“మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా?”
అకస్మాత్తుగా వినిపించిన ప్రశ్నకు, ఆశ్చర్యంగా చూసి “ఏమిటీ? నన్ను పెళ్ళిచేసుకుంటారా?” పకపకా నవ్వింది రాజి.
“అబద్ధం కాదు నిజంగానే అంటున్నాను. మా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్, అతని సహాయంతో మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాను. నన్ను నమ్మండి” సీరియస్‌గా అన్నాడు విశ్వం.
“మీరు చదువుకున్నారు, మంచి ఉద్యోగం వస్తుంది. అసలు మీరు ఇక్కడికి రావటమే విచిత్రం! వచ్చినప్పటి నుంచి కబుర్లు చెపుతున్నారు. పైగా నన్ను పెళ్ళిచేసుకుంటారా? అభ్యుదయభావాలా?” గమ్మత్తుగా అడిగింది.
“ఈరోజు మా స్నేహితుడి బలవంతం మీద కొంత, అసలు ఈ అనుభవం ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలంతో కొంత వచ్చాను. మిమ్మల్ని చూడగానే ఏదో ఆత్మీయ భావం కలిగింది. అందుకే అడుగుతున్నాను నన్ను పెళ్ళి చేసుకుంటారా?” మళ్ళీ అడిగాడు విశ్వం.
విశ్వం కళ్ళల్లో కనిపించిన ప్రేమ, నిజాయితీని చూసి “మీకెందుకు ఆభావన కలిగింది? నాలో ఏమి ఆత్మీయత చూసారు? నేనొక వేశ్యనని మర్చిపోతున్నారా?” విస్మయంగా అడిగింది.
“ఎందుకు? ఏమిటి? అంటే ఏమి చెప్పను? కొన్నిటికి సమాధానం ఉండదు” జవాబిచ్చాడు విశ్వం.
విశ్వం వైపు సాలోచనగా చూసింది. ఒక్క క్షణం ఆగి, “ నిజంగా మీకు నామీద ఆత్మీయతాభావం ఉంటే ఒక సహాయం చేయగలరా?” కన్నీటిని కనురెప్పల మాటున దాచుతూ అడిగింది రాణి.
“ఏమి సహాయం చేయాలి?”
“మా నాన్న ఆటో డ్రైవర్. అమ్మ ఒక పెద్దింట్లో పని చేసేది.మేము హైద్రాబాద్‌లో ఒక బస్తీ లో ఉండేవాళ్లము. నేను, మా చెల్లి, తమ్ముడు అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో చదివేవాళ్ళము. నేను తెల్లగా, అందంగా ఉండేదానిని అని నన్ను రాణీ అని పిలిచేవారు అమ్మానాన్నా. నేను ఎనిమిదవ తరగతి చదువుతుండగా జబ్బు పడ్డాను. చాలా వీక్ అయ్యాను. అందుకని ఆ సంవత్సరం స్కూల్ మానిపించి, అమ్మ తనతో పెద్దింటికి తీసుకెళ్ళేది. వాళ్ళ నాలుగేళ్ళ లోయర్ కేజీ చదువుతున్న, బాబుని స్కూల్‌కు తీసుకెళ్ళి, మధ్యాహ్నం స్కూల్ అయిపోయవరకు అక్కడే ఉండి, ఇంటికి తీసుకొచ్చేదానిని. మేడంకు చిన్నచిన్న పనులు చేసిపెడుతూ సహాయంగా సాయంకాలం వరకూ అమ్మతో ఉండేదానిని. బాబును స్కూల్‌కు తీసుకెళ్ళే డ్రైవర్ మురళి. అతనూ నాతోపాటే స్కూల్ అయిపోయేవరకూ ఉండేవాడు. ఆ సమయంలో నాతో చాలా చనువుగా ప్రేమ మాటలు చెపుతుండేవాడు. నన్ను పెళ్ళి చేసుకుంటాననేవాడు. అప్పుడు నాకు నిండా పద్నాలుగు ఏళ్ళు కూడా లేవు. ఏమీ తెలియని రోజులు.బాబు వచ్చేవరకూ కార్‌లో కూర్చొని అతను చెపుతుండే ప్రేమ కబుర్లు నన్ను సుందరస్వప్నలోకంకు తీసుకెళ్ళేవి. పైగా చూస్తున్న సినిమాల, టీ.వీ షోల ప్రభావమనుకోండి, ఏదైనా అనుకోండి, ఓ రోజు స్కూల్ నుంచి అటే అతనితోవచ్చేసాను. అమ్మా వాళ్ళ గురించి కానీ స్కూల్‌లో ఉన్న బాబు గురించికానీ ఆలోచించలేదు! ఇక ఆతరువాత చెప్పేదేముంది? అందరికీ తెలిసిన మామూలు కథే! కడుపుతో ఉన్న నన్ను ఇక్కడ అమ్మేసి చెక్కేసాడు! ఇప్పుడు నా బాబుశౌర్యకు నాలుగు సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే వాడికి ఊహ తెలుస్తోంది. ఇక్కడే ఉంటే నాకే విటులను తీసుకొచ్చేవాడవుతాడు. వాడు ఇక్కడ పెరగటం నాకు ఇష్టం లేదు. బాగా చదువుకొని జీవితంలో మంచి వ్యక్తిగా స్థిరపడాలని నా కోరిక. మీకు వీలవుతే వీడిని ఈ వాతావరణానికి దూరంగా తీసుకెళ్ళి ఏదైనా స్కూల్‌లో, హాస్టల్‌లో చేర్చండి. డబ్బు సంగతి ఆలోచించకండి. నేను వీడికోసం ఎంతైనా కష్టపడుతాను. ఫీజులు నేనే కడుతాను. అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటాను. ఇక్కడి మౌసీకి నేను ఇక్కడే ఉండి, డబ్బులు సంపాదించి ఇస్తే చాలు. అభ్యంతర పెట్టరు” అని వేడుకోలుగా అన్నది రాజీ.
ఆ తల్లి హృదయం ను అర్థం చేసుకున్న విశ్వం శౌర్యను కలింగ్‌పాంగ్ లోని స్కూల్‌లో, తన స్నేహితుని కొడుకని, తల్లితండ్రులు ఆక్సిడెంట్‌లో చనిపోయారని, తను గార్డియన్ అని చెప్పి చేర్చాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. శౌర్య గ్రూప్ పరీక్షలు పాస్ అయ్యి, పోలీస్ ఆఫీసర్ అయ్యాడు.
“ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టు” విశ్వ తన ఎదురుగా నిలబెట్టిన యువకుడిని తేరిపారా చూసింది రాజి. అప్పుడప్పుడు కలింగ్‌పాంగ్ వెళ్ళి కొడుకును దూరం నుంచి చూస్తూ ఉండేది. ఇప్పుడుయూనీఫాంలో ఎదురుగా ఉన్న కొడుకును కన్నీరుతో కళ్ళు మసకలుబారుతుండగా, ప్రేమగా తడుముతూ భావోద్వేగానికి గురయ్యింది రాజి! విశ్వ వైపు తిరిగి రెండు చేతులూ జోడించింది!
తల్లిని పొదివి పట్టుకొని, తనవైపు భయంభయంగా, ఆసక్తిగా చూస్తున్న అందరినీ చిరునవ్వుతో చూసి, పెద్ద సోఫాలో కూర్చొని ఉన్నావిడతో “మౌసీ మా అమ్మను తీసుకెళుతున్నాను” అన్నాడు శౌర్య.
అప్పటి వరకూ వాళ్ళిద్దరినీ గమనిస్తున్న మౌసీ, యూనీఫాంలో ఉన్న శౌర్యను ఏమనలేక “సరే తీసుకెళ్ళు కానీ కాస్త మమ్మలిని కూడా చూసుకుంటూ ఉండు” అంది ఆదరంగా.
“అలాగే నువ్వింకే అమ్మాయినీ తీసుకురాకుండా కనిపెట్టి ఉంటానులే నవ్వుతూ అని పదమ్మా” అన్నాడు శౌర్య అమ్మతో.
అప్పటి వరకూ ఒక ట్రాన్స్‌లో ఉన్నట్టున్న రాజీ”నేనెందుకు వద్దు. నేను నీతో వస్తే సమాజంలో నీకు గౌరవం ఉండదు. నాతో గడిపిన ఎందరో ఎదురైనప్పుడు నిన్ను చిన్నచూపు చూస్తారు. నీకు పెళ్ళి కాదు. వద్దు నన్ను ఇట్లాగే ఉండనీయి. నేను కోరుకున్నట్లుగా నువ్వు పెద్ద ఆఫీసర్‌వి అయ్యావు. ఆతృప్తి చాలు నాకు” వణుకుతున్న గొంతుతో అంది రాజి.
“నాకు నా అమ్మ చాలు. ఈ సమాజంతో నాకు పనిలేదు. నిన్ను ఇష్ఠపడి, గౌరవంగా చూసుకునే అమ్మాయి వస్తే పెళ్ళి చేసుకుంటాను. లేకపోతేలేదు. ఇంక మాట్లాడక పద” అన్నాడు శౌర్య.
అదేమిటి రాజీ, ఈరోజు కోసమే కదా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసింది. ఇన్నాళ్ళు ఈ మురికి కూపంలో కష్టపడ్డావు. ఇక కొడుకు దగ్గర గౌరవంగా ఉండు” మందలింపుగా అన్నాడు విశ్వ.
ఇక మారు మాట్లాడకలోపలి నుంచి సూట్‌కేస్ తెస్తున్న రాజీ చేతిలోని సూట్‌కేస్ తీసి కింద పెడుతూ “ఇక్కడ నుంచి ఏమీ తేవద్దు. ఈ సామానులనూ, ఈ జ్ఞాపకాలనూ అన్నీ ఇక్కడే వదిలిరా” అంటూ తల్లిని పోలీస్ జీప్ ఎక్కించాడు.
పోలీస్ జీప్ ఎక్కుతుంటే రాజీ కాళ్ళు తడబడ్డాయి. కొడుకును పట్టుకున్న చేయి కూడా వణికింది. ఇప్పటి వరకూ ఎన్ని సార్లో పోలీస్ వాన్, పోలీసులు బందిలి దొడ్డిలోకి పశువులను తోలుతున్నట్లుగా లాఠీతో అదిలిస్తుంటే ఎక్కింది. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ తల్లిగా ఎక్కుతుంటే చెప్పలేని భావోద్వేగానికి గురి అవుతోంది. తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న శౌర్య అమ్మ చేతిని మృదువుగా తట్టి, చిన్నగా ఎక్కించాడు.
***
పదమ్మా అంటూ అమ్మ భుజాల చుట్టూ చేయివేసి ఇంట్లోకి నడిపించాడు శౌర్య. Sourya I.P.Sగేట్ ముందున్న నేమ్ ప్లేట్‌ను ఆప్యాయంగా, గర్వంగా తడుముతూ లోపలికి నడిచింది.
పోలీస్ కాలనీలో చిన్న, ముచ్చటైన క్వాటర్శౌర్యది. హాల్, కిచెన్, మూడు బెడ్ రూంస్, ఇంటి చుట్టూ అందమైన తోట, ఆర్డర్లీ, వంటమనిషి, పని మనిషి అన్నీ అమర్చిన ఇంటిని చూసి మురిసిపోయింది రాణి. ఇంత వైభోగానికి తను తగునా అని నూన్యతాభావం కలుగుతోంది. పోలీస్‌లను చూసి ఉలిక్కిపడుతోంది. ఎవరిని చూసినా తనను చూసి నవ్వుకుంటున్నారేమోననే భావననే కలుగుతోంది. అమ్మను గమనిస్తూనే ఉన్నాడు శౌర్య. ఓరోజు ఒక మధ్యవయస్కురాలిని వెంటబెట్టుకొచ్చాడు.
“అమ్మా, ఈవిడ పేరు శారద. ఈవిడ రామకృష్ణామఠం లో యోగా నేర్పిస్తారు. ఇక నుంచి రోజూ మనింటికి వచ్చి నీకు యోగా నేర్పిస్తారు. చదువు చెపుతారు. బయటకు తీసుకెళుతారు” అని ఆవిడను పరిచయం చేసాడు.
నాకెందుకు నాన్నా యోగా, చదువు అనబోయింది కానీ శౌర్యను చూస్తూ అనలేక పోయింది. శారద వైపు చూసింది. తెలుపుకు ఎరుపు రిబ్బెన్ అంచు ఉన్న నేత చీర, తెలుపునలుపు కలగలిసిన జుట్టుతో చిన్న ముడి, నుదుటన చిన్న కుంకుమ బొట్టుతో సింపుల్‌గా ఉంది. రాజీ తనవైపు చూడగానే చిన్నగా నవ్వింది ఆవిడ.
“మా అమ్మ, రాజేశ్వరి” శారదకు పరిచయం చేసాడు.
ఎప్పుడో నా అసలు పేరు రాజేశ్వరి అని చెప్పింది వీడికి బాగానే గుర్తుందే అనుకుంది రాజీ.
మరునాడు సాయంకాలం నాలుగు గంటలకు రాజేశ్వరిని రామకృష్ణమఠంకు తీసుకెళ్ళింది శారద. అక్కడ ఒక హాల్‌లో ఒక స్వామీజీ భగవద్గీత వినిపిస్తున్నారు. కాసేపు అక్కడ కూర్చున్నాక, వేరే హాల్‌లోకి తీసికెళ్ళింది. అక్కడ పిల్లలకు యోగా నేర్పిస్తున్నారు. అక్కడ నుంచి వెనుక వైపు ఉన్న మందిరంకు తీసుకెళ్ళింది. అక్కడ కూర్చున్నారు. ప్రశాంతంగా ఉన్న మఠం పరిసరాలు రాజేశ్వరికి చాలా నచ్చాయి. రాజేశ్వరి సెల్ తీసుకొని, యూట్యూబ్ తెరిచి, చాగంటి, గరికపాