దట్టమైన మబ్బులు పరుచుకున్నాయి. చిరుజల్లు వానకురుస్తుంది చిరుజల్లుల్లో తడిసిన నేలతల్లి తన పరిమాళన్ని గాలి ద్వారా లోకంలో వెదజల్లుతుంది. వర్షం నీటిలో తడిసిన చెట్లు, ఆకులు పువ్వులు ఆనందంలో ఒకకొమ్మ పై మరోకొమ్మ వంగి గుసగుసలాడుతుంటే పుష్పాలు తమ మకరందమును పంచుతూ ఆనందడోలికల్లో తెలియాడుతున్నాయి. అంతలోనే పెద్ద ఉరుము ఆ వెంటనే మెరుపులు ఒక్కసారి వాతవరణమును భయకపితులను చేసింది. వీది దీపాలు వస్తూ పోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటోరిక్షా కిర్రుమంటు శబ్ధం చేసుకుంటు గాంధీ బొమ్మ వద్దకు వచ్చి ఆగింది. ఆటు, ఇటు చూసి అందులోని మనుష్యులు వెనుదిరిగిపోయారు. వారు వెళ్ళి తరువాత జల్లువాన కాస్త జడివానగా మారింది. ఆమసక వెలుతురులో ఎదో నీడ కన్పిపించింది. మూడుకాళ్ళ (చేతికర్ర)ను అసరచేసుకొని అడుగులో అడుగువేసుకుంటు నెమ్మదిగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంది. పైన కాస్త కప్పు ఉండటము వల్ల తడిసిన చీర చెంగును పర్చుకొని తన చేతులనే తలగడగా చేసుకొని, కాళ్ళు కడుపులోకి ముడ్చుకొని గాంధీ తాత వైపుచూడసాగింది. మహత్మ ఏమిటి ఈ కాలం? నీవు కోరుకున్న ఆహింస సమాజం? ఎక్కడ? ధర్మ నమసిపోతుంది. “ఏది జీవితం, ఏది మృత్యువు, ఏది నరకం”. అని ఆనాడు శ్రీశ్రీమహకవి అన్నారు “మాయమవుతున్నాడమ్మ మనిషన్నవాడు” అని నేటికాలంలో అందెశ్రీ గారు పాట రాశాడు. ఈనాటి నాస్థితి మరణమా! నరకమా, మృత్యువా తెలియకుంది బాపు నీవు మళ్లీ జన్మిస్తావా! మాలాంటి వాళ్ళు ఎందరో వున్నారు. వారికి జీవన విముక్తినైన ఇవ్వు, లేదా జీవనరక్షణనైనా ఇవ్వు కానీ ‘అంపశమ్య బ్రతుకులు బ్రతకలేకున్నాము. మానవుడు రాకెట్ ప్రయోగము చేస్తున్నాడు. ఖగోళ పరిశోధనలు చేస్తున్నారు. కాని కన్నవారి ఆత్మఘోష పరిశోధన చేయడం లేదు. నీవు ఎవరిలోనైన పరకాయ ప్రవేశం చేసి మాలాంటి వారికి ఆత్మశాంతి కల్గించు అంటు మౌనంగా కళ్ళ నుండి నీరు ధారపాతంగా ప్రవాహిస్తు ఉండగా మగతగా కళ్ళు మూతలు పడిపోయాయి.
