన విషాద సన్నివేశానికి, సింబాలిక్ గా ఈ పదం వాడారని చెప్పవచ్చును.
కృష్ణశాస్ర్తీ గారు భావగీతలను కూడ రాశారు.
” ఆకులో ఆకునై పువ్వులలో పూవ్వునై / కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై / ఈయడవిదాగిపోనా ఎట్లైనా/ నిచటనే దాగి పోనా అంటుసాగిపోతాయి.
కృష్ణ పక్షం కావ్యంలో గొప్ప కవితా ఖండిక ‘అన్వేషణ’ తనకుతానే గోపికయై వంశీ మోహనుడైన గోపాల దేవున్ని కవి వెతకడం అన్వేషణలోని ప్రధాన ఇతి వృత్తం సెల యేటి కెరటాలలో తేలిపోతున్న విరికన్నె వలపు గాను, తొలి ప్రొద్దు తెమ్మర త్రోవలో పయనమై పరిగెత్తు కోయిల పాటగాను తెల్లని వెన్నెలలో కలసి కరిగి పోతున్న మబ్బు తునక లాగాను తీయదనమైన గోపికా హృదయాంతరాన్ని తన్మయత్వంలో ముంచి తట్టిలేపింది. అనంత సంగీత మకరంద మాధుర్యాన్ని చవి చూసిన గోపికా నాథుని వెదుకుచు ఆయన పల్లె వదిలి ప్రాణ నాథుని పట్టువొదలి యమునా సైకత భూవిలో వెరిగ్రా తిరగసాగింది ఇలా “శారద శర్వరే మధుర చంద్రిక / సూర్యమంతా స్రవంతిగా చారు వినీల వీచిక ప్రశాంత నిశా | పవనోర్మి మాలికా ” అంటు సాగింది. కృష్ణ శాస్త్రి జీవితమే అన్వేషణగా జీవించి మురళీ మోహమనే ద్యాన భజనలో మధుర భక్తిని పండించిన ఆపరజయదేవుడు. లోక నీతికి, సంప్రదాయ రీతికి భిన్నంగా శ్రీకృష్ణునికి తనకు తాను అర్పించుకున్న రాధగా జయదేవ కవి ఆలపించిన భావ సౌందర్యాన్ని పూతగా స్వీకరించ కృష్ణ శాస్త్రి అన్వేషణలో రాశారు. దేశ మాతను బంధించిన కఠిన దాస్య శృంఖలాలు చెదరి పోయినట్లు గగనతలం మారు మ్రోగెటట్లు కంఠమెత్తి స్వేచ్ఛాగానం చేశారు. ఏల ప్రేమింతును, నా ప్రేమ, ప్రాణకాంత వంటి గీతా మాలికలు రాశారు. భార్య వియోగంతో తపించిపోయిన శాస్త్రిగారు దుఃఖంలో విషాదకావ్యాలు రాశారు. ‘ఆశ్రువులను మాయం చేసె మరణం కన్నా జీవించి ఆమె కోసం దుఃఖించటమే తనకు ఆనందం అంటారు.
1929వ సం||లో జ్వాల పత్రికను నడుపుతున్న ముద్దు కృష్ణగారు ప్రవాసము ఊర్వశి అనే సంపుటిని ముద్రించారు. ‘కృష్ణపక్షము’ లోని వియోగం నుండి ప్రవాసములోని దుఃఖం ఆ దుఃఖం నుండి గమనించిన నాయిక “ఊర్వశి” అని చెప్పవచ్చు. దుఃఖాన్నే సౌఖ్యంగా అనుభవిస్తూ ప్రవాస గీతాలల్లడం, ప్రవాస గీత మాధుర్యాన్ని భావనకు అనునయించి ఆ భావనలో దివి నుండి దివ్యమూర్తి ‘ఊర్వశి’ ని భూమికి దించారు కృష్ణ శాస్త్రి గారు. ఉషస్సులు రావని తన జీవితం వలె కాలం కూడ చీకటి మయం గా కనిపిస్తుందని వాపోయారు. ఆయన బాధనుఏ గంధర్వలు అలకించారో ఏ వసంతుడు విశ్వ ప్రేయసి ఊర్వశికి తెలియచేశారో కాని ఆమె నిశీధిలో వెల్లు రేఖలా కవి హృదయకవాటాన్ని తట్టి లేపింది. ఆ విధఃగా కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ మాత్రమే కాదు సర్వలోకాలను కదిపి వేసిన గాధ కూడ ఆమె కోసం నిశీథిలో అన్వేషించారు. తపించారు కళ్ళలో వత్తులువేసుకొని నిరీక్షించారుఎద లోపలి ఎదలో దాచుకున్నారు. ఊర్వశిని “తొలిపొద్దున కురిసిన మంచు’ లా, విశ్వ వేదన మాల్యంగాను, విషంతో, అమృతంతో, చీకటితో, వెన్నెలతో కలసిన ప్రేయసిగా ఊహించుకున్నారు. శాస్త్రాగారి మాటల్లో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్మ సీతమ్మ, ప్రేయసి ఊర్వశి’అని అంటారు.
రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి శిష్యరికంలో బ్రహ్మ సమాజంలోని విశాల మానవ దృష్టి సంకల్ప శక్తి ఆయనకునైతిక బలాన్నిచ్చాయి. వైష్ణవి గీతాల్లోని వర్ణన మాధుర్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. వీరి భావనలోని అణువణువు లయతో ఉంటుంది. శాస్త్రిగారి లేఖిని నుంచి జాలువారె ప్రతి గేయంలోను శబ్ధార్ధాలు పొందికలో నాట్యం చేస్తుంది. ఇంకా భక్తి గీతాలు అమృత వీణా ‘మంగళ కాహళి అనే సంపుటాలుగా వెలువరించారు. కృష్ణ రజని కన్నీరు, మహతి, మధు మురళి, గుడి గంటలు, ఋతుభేల, విరితూపు అనేవి సప్తస్వర సమ్మిళితం అయతే నిరాశ, కరుణ, ఆర్తి, భక్తి, ప్రణయం, ప్రకృతి ఆరాధన, పుణ్యయ ప్రేమ అనేవి సప్త స్వరాఅంత నాదాలు ఉంటాయి.
ఋతుశోభను ప్రకృతి కాంతలీలా మాధుర్యాన్ని కళ్ళారా చూచి, మనసారా అనుభవించిన కృష్ణశాస్త్రి వైష్ణవ భావ పరిపక్వతతో అండాళ్ళు ‘తిరుప్పావై’ ని ఆంధ్రీకరించారు శబ్దమాధుర్యంతో పాటు రూపమాధుర్యాన్ని అంతర్నేత్రంతో దర్శించి ఆనందించగల కృష్ణశాస్త్రికి దేవుడికి ఏ పూవ్వులు కావాలో, తెలుగులో ఏ అలంకారాలు, ఏ దేవుడికిష్టమో తెలుసు. ఏ అక్షరాలలో ఏ దేవుని పూజిస్తే అతడు సంతృప్తుడౌతాడో తెలుసు. అందుకే పుష్పాక్షరాలతో పూజించిన పుణ్య మూర్తి కాబట్టి వందలాది భక్తి కీర్తనలను రచించారు. కృష్ణశాస్త్రి గారి గొంతు పోయాక రాసిన గేయ సంకలనం కృష్ణ రజని’ లో ఆర్తిగీతాలు అద్భుతంగా పలికించారు.
కృష్ణశాస్త్రి పద్యాన్ని పాటను ఎంత రమణీయ శిల్పరంజితంగా తీర్చిదిద్దారో అంతటి నైపుణ్యాన్ని వచన రచనల్లో కూడ చూపించారు మంచి గంధంతో మల్లెపూలు అత్తరులో కలిపిచినుకు చినుకు చిలకరించినట్లుంది. వారి వచన శైలి, పచ్చకర్పూరపు గుభాళింపుతో వున్న పాయస పాత్రను నోటికందించినట్టుగా వుంటుంది. శాస్త్రిగారి విషయ విన్యాసం. కృష్ణశాస్త్రి పుట్టుకతో కవిగా అవతరించిన నిరంతర కవితా ధ్యానంతో పరిణతి చెందారు. వచనంలో కూడ తనదైన ఒక శైలిని సృష్టించుకున్నారు. ఆధునిక అవసరాలను ఊటకింస్తూ రాసిన చిన్న చిన్న వ్యాసాలల్లో కవిత్వం హృదయాన్ని ఎంత రంజిప చేస్తుందో వారి వచనం కూడా అంతగానే ఆలోచనలను తట్టి లేపుతుంది. వీరి కవిత్వంలో ప్రధాన గుణం భావమైతే మరో గుణం సంగీతం అంతర్వాహినిలా సాగుతుంది. అందుకే 1960 సం||లో హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేశారు అనతి కాలంలోనే చలన చిత్ర పరిశ్రమ కూడా కృష్ణశాస్త్రి గార్ని ఆహ్వానించింది. సినిమా మరుగైనా పాట నిలిచే ఉండే మంచి పాటలు రాసిన కవుల్లో దేవులపల్లి అద్వీతీయులు.
1939వ సం|| నాటికే ప్రతినాగరికుడి నోటికి కూని రాగాలయ్యాయి. ఆనాడు రాసిన గీతాల్లో “మవదూదయంలో మంచి ముహుర్తం/ మాధవి లతకు పెండ్లి/ మాదవి పెండ్లికి మల్లెమాలలు /మంధారాలు పేరంటాళ్లు” అనే పాట బహ్మండమైన ప్రచారంలో ఉండేది. ఇలాంటి పదచిత్రాలు చూసిన సినిమా రంగం 1951లో వారిచే పాటలు రాయించింది. దేవులపల్లిగారు పాటలు రాసిన మొదటి సినిమా ” మల్లీశ్వరి’ రాణి వాసపు పంజరంలో బంధీయైన మల్లీశ్వరి రాత్రిపూట రహస్యంగా ప్రియునిన కలుసుకున్నపుడు ఆమె మనస్సు మల్లెలు ఊగిపోయాయి హాయి నిండిన ఆ రేయిలో ఆమె బతుకే పండింది అంటూ ఈ పాట ‘మనసున మల్లెల మాల లూగెనే / కన్నుల వెన్నెలడోల లూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో / ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో అంటు సందేశాన్ని పంపినా ప్రతి పాటా ఒక మధుర కావ్యం. కాళిదాసు మేఘ సందేశాన్ని దృష్టిలో ఉంచుకొని మల్లీశ్వరిలో మంచి పాటలు రాశారు. జావళీలు రాయడంలో కూడా ఆయనకు తిరుగు లేదు. పిలిచిన బిగువటరా / పిలిచినా బిగువరా / ఔరౌర అంటు సాగే జావళీ పాట నేటికి నిత్య నూతనంగా అందరి హృదయాలను అలరిస్తూనే ఉంది. పాటలో జీవిత చిత్రాన్ని చిత్రించడంలో ‘వారికి వారె సాటి. జీవితంలో అన్ని విధాల ఓడిపోయిన మారిపోయిన ఉక్కు మనిషిలోపరివర్తనకు కారణమైంది ఒక పసిపాప. అతడు పాప కోసమే జీవిస్తాడు కారణాంతరాన చెరసాలకు వెళ్లి తిరిగి వచ్చాక పాప పెద్దదవుతుంది. అతన్ని మర్చిపోతుంది. బరువెక్కిన గుండెలతో ఒక పాప బొమ్మను లాలిస్తూ. తథిమి తకథిమిల్ బొమ్మ /దీని తమాస చూడవే కీల్ బొమ్మ / దీని తమాస చూడవే మాయ బొమ్మ అంటు పాడతాడు తలచుకుంటేనే గుండె కరిగిపోయే ఈ సన్నివేశంలో తత్త్వాన్ని చాలా గొప్పగా పలికించారు. కృష్ణశాస్త్రి గారు. మల్లెల్లో పూలల్లో కూడ సృష్టి విలాసాన్ని పొదిగి చెప్పిన పాటలు లెక్కకందవు. అందులో ఒక్కటి ” ఇది మల్లెల వేళయని / ఇది వెన్నెల మాసమని / తొందర పడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది అంటు మల్లెలు, వెన్నెల, కోయిలతో మహత్తరమైన జీవిత సత్యాన్ని పాడారు. అందులోనే “మరిగిపోయెకి మానవ హృదయం / కరుణ కలిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురైవచ్చు, వాడని వసంత మాసం వసివాడని కుసుమ విలాసం అంటు సాగే ఈ పాటలో విషాదం వెనుక వసంతాన్ని సృష్టించి ఊపిరిపోస్తారు. సినిమాల్లో కూడ ఎన్నో భక్తి గీతలు రాశారు “సంపూర్ణ రామాయణం” లో శబరి రాముని కోసం ఎదురు చూస్తుంది రాముడు సమీపానికి వస్తున్నాడు ఈ సన్నివేశంలో శబరికి, శాస్త్రిగార్కి బేధం లేదు. ఆ సందర్భంలో ఇలా… ముందు తెలిసెనా ప్రభూ / ఈ మందిర మిటులుండేనా, మంద మతిని, నీవు వచ్చు మధుర క్షణమేదో, కాస్త ముందు తెలిసినా……. అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందర మందార కుందసును దళములు పరవనా…. అంటు షాగే ఈ పాట గళం మూగబోయాక రాసిన గగన తలాన్ని సృశిస్తుంది భగవంతుని పిలుస్తుంది. భాగ్య రేఖ సినిమాలో “నే వుండేదాకొండపై రాజమకుంలో ‘సడిసేయకేగాలి” భక్త శబరి చిత్రంలో “ఏమి రామ కథ” మంచి రోజులొచ్చాయి చిత్రంలో “నేలతో నీడ అన్నది నను తాకరాదని” ఆమెరికా అమ్మాయిలో పాడనా తెలుగుపాటా”, బంగారు పంజరంలో ‘గట్టుకాడ ఎవరో ” మొదలైనవి శాస్త్రి గారి పాటల్లో ఆణిముత్యాలుగా చెప్పవచ్చును. వందల సినిమాల్లో దాదాపు 500పైగా పాటలు రాశారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కల్పించిన ఘనత కృష్ణశాస్త్రి గార్కె దక్కింది.
కృష్ణశాస్త్రి గారు స్వాతంత్య్ర కాంక్షతో జాతీయ గీతాలు పాడారు. “జయ జయ జయ ప్రియభారతి జనయిత్రీ దివ్వ దాత్రి ” అంటూ నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో ప్రజలను కదిలిస్తూ రాసిన గీతం ” ప్రజారథం తరలింది / ప్రపంచ పధం పొరలింది/ కనుక పదవోయి పద” అంటూ హెచ్చరిస్తూ ఉత్తేజతుల్ని చేసింది. 1939 ప్రాంతంలో దేశంలో క్షామ దేవత తాండవిస్తున్న తరుణంలో ఆకలిగేయం రాశారు. 1941లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి మహ సభకు ఉద్యమానికి ప్రేరణగా అవేశం అంతర్భూతంగా ఒక స్వభోధ గీతాన్ని రచించారు. శాస్త్రిగారు అభ్యుదయ కవుల హృదయాల్లో చెలరేగిన ఉద్వేగ భావాలు గుర్తించారు. ఆశీర్వదించి వారికి పద నిర్దేశం చేసి ముందుకుసాగనించారు. తృతీయ అభ్యుదయ రచయితల మమాసభకు అధ్యక్షత వహించడం ఆయన అభ్యుదయ ప్రియత్వానికి నిదర్శనం శాస్త్రిగారు భావ కవితా ప్రతినిధే కాదు కవితా వైతాళికుడు కూడా. వారు పాడితే పక్షులు వంతపాడుతాయి. మబ్బులు శృతి కలుపుతాయి, నదులు పర్వతాలు లయలు చూపుతాయి. అందుకే ఆయన అచ్చమైన ప్రకృతికవి. ఆయన పాటల్లో ఆకుల నాడించే కొత్తగాలి, మాటల్లో విశ్వ ప్రేమ ను చూపించే కొత్త ఊపు, ఆలోచనల్లో సామాజిక హృదయ స్పందనలపై కొత్త చూపు కలంలో కరుణ, జాలు వార్చెడి కొత్త రసస్పందన కవితలలో సర్వహృదయాలను కదిలి కదిలిపోయె నూతన భాష్పీభవన పరిస్పందన. దేవులపల్లి కవిత ఆత్మీయుడైన మిత్రుడు సంస్కారాన్ని తట్టి మేలు కొల్పినట్లుంటుంది. సంప్రదాయం నుంచి చైతన్య పూరితమైన సన్నివేశాలు తెలసుకోగలరు. అవి రెండు కలిపి కవిత్వంగా ఆవిష్కరించగలరు. ఆ కవిత్వాన్ని పాడి ఎదుటి వాడి గుండెలో గూడు కట్టి కాపురం చేయగలరు. అందుకే ” కవి కృష్ణ శాస్త్రి కమ్మని కవితల కతడు మేస్త్రి అంటారు. 1942లో నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1964లో శాస్త్రి గారి స్వరపేటికలో కాన్సర్ సోకింది. ఆపరేషన్ చేశారు. గళం మూగబోయింది. మధుమాస కోయిలకు గొంతు మూగ బోయదంటే ప్రకృతిలో ఎంత విచిత్ర మైన లీలలు సాగుతున్నాయో గదా !
గొంతు మూగబోయిన చివరి వరకు ఆయన మానసికంగా ఎంతో ఉత్సాహంగా జీవించారు. కవితా వ్యాసం సగం విడువలేదు ఆ సమయంలో రాసినదే “కృష్ణరజని” అని పేరు పెట్టారు. తన అభిమానులకు కొండంత సాహిత్యంతోపాటు రవంత కన్నీరు మిగిల్చి 24-02-1980 వ సంవత్సరములో గంధర్వ లోకం వెళ్ళిపోయారు.
“నన్ను గొపోవరాదా నాదా / నా హృదయం నాదా ” అంటూ భగవంతుని సన్నిధానం చేరుకున్నారు. కృష్ణ శాస్త్రి కవిత్వం రాయడానికి కొన్న హంగులు కావాలి నిరంతరం సాహితి గోష్ఠికావాలి మంచి సంగీతం వింటూ ఉండాలి. ఊసులు చెప్పుకోడానికి ఊహ తెలిసిన మిత్రులు కావాలి. ఈ హంగులుంటేకాని ఎక్కడో గున్నమావి కొమ్మల్లో ఉన్న గువ్వ కలంతో కలిసి పాడదు. కదిలి పోయే గుండె ఉండాలే కాని కృష్ణ కోయిల ప్రతి వసంతానికి తట్టి లేపుతునే ఉంటుంది.
” గూడు నిద్రపోయిన గువ్వ మేలుకుంది.
గొంతు మూగ పోయిన గుండె మేలుకుంది “
వనపర్తి పద్మావతి
ప్రముఖ కవి, రచయిత
ఉపన్యాస సిరోమణి
“గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండు ఉండేవి. ఒక గూటిలోన రామచిలుక ఉంది, ఒక గూటిలోన కోయిల ఉంది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది అయిన రెంటికీ జత కుదిరింది” ఈ పాట ప్రతి ఉదయం “ఆత్మీయ నిలయం”లో సుప్రభాతంలా వినపడ్తూనే ఉంటుంది. అక్కడ ఉండే వారందరూ బంధువులు కారు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. కొందరు కన్నా బిడ్డలు వదిలిచ్చుకున్నవారు. మరికొందరు కూడు, గూడు లేనివారు. అందరూ అక్కడ ఒకరికి ఒకరు ఆత్మీయులే అక్కడ అందరి మతం మానవత్వమే ఒకరికి ఒకరుగా వయో బేధం లింగ వివక్ష లేని నిలయం. ఆరోగ్య ప్రధమైన ఆలయం అనవచ్చు. ఆత్మీయ నిలయంకు అంకురార్పణ చేసింది రామయ్య, అతనికి ఒక కుమారుడు, బాగా చదువుకొని విదేశాల్లో స్థిర పడ్డాడు. కొంత కాలం క్రితమే రామయ్య భార్య సీతమ్మ దేవుడి దగ్గరకు పోయింది. రామయ్యకు రంగయ్య ప్రాణ స్నేహితుడు. రంగయ్య నిలువెత్తు ఫోటో ఆత్మీయ నిలయంలో అడుగు పెట్టగానే ఎదురుగా కనిపిస్తుంది. రంగయ్య ఇష్ట దైవం శ్రీ కృష్ణుడు ఆ విగ్రహం కూడా పూల తోట మధ్యలో మనకు కనిపిస్తుంది. పచ్చని చెట్లు, పండ్లు, కూరగాయలతో పూల పరిమళాలు వెదజల్లుతూ నిత్య వసంతంగా ఆత్మీయ అనురాగాలతో ఆనంద నిలయంగా కళకళగా ఉంటుంది.
అర్థరాత్రి అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. గేటు బయట కట్టిన గంట అదే పనిగా మొగుతుంది. ఎవరో ఆశ్రమం కోసం వచ్చారనుకొని రామయ్య వెళ్ళి గేటు తీసాడు అంతే, ఓ అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి తూలుతు కనిపించాడు. రామయ్య పడిపోకుండా ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఆపలేకపోయాడు. ఆలింగనం చేసుకున్నాడు పోదిమి పట్టుకున్నట్లుగా ఆ స్పర్శ ….. ఆ స్పర్శ రామయ్యలో ఏదో భావోద్వేగాన్ని కల్గించింది. మనసు తనువు పులకించింది. నెమ్మదిగా లోపలికి తీసుకువచ్చి వేడి నీటితో స్నానం చేయించి మంచి బట్టలు వేసి, ఆహారం తినిపించి, మంచంపై పడుకోబెట్టాడు. ఆ వ్యక్తిని పోల్చుకోలేనంతగా మారిపోయాడు కాని శరీర పరిష్వంగణలో చిన్ననాటి ప్రాణ స్నేహం చెదరలేదు. అతడే రంగయ్య, రామయ్య ప్రాణ బంధం. రంగయ్య నిద్రలోకి జారుకున్నాడు. రామయ్య పక్కనే కూర్చొని ఆలోచనలోకి జారుకున్నాడు. ”రంగయ్య ఒకప్పుడు శ్రీ కృష్ణుడైతే తాను కుచేలుడు అలాంటి గుణవంతుడు, ధనవంతుడు, స్నేహ శీలి, అందరి కష్టాలు వాడివిగా భావించి సహాయం చేసే ధర్మదాత. నేడు ఈ పరిస్థితిలోకి ఎలా వచ్చాడు. గత కొంత కాలంగా అందరికీ దూరంగా ఉన్నాడు. కనీస వివరాలు గానీ, ఫోన్ నంబర్ కూడా లేదు. కానీ రామయ్య మాత్రం రంగయ్య జ్ఞాపకాలతోనే కాలం గడుపుతున్నాడు. నేడు ఇలా …… చూస్తుంటేనే గుండెల్లో బాధ మెలిపెడుతుంది. అలానే నిద్రలోకి వెళ్ళిపోయాడు.
వరంగల్ దగ్గర ఒక పల్లె, అక్కడ యజమాని-నౌకరు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్యతో పనులు చేసుకునేవారు. వారికి ఇద్దరు కొడుకులు, వారి పేరే రంగయ్య, రామయ్య. చిన్న తనం నుండి కలిసి మెలిసి ఉండేవారు. గడ్డివాముల్లో కూర్చొని చదువుకునేవారు. రంగయ్య తల్లి కూడా రామయ్యను తన కొడుకుతో సమానంగా చూసుకునేది. హెచ్చు తగ్గులు బాల్యానికి అవరోధం కాకూడదు. పసి మనసులకు తారతమ్యం ఉండకూడదు అనే మంచి మనసు ఆ తల్లిది. రాము, రంగ అంటూ ముద్దుగా పిలిచేది. ఇద్దరు రూపంలో రంగుల్లో వేరైనా మాట, బాట, నిజాయితీ ఒకటిగా పెరిగారు. చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారికి వారే పోటీ. కొన్ని సార్లు రాము ఓడి రంగను గెలిపిస్తే, మరోసారి రంగా ఓడి రామును గెలిపించేవాడు. పాఠశాల వార్షికోత్సవము లో బహుమతులన్నీ వాళ్ళవే. వారి స్నేహం ఆ గ్రామానికే కాక అందరికీ ఆదర్శం. రంగయ్య పై చదువులకు పట్నం వెళ్ళాడు. రాము చేతి వృత్తుల విద్యతో పాటూ వ్యవసాయం నేర్చుకొని ఉన్న ఊర్లోనే ఉండిపోయాడు. సెలవుల్లో కలుసుకొని యోగ క్షేమాలు తెలిసుకోనేవారు. రంగ పట్నంనుండి రాము కోసం మంచి మంచి పుస్తకాలు, బట్టలు తెచ్చేవాడు. వృత్తికి వ్యవసాయానికి సరైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు. రాము రంగ దగ్గరికి వెళ్ళినపుడు పల్లె రుచునలను, పల్లె తల్లి ఇచ్చిన సంపదలను కానుకగా తీసుకెళ్ళేవాడు. కొంత కాలం గడిచాక రాముకు, రంగకు తగిన అమ్మాయిలను చూసి పెళ్లిళ్లు చేశారు వారి తల్లిదండ్రులు. రాముకు దగ్గరి బంధువుల అమ్మాయి మామూలుగా చదువుకున్నది. రంగకు బాగా చదువుకున్న అందమైన, ఆస్తి గల కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. రాము, రంగ భార్యల స్వభావం విభిన్న దృవాలైన తమ భర్తల స్నేహం ముందు తల వంచారు. స్నేహ మాధుర్యాన్ని తమ మనసులో ఆస్వాధిస్తూ వారి మధ్య కూడా సఖ్యత, ఆప్యాయతలు నెలకొన్నాయి. కాల చక్రం అయిదు సంవత్సరాలు తిరిగే సరికి రాము, రంగ ఇద్దరు తండ్రులైనారు వారికి చెరొక కొడుకు చాలనుకున్నారు. కాలానుగుణంగా మార్పులు సహజంగా వచ్చాయి. రంగ, రాము ఇద్దరు వారి పిల్లలను బాగా చదివించి అమెరికాకు పంపించాలన్న సంకల్పం చేసుకున్నారు. రాము పల్లెలోని పొలం కౌలుకు ఇచ్చి తన వ్యాపారంను పట్నంలో సాగిస్తూ ఇద్దరు మిత్రులు ఒకే ఊరిలో జీవనం సాగిస్తున్నారు. అనుకున్నట్లుగానే రాము వ్యాపారం బాగా వృద్దిలోకి వచ్చింది. రంగ ఉద్యోగంలోనూ, ఆస్తులలోనూ చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇద్దరి మధ్య స్నేహ వారధి ఇంకా బలపడసాగింది. పిల్లల చదువులు ముగిశాయి. పై చదువులకు అమెరికా వెళ్లాలని రంగ కొడుకు, జర్మనీ వెళ్తానని రాము కొడుకు నిర్ణయించుకున్నారు. వారి అభిరుచులకు, ఆశయాలకు అనుగుణంగానే రాము, రంగ ఏర్పాటుచేసి విమానాశ్రమానికి వెళ్ళి, విమానం ఎక్కించి వచ్చాడు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో రంగ కొడుకు అమెరికా నుండి ఫోన్ చేశాడు “తానే స్వంతంగా ఒక కంపెనీ పెడుతున్నానని ఇక్కడి అమ్మాయి పరిచయం వల్ల నాకీ అవకాశం వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను”. అంటూ ఫోటోలు పంపించాడు. ఏమీ చేయలేని స్థితిలో రంగ దంపతులు సోఫాలో కూలబడిపోయాడు. రాము దంపతులు రంగను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. మనసులో మాత్రం తన కొడుకు ఏమి చేస్తాడో అన్నదిగులు ఉండేది రాము దంపతులకు. కాని రాము కొడుకు తల్లిదండ్రుల ఇష్టంతోనే ప్రేమించిన అమ్మాయిన పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఉద్యోగాలుచేస్తూ వారి ఖర్చులకు పోనూ మిగిలిన డబ్బులను తండ్రికి పంపించేవాడు. వాటితో రాము ఆస్తులను కొని కొడుకు, కోడలు పేరున ఉంచేవాడు.
రంగ కొడుకు వ్యాపారంలో మెళకువలు నేర్చుకొని బాగా సంపాదిస్తూ ఖరీదైన స్నేహాలు, అలవాట్లతో పొదుపు చేయలేకపోయాడు. అతని భార్య కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చింది కావడం వలన విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. రంగయ్య కొడుకును ఎప్పుడు ఏమీ అనేవాడు కాదు. సంతోషంగా ఉంటేచాలు అనుకునేవాడు. రంగయ్య దంపతులను కొడుకు అమెరికా పిలుచుకున్నాడు. అక్కడి అందమైన ప్రదేశాలు చూపించాడు. తన కంపెనీ ఎలా నడుస్తుందో చెప్పాడు. స్నేహితులను పరిచయం చేశాడు. దాదాపు రెండు నెలల కాలం కొడుకు, కోడలు, మనవళ్లతో గడిపాడు. ఈ ఆనందం చాలు ఇంకా ఏ దిగులు లేదనుకున్నాడు. ఇద్దరు ఇండియా కు ప్రయాణం అవుతున్నారు. సరిగ్గా అదేసమయంలో కోడలు దగ్గరకు వచ్చి “మావయ్య మీ అబ్బాయి బిజినెస్ ను ఇంకా డెవెలప్ చేయాలనుకుంటున్నాడు”… అంటూ ఆగిపోయింది నేలచూపులు చూస్తూ, చెప్పు తల్లీ నువ్వు నా బిడ్డవే అన్నాడు రంగ.”అదే మామయ్య పట్నంలో ఉన్న ఆస్తులు కొన్ని అమ్మి మాకు డబ్బులు సర్దుబాటు చేస్తే బాగుంటుంది”. ఆ మాటలకు ఓ క్షణం తటపటాయించి ఇంటికి వెళ్ళి కబురు చేస్తా, వాటికి ఎంత ధర వస్తుందో తెలుసుకోవాలిగా అన్నాడు. సరే మామయ్య అంటూ సాగనంపారు. ఇండియాకు వచ్చి కోడలు అడిగినట్లుగానే ఆస్తులు అమ్మి కొడుకు అకౌంటుకు బదిలీ చేయించాడు. రాము వారించినా వినలేదు. మనం సంపాధించింది వాళ్ళకే కదా అంటూ రాము మాటలను తోసిపుచ్చాడు. మరో రెండు సంవత్సరాలకు ఇంకొంత ఆస్తి అమెరికా చేరింది. వయసు తెచ్చిన ప్రభావమో, దిగులో తెలియదు రంగ భార్యకు అనారోగ్యం వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. విషయం తెలుసుకున్న రంగ కొడుకు మిగిలిన ఆస్తులను అమ్మి అమ్మను తీసుకొని మా దగ్గరకు రండి ఇక్కడ మెరుగైన వైద్యం చేయించవచ్చు అన్నాడు. భార్యను బ్రతికిచ్చుకోవాలి అన్న ఆరాటంతో ఆస్తులను సొమ్ముగా మార్చుకొని భార్యను తీసుకొని కొడుకు దగ్గరకు వెళ్ళాడు. ఇంతకుముందు వెళ్ళినపుడు కొడుకు కోడలు బాగా చూసుకున్నారు కదా ఇప్పుడు అలాగే అనుకున్నాడు. కాని అక్కడకు వెళ్ళిన కొద్ది రోజులకు తెలిసింది. ఆస్తులు కావాలి కాని కన్నవారి అవసరం కాదని ఏదో మొక్కుబడిగా వైద్యం సాగుతుంది. కాస్త మెరుగైంది అనుకునే పరిస్థితిలోనే రంగ భార్య చనిపోయింది. ఆ తర్వాత రంగ నుండి ఫోన్లు ఏమీ రాలేదు……
రంగ లేచి కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న రాముని లేపి అమాంతంగా కౌగిలించుకున్నాడు. “స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం” అనే పాట వినిపిస్తుంది ఇద్దరి మనసుల్లోనూ. అప్పుడు అడిగాడు రాము, రంగను ఇన్నాళ్ళు ఎక్కడకు వెళ్లావు? నేను గుర్తుకు రాలేదా? అంటూ …. రంగ కళ్ళు జలపాతంగా మారాయి. రాము తన కండువతో కన్నీటిని తుడిచి ఏంటి రా చిన్నపిల్లాడిలా! అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ముందు కాఫీ తాగు అంటూ మొక్కల మధ్య ఉన్న శ్రీ కృష్ణుని విగ్రహం దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. చూడరా నీకు ఇష్టమైన దైవం నీ గుర్తుగా ఇక్కడ పెట్టించాను. అదిగో అక్కడు చూడు నీ ఫోటో ఉంది అంటూ చూపించాడు. రంగ రాము చాలా ఆనందంగా చిన్నపిల్లలై పోయారు.
ఇప్పుడు చెప్పరా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అని రాము రంగ ను మళ్ళీ మళ్ళీ అడిగాడు. “ఏముందిరా చెప్పడానికి వాళ్ళు పథకం ప్రకారం నా ఆస్తులన్ని స్వంతం చేసుకొన్నారు. తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పు చూశాను, ఇండియాకు రావాలనుకున్నాను. కాని ఆవిడ చనిపోవడంతో కొంత కాలం ఉండాల్సి వచ్చింది. నిన్ను చూడాలని మన పల్లెలో బ్రతకాలని మనసు ఆరాట పడింది. ఆ విషయమే కొడుకుకు చెప్పాను. వాడు విమానం మాత్రం ఎక్కించాడు. చేతిలో చిన్ని గవ్వలేదు. పట్నం రాలేక ఎక్కడెక్కడో చిన్నచిన్న పనులు చేసుకుంటూ చివరకు ఇలా నీ దగ్గరకు చేరాను” అని చెప్పాడు.
ఆత్మీయ నిలయం ఏంటి రా ఎందుకు పెట్టావు అని రంగ రాముని అడిగాడు. నా కొడుకు పంపిన డబ్బులతో ఆస్తులను కూడబెట్టాను. వాడు రమ్మన్నా నేను పోలేదు, వాళ్ళే అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోతారు. ఇక్కడ అన్నీ లెక్కలు చూసుకుంటారు. మన ఊళ్ళో ఉన్న మన వయసు వాళ్ళందరూ ఒంటరి వాళ్ళు అయ్యారు. పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, అందుకే కొడుకు, కోడలు, నేను కలిసి తీసుకున్న నిర్ణయం మన స్నేహానికి గుర్తుగా మన లాంటి వారి కోసం ఏర్పాటుచేసిన నిలయమే ఈ ఆత్మీయ నిలయంరా అంటూ ఒకరినొకరు కౌగిలించుకొని ఇద్దరి ఆత్మలు ఒకటిగా అడుగులు వేయసాగారు. “స్నేహానికన్న మిన్న లోకాన లేదురా …. కడ దాకా నీడ లాగా నిను వీడిపోదురా … పాట సాక్షిగా రాము రంగ స్నేహానికి చిరునామా అయ్యారు.”
భారత దేశసామాజిక వ్యవస్థలో వివిధ మతాలు, విభిన్న కులాల వారు జీవిస్తున్నారు. బ్రహ్మణ, క్షత్రియ, వైశ్యం, శూద్ర అనే నాలుగు వర్ణాలతో పాటు, పంచమ వర్ణం అనే మరొక వర్ణం అదనంగా స్పష్టించబడిరది. వీటిల్లో ఉపకులాలున్నాయి. కులాల్లోని అంతరాల వల్ల అస్పృశ్యత విచ్చలవిడిగా కొనసాగుతుంది. పంచములకు సమాజంలో అనేక పేర్లు ఉన్నాయి. అంత్య, అంత్యజ, ఛండాల, శ్వపచ, మాల, మాదిగ, ఛమార్, మోచీ, మాంగ్, మహర్ ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ సభ్య సమాజం సాంఫీుక జీవితం నుండి వెలి వేసారు.
అస్పృశ్యులుగాను, పంచములుగాను పిలువబడుతున్న వీరందరు ఊరికి వెలుపల వెలివాడలు నిర్మించుకొన్నారు. వీరి ఉనికి, నీడలు సవర్ణ సమాజంపై పడకుండా కట్టుదిట్టం చేశారు. మరణించిన జంతువులు వాటి తోళ్ళు, కలేబరాలూ, కుక్కలు, గాడిదలు వీరి స్థిర, చరాస్తులు, అంత్యజులు శుచి శుభ్రంగా ఉండకూడదు. మంచి దుస్తులు ధరించకూడదు శవాల మీది ప్రేత వస్త్రాలే వీరికి దుస్తులు. పగిలినమట్టి పాత్రలు ఉపయోగించాలి. భోజనంలో కాని ఇతర పరిస్థితులలో
నెయ్యి వాడకూడదు. అస్పృశ్యులు ఆభరణాలుగా ఇనుప నగలే ధరించాలి. దేశ దిమ్మరులై సంచార జీవితం గడపాలి. శవాలకు కాపలాకాస్తూ కాటి కాపరులై ఉండాలి. ఊరి పోలిమేరల్లో ఉండి గ్రామాన్ని రక్షిస్తుండాలి. సొంత ఆస్తి వుండకూడదు.
బహిష్కరణకు గురైన పంచమ జాతిలో పుట్టినవారే గుర్రం జాషువా కుల దొంతరల సమాజంలో పుట్టకతోనే అస్పృశ్యుడుగా ముద్రపడిరది. మహాకవి గుర్రం జాషువా 1895 సం॥ సెప్టెంబర్ 28వ తేదిన గుంటూరు జిల్లా వినుగొండలో జన్మించారు. తల్లిదండ్రులు లింగమ్మ వీరయ్యలు. ఈ దపంతులు కులాంతర వివాహం చేసుకున్న క్రైస్తవ, యాదవ కులస్థులు కాబట్టి యాదవులు వీరిని కులం నుండి వెలివేసారు. మనది పితృసామ్యం వ్యవస్థ కావున తండ్రి కులమే వారి సంతానానికి కూడ వర్తిస్తుంది. కాబట్టి జాషువా కులం అస్పృశ్యుడిగా చెప్పబడిరది. జాషువా బాల్యం నుండి కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు. కులం, పేదరికం రెండు తన గురువులని చెప్పుకున్నారు. పేదరికం ఆయనకు వినయాన్ని నేర్పితే, కులం ఆయనని బానిసని చేయక ప్రతిఘటించే శక్తినిచ్చింది. కుల సమాజం పోవాలని కలం మోధుడై సమాజం మీద దండెత్తాడు జాషువా. ఇవన్నీ జాషువా సాహితి వ్యక్తిత్వాన్ని ఒకరకంగా పటిష్టపరిస్తే ఇంత కంటే విశాలమైన భూమిక మరొకటి జాషువా కవిత్వానికి బలం చేకూర్చింది.
19వ శతాబ్ధం నాటికి భారతీయ సామాజిక వ్యవస్థ కుల, మత సంఘర్షణలతో, అస్పృశ్యతా దురాచారంతో, హేతురహితమైన ఆచారాలు భ్రష్టుపట్టిపోయిన సంప్రదాయాలు బలంగా మర్రి ఊడల్లా వ్యాపించాయి. అ నారోగ్యకరమైన వ్యవస్థను రూపుమాపాలని, సమాజాన్ని ఆవరించిన చీకట్లను పారదోలాలని కొందరు మేథావులు సంస్కరణ ఉద్యమాలు నడిపారు. ఈ ఉద్యమాలు సమాజంలో నెలకొన్న అనేక దుష్ట సంప్రదాయాలను రూపు మాపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసాయి. వలస పాలనను అంతమొందించాలని జాతీయోద్యమం పుంజుకుంది. జాతీయోద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమ ఆశయాలను లక్ష్యాలను చేపట్టింది. ఆదే సమయంలో రాజకీయోద్యమం, సంస్కరణ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాని జాతీయోద్యమ ఉదృతికి తట్టుకోలేక పోయాయి. జాతీయోద్యమ లక్ష్యం ప్రధానంగా స్వాతంత్య్ర సంపాదన అందుకోసం సమాజంలో గుణాత్మకమైన మార్పులు రావాలని కొందరు మేథావులు భావించారు. ఆస్తిక, నాస్తిక ఉద్యమాలు చరిత్రలో నిలిచి పోయెలా తగిన పాత్ర పోషించాయి. మన దేశంలో మహాత్మాగాంధీ నాయకత్వాన, జాతీయోద్యమం బలంగా సాగుతుంది. మహరాష్ట్రంలో డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో పంచముల కులనిర్ములనోద్యమం చేపట్టారు. అంబేద్కర్ ఉద్యమాలకు స్పందించిన కవులు వారి వారి మార్గాన్ని ఎంచుకుని కృసి చేయసాగారు. జాషువా పై ఈ ఉద్యమాల ప్రభావం బలంగా పడిరది. జాషువా వ్యక్తిగత జీవితం సాహిత్య జీవితం రెండు ఘర్షణ నుండి పుట్టినవే. ఈ రెండు ఒకదానికొకటి పేన వేసుకపోయి మహకవి జాషువా రూపంలో కన్పిస్తాయి.
జాషువా బాల్యంలో ఆటస్థలంలో పంచముడిగా సవర్ణుల చేత అవమానింపబడ్డాడు, పాఠశాలలో చదువుకునే రోజులలో గురువులకు కూడా అస్పృశ్యత భేదభావం ఉండేది అంటు ఓ పద్యంలో ఇలా ‘‘మా గురువు గారికి కోపము వచ్చు వేళ / పెంపల రెడునంట రాని తన మడమువచ్చే’’ అని జాషువా చెప్పుకున్నారు. గ్రామంలో నాటక ప్రదర్శనకు వెళ్ళిన బాల జాషువాకు అక్కడ అస్పృశ్యత ఎదురైంది. జాషువా కవిగా కళ్ళు తెరిచే నాటికి ప్రతి పల్లె, పట్టణాలలో ఊరు వాడలలో ఆశుకవితా ధారల్లో పండితులు పామరులు మునిగితేలుతున్నారు. కొప్పరపు కవులు, తిరుపతి వేంకటకవులు ఆశుకవితతో అవధానాలు చేస్తూ గ్రామగ్రామాల్లో విస్తృతంగా పర్యంటించారు. ఇలాంటి సాహిత్య వాతావరణం జాషువాలో ‘కవి’ అంశ మొగ్గ తొడిగి సాహిత్య ప్రస్థానం మొదలైంది.
జాషువా హిందూ ధర్మశాస్త్రాలు, ఇతిహసాలు చదువుతుంటే హిందువుల్లో సంచలనం బయలు దేరింది. ఆశ్యర్యాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కవిత్వం చెప్పడం మొదలు పెట్టగానే ` ‘‘ప్రధివీ సురులు దక్కనితర జాతులు కైతలల్లరాదు నేరం’’ అ ని సవర్ణులు జాషువాని నిలదీసారు.
జాషువా వ్యక్తిగా, కవిగా, కుల రక్కసి చేతిలో అనేకమైన అవమానాలు, అవహేళన పలుమారులు చవిచూసారు. అవమానించిన కవులను వ్యక్తులను ‘గవ్వకు సాటిరాని పలుగాకులుగా’ గణించాడు. వీరు అడ్డగిస్తే తనను వరించిన శారద లేచిపోవునా! అని ఘంటమూనెదన్ రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద నాంధ్ర వాణికిన్’’ అని ఆత్మ విశ్వాస ప్రకటన చేసాడు. ఈ సామాజిక సాహిత్య నేపథ్యం నుండి చీకటి వెలుగుల నుండి జాషువా కవిత్వాన్ని దర్శించవచ్చు. జాతీయోద్యమాల వల్ల, కులనిర్మూలనా పోరాటాల వల్ల, సంస్కరణల వల్ల, క్రైస్తవ మతం వల్లనైతేనేమి విద్య నేర్చుకునే హక్కును, ఆలయ ప్రవేశాన్ని పొందగలిగారు పంచములు.
ప్రాథమికోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, నాటి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేశారు. ఊరూరా తిరిగి, వీరేశలింగం, చిలకమర్తల వారి ఆశీర్వాదాలు పొంది, కావ్యజగత్తులో స్థిరపడ్డారు. తిరుపతి వేంకటకవుల ప్రోత్సాహంతో ముందుకుసాగి, ఉభయ భాషాప్రవీణులై తెలుగు పండితునిగా, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో యుద్ధప్రచారకునిగా, స్వాతంత్య్రానంతరం 1956 నుండి 1960 వరకు ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో తెలుగు ప్రోడ్యూసర్‌గా ఉద్యోగాలు నిర్వహించారు.
ఆరుబయటి ప్రక్కపరుచుకొని, ఒక ప్రక్క వేడిగాడ్పులు, మరోపక్క పిండిఆరబోసినట్లున్న వెన్నెలను అనుభవిస్తూ ‘‘నా జీవితం కూడా ఇలాగే వెన్నెల వడగాడ్పు మిళితమై సాగిపోతుంది, వడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం’’ అని తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. కవిగా నిలదొక్కుకోవడానికి పడిన శ్రమ నిలుపుకున్న వ్యక్తిత్వమే జాషువాను గొప్ప కవిగా ప్రకాశింపచేసింది.
జాషువా తెలుగు సాహిత్యంలోని వివిధ సాహితీ ప్రక్రియలని చేపట్టి రచనలు చేశారు. సోదరునితో కలిసి నేత్రావధానం చేసారు. పారాణిక నాటకాలు రాసారు. నవలా ప్రక్రియలో కూడా జాషువాకు ప్రవేశం ఉంది. జీవిక కోసం పారాణిక, సాంఘిక నాటకాలనేకం రాశారు. ‘బొబ్బిలి యుద్దం’ వంటి సినిమాలకు ఆశువుపద్యాలల్లి ఇచ్చారు. గేయాలు రాశారు, జానపద కళారూపాలకు గేయాలు సమకూర్చారు జాషువా ఎన్ని ప్రక్రియలు చేపట్టినా తెలుగు సాహితీలోకం ఆయనను ఆధునిక పద్యకవిగా గుర్తించి గౌరవించింది.
జాషువా ప్రధానంగా వస్తు కవి. అయిన శిల్ప వ్యతిరేకి మాత్రం కాదు. సంప్రదాయ చంధస్సు స్వీకరించి, సమకాలీన సంఘటనతో నవ్యమైన వస్తువును జోడిరచి కవిత్వం చెప్పారు. వీరు వర్తమానాన్ని నిశితంగా పరిశీలిస్తూ భూత, భవిష్యత్తు కాలానికి తొంగి చూడగలిగిన ఋషితుల్యుడు. జాషువా ప్రాచీన కవుల సంస్కృత కవుల కవిత్వాన్ని పుక్కిట పట్టారు అతని కవిత్వంలో కవిత్రయం వారి కవితారీతులు, శ్రీనాథకవి సీస పద్యధార, ప్రబంధ కవుల వర్ణనతో పాటు కాళిదాసు వచోవైభవం చూడవచ్చును, కథావస్తువు, పాత్రల చిత్రణ, చంధోలంకారాది నియమాలు, రసపోషణ, ఉక్తిచిత్రి, భాషాపదప్రయోగం లాంటివన్ని కావ్య శిల్పానికి అంగాంగాలుగా చెప్పుకోవచ్చు. అనతంతమైన ఆర్థ్రత, అపారమైన భావుకతతో మానవీయ కవిగా దర్వనమిస్తారు. ప్రకృతి అందాలను, సూక్ష్మ రహస్యాలను సున్నితంగా కవిత్వ రూపంలో సమాజానికి అందించడం జాషువా కవితా ప్రతిభకు నిదర్శనం.
సీయపద్య రచనకు జాషువా పెట్టింది పేరు. శ్రీనాథుని త రువాత సీసపద్యాన్ని జాషువానే మధురంగా రాయగలిగాడని విమర్శకులు సైతం పొగిడినారు. కవితా శిల్పం, నైపుణ్యం, వైభవం సీసపద్య రచనలో ఆటవెలది జోడిరచి చెప్పడంలో జాషువా ప్రతిభా సంపత్తి వెల్లడవుతుంది.
‘‘ముడిచె నిచ్చట కుంతికొడుకు ద్రౌపదికొప్పు / పగవాని రుధిరంబు పరిమళింప / మెఱసె నిచ్చోట నాదరుషా కురారంబు / నిఖిల భారతము కన్నీరు నింప / వెలిసె నిచ్చోట పచ్చల బర్హిపీరంబు / షాజాను రాజు నాస్థాన వాటి / పెండ్లాడె నిచ్చోట పృధ్విరాజోక రోజు / జయ చంద్రు సుతను దోస్సారగరియ’’ ఇలా సీస పద్యంలో ఆటవెలదినిగాని, తేటగీతిని గాని వాడుకున్న వాటిలో అందంగా, సొగసుగా నృత్యం చేయించగల శక్తి సంపన్నుడు. జాషువా వృత్తాలలో మత్తేభం, శార్థూలం, ఉత్పలమాల, చంపకమాల, జాతుల్లో ఆటవెలది, తేటగీతి, కందం, సీసం లాంటివి ఆయన మధురమైన కవితలకు వాహికలుగా నిలిచాయి.
జాషువా గబ్బిలాన్ని చీకటితో పోల్చి చెప్పడం కోసం ఉపమాలంకారం తీసుకున్నాడు. ‘మక్కు మొగమున్న చీకటి ముద్దవోలె / విహరణముసేయ సాగె గజ్జల మొకండు’ అంటు చెప్పారు. అర్థాంతరన్యాసాలంకారానికి గాను ‘‘గిరుల మగవాని చెలిమి వ్యక్తీకరింప, మస్తమునదాల్పు మొకచిన్ని మంచుతున్క, విసపు మేతరికది సిఫారసుగనుండు, వ్యర్తములుగావు పెద్దలపరిచయములు’’ అంటు పూరించారు. ఔషధంబు లేని యస్పృశ్యత జాఢ్య / మంద భాగ్యు నన్ను మఱచిపోవు’’ అనే పద్యపాదములు రూపకాలంకారానికి చక్కని ఉదాహరణంగా నిలిచింది. ప్రకృతిని చూసి పులకించే కవిహృదయం జాషువాది. అందుకే గరికపోచలో కూడా కవిత్వాన్ని చూడగల్గిన సున్నిత హృదయంగలవారు.
‘‘తేటయైన తీపినీట దిక్కులదాక / విస్తరించి రుచుల గుస్తరించి / చిల్కసంద్రముంపు సీయుచుగన్నట్టు’’ అనే ఈ పద్యంలో తీయదనాన్ని దాచుకున్న నీటిసరస్సు స్వచ్ఛమైన తెలుగు భాషలా ఉంటుందని చెప్పడంతో జాషువాకు తెలుగు భాషపైనున్న అభిమానం తెలుస్తుంది. జాషువా సాహిత్యంలో సంస్కృతం, ఆంగ్లభాషా పదాలతో పాటు హిందుస్తానీ, ఉర్దూ, పారశీక, హిందీ మిశ్రమపదాలు అనేకం వీరి కవిత్వంలో కల్సిపోయాయి. తెలుగు పలుకుబడులు, నుడికారాలు, జాతీయాలు జాషువా కవిత్వంలో పలుమార్లు కన్పిస్తాయి. కవిత్వానికి తెలుగుపలుకుబడులతో గుడికట్టారు జాషువా అంటారు డా॥ సి.నారాయణ రెడ్డి గారు. 30కి పైగా రచనలు చేసి, సాహితీ జగత్తులో తనదైన ముద్రవేసుకున్న మహోన్నతమైన కవి జాషువా.
జాషువా పాండితీవైదుష్యానికి వేయికి పైగా సన్మానాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి శతావధాని చైళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు జాషువాకు గండె పెండారం తొడిగి సత్కరించారు. కనకాభిషేకం చేసి పగటి దివిటీలు పట్టి పల్లకిలో ఊరేగించారు. జాషువాను వర్ణ వివక్షతతో క్షోభపెట్టిన సమాజమే ఆయన పాండిత్యానికి ప్రతిభావ్యుతృత్తులకు తలలు వంచి కవికోకిల, కవిశారద, కవిదిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగకవి చక్రవర్తి, విశ్వకవి, కవిసామ్రాట్ బిరుదుతో పాటు, కేంద్ర సాహిత్య అకాడమీ ‘‘క్రీస్తు చరిత్ర’’ కావ్యానికి అవార్డు బహుకరించింది, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శాసన మండలి సభ్యునిగా నియమించింది, ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘‘కళాప్రపూర్ణ’’ బిరుదాంకితున్ని చేసింది. రాష్ట్రపతి ‘‘పద్మభూషణ్’’ ఇచ్చి సంత్కరించారు. జాషువా 1971 జులై 24వ తేదిన కీర్తి శేషులైనారు.
రచన:
వనపర్తి పద్మావతి,
హన్మకొండ,
సెల్ : 9949290567.
నిర్థిష్ఠ లక్ష్యంగా సాహిత్యపు విలువలతో నిరంతర కవిగా మృత్యుపర్యంతం తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు సి.నా.రె గారు. గేయం పద్యం, సంగీత రూపకం, కథాకావ్యం, కావ్యేతీహాసం, వచనకవిత్వం, గజల్, పాట నాటిక, వ్యాసం, పరిశోధన, సంభాషణా రచన, విద్యబోధన, వ్యాఖ్యానం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియలలో ఆరితేరిన సాహిత్య ధీరుడు. తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రను మిగిల్చి వెళ్లిన మానవీయకవి సి.నారాయణ రెడ్డి గారు. మేరు శిఖరం లాంటి సినారె జన్మదినం సందర్భంగా తిరునగరి శ్రీనివాస్ గారి సంపాదకత్వంలో ‘‘కవితా విశ్వంభరుడు’’ అనే కవితా సంకలనం వెలువడించారు. ఇందులో 71 మంది కవుల కవితా నీరాజనాల సమహారంగా తరతరాలకు ఆదర్శంగా అక్షర పుష్పాల పరిమళంగా నిలుస్తుంది. తిరునగరి శ్రీనివాస్ గారు కవి, రచయిత, మరియు జర్నలిస్టు కావడంతో పాటు నారాయణ రెడ్డి గారికి ఆప్తుడు కూడా అతి సమీపంగా ఉండి వారి రచనశైలిని కొంత ఆకళింపు చేసుకున్నారు. కాబట్టి సి.నా.రె. కవిత్వం, గజళ్ళు, పాటలపై వచ్చిన రచన పై కూడ తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ‘‘జ్ఞానవీచికలు’’ సాహిత్య విమర్శా వ్యాసాలు అనే పుస్తకం కూడా సి.నా.రె జన్మదినం సందర్భంగా ఆవిష్కరించి, గురుభక్తిని చాటుకున్నారు. ‘‘కవితా విశ్వంభరుడు’’ కవితా సంకలనం, మరియు ‘‘జ్ఞానవిచీకలు’’ వ్యాససంపుటి రెండు పుస్తకములు కూడా నేటి తరానికి, మరో తరానికి అధ్యయనం, పరిశోధనకు ఉపయుక్తంగా వుంటాయనేది అక్షర సత్యం. ‘‘విశ్వంభరుడు’’ అక్షరాలతో నిరాజనం పట్టిన కవుల అక్షర లక్షల అణిముత్యాల వంటి కవితలను విశ్లేషించుకుందాం…
అక్షరనాదాల్ని పలికించిన విజ్ఞాని / గుండెనిండా విశ్వంభరా తత్వంతో / ఎన్నో అనుభూతుల క్షేత్ర బంధం / అలలెత్తిన మానవత్వం / ‘యశస్వి’ సి.నా.రె. అంటూ వారి జీవితపు సాహితి ప్రస్తావాన్ని వివరించారు. ‘‘చిత్రం… హాయి భళారే విచిత్రం’’గా మదిలో మీ జ్ఞాపకాలు నింపి / కానరాని లోకానికి ఎలా వెళ్లారు / ‘‘విశ్వంభర’’ తో జ్ఞానపీఠాన్ని అదిరోహించి మీరు ఇంద్రుడి పీఠాన్ని అధిరోహించటానికి వెళ్లారా / అంటు మదినిండ అక్షరాలు నింపిన జ్ఞాపకాలతో జీవిస్తాము అంటూ మనోవేధనను వ్యక్తం చేశారు.
శబ్దసౌందర్యాలు సైనిక కవాతులై సాగేవి / పొద్దును పాట చేసి / భూగోళమంతా భూపాలరాగమైన వెన్నెలపాట / సర్వసామాన్యుడు / బహుముఖీన ప్రతిభా ప్రభాతుడు అంటు ‘‘వనపట్ల సుబ్బయ్య’’ వెన్నెల పాటగా కవిత్వీకరించారు. ‘‘ఆయన ఈ అనంతమైన / సాహిత్య వెలిగే జ్యోతి / ఆసాంఘిక శక్తులపై ఉరిమిన ‘‘మహద్యుతి’’ అంటారు మౌనశ్రీ మల్లిక్. మలి జ్ఞానపీఠ విశ్వంభరుడా ‘‘మాకు దూరమై మీ… పెన్నుమూ ‘‘సి.నా.రె’’! అంటూ తను లేడనే నిజాన్ని జీర్ణించుకోలేని డా॥ అమ్మిన శ్రీనివాసరాజు గారి వ్యధ నే మూడక్షరాలు. ‘‘పద్మభూషణంతో, జ్ఞానపీఠంలో నింగికెగసినారె నిత్యమయినారె / ధృవతారగా నిలిచిపోయినారె అంటు డా॥ రామకృష్ణమూర్తి గారు సి.నా.రె. ను చిరంజీవిగా చేశారు. ‘వగలరాణివినీవే’ నంటూ అక్షరాన్ని వంపులు త్రిప్పిన సముద్రుడు / ‘మబ్బులో ఏముందని’ అంటునే ఆ చోటికే తరలిపోయిన తపస్వి / ‘‘అభినందన మందరామాలలు’’ ఎన్ని వేసిన సరిపోవు అంటు ‘‘పాటల రారాజు’’గా మల్చినారు. యలమర్తి అనూరాధ ‘‘కృష్ణవేణి నడకలా… సాగించిన సృజనకారుడు!’’ / తెలుగు పదాలను కర్పూరం / వసంత రాయలకు కావ్యమల్లిన / కవి శిఖమణి సి.నా.రె. అంటారు. ‘‘కిలపర్తి దాలినాయుడు’’
‘‘గలగలపారే జలపాతమై / ధీర, గంభీర వీరతలతో / సాహితీ సీమను అలరింప చేసిన మహకవి, మహోన్నత కవికి వందనం చేశారు. ‘‘కవిసార్వబౌముడు’’ అనే శీర్షిక ద్వారా శనిగరపు రాజమోహన్ ‘‘పేదలకన్నీటిలో తడిసిన కష్టం / పెద్దల పెదాలతో పలికిన జీవిత సత్యం ఆయన కవిత్వం’’ అంటూ సి.నా.రె. పదాల అల్లికను చెప్పారు. డా. గంజి భాగ్యలక్ష్మి, ‘‘అతడొక సాహితి యుద్దనౌక / ఎడారిలో సైతం పయనించే శక్తి / సాహితి లోకానికే ఆయనొక స్ఫూర్తి’’ అంటారు టి.వి. అశోక్ కుమార్. ‘‘తెలంగాణ అక్షరకీర్తి, కిరీటం, కవితా తపస్వినిత్య ప్రగతిశీలి, అభ్యుదయవాది, మానవతామూర్తి, కవితా జాతిరత్నం’’ అంటూ సి.నా.రె. గారి కీర్తిని అక్షర శిఖరాల్లో నిల్పినారు ఎల్గటి తిరుపతిరెడ్డి. ‘‘అభినందన మందార విశ్వంభర సాహితి సారంగధర సినారె… దివికేగిన గేయతార తెలుగు కావ్యధార అజరామర సినారె… అంటూ కవి ఎపుడు అమరుడె అన్నట్లు గుమ్మడి రామలక్ష్మి తన కలం ద్వారా వెల్లడిరచారు. ‘‘సాహిత్య సమరంలో గెలిచి నిలిచిన అక్షర తపస్వి / విశ్వజనీనతకు నిదర్శనం / మన తెలుగు వెలుగుల తేజం సి.నా.రె అంటూ సాహిత్య జగత్తులో అక్షరాలను నక్షత్రాలుగా మల్చిన తేజో రూపం సి.నా.రె వారు ప్రతిభకు పట్టంకట్టారు వనపర్తి పద్మావతి. మాతృభాష సినారె / మధుర కవిత సినారె / మహిలోపల వెలిసినట్టి / మహాకవి సినారె అని ‘‘మణిపూసలు’’ గా మల్చారు వడిచర్ల సత్యం. సినీ జగత్తు నీ పాటకు దాసోహం అంది, కర్పూర వసంత రాయల్ని పలకరించినా, నాగార్జున సాగరాన్ని తాకిని నీ మాటల ప్రతిధ్వని మనసును తాకుతుంది. మహాకవి ప్రణామం అంటాడు కందుల శివకృష్ణ సాహిత్యపు బాటసారి… శీర్షికతో.
‘‘తెలుగు భాషా దురంధురుడు / సాహితి విశ్వంభరుడు / మీగజల్స్ అద్భుతాలు భళారే / మిమ్మల్ని ఎప్పటికి మరువలేరే సినారె అందుకోండి మా జోహారే అని అద్దేపల్లి జ్యోతి సినారె గారికి ‘పరిపూర్ణుడు’ అంటు జోహార్లు అర్పించారు. ‘‘సినిరంగాన్ని ఉర్రూతలూగించి మెరిసిన వెండి తెరధృవతార / వివిధ రంగాల్లో ప్రతిభను చూపి చెరగని ముద్ర వేసిన గురువుకు నా కవితా సుమాంజలి అని డా. చీదెళ్ల సీతాలక్ష్మి అక్షరసుమాలు అర్పించారు. ‘‘ఓ పద్మశ్రీ… నీకలం పగలే వెన్నెలను, వెన్నెలలోని చల్లదనాన్నే కాక సాగర ఘషను వినిపించింది’’ అని విశ్వకవికి వందనం… అంటారు లింగాల రజని. ‘‘ఆ కలం నడక అమృత వర్షం / ఆ గళం సాహితీ పరవశం / ఆ స్నేహం పుస్తకాల పరిమళం’’ ‘‘మీ బాటలోనే’’ మేము అంటారు ఉండ్రాళ్ళ రాజేశం. ‘‘చిరంజీవిగా చరితార్థులు సినారె / తెలుగు సాహిత్యాంబరంలో / శోభాయ మానంగా వెలిగె స్మరణీయ నారాయణ ధృవతారమీరె’’ ధృవతారగా వెలుగొంది సాహితి లోకానికి వెలుగులు పంచాలనే ఆశ మనోహర్ రెడ్డి గంటా. మరెందరో కవులు, కవయిత్రులు, వ్యధతోను, గౌరవంతోను, ఆవేధనతోను ఓ మహామేరు పర్వతమే సాహితిలోకాన్ని విడిచింది అని తెల్సినప్పటికి కవుల కలంగళం ఎప్పటికి సినారెగార్ని తమవెంట ఉన్నట్లుగానే భావిస్తున్నారు. సినారె గారు మన మధ్య లేకపోవచ్చు కాని వారు రాసిన కవిత్వం సిని గేయాలు, గజళ్ళు, అన్ని కూడా సాహితి వినిలాకాశంలో ఉన్నంత వరకు సినారె అజరామరుడు. చిరంజీవి అంటు నీరాజానాలు అర్పిస్తు విశ్వంభరుడుని విశ్వవ్యాప్తం చేశారు.
తిరునగరి శ్రీనివాస్ కలం నుండి జాలువారిన మరో పుస్తకము ‘‘జ్ఞాన వీచిక’’ సాహిత్య విమర్శా వ్యాసాలు ఇందులో 25 వ్యాసాలు ఉన్నాయి. సాహిత్యాన్ని మలుపులు తిప్పిన ప్రయెగశీలి సినారె గారు. ‘‘వాక్కుకు వయస్సు లేదని’’ ప్రవచించిన సాహిత్యాన్వేషి, ‘నవ్వనిపువ్వు’ మొదలుకొని, ‘‘నా రణం మరణంపైనే’’ వరకు 86 గ్రంథాలను రాసిన నిలువెత్తు తెలుగు సాహిత్య సాక్ష్యం. అనుభూతి కేంద్రం ఆయన కవిత్వం. విభిన్నసాహిత్య తాత్విక కోణాలను శోధించిన సమగ్ర పరిశోధన సినారె రచనలు అలాంటి రచనల పై సాహిత్య విమర్శా వ్యాసాలను అక్షరాలక్షలను ప్రోది చేసి భావితరాలు సులభ శైలిలో తన కలం ద్వారా ‘జ్ఞానవీచిక’ అందించారు రచయిత శ్రీనివాస్.
1931 జులై 29 నుండి 12 జూన్ 2017 వరకు నిర్ఠిష్ట లక్ష్యంతో సాహిత్యపున విలువలతో ‘‘నిరంతరకవి’’గా తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు కవిత్వమే చిరునామా, శ్వాసగా మార్చుకున్న నిరంతర బాటసారి సాహితీ ఉన్నత శిఖరం సినారె. ‘వాక్కుకు వయస్సు’ లేదన్న సాహిత్యాన్వేషి, ‘నవ్వని పువ్వు’ మొదలుకొని ‘‘నా రణం మరణం పైనే’’ అంటూ 86 గ్రంథాలను రచన చేసి మధుర కవితాక్షర జలపాతాలను పొంగించారు. ‘‘నడక నా తల్లి పరుగు నా తండ్రి సమత నా భాష’’ అన్న కవితా వారి ప్రతిభా సమ్మేళనానికి నిదర్శనం. ‘‘చిన్న నాటి మురిపెం ఇప్పటికి నా గుండె గూటిలో పదిలంగా ఉంది’’ అంటూ హృదయ నేత్రాలలో దివ్యత్వంగా బాల్యాన్ని దాచుకున్నారు. చైతన్యం రంగరించుకున్న రవి లాంటి కవి సినారె తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన సాహితీ చైతన్య దీపం.
సాహిత్య ప్రపంచంలో ఓ అపూర్వ ప్రయోగంగా నిలిచింది. ‘ప్ర’ పంచపదులు, భావపరిణతికి, చందోవైవిద్యానికి పరాకాష్టగా నిలిచి వెలిగింది ఈ కావ్యం. ‘ప్ర’పంచపదులు అన్న కూర్పులో అనేక అర్థాలున్నాయి. ‘ప్రపంచించి’ చెప్పడం అంటే ‘విస్తరించి చెప్పడం’ అని అర్థం. ‘ప్రపంచ’ అని కలుపుకుంటే లోకతత్వాన్ని బట్టి చెప్పిన పదాలని తెలుస్తుంది. మానవ సమాజ పరిణామతత్వానికి సినారె అందించిన నిరంతర మూల్యాంకన ఫలితమే ‘‘ప్ర’’పంచపదులన్నది అక్షరాక్షర సత్యం, మానవ సమాజాన్ని విశ్లేషించిన సినారె మహత్తర హృదయావిష్కరణే ‘ప్ర’పంచ పదులు అంటూ విశ్లేషించారు రచయిత.
‘‘ఒళ్ళంతా కన్నీళ్ళయిన జీవితం’’ పట్ల కనబరిచిన ఆర్తినారాయణ రెడ్డి కవితా వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు. 40సం॥ సినారె కవితా కృషికి సంకేతంగా ‘ది బెస్ట్’ అనే ఉద్దేశ్యంతో కాకుండ ‘ఆల్ ఆర్ ది బెస్ట్’ అనుకున్న కవితలను ఎంపిక చేసి ‘నిరంతరం’ను ప్రచురించారు. ‘‘తరం మారుతుంది ` ఆ స్వరం మారుతున్నది / వందేమాతరం గీతం వరుస మారుతున్నది’’ అనే కవితలో అభివృద్ధి వైపుగా కనబరుస్తున్న నిర్లిప్తత, నిర్లాక్ష్యాన్ని ఎండగడుతూ చిదిమి వేసినా వదలని చీడ అంటుకుని ముసి, ముసినవ్వుల మాటున విషం మరుగుతున్నదని వేదన చెందారు. ‘‘కాలం ఇసుకలో దిగబడ్డ కాళ్ళను పెరుక్కుంటూ వేళ్ళమీద నడుస్తున్న మాతృభారతిని ‘జాగ్రత్త సుమా అంటూ ముందు జాగ్రత్త చెప్పారు. ‘‘ఆకలేస్తే వీధి దోసిలి / ఆగ్రహిసై వీధి పిడికిలి’ అంటూ నిన్ను నిన్నుగా నిలిపి భుజం తట్టే మహాభోధి వీధి’ అంటారు. శబ్దశక్తితో కూడిన హృదయ స్పందనలకు చైతన్యాన్ని రంగరించి నిరంతరం కవిత్వాన్ని అజేయంగా, ఆప్రతిహతంగా సినారె గారు ఆవిష్కరించారు.
ప్రౌడ నిర్భరవయః పరిపాకంలో ప్రచురించిన కవితాసంపుటి ‘వ్యక్తిత్వం’ 69వ జన్మదినంన వెలుబడిన ఈకృతిలోని కవితల్లో సినారె క్రాంత దర్శిత్వం ప్రస్ఫుటించడం ప్రత్యేక విశేషం, అత్యాధునికుడుగా సృజన చేసిన ప్రతిభాశాలి ‘వ్యక్తిత్వం’ సంపుటిలోని ప్రతికవితా నవనవో న్మేషమైందె అనడంలో సందేహం లేదు. ‘‘గుండెకు నిప్పంటుకుంది అర్పడానికి నా దగ్గం కన్నీళ్ళు లేవు’’ అనే పంక్తుల్లో సమాజంలో ఒక గుండె బాధతో రగులుతున్నపుడు సానుభూతీదయాచూపలేని కఠినాత్ములను మెత్తగా మందలించిన తీరు బాగుంది అంటారు వ్యాసకర్త శ్రీనివాస్.
సినారె వెలువరించిన అత్యాధునిక, ఆలోచనాత్మక కవితా సంపుటి ‘‘కవితావ్యక్తిత్వం’’ వర్తమాన పరిస్థితుల మధ్య సినారె ఎగురవేసిన మానవీయపతాకం ‘వ్యక్తిత్వం’
‘‘ప్రకృతిలోని చలనశీలానికి పరిణామం మనిషి / జగతిలోని భ్రమణ గుణానికి ప్రతిరూపం మనిషి అనే మానవతా వాదాన్ని మకుటాయమానం చేసుకున్నారు. ఐదు ప్రకరణాల సమగ్రకావ్యం 1980లో ‘‘విశ్వంభర’’గా మానవ పురోగమనశీలితకు నడకలు నేర్పిన కావ్యంగా ప్రచురితమై జ్ఞానపీఠపై నిలిచింది సినారె గారి రచనాశిల్పం. మానవత్తత్వం, అలంకార ఔచిత్యం కల్పనం, శబ్ధ, ఉదాత్తభావమై సమనిష్పత్తిలో కలిసి హృదjైుక, వేద్యమైన ప్రతికాత్మక కావ్యం ‘విశ్వంభర’ జ్ఞాన బీజమే విశ్వంభరాభ్రమణానికి శాశ్వతచైతన్య తేజమై నిలిచింది. నాయకుడైన మానవునికి విశాల విశ్వంభరనే జీవన రంగస్థలంగా మలిచి చూపిన మహాకావ్యమైంది ‘‘విశ్వంభర’’
చిరకాలం స్మృతిపదంలో నిలిచే మనోజ్ఞ కళాఖండాలుగా కథాకావ్యాలను మలిచాడు. సి.నా.రె. ‘‘జాతిరత్నం’’ ‘‘విశ్వనాథనాయుడు’’ కర్పూర వసంత రాయలు, ‘‘సప్నభంగం’’ ‘‘నాగార్జున సాగరం’’ లాంటి రచనా వైచిత్రిని అనుభూతుల దృశ్య పరంపరలను కళ్ళముందు నిలుపుతాయి. ఉదయం నా హృదయం మధునం, విశ్వగీతి, భూమిక, సమదర్శనం, మావూరు మాట్లాడిరది, ముఖాముఖి సమీక్షణం, రామప్ప, గాంధీయం, మీరాబాయి, శిఖరాలు, లోయలు, ముత్యాలకోకిల, మందార మకరందాలు, మట్టిమనిషి, ఆకాశం, నిరంతరం, విశ్వంభర వంటి కావ్యాలలో అనవరతంగా పరిజ్ఞాణంతో సాగిన సినారె రచనా ప్రయాణపు మలుపులు, మార్పులు, వారు ఇచ్చిన తీర్పులు పరిశోధనాత్మక విమర్శకు, విశ్లేషణలకు ద్వారాలు తెరిచాయి. కవిత్వాన్ని గుబాళింపచేసే లక్షణాన్ని పుష్కలంగా కలిగిన కవి కావున కవిత్వమే సినారెకు శ్వాసగా మాతృభాషగా మారింది.
అంత్యప్రాస, పూర్వాంత్యప్రాస నియతితో ఫారసీ, ఊర్ధూకవితలోని రదీప్, ఖాసియా చందస్సులో ‘తెలుగు గజళ్లను’ సృజించి విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకవచ్చారు సినారె గజల్పల్లవి ‘మత్లా’చరణం ‘ముక్తా’ కవినామముద్ర ‘తఖల్లుస్’, నారాయణరెడ్డి గజళ్లలో తఖల్లుస్ ‘సినారె’’ తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి స్మృతిలో ప్రఖ్యాతమై విఖ్యాతిపొందిన తెలుగు గజళ్లనెన్నింటినో రచించి స్వరకల్పన చేసి స్వయంగా గానం చేశారు. ‘అమ్మ’ లాంటి వాళ్లమ్మాయి ‘గంగ’కు తన గజళ్లను అంకితమిచ్చారు. 35 గజల్‌ను ‘‘సినారె గజల్స్’’ పేరిట పుస్తకంగా వెలువరించారు. అంతకు ముందే ‘తెలుగు గజల్లు’ కూడా ఆయన లేఖిని నుండి వచ్చాయి. ‘మత్లా’ మొదులుకొని ‘మక్తా’ వరకు అన్ని పాదాల్లో మాత్రా సంఖ్యాసమత్వాన్ని పాటిస్తూ ‘కాఫియా’ స్వరూపంలో స్వేచ్ఛ తీసుకుంటు గజళ్లలో కూడా యతి నియతిని పాటిస్తూ సినారె గజల్స్‌కి పరిపూర్ణత తీసుకవచ్చారు.
ఆచార్య సినారె ప్రతినిత్యం నడకలో సహచరుల పలకరింతలకు బదులు పలుకుతూనే మనసులో పంక్తుల అట్లుకుంటూ చెప్పగా వెలుబడిన ‘ద్విపదులు’ ‘కలం సాక్షిగా’ పేరుతో 1995 సం॥లో ప్రచురించబడ్డాయి. చతురస్ర, మిశ్రతిస్ర గతులలో సాగిన ఈ ద్విపదులు నడకలో జనించిన ముత్యాలుగా, మనసుకు అద్దం పట్టిన మౌలిక సత్యాలుగా అభివర్ణించారు. కత్తిరిస్తేనే మొక్కలు కొత్తగా చిగురు పెడతాయని చెప్పిన సినారె బీజం చిన్నదైనా దిక్కులను కాపాడె దిక్కయ్యే పచ్చని చెట్టుని ప్రసవిస్తుందని సూచించారు. ‘కరగని జీవన నిధులు’’గా నారాయణ రెడ్డి ద్విపదులుగా భాసించాయి. ‘‘ఊపిరిగాడ్పులు చెలరేగుతున్నాయి / ఉరికే రోజులతో చేయి కలిపి నా మనసు పరుగులు తీస్తున్నది / పరిసరాల ప్రశంసలతో… ముంచేస్తున్నవి. అనే ఉరికే రోజులు ` సినారె చివరి ప్రచురిత కవిత ‘‘మన తెలంగాణ’’ దిన పత్రిక ` కలం పేజీలు 12/6/2017 లో అచ్చు రూపంలో ఉంది. ‘‘చెక్కనిదేశిల కడుపున శిల్పమెలా పుడుతుంది / మరగనిదే నీరు ఎలామబ్బు రూపుకడుతుంది / నలగనిదే అడుగు ఎలానటన రక్తి కడుతుంది’’ అన్న సినారె మరణం సాహిత్య ప్రపంచానికి, సాంస్కృతిక వైభవానికి ఎంతో లోటును మిగిల్చింది.
‘‘సంకల్పం అచంచలంగా వుంటే / ఈదగలిగే చేతులకు సముద్రాలు లొంగిపోతాయి’’ అనే ధీమాను వ్యక్త పరుస్తూ 116 కవితలతో తన 86వ జన్మదినోత్సవ సందర్భాంగా సినారె గారు ‘‘నా రణం మరణం పైనే’’ అన్న కవితల సంపుటిని వినూత్న వస్తు వైవిద్యం, భావవైశిష్ట్యం, శిఖరస్థాయిలో అభివ్యక్తిని సంతరించుకున్న కవితలను ఈ సంపుటిలో చేర్చారు. ‘‘తొలి ఊపిరి జననం, తుది ఊపిరి మరణం’’ అని తెలిసిన ప్రాణికి కరిగిపోయిన జీవనకాలంలో తాను మిగిల్చిన పునాదులే మరణానంతర సజీవత్వాన్ని ఆపాదిస్తాయని అ ంటారు. మరణాన్ని జయించే దైర్యపు ధీరతనే జీవిత వృక్షాన్ని అక్షయంగా నిలుపుతుందన్న ఆశావాహ దృక్పథాన్ని నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేశారు. పరిపక్వఫలభరితమై తరుదశకు చేరుకుని అన్నీ తట్టుకుని నిలబడే మనుగడల జీవిత వృక్షాన్ని కాంక్షించారు. వారి వారసులుగా మనం సాగుదాము అంటూ తిరునగరి శ్రీనివాస్ వారి వ్యాసాల ద్వారా తెలిపారు. ఈ సాహిత్య విమర్శా వ్యాసాలు భావితరాలకు పరిశోధనకు నాందిపలుకుతాయని భావిస్తున్నాము.
‘‘చినుకును రమ్మని చిటికేశాను అది జల్లై వచ్చి కురిసిపోయింది చిగురును చేత్తో నిమిరి చూశాను అది నూరు రేకుల పువ్వై విచ్చుకుంది. తారను ధగధగ వెలిగిపో అన్నాను, అది మధ్యాహ్న సూర్యబింబంలా ఉజ్వలించింది’’ అనే పంక్తుల్లో ప్రకృతిలో మనిషి మమెకమైతే సంపదలను ఇస్తుంది. ఆదే ప్రకృతిని విధ్వంసం చేస్తే కల్లోలం సృష్టింస్తుంది. వ్యక్తి నీతిగా, న్యాయంగా, నిస్వార్థంగా మానవతా దృష్టిలో తోటి వారిని ఆదుకోవాలనే సమన్యాయం వీరి రచనల్లో ఉన్నాయి. ఓ మేరుపర్వతం లాంటి భావకుడు స్పర్శించిన అక్షర జ్ఞానం మనకిచ్చిన అక్షర వరాలుగా భావిస్తూ ఆదర్శవంతమైన, సాహితి విలువలతో కూడిన రచనలు చేయటానికి ఆదర్శనీయులు మన ఆచార్య సి.నారాయణ రెడ్డి అంటారు శ్రీనివాస్ తిరునగరి.
ఆనాటి కాలంలోనే చలం తన రచనల్లో స్త్రీకి స్వేచ్ఛ కావాలని కోరుకున్నాడు. ఆమెకు మనసుంది, దాని స్పందన ఉంటుంది. ఆ స్పందనకు స్వేచ్ఛ కావాలని ఆమె ఆలోచనకు రూపం ఉండాలని స్త్రీని గౌరవిస్తూ ఆమెకు మాట్లాడే హక్కుతోపాటు జీవన స్వేచ్ఛ కావాలని చాలా సందర్భాల్లో చెప్పారు.
నేటి కాలంలో స్త్రీ చదువుకుంది. ఎన్నోరకాల ఉద్యోగాలు చేస్తూ రాజకీయాల్లోను తన ప్రతిభ చాటుకుంటుంది. కాని మానసికంగా స్వాతంత్రాన్ని కుటుంబపరంగా స్వేచ్ఛను పొందలేక పోతున్నది. ఎ.కె.మల్లీశ్వరిగారు రాసిన ‘నీల’ నవల ద్వారా మహిళ స్వాతంత్రాన్ని మరింత నిశితంగానూ నిర్ధిష్టంగాను తెలుసుకునె అవకాశం లభించింది. స్త్రీ పురుషుల మధ్య సహచర్యం ఆర్థిక రాజకీయ స్వాతంత్రాల వల్ల వచ్చేది కాదు. కేవలం మానసిక స్వాతంత్ర్యం వల్ల మాత్రమే సాధ్యం అంటారు స్త్రీ వాద రచయితలు. మన చుట్టూ ఉన్న పదిమంది మనకు అండగా ఉంటారనుకోవడం మానవ సహజం. అయితే ఒకరు లేకపోతే జీవితమే శూన్యం అనుకోవడం బేలతనం అవుతుంది. అలాంటి బేలతనం నుండి తన జీవన ప్రయాణం నుండి తెలుసుకున్న పాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్నపాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్న ఆమె జీన పోరాటము అందులోని సామాజిక అసమానతుల, స్త్రీ పురుషుల సమానత్వం అంటూనే స్త్రీని అణచివేస్తున్న పరిస్థితులకు నిలువెత్తు రూపం ‘నీలం’ నవల సముత్ర చెలియలి కట్ట దాని అలలే దాన్ని నియంత్రించినట్లుగా స్వేచ్ఛ లేనపుడు పెళ్ళి, ప్రేమ, సహజీవనం ఒంటరి జీవితం బరువే అంటారు. అలాంటి సందర్భాల్లో వ్యక్తికీ – వ్యక్తికీ స్వేచ్ఛ నిర్వచనాలు మారుతాయి. ఒకరికి స్వేచ్ఛ అనుకున్నది. మరొకరికి విశృంఖలత్వం అనిపించవచ్చు. ఇవి అన్ని కూడా వ్యక్తులు మనస్తత్వాలు, సంస్కారాలను వాటి పరిమితిల్లో నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఓ మహిళ జీవితంలో జరిగిన సంఘటనలే ‘నీల’ నవలగా చెప్పవచ్చును.
నీల బాల్యం నుండి కష్టాల కొలిమిలో రాటు తేలింది. తన తల్లిని చంపిన తండ్రి జైలుకెళ్ళగా అనాథగా జీవనం సాగించింది. మానసిక పరిపక్వత చెందని వయస్సులోనే పెంచినవాళ్ళు పెళ్ళి చేయగా తనకు ఓ తోడు దొరకదని ఆనందపడింది. ఓ బిడ్డకు తల్లిగా మారింది. అంతలోనే తన భర్తకు మరో స్త్రీతో సంబంధం ఉందని తెలుసుకొని ‘స్వచ్ఛమైన, నిష్కలషమైన ప్రేమకోసం పరితపించింది. ఋతువులు మారుతున్నాయీ కాని నీల జీవితంలో ఏ వర్ణము ఆమెను దరిచేరలేదు. కుటుంబ జీవితంలో హింసను చూసింది తనను హింసిస్తున్న మగవాడి పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు. పైగా అతను పడుతున్న హింస నుంచి విముక్తి కల్గించాలనుకుంది. అంటే తను విముక్తమవ్వాలి అనుకుంది. అందుకే పెళ్ళి పేరున ఏర్పడిన సాహచర్యాన్ని తెంచుకుంది. సహజీవనంలో భద్రత కోరుకుంది. స్వచ్ఛతని, సమానత్వాన్ని కోరుకుంది. స్త్రీ పురుషుల సాహచర్యంలో ప్రేమ, స్వేచ్ఛలతో కూడిన దృఢమైన బంధం కోసం వెతికింది. అతి హింసాత్మక నేపథ్యం నుంచి దుర్భర దారిద్ర్యం నుంచి భవిష్యత్తు సందేహంగా మారగా ‘నీల సుదీర్ఘ ప్రయాణంలోని అనుభవాల నుంచి మరియు చుట్టూ వున్న తనలాంటి మరికొందరి జీవితాల నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకుంది. తనలాంటి నీలవేణులకు జీవితపు అస్తిత్వము సులుపు చేయాలనుకుంది. మళ్ళీ కథలోకి వస్తే పెళ్ళి బంధం నుండి విముక్తి అయిన తరువాత నీల తొలి ప్రేమ పరదేశిపై కల్గింది. కాని అప్పటికే పరదేశి మరో స్త్రీతో రిలేషన్లో వున్నట్లు తెలుసుకుని తన ప్రేమను విరమించుకుంది. ఎవరి వ్యక్తిగత జీవనం వాళ్ళదే దానివల్ల కలిగే మంచి చెడ్డల ఫలితం అనుభవించేది కూడ వాళ్ళే అందులోకి తొంగి చూసె అవసరంకాని ప్రమేయం లేదు. స్త్రీ పురుషుల సహజీవనానికి ప్రేమ అవసరం కాని సమాజం, కుటుంబ విధించిన నియమాల సంకెళ్ళ, చిక్కుదారులు అనేకం వాటిని తెంచుకొని స్వేచ్ఛ కోసం వెతుకులాడే వాళ్ళంతా నీలగాను, నీల తల్లిగాను, నీల నేస్తం సంపూర్ణం, పరదేశిలాగా, ఆపన్న హస్తం అందించిన అజితలాగ సంఘర్షణకు గురికావల్సిందే. స్త్రీ ఆర్థిక స్వాతంత్ర్యానికి, లైంగిక స్వేచ్ఛకి వున్న కనిపించని సంబంధాలు గూర్చి వెలువడిన ఎన్నో ప్రశ్నలకు రచయిత ఈ నవలలో సమాధానాల కోసం అన్వేషణ చేశారు. కొన్నిటికి సూచనప్రాయంగా జవాబులు ఉన్నట్లు కన్పిస్తుంది. ఈ నవలలోని ‘నీల’ వేసుకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు జీవితానుభవం ద్వారా తనకు తానే రాబట్టుకుంది. ఆమెకు తెలియకుండానే జారిపోయిన వాటిని వొడిసి పట్టుకుని తనకు నచ్చిన రీతిలో సరిదిద్దుకునే క్రమంలో తనను తాను తెల్సుకుంది. చదువుకుని సొంత కాళ్ళమీద నిలబడింది. తనని బాధించే హక్కు ఎవరికీ లేదు. తాను ఎవరి బాధకీ కారణం కాకూడదు అనే జీవన తత్త్వంగా మార్చుకుంది. ‘నీల’ స్వీయ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ కోసం చేసిన పెనుగులాటే ఆమె గమనంగా మారింది. దాతృత్వం కాన్సెప్ట్ తో పనిచేసే స్వచ్ఛంద సంస్థలో లోపిస్తున్న దీర్ఘకాలిక ప్రయోజనాల్ని తెలుసుకుంది. అభివృద్ధి నీడ కింద సమాజం అనుభవించే వేదనని అర్థం చేసుకని జీవించే హక్కు కోసం పోరుసల్పె జనంతో కలిసి రాజ్యం చేస్తున్నఅమానవీయం హింసకు వ్యతిరేకంగా నిలవాలని నిర్ణయించుకుంది.
‘నీల’ అనే వ్యక్తి జీవిత చిత్రణలో సామాజిక చరిత్రను చేర్చారు. వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే రాజకీయ సామాజిక సంఘటనల్ని ప్రస్తావిస్తూ ‘నీల’కి సొంత జీవితము, సామాజిక జీవితము వేర్వేరుగా లేవు అనే స్పృహతోనే రచయిత ‘నీల’ని ‘ఒక పిరియడ్’ ‘నవల’ తీర్చిదిద్దారు. ఒక నిర్దిష్ట కాలంలో గ్రామీణ పట్టణ నగర నేపథ్యాలు స్త్రీల స్వేచ్ఛపై లైంగికతపై చూపే ప్రభావాల్ని వాటిలోని భిన్న పార్శ్వాల్ని కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి. స్వశక్తి డ్వాక్రా గ్రూపుల ద్వారా స్త్రీలకు కొత్తగా ఆర్థిక వెసులుబాటు వల్ల దాంపత్య సంబంధాల్లో వచ్చిన మార్పుల వల్ల కుటుంబ వ్యవస్థపై అధిక ప్రభావము లేకున్న స్త్రీ పురుష లైంగికతపై బలమైన ప్రభావాన్ని చూపాయని సూచనప్రాయంగా తెలిపారు. గ్రామాల్లో సైతం కమ్యూనిజం కోరలు చాచింది. మార్కెట్ గద్ద రెక్కలు విప్పుకోగా దేశీయకళాకారులకీ కొత్త మార్కెట్ లభించింది. చాలా సందర్భాల్లో పురుషులు కుటుంబ భారాన్ని ఆడవాళ్లకి వొదిలేశారు. ఊర్లు ఆత్మహత్యలకి, అత్యాచారాలకి నిలయంగా మారాయి. స్వశక్తి గ్రూపులు స్త్రీ వోటు బ్యాంక్ రాజకీయాలకు దారులు వేశాయి. మహిళలు కొత్త సవాళ్ళు ఎదుర్కొన్నారు. అధికారుల కోసం ఆధిపత్యపు కులాల ఎత్తుగడలకు వీళ్ళు పావులుగా బలైనారు. నవల్లో రచయిత్రి ఈ విషయాన్ని విస్తృతంగానే వివరించారు. సమకాలీన స్థానీక రాజకీయాల్తో పాటు పలాస అడవుల్లో ‘నీలధార’ సాక్షిగా నడిచిన గిరిజన ఉద్యమాల ఊసులు, స్టాలిన్ సూర్యం పాల్గొన్న ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమాలపై అమలైన అణచివేత జాడలు నవల్లో సందర్భానుసారంగా ప్రస్తావనకి వచ్చాయి.
ప్రకృతి వనరుల్ని మల్టీ నేషనల్స్ కి అప్పజెప్పడానికి సముద్ర మైదానం అడవి తేడా లేకుండా మానవ విధ్వంసానికి ప్రకృతి వినాశనానికి తెగబడ్డ భీభత్స సందర్భంలో మల్లీశ్వరి నీల గురించి నీల లాంటి మరికొందరి నీల చేయబోయే నూతన ప్రస్థానం గురించి మనం మాట్లాడటం అనివార్యమే కాని ఆ అనివార్యములోంచే ఈ నవల పుట్టి వుండవచ్చు. ‘సముద్రం కార్పోరేట్ల నీటి తొట్టి’ అవడానికి కారణాలు అనేకం. వాటిని తెలుసుకునే దిశగా ‘నీల’ ప్రస్థానం మొదలైంది. ‘జీవితమంతా పోరాటమైన స్థితి నుంచి పోరాటాన్నే జీవితంగా’ మార్చుకునే కొత్త ప్రణాళికల్ని రచించుకుంటుంది. నాలుగు పదులు కూడ నిండని ‘నీల’ మరింత సంఘర్షణాత్మకమైన దారిలో నీల తనలాంటి మరెందరినో కలుపుకుని అడవుల వేడి నిట్టూర్పుల్ని సాగరాల గంభీర శ్వాసని వింటు నడుస్తుంది. స్వతంత్ర జీవనం గడపాలి అనుకునేవాళ్ళు, జాలరి పైడమ్మ లాంటి పీడితుల కోసం పరదేశిలా భుజంకాయారి అనుకునేవాళ్లు సదాశివలా స్వేచ్ఛని గౌరవించగల వాళ్ళు అందరూ నీలకు హితులే, సన్నిహితులే.
మానవ సంబంధాల్లో బలీయమైనది ప్రేమ, స్వేచ్ఛకి సంకెళ్ళుగా పరిణమించిన సంఘర్షనాత్మక సందర్భాల్లో క్లేశాన్ని అధిగమిస్తూ చిక్కుముడులు నిప్పుకుంటూ ప్రేమ – స్వేచ్ఛల మధ్య సమన్వయం సాధించటానికి ఓ స్త్రీ జీవన పోరాటమే ‘నీల’ నవల.
Writer: A. K. Malleswari
ఈ నవలని రచయిత్రి దృష్టిలోంచి చూసినపుడు అశాంతిని కాక జీవశక్తిని ఆవిష్కరిస్తుంది. అది వ్యక్తిలో అపార జీవశక్తి ఉంది. ఆమె వైరిలో ఉద్వేగముంది. సన్నివేశ కల్పనలోను, మనోభావాల్ని పట్టుకొని వివరించడంలో కౌశల్యముంది. కె.ఎఫం.మల్లీశ్వరిగారు రచించిన ‘నీల నవల’ ‘తానా’ బహుమతి పొందినది. మన ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ అన్ని దశల్లో పురుషుడి మాటునే ఉండాలనే నియమాలకు విరుద్ధంగా స్త్రీ స్వేచ్ఛ కోసం ‘నీల’ పాత్ర ద్వారా మనకు అనేక విషయాలను సమా కోణంలో చూపిస్తూనే స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ఎంత అవసరమో చెప్పడంలోనను కొన్ని మెళుకువలతోపాటు ఆధిపత్యపు సంస్థ ద్వారా స్త్రీ జీవన సంఘర్షణని చూసారు. ఈ నవల ప్రతి ఒక్కరిని చదివించేదిలా ఉంది.