భావా లన్ని గజిబిజిగా
సందడి చేస్తున్న వేళ
ఏది మంచో ఏది చెడో
సందిగ్ధంలో ఉన్న వేళ
ఉదయాన్నే చూసినప్పుడు
ఉరకలు వేసిన మనసు
సాయంకాలం కాగానే
పెన్ను ముందుకు కదలనంది
సాయం కోసం వెదికే కష్ట జీవుల చేతుల్లా
భావాలన్నీ ఒక్కసారి నా పై
దాడి చేస్తున్న క్షణాలు
కవి కావాలన్న కులం కావాలి
కవిత ప్రచురణ పొందాలన్న
నా వెనుక అభయహస్తం కావాలి
కవిత కాని కవిత్వం
పలుకుబడితో రాసే కవిత్వం
అనుభవం లేని కవిత్వం
భావం లేని కవిత్వం
ఓ చిరునవ్వు నవ్వుతూ
నిన్నటి నా కవిత
నేడు మరొకరి పేరుతో
అన్ని పేపర్లలో పేరు చూసుకుని మురిసిపోతూ
ఉన్న క్షణాలు
పెన్ను ముందుకు కదలనన్నది
సహాయం చేసే చేతులు
కవితలు రాసే చేతులు
మార్పిడి చేసుకుంటున్నాయి
ఇందులో ఏది గొప్ప
నేనంటే నేనని పోటీపడి మనసున సంఘర్షణని రేపుతున్నాయి
కదలికలో సౌందర్యాన్ని
ప్రతి పువ్వు ప్రతి ఆకు ఇంద్రధనస్సులలా
ఊగీస లాడుతూ
ఆనంద డోలిక లతో తేలిపోతూ కవిత్వమే సాగిపోతూ పిల్ల గాలిలో కలిసిపోతుంది ఆ భావాల్ని నా మనసులో ఉద్వేగాన్ని ఆనందాన్ని నింపుతూ ముందుకెళుతోంది
పెన్ను ముందు కు కదలనన్నా
ఒకానొక శుభోదయం కోసం
సంయమనాన్ని వెంటబెట్టుకొని మునుముందుకే వెళ్తోంది
—*—-
కవితలు
జులపాల జుట్టోనికి
దుఃఖం ఎంత ఇష్టం అంటే
నాటుసారాను ఫూటుగా తాగేంత
ఎక్కడ ఏడుపులు వినిపించినా
వాలిపోయి తనూ ఇంత కన్నీటిని
జమచేసే వాడు
వాడికి దుఃఖం ప్రియ నేస్తగాడు
పెల్లిపెటాకుల్లేని చెంచితగాడు
ఊర్లూ పట్టుకుని తిరిగేవాడు
అందరి స్నేహాల్లోకి కుశలంగా ఒదిగేటోడు
బేకారు కట్ట వద్ద
పులి జూదమై గాండ్రించే వాడు
బైరాగుల సవాసం
బైరన్నల తోటి కల్లు కబుర్లు
వీడికి ముదిరిన మోహం
దర్గాల వద్ద ఫకీర్ల తో
ప్రియ ముచ్చట్లు
పీర్ల చావిడి కాడ
మంచి నేస్తగాడు కుక్కలకు
జాతర్లలో గొరవయ్యలతో
ఒకటే కలిసి తిరుగుడు
జుట్టు పొలిగానితో
కల్లుముంతల పోటిలో వీర నెగ్గుడు
అంత్రాలు కట్టే పీరు సాయబుతో
బాగా సావాసం
కుదిరితే నాలుగైదు వారాలు
ఊరిడిచి వనవాసం
మంగలి సవారి
కొలిమి ఉసేను
బెస్త గాలిగాడు
ఉప్పర ఎల్లయ్య
వీడి జిగిరీ దోస్తులు
గాలి వాటం బతుకు
ఫికిర్ లేని జిందగీ
చెట్టు పుట్ట సత్రాల వద్ద కునుకు
బతుకు పై బెంగ లేనోడు
అన్ని తావులు నావేననే మార్మికుడు
ఆశల్ని వదులుకున్న రికామిగాడు
పగల్లు రాత్రులకు
మాసిన చొక్కాను తగిలించి
సగం పాడి వెళ్ళిన
బుల్బుల్ పిట్ట గీతాన్ని ఆలపిస్తూ
కీచురాళ్ళ చప్పట్లను స్వీకరిస్తూ
కడుపులో ఆకలికే కాక
దుప్పటిలో దోమలకీ చోటిస్తూ
అందరి దుఃఖాల్ని
స్వప్నం లో దేవదేవుడికి వినిపిస్తూ
కోడి కూతలో మళ్ళీ మేల్కొంటాడు
మరో దిమ్మరి రంగుల్ని
రేపటికి సాపు చేసుకుంటూ .
నీకు ఇష్టమో కాదో తెలియదు కానీ
నిన్ను మనసంతా నింపుకుని
నిరంతరం ఆరాధిస్తూనే ఉన్నాను
నాకు సంక్రమించిన ఒక జన్మహక్కుగా
నీ స్పందనేమిటో
తెలియనప్పటికీ …. తెలిసి రానప్పటికీ
ఇకమీదట కూడా
ఇలాగే ఆరాధిస్తూనే ఉంటానేమో
నిన్ను వేధించనంత వరకూ
నీ నుంచి ఏమీ ఆశించినంత వరకూ
నా ఆరాధనేమీ తప్పు కాదు కదా..!
నీ మనసునివ్వమని
హఠం చేస్తూ అడగకుండా
నీ పాదాల వద్ద నా మనసును
అర్పించడమేమీ తప్పు కాదు కదా…!!
దేశం కాని దేశంలో
ఈ శీతలోష్ణపు సాయంత్రం వేళ
అంతగా పరిచయం లేని దారిలో
విచ్చుకున్న చూపునై నడుస్తుంటే
ఎదురుపడి
‘ హాయ్ ‘
అని నన్ను పలకరిస్తూ
చిర్నవ్వై సాగిపోయిన
అతనెవరు
పూర్వ పరిచయమా ? లేదు,
మళ్లీ మరెక్కడో కలుస్తామా ?
తెలియదు
అతనొస్తూ వస్తూ నన్ను చూసాడు
అంతే, అతని పెదాలు విచ్చుకున్నాయి,
అప్పటికప్పుడు పూలు పూసాయి
గొంతులో కూడా!
హాయ్!
పలకరిస్తూంటే అతనిలో
హాయి సమీరం వీచినట్లుంది
అది అక్కడే అంతర్థానం కాక
నా దాకా వచ్చి నను తాకి
పలకవోయీ అన్నట్లుంది
అంతే! నా పెదాలూ విప్పారాయి,
పలుకూ పూసింది సుతారంగా!
హాయ్!
రెండు పిలుపుల కలయిక
ఎంత సరళం, పరిమళ భరితం!
ఏ ఒప్పందాల పత్రాల్లేవు
ప్రయోజనాల లెక్కల్లేవు
హెచ్చూ తగ్గుల యోచనల్లేవు ,
ముందూ వెనకాల వ్యూహాల్లేవు
యోగ్యతాయోగ్యతల తూకాల్లేవు
అప్రయత్నంగా హాయిగా
పెదాల తోటల తలుపులను తెరిచి
పలకరించడానికి పెద్ద కారణాలెందుకు
తోటి మానవుణ్ణి కలిసిన
ఆనంద తన్మయపు పులకరింత చాలు
తోటి మానవుడికి గుప్పెడంత
ఉల్లాస గంధాన్ని అందిస్తున్న ఆ వేళ
పొందే అగణిత తృప్తి చాలు
మనుషులే కాదు,
దేశాలూ పలకరించుకోవచ్చు మెత్తగా!
అపుడు సరిహద్దుల్లోనే కాదు,
ఆ వైపూ ఈ వైపూ
మనిషి నడిచే ప్రతీ దారిలో
పూల వనాలు పలకరిస్తాయి
హాయ్! హాయ్! హాయ్!
అలకలు పట్టివులు
కక్ష సాధింపు కయ్యాలూ
పిల్లల మొండితనం లాగా
రాద్ధాంతం గానే మొదలవుతది
అర్థం కాకుండానే
వాదన పెట్టుకుంటది
దిగువ ప్రవాహానికి నీళ్లు తాగుతున్న మేక
ఎగువగానున్న పులికి ఎంగిలి పడ్డ నెపం ఒకటి
యుద్ధానికి కారణమవుతది
అంత దానికి ఇంత బల ప్రయత్నమెందుకో!
భూనభోంతరాళాల
జలజలాంతర విన్యాసాలెందుకో !
కూటములు శాంతి దౌత్యాలెందుకో !
ఈ ఎల్లల విస్తరణా
చుట్టుముట్టు ఎత్తుగడా
ఏ సంక్షేమానికని !
అంతా మన బోటి ఆగం కానీ
పై పై కారణాలన్నీ ఉట్టుట్టి ప్రేలాపణలే !
వాడిన హరితం
వాంగ్మూలం చెబుతుంది
కప్పు సాసర్ కింద
కాలుతున్న పువ్వులను కనుగొనాలి
యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు
ఎగుమతి దిగుమతుల మీద
ఉత్పత్తి వినియోగాల మీదా
ధరల మీద తడి లేని ప్రాణాల మీదా
వికసించే మొగ్గల మీద సీతాకోక చిలుకల మీదా
వయస్సు మీద పడ్డ మడతల మీదా
పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర మవుతుంది
యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు.
యుద్ధ మన్నాక ఒక్క రీతీ ఉండదు
యుద్ధం ఒక చార్ పత్తర్ ఆట
సైనికులు పహారా ఉన్న
అహంకారపు పూల విమానం
మృగయా వినోదం
దానికో బీజీయ సమీకరణముంటది
అంకెలూ అక్షరాలూ కలవని కూట సంబంధం
తడిసి మోపెడు పెను భారమవుతుంది
యుద్ధం ఒంటరిగా రాదు
కనిపించని వ్యూహంతో
కత్తులు నూరుతుంది
అనాగరిక దుష్ట సంప్రదాయం
ప్రజలు వద్దంటున్నా
ఎందుకింత పిపాస !
ఈ విశ్వ కుటుంబానికి
పాలకులు తండ్రి లాంటి వారు
పొరుగు బంధాలన్నీ లోకకళ్యాణార్ధం
ఏ పక్షం కానీ
ప్రజా పక్షం కావాలి
ఒక నాగరిక సమాజం కోసం
కొత్త సూత్రాలను
కొత్త విలువలను ఆవిష్కరించుదాంహాయ్!
పంకం నుంచి పద్మం వచ్చినట్లు
పాలనాంకం నుండి సుంకం వచ్చినట్లు
తత్వం నుండి సత్యం వచ్చినట్లు
స్వరాజ్యం కోసం తిలక్ ఉదయించినట్లు
కాంగ్రెస్ నుండి గాంధీ వచ్చినట్లు
సంస్కరణ కోసం కందుకూరి ఉద్యమించినట్లు
ఆదర్శ మే మూడో పాదం గా గురజాడ అడుగు పడినట్లు
భాషపై వ్యవహార పిడుగు గిడుగు పడినట్లు
ఒక చాణుక్యుడి నుండి కౌటిల్యుడు వచ్చినట్లు
ఒక సంకల్పం నుండి నెహ్రూ వచ్చినట్లు
సాహసం నుండి నేతాజీ వచ్చినట్లు
ధృఢ సంకల్పం నుంచి సర్దార్ వచ్చినట్లు
పౌరుష సందర్భం నుండి ప్రకాశం వచ్చినట్లు
విభిన్నత నుండి జిన్నా వచ్చినట్లు
ధిక్కార స్వరం నుండి అంబేడ్కర్ వచ్చినట్లు
ఛందస్సు నుంచి పద్యం వచ్చినట్లు
వికాసం కొరకు పౌరహక్కులొచ్చినట్లు
సమాజం నుండి సంక్షేమం వచ్చినట్లు
అత్యాశ నుండి అవినీతి వచ్చినట్లు
పరిపక్వత నుండి పీవీ వచ్చినట్లు
ధిక్కార స్వరం నుండి కాళోజీ వచ్చినట్లు
ప్రపంచంలో భారత్ ఎదిగినట్లు భిన్నత్వంలో ఏకత్వం మిగిలిన
నిప్పులు చిమ్ముతూ నింగికెగిసే ఉపగ్రహ ప్రయోగం మంచి తిథి ఎంపిక తో మనదైన నమ్మకం తో
విజ్ఞాన శాస్త్ర కేతనాన్నెగురవేస్తున్నది
ఆధ్యాత్మిక మహిమకు,మన సంఖ్యాశాస్త్ర శక్తికీ ఇది
ఎదురులేని నిదర్శనం
ప్రపంచవ్యాప్తంగా
ప్రచండ వేగంతో
ప్రజాభిప్రాయమై వెలుగుతున్నది
ప్రాణ రక్షణ పాత్రోల్మీనమై
ఆరోగ్యానికిస్తున్న
ప్రాముఖ్యత
ఎన్ని కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నా
మన ఆధ్యాత్మికత అంటుకట్టుకున్నా
యోగా విశ్వవ్యాప్తంగా జనాదరణ పొందిన యుక్తి కి
మన భక్తికి ఇది బలమైన తార్కాణం!
అవనిని జనని గా కొలిచే దేశంలో
పారే నీరైనా
పీల్చే గాలైనా
భక్తితో
భగవంతుని ప్రసాదమని
ఇక్కడి
జనం గుండెల్లో గూడు కట్టుకున్నది నమ్మకం!
అదే మనకు అనువంశికంగా అబ్బిన గుణం
అందుకే మాది కర్మభూమి అంటున్నారు ఈ దేశజనం!
నిండైన ఈ భావనతోనే సౌభ్రాతృత్వం
పరిఢవిల్లుతుంది
ఇక్కడ అనుదినం!!!
——– పెద్దూరి వెంకటదాసు
మాఘమాసం
ముడివేసింది వాళ్ళిద్దరిని
శ్రీకారంచుట్టింది కలల కాపురానికి
మొట్టమొదలే
అవాంతరం జడలు విరబోసుకుని
ఆయన మనసులో ఒక ఆలోచన పురుడుపోసుకుని
ఆమె కలికివలపుల వాకిళ్ళలో
తిష్ట వేసింది అమాస నిశీధం
ఇరువురిమధ్యఏర్పడింది పెను అగాధం
ఆ అగాధం బంగాళాఖాతంగా మారి
ఇరువురి బ్రతుకుల్ని నిండా ముంచింది
ముసలవ్వ సేవలోఆయన ఇక్కడ
ముసలి నాయనకు ఊతకర్రగా ఆమె అక్కడ
ఏ ముద్దుముచ్టటకు ఆశలేదు
ఏ కోరికా తీర్చడానికి చెంత ఆమె లేదు
అంటార్కిటికా ఖండం దీర్ఘరాతిరిలాంటి విరహాలు వాళ్ళు
కలుసుకోలేని రైలుపట్టాల సమాంతర జీవితాలు వాళ్ళు
వృద్ధాశ్రమాల్నిగాని
తాడుతో వ్రేలాడదీసే లంచ్ బాక్సుల్ని గాని
ఫోనులోనుండి మందులను గుర్తుచేసే మోడ్రన్ మమతల్నిగాని
నాలుగు గోడల నడుమ నలిగే శుష్కవేదనల్నిగాని
కాదనుకున్న వాళ్ళు
కన్నవాళ్ళఒంటరి ఆఖరిమజిలీని కాస్తంత హరితమయం చేస్తున్న వాళ్ళు
కళ్ళ ముందుండి మనోధైర్యాన్ని నింపి ముదిమి జీవితాల్ని ఆనందమయంగా మలుస్తున్న వాళ్ళు
ఆయనకు ఒక పాప ఉంది
ఆమెకు ఒక బాబు ఉన్నాడు
ఇది శిశిరగీతంలో వసంత రాగం
దగ్దహృదయం మీది వెన్నెలజలపాతం
ఆ ముసలివాళ్ళు మంచానికే అంకితం
కాలు కదపలేకున్నాగాని వాళ్ళు
స్వర్గంలో తప్పక కలుసుకుంటారు
అపుడైనా వీళ్ళు కూడా కలుసుకుని జీవిస్తారేమో బహుశా జీవితాంతం
అపుడు కదా కధ సుఖాంతం.
రమేశ్ నల్లగొండ
8309452179
(వచన కవిత)
మేఘాల చాటుకొండకోనల్లో పుట్టినా
దాహపుగొంతుల వెతుక్కుంటూ వచ్చే గంగమ్మ
ప్రాంతీయ గాథల ఉరవడినీ కలుపుకొని…
పలుపేర్లతో అలరిస్తూ అఖిలప్రాణి సమూహాలకు
ఆదరువుగా ప్రవహిస్తుంది!
సరళంగాసాగే మైదానాల్లో పసిడివరి పంటలకు కారణం
ఇసుక ఒండ్రునేలల్లో పుచ్చ, ఖర్భుజా, గెనుసు గడ్డల పహరా హుషార్ !
వేసవిపంటలకు వాణిజ్యమై
కొబ్బరి, అరటితోటలఆర్ధిక ఆహ్లాదమే !
నది నిశ్శబ్దమిత్రుడు,తీరంలో జాలరికుటుంబాలకు
తాటిమానులతెప్ప నుండీ మరపడవవరకూ..
ఆటుపోట్లజలధికి అనుచరగణంనదులు!
ఇసుకతిన్నెల్లో కృష్ణపక్షం వెన్నెల
భావకవిత్వం అలలుగా తేలే సమయం !
పాపికొండల మధ్య గోదావరి అందం
విహారయాత్రా విషాద గీతం !!
చిన్ని చిన్ని గుడులున్న తీరాలలో జనసముద్రంగా..
తిరుణాల తీర్థం
ఎంకితో నాయుడుబావ సంకలో పిల్లాడు సంబరాలు
జానపద భవ్యదృశ్యాలు !
అవధిలేని వర్షాభావంతో,
నదీ గర్భం ఎండినా
చెలిమల్లో శ్రామిక జీవుల సంజీవని గానే !
నదిముఖం ముడుచుకొని..
ఫ్యాక్టరీ వ్యర్ధాలకూపంలో గిలగిల కొట్టుకునే పాయలు..
స్వార్థశక్తులు ముందు తరాలకు చేసే ద్రోహాన్ని,
వరదలుగా ముంచి ప్రశ్నించే నది,
లోయల్లో నాగరికతకు
నిదర్శనంగా మృణ్మయపాత్రలా
బండలపై నిలిచిన శిలాజమై
పుష్కరరేవుల్లో బురదతొక్కిసలాటల విస్మయ దుర్ఘటనలై
పాలకుల పాపపుకీర్తి తురాయిని ముంచేసింది!
ఏ బంధం అంటించుకోని నది
పల్లె జనం భక్తితో చల్లిన పసుపు కుంకుమల్లో.. దివ్యంగా !!
చిట్టి పొట్టి కూనల్లార
చదువులమ్మ బిడ్డల్లార
చదువులమ్మ బిడ్డల్లార
భావి భారత పౌరుల్లార చదువులెన్నొచదివేద్దామా
– భలే భలే మనదేశపు భవిత
వుదామా – హురేహురే
పర్యావరణ రక్షణలో
మనమూఒక చెయ్యేద్దాం
ప్రతి చెట్టూపోషణలో మనమూ ఒక
అమ్మవుదాం
చెట్లెన్నో నాటేద్దామా-
భలే భలే
అడవులనే పెంచేద్దామా –
హురేహురే
తులసి చెట్ల వనంలోన
తులసిమొలకమన
మవుదాం
కాలుష్యా నివారణలో
మనమూ ఒక సమిధ
వుదాం
బంతిపూల బాటవు
దామా – భలే భలే
బంగారు భవితవుదామా
-హురేహురే
మనవూరి చుట్టుముట్టు
చెరువులెన్నొ తవ్వేద్దాం
జలాలను రక్షించి
నీటి కరువు తీర్చేద్దాం
నింగిలోని మేఘమవు
దమా -భలే భలే
మేఘంలో నీరవుదామా
-హురేహురే
చిన్నాచిన్నగ మొలచిన
చిట్టిపొట్టి మొలకవుదాం
తెల్లాతెల్లగ విరిసిన
పసికూనల నవ్వవుదాం అరవిరిసిన పువ్వ
వుదామా -భలే భలే పున్నమి వెన్నెలవుదమా-
హురేహురే
మనవూరి బడిలోన తోటమాలిమనమవుదాం
కలుపు మొక్క లేరేసి
అందమైన తోటవుదాం
సీతాకోకచిలుకవుదామా
-భలే భలే ప్రకృతి అందాలు
చూద్దామా-హురేహురే
మనవూరి గుడిలోన
కోలాటం పాటవుదాం
బతుకమ్మ సిబ్బిలోని
పూల వరుస మన
మవుదాం
చెరువులోని తామర
వుదమా – భలేభలే తెలంగాణ సింగిడ
వుదమా-హురే హురే
గులాబీ తోటలోన
గుబాళింపు మన
మవుదాం
జమ్మి చెట్టు కొమ్మ పైన
పాలపిట్ట మనమవుదాం ప్రతిపౌరుడి మాట
వుదామా – భలే భలే
ప్రగతిలో పాత్రవుదామా
-హురేహురే