బళ్ళున తెల్లవారింది గాంధి బొమ్మ దగ్గర పిల్ల పెద్ద, ముసలి అందరు గుమిగూడరు ఎదో అలజడిగా, అందోళనగా వుంది. నాకు మెలకువ వచ్చింది. రాత్రి కలలోని నుండి బయటకు రాలేదు. కాని ఎదురుగా గుంపు దగ్గరకు పోయి చూశాను నేను రాత్రి కలలో చూచిన హృదయ విచారకర దృశ్యం సాక్షాత్తుగా నాఎదుట ఉంది. అందరు తలో మాట అంటున్నారు అసలు ‘ఉపిరి’ వుందా! లేదా? అనే ‘సందేహం’ నేను దగ్గరికి వెళ్ళెలోపే వేరే వారు నాడీ పరిక్ష, శ్వాస చూసి బ్రతికె ఉందని ఋజువు చేశారు. అక్కడ చేరిన వారిలో సగం మంది వెళ్ళిపోయారు. మిగతవారు తమ ఇళ్ళల్లోకి వెళ్ళి ఒకరు నీళ్ళు తెచ్చి ముఖం పై చల్లీ త్రాగించారు. నేను వేడిగా పాలు తీసుకునిపోయి త్రాగించాను. అవ్వ కాస్త కోలుకున్నది. కానీ ఆమె బట్టలు అన్ని తడిసి పోయి ఉన్నాయి. మరో తల్లి పొడి బట్టలు తెచ్చింది. కట్టించాము. మాకు సూర్యకిరణాల నులివెచ్చధనము తోడునిల్చింది దాంతో అవ్వది మంచి జుట్టు ఆ జుట్టుకాస్త సరిచేసి పైకి ముడిచి పెట్టాము. పర్వాలేదు అసరా ఇస్తే కూర్చుంది. నీ పేరు ఏంటి? అవ్వ అని అడిగాము చెప్పటానికి కాస్త తటపటాయించింది. కాసేపటికి “రాజమ్మ” అని చెప్పింది. ఇంక వివరాలు అడిగితె చెప్పటానికి నిరాకరించింది. మేము బలవంతం చేయ చేయలేదు. నా ఫ్రెండ్ డా|| రామిరెడ్డి గారికి ఫోన్ చేసింది. డాక్టరు గారు వచ్చి ‘ఉలన్ కంబలి కప్పి’ బలానికి టానిక్ ఇచ్చి వెళ్ళారు. కాసేపటికి అవ్వకు బోజనం పెట్టి టానిక్ ఇచ్చి పడుకోబెట్టాము. రాత్రికి పగలుకు ఎంత తేడానో అవ్వకూడ అదే తేడాతో మనస్సులో మదనపడ్తునే వుంది. గతం తాలుకు వైభవం తన సంతానం, వారి వృద్ధి ఆనంద, తన భాగస్వామి సహచర్యం అన్ని కళ్ళముందు కదలాడుతున్నట్లున్నాయి. కళ్ళు మూసుకొనే వున్నాయి కాని కంటి కొనలనుండి నీరు కారిపోతుంది. అది గమనించి మేము అవ్వను కాసేపు ఒంటరిగానే ఒదిలేశాము.
సాయంకాలం వేళ పిల్లలు అందరు స్కూల్ వదలగానే గాంధీ బొమ్మ దగ్గర చేరి ఆడుకుంటారు కాని ఆరోజు వారు అవ్వనుచూసి కాస్త బెరుకుగానే వున్నారు. ఇంతలో చింటూ గాడు దగ్గరకు పోయి అవ్వ మాతో ఆడుకుంటావా. చాక్లెట్ ఇస్తాను అన్నాడు. అవ్వ మోహంలో ఎదో తెలియని వెలుగు కన్పిపించింది. చాక్లెట్ తీసుకొని చింటూగాడి నోట్లోపెడ్తూ నాకు పళ్ళులేవు నాయన నీవే తిను అంది. అయితే ఐస్‌క్రీమ్ తింటావా అంటు నానిగాడు వచ్చాడు. అవ్వనవ్వుతు వారించింది. అలా కాసేపు పిల్లలు అవ్వతో గడిపి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళి పోయారు. ‘టీగ్లాస్’ తీసుకొని నేను అవ్వ దగ్గరకు పోయి గ్లాసు నోటికి అందించా ఎంతో కృతఘ్నత భావంతో నావైపు చూస్తు ‘టీ’ తాగింది అవ్వ. అవ్వతాత పేరు చెప్పు అన్నాను. అవ్వ సిగ్గుపడి పోయి కాసేపు ఆగి “రామచంద్రయ్య” అని చెప్పింది. ఇంక నెమ్మదిగా వివరాల్లోకి వెళ్లాను. ఎక్కడినుండి వచ్చావు నీవు నీకు ఎవరు లేరా! అని అడిగినాను. ఓక్షణం మౌనం రాజ్యమేలింది. నెమ్మదిగా తనకు ఓకొడుకు, కూతురు ఉన్నారని, ఈ మధ్యనే తనకొడుకు చనిపోయాడని అతనికి నల్గురు కూతుళ్లు అని, తన కూతురు మరో ఊరిలో స్థిరపడిందని చెప్పింది కళ్ళ నీళ్ళతో. ఇంక వివరాలు అడిగితే రెండు చేతులు జోడించి దండం పెడ్తూ అడగవద్దని వారికి చెడ్డ పేరు వద్దని వారించింది. దాదాపు 90సంవత్సరాల వయస్సులో వున్న ఆతల్లి మనసా, వాంచ తన వారి కుటుంబ క్షేమంనే కోరుతుంది. తప్ప మరో ఆలోచనలేదు. అదేకాబోలు తల్లిప్రేమ భూమాతలా ఎన్నితప్పులు చేసిన క్షమిస్తుంది. ఇక్కడికి ఎలా వచ్చావంటే దాదాపు 40కీ, లో మీటర్లు నడిచి వచ్చానని చెప్పింది. ఆమాట విన్న ప్రతి హృదయం చలించిపోయింది. ఒకరి మెహలు ఒకరు చూసుకుంటు అవ్వ ద్గర ఉన్న వాకింగ్ స్టాండ్ అది కూడ చాలపాతది దాంతో ఇంత దూరం తలుచుకుంటేనేమైండ్ ఓక్షణం పనిచేయడం మానేసింది. అవ్వకు రాత్రి బోజనం ఏర్పాటు చేసినాము. ఎవరింట్లోనైనా వుండు రమ్మని అడిగాము అవ్వ ఓప్పుకోలేదు. దాంతో పడకకు కావలసి ఏర్పాట్లు కూడా చేశాము.
ఇంటికొచ్చి పడుకున్నాను పైనా ఫ్యాన్ తిరుగుతుంది. నాలో ఆలోచనలు కూడ అంతే స్వీడ్‌గా తిరుగుతున్నాయి. స్త్రీ జన్మఇంతేనా లేక మానవజన్మనే ఇంతనా. ముసలి తనం వరమా! శాపమా! యవ్వనము బాధ్యతలతో గడిచిపోతుంది. బాల్యము చదువుతో, నడివయస్సు నల్లేరు మీద బండి అయితే ముసలి తన అంపశయ్య మీద ఎదురు చూపులా! ఎంటి ఈసృష్టి దీనికి పరిష్కరము లేదా లాంటి ఎన్నో ఆలోచనలు మనస్సు నిండా తేనేటిగల్లా ముసురుకున్నాయి. ఆలోచనల్తో ఎపుడు నిద్రపోయానో నాకే తెలియదు. ఫోన్ మ్రోగుతుంది ఎక్కడో లీలాగా విన్పిస్తుంది నిద్రమత్తు వీడలేదు అదే పనిగా సెల్‌ఫోన్ మోగుతూనె వుంది దాంతో మెలకువలోకి వచ్చి ఫోన్ ఆన్ చేసి మాట్లాడిన రాత్రి ఎవరో ఇద్దరు మనుష్యులు వచ్చి అవ్వను కొట్టపోయారంట దారిన పోతున్న వారు చూసి వాళ్లను పట్టుకొని పోలీసులకు అప్పగింస్తానంటే అవ్వ ఓప్పుకోలేదట ఇంతలో వారు పారిపోయారంటా నా ఫ్రెండ్ చెప్పిన విషయం. అప్పుడు అర్థం అయింది అవ్వను ఎవరో కాదు తన కుటుంబ సభ్యులే ఇలా చేస్తున్నరని అయిన అవ్వ వారిని క్షమిస్తుంది. ఎందుకు తన మనవారాళ్ళ కోసమా! తన కన్నపేగు దూరం అయిన తన వారసులైన క్షేమంగా వుండలని కాబోలు ఏదిఏమైన అవ్వగతం తెలుసుకోవాలని దాన్ని గూర్చి ఆలోచన చేశాను.
అవ్వ పుట్టింటివాళ్ల ఓరకంగా ధనవంతులే అమెకు పసుపుకుంకువ కింద కాస్తపొలం ఇచ్చారు. ఒకతె కూతురు కావడం వల్ల ఓ బంగళా కూడ ఇచ్చారు. దాంతో ఆ ఇంట్లోనే తను తన భర్తతో కల్సి కాపురం చేశారు. పిల్లలు లేకపోవడంతో ఒక అబ్బాయిని తెచ్చుకొని పెంచుకుంది. అతనికి రాఘవ అని పేరుపెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సమయంలోనే రాజవ్వకు ఓ కూతురు జన్మినించింది. ఇద్దరిని రెండు కళ్ళగా భావించి వారి బావితరానికి చక్కటి బాటలు వేయాలని రాజవ్వ, రామచంద్రయ్య దంపతులు ఎన్నో కలలు కనడమే కాకుండా వాటిని అచరణలో పెట్టడానికి సాయశక్తులు కృషి చేశారు. వారి ఆశలకు తగ్గట్టుగానే రాఘవ, రమ్య ఇద్దరు చక్కని రూపం, తెలివితో చదువులోను ముందుండేవారు. ఒకసారి రాఘవకు విపరీతమైన జ్వరం వచ్చింది. పరిస్థితి ఆందోళనకరంగా మారగ డాక్టర్ గారు భగవంతునిపై భారం వేశారు. ఆసమయంలో రాజమ్వ తనకులదైవం అయిన అమ్మవార్ని పూజిస్తూ మోకాలిపైనా 108 ప్రదక్షణాలు చేసింది. మోకాళ్ల నుండి రక్తం కారుతున్న లెక్క చేయలేదు. ఉపవాసాలు, దీక్షలుచేసింది. ఇలా ఓవారం రోజుల పూజలానంతరం, డాక్టర్లు వైద్య ఫలితంమో రాఘవ కళ్ళుతెరచి అమ్మ! ఆకలి అన్నాడు. పట్టరాని సంతోషంతో రాజవ్వ వేడి వేడి అన్నం తినిపించింది. అలా కొడుకు కడుపు నిండా తిటుంటే రాజవ్వ పడిన కష్టం, తన ఆకలి మర్చిపోయింది. రాజవ్వ కొడుకును ఒళ్ళో పడుకో పెట్టుకొని దేవుని కథలు, చందమామకథలు చెప్పసాగింది. వాడికి ఇష్టమైన అన్ని వండి పెడుతుంది. ప్రతిరోజు ఒక్కోరకంగా వారం పది రోజుల్లో వాడుమాములు మనిషైయ్యాడు. ఎవరు కన్నబిడ్డ అయినప్పటికి రాఘవ తనబిడ్డ అనుకుంది. ఎందుకంటే రాఘవ మూసినకన్ను తెరవకుండ జ్వరంతో పడివున్న రోజుల్లో డాక్టరు గారు రక్తం కావాలి రాఘవకు రక్తంలేదు అన్నారు. ముందు వెనుక ఆలోచిచంకుండ రాజవ్వ తన రక్తం ఎంత కావలన్న తీసుకొండి కాని నా రాఘవ బ్రతకాలి వాడు లేకుంటే నేను బ్రతకలేను అని బోరున ఏడ్చింది. అలాంటి సందర్భంలో రాజవ్వ తన రక్తం రాఘవకు పంచి నిజంగానే కన్నతల్లి అయింది. ఇపుడు రాఘవ సంపూర్ణంగా రాజవ్వ కొడుకు ఆనాటి నుండి రాఘవకు కూడ ఎలాంటి అనారోగ్యం కల్గులేదు. తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూస్తూ జీవనం సాగిస్తున్న రాజవ్వ భర్త పొరుగు వూళ్లో వ్యాపారం బాగా సాగితే కొన్నాళ్ళ వరకు ఇంటికే రారు. వ్యాపారం తక్కువ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి రాజవ్వతోను, పిల్లలతోను సంతోషంగా ఉండేవాడు. రాజవ్వ ఏరంగుచీర కట్టుకుంటే ఎంత అందంగా ఆనందంగా వుంటుందో రామచంద్రయ్యకు బాగా తెల్సు. దానికి తోడు మెడలో కాసుల పేరు, తలలో మల్లెపూవ్వులు, చేతి నిండా గాజులు, పెద్ద కుంకుమబొట్టు, కళ్లకు కాటుకతో చూడగానే చేతెలెత్తిమెక్కెలానే వినయంగల రూపం రాజవ్వది. చుట్టు ప్రక్కల వారికి ఎంతో గౌరవం అభిమానం కూడ, గిట్టనివారికి రాజవ్వ ఆత్మాభిమానం గర్వంగా కన్పిస్తుంది. కాని సున్నితమైన మనస్సు తన కోసం తాను ఏనాడు ఆలోచించుకోదు. అడిగిన వారికి లేదనకుంటా తన చేతనైన సహాయం చేస్తూ తనపని తాను చేసుకుంటూ జీవనం గడిపేది. ఇలా కొంత కాలానికి రాఘవకు యుక్త వయస్సుతో పాటు ఉద్యోగము వచ్చింది. రమ్యకు కూడా పెండ్లి చేయాల్సిన సమయం వచ్చింది. అందమైన చదువకున్న రమ్యకు తగిన వరుడ్ని చూసి కాస్త ధనవంతుల ఇంటికోడలిగా చేసింది. ఇంక మిగిలింది రాఘవ.
ఓరోజు రామచంద్రయ్య రాఘవ పెండ్లి ప్రస్తవం తెచ్చారు. రాఘవ! చెల్లి పెండ్లి అయింది. ఇంక నీకు కూడ పెండ్లిచేస్తే మా బాధ్యత తీరుతుంది. మాకు కూడ వయస్సు మీదపడ్తుంది అన్నారు. అప్పటి వరకు అమాయకంగా అమ్మచాటు పిల్లాడిలా వుండే రాఘవ పెండ్లిమాటలు వచ్చే సరికి ఎలాంటి సంకోచము లేకుండ, నాన్న నేను క్లాస్ ఎపుడు ఫస్ట్ గా వుండేవాన్ని మీకు తెస్సు కదా. నాతోపాటు టాప్ ర్యాంకర్‌గా ఓ అమ్మాయి అదే ధరణి నాన్న మేము ఇద్దరము పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అన్నారు. ఆమాటలు విన్న శ్రీమతిశ్రీ రామచంద్రయ్య గార్లు విస్తుపోయారు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అన్నారు. సందర్భం రాలేదు కదా నాన్నగారు. ఇప్పుడు మీరు పెండ్లి విషయాలు మాట్లాడుతుంటే చెప్పలనిపించింది అన్నాడు. ఈ దంపతులు ఒకరిమోహలు ఒకరు చూసుకుంటు చేసేది ఏమి లేదు అనుకున్నారు కాబోలు రాఘవ ఇష్టప్రకారమే ధరణితో వివాహం జరిపారు. అంత సవ్యంగానే జరుగుతుంది. రాఘవ, ధరణి మంచిజీతం గల ఉద్యోగస్తులు అయ్యి ఇద్దరు సంపాదన పరులైయ్యారు.
రమ్యకు ఇద్దరు పిల్లలు వారు తమ సంసారంలో సుఖంగానే వున్నారు. రాఘవకు ఇద్దరు అమ్మాయిలు మూడో కాన్పు దగ్గరకు వస్తుంది. ఇసారైన ఫ్యామిలి ఫ్లానింగ్ చేసుకోమని రామచంద్రయ్య తనకొడుకుకు సలహా ఇచ్చారు కాని ధరణి తల్లి అందుకు ససేమిరా ఓప్పుకోలేదు “పున్నమనరకము” నుండి కాపాడె కొడుకు లేకుండ ఎలామరో సారి చూద్దాము అంటు రామచంద్రయ్య మాటలను త్రోసి పుచ్చింది. నల్గువ సారి కూడ అమ్మాయే ఇలా నల్గురు అమ్మాయిలకు తండ్రిగా రాఘవ. అమ్మ వార్లు అందరు తమ ఇంట్లోనే వున్నారని రాజవ్వ సంబరపడిపోతు వారి కోసం పొదుపు చేయటం మొదలు పెట్టింది. తన పుట్టింటి వారు ఇచ్చిన పొలం, ఇల్లు చాలా ఖరీదైన ఆస్తులుగా ఎదిగినాయి.
ఆకస్మాతుగా రామచంద్రయ్య గారి ఆరోగ్యము క్షీణించసాగింది వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య కుదుట పడ్తునే వుంది. అంతలోనే మళ్ళి వ్యాదీ తిరగపడ్తుంది. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. రామచంద్రయ్య వ్యాపారం బాగా సాగిన రోజుల్లో చాల డబ్బు రాజవ్వ పేరున వుంచారు. కొంత రామచంద్రయ్య వైద్యానికి ఖర్చు అయిన చాలా సొమ్ము రాజవ్వ పేరునే వుంది. ఇంట్లో ధరణి పెత్తనం మితిమీరటం ఆసొమ్ము తన పిల్లలకు తనకు కావలని ఇంట్లో గొడవలు మొదలైనాయి. రాఘవ కూడ భార్యకు తోడుగానే వున్నాడు.
ఈ ఇలాంటి సందర్భాలు అందరికి సహజమే కాబట్టి రామచంద్రయ్య దంపతులు కూతురు అల్లుడిని పిలిచి పాత ఇల్లు కూతురికి, పొలం తాలుకుహక్కును మాత్రం రాఘవకు ఇచ్చారు. రాజవ్వ పేరున ఆస్తులు మాత్రం అమె బతికి ఉన్నంత కాలం ఆమెకు చెందాలని వీలునామా రాయించారు. అప్పటికి గొడవ సద్దుమణిగినప్పటికీ మానసికంగా రామచంద్రయ్య చాల కృంగిపొసాగాడు. రాజవ్వ ఎంత దైర్యం చెప్పిన అతని మానసిక రోగం తగ్గుముఖం పట్టలేదు. కొంత కాలానికి రాజవ్వను ఒంటరిదాన్ని చేసి రామాచంద్రయ్య పై లోకానికి వెళ్ళిపోయాడు. తాత చనిపోయిన సంవత్సరంలో ఆడ పిల్ల పెళ్ళి చేసి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే నమ్మకంతో రాఘవ ఇద్దరు అమ్మాయిల పెండ్లి ఒకేసారి చేశారు. పొలంలో కొంత భాగం అమ్మివేసి మరికొంత వారి ఆదాయంతో అప్పటికే రాజవ్వ వంటి మీది నగలు మాయమైనాయి. భార్య పిల్లలు ఖర్చులు భరించలేక లంచం తీసుకోవడం వల్ల అనుకొని పరిస్థితుల్లో రాఘవ ఉద్యోగం నుండి తీసివేయబడ్డాడు. దాంతో ఇంక ఇద్దరు అమ్మాయిల పెండ్లిళ్ళు చేయ్యాలి. ఎలా అని మానసికంగా మధనపడ్తూ అనారోగ్యం కొని తెచ్చుకున్నాడు. భార్య ధరణి మాత్రం తనకు ఇంక ఎదురులేదని తనదే పెత్తానం అన్నట్లు ఆమె ప్రవర్తన రోజురోజుకు శృతి మించి పోతుంది. రాజవ్వ పై ఒత్తిడి తీసుకరాసాగింది. డబ్బు మిగిలిన నగలు ఇస్తే తన కూతుళ్ళ పెండ్లి చేస్తానని నిస్సహాయ స్థితిలో రాఘవ ఉన్నాడు.
అనుకున్నట్లుగానే మిగిలిన పొలం రాజవ్వ నగలతో మరో ఇద్దరు అమ్మాయిల పెండ్లి ఘనంగా జరిపారు. కొంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది. అప్పు చేశారు కాని ఎలా తీర్చాలో అనే ఆలోచన లేదు. కొంత కాలానికి అప్పుల వాళ్ళ అగడాలు ఎక్కువైనాయి. రాఘవ ఏమి తోచ్చని స్థితిలో తన నాన్న గారి వ్యాపారం చేయసాగారు. కుటుంబానికి దూరంగా వుంటూ అలవాటులేని వ్యాపారం కాబట్టి లాభల కన్న నష్టలే ఎక్కువైనాయి ఉన్న అప్పులు తీర్చలేదు సరికదా కొత్త అప్పులు చేయడం జరిగింది. రాజవ్వకు వయస్సు మీదపడి కంటిచూపు మందగించింది. నడవలేని స్థితిలోకి వచ్చింది. కాని తన భర్త రామచంద్రయ్య మాట ప్రకారం తన వద్దనున్న డబ్బును తన మనవారళ్ళ పిల్లలకు ఇవ్వాలని భద్రపర్చసాగింది. కాని వాటికై కోడలు, కొడుకు ప్రతిరోజు హింసించడం మొదలుపెట్టారు.
ఓరోజు ఇంట్లో అందరు గొల్లుమని ఎడ్చుస్తున్నారు. రాజవ్వ అప్పుడే నిద్రలో నుండి మెల్కొని కళ్ళజోడు సవరించుకుంటూ కిందకు వచ్చి చూసింది. తనబిడ్డ రాఘవ చలనం లేకుండ పడివున్నాడు. తన రక్తం ధారపోసి బ్రతికిచుకున్న వాడు ఈనాడు వాడి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరు కలిసి నన్ను ఒంటరి దాన్ని చేశారు అనుకుంటు ఆచేతనంగా కూలబడింది. కళ్లవెంట నీళ్ళురావడం లేదు ఎందుకంటే రాఘవకువ తను ఎడిస్తే చూడలేదు. మౌనగంగలా తనలో తానే వేదన తరంగాలను అదుపు చేసుకుంటుంది. జరగాల్సిన కార్యక్రమాలు జరిపించారు.
కొడుకు తనప్రాణం దూరం అయ్యాడు. తట్టుకొనిలేని హృదయం రాత్రి పగళ్ళు విలపిస్తునే వుంది. అలా చీకటి గదిలో ఎన్ని రోజులు వుందో తనకే తెలియదు. ఓ రోజు గదిలో లైటు వెలిగింది. రాఘవ పెద్ద కూతురు వచ్చింది. తన భుజం పైనచేయి వేసింది. రాఘవ స్పర్శలా అన్పించి మనస్సుకు కాస్త ఊరట కల్గింది. చేతిలో బాబు వున్నాడు ఒళ్లోకి తీసుకుంది. మా నాయన మళ్ళీ నా ఒళ్ళోలోకి వచ్చాడు అంటూ సంబరంగా గదిదాటి బయటికి వచ్చింది. కోడలు తినడానికి అన్ని పెట్టింది. ఎన్నాళ్ళు అయిందో రాజవ్వ అన్నం తినక కడుపునిండా తిన్నది తనగదిలో నిద్రపోతుంది. అప్పుడే చల్లటిగాలి చిన్నుకులు మొదలైనాయి. కరెంట్ పోయింది. ఎవరో తన గదిలోకి వస్తున్న అలికిడి గాజుల శబ్దం వినబడుతుంది. తనను (రాజవ్వ) నలుగురు పైకి ఎత్తుకున్నారు. నిద్రలో ఉన్నదని భయపడినారు. కాని రాజవ్వ మెలకువతోనే గమనించసాగింది. ఆనలుగురు కలిసి రాజవ్వను ఓ ఆటోలో వేసుకుని వెళ్ళి వూరిచివరన ఒదిలేసి వెళ్ళారు. ఇంక ముసలిదాని పీడ విరగడైంది. ఈ వర్షంలో తడిసి చచ్చిపోతుంది. ఆ డబ్బు మొత్తం తీసుకోవచ్చని ప్లాన్ వేసి రాజవ్వను చీకటిలో ఆనాధగా వదిలి వెళ్ళారు. ఇది రాజన్య గతం గురించి మేము తెలుసుకున్న విషయాలు. చాలా బాధ
కలిగింది.
మరునాడు ప్రొద్దున్నే కాలింగ్ బెల్ మోగుతుంది పాలవాడు పాలు తెచ్చాడు. దాంతో పాటు రాజవ్వ పరిస్థితి బాగా లేదని చెప్పాడు. రాజవ్వకు పాలగ్లాసు తీసుకొని వెళ్ళాను మేము తెలుసుకున్న విషయాన్ని నా కలగా రాజవ్వకు చెప్పాను. రాజవ్వ నన్ను గట్టిగా పట్టుకుని ఎడ్వసాగింది.
–
అదే బిడ్డ నాగతం నీకలగా వచ్చింది. అని తల ఊపింది. రేడియో వారు అప్పుడే మానవ సంబంధాలు – విలువలను గూర్చి చెప్తు పాటలు వేస్తున్నారు. నాకో ఐడియా వచ్చింది. దాన్నితోటి వారితో పంచుకున్న. మా ప్రయత్నం ఫలించి, ఓ 10 సంవత్సరాల అబ్బాయి, 8 సంవత్సరాల అమ్మాయి రాజవ్వ దగ్గరకు పూలు పట్టుకుని వచ్చారు. రాజవ్వ వారిని తన తొడమీద కూర్చోపెట్టుకొని ముద్దులు పెట్టుకుంది. తన సంచిలో భద్రంగా దాచుకున్న కొన్ని కాగితాలను వారికి ఇచ్చింది. ఆ పిల్లలు వారి ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో రాజవ్వ విషయం చెప్పారు. అవ్వను మన ఇంటికి తీసుకు రండి, లేకపోతే మేము కూడ ఇంట్లోకి రామని మొండికేశారు. రాజవ్వ ఇచ్చిన ఆస్తి కాగితాలు వారిపైకి విసిరి బయటకి వచ్చారు వారి స్నేహితులతో కలిసి గాంధి తాత బొమ్మ వద్దకు వచ్చారు. రాజవ్వలో ఎదో తెలియని శక్తి కాస్త వచ్చినట్లు అయింది. కాని మాట్లాడలేకపోతుంది. ఎదో సైగలు చేస్తుంది. కానీ అర్థం కావడం లేదు. గాంధి తాత బొమ్మపై చూపులు నిల్పి అలాగే పడుకుంది. ఇంతలో రాఘవ భార్య ఆమె కూతుళ్ళు వచ్చారు పశ్చాతాపంతో. అప్పటికే రాజవ్వ ప్రాణజ్యోతి గాంధీ తాత విగ్రహం దాటి రామచంద్రయ్యను కలిసింది. మానవత్వమును తిరిగి మెల్కోలిపిన పిల్లలు రాఘవ మనవడు, రమ్య మనరాలు. మరో తరం, మధ్య తరానికి మార్గదర్శనమై నిల్చింది.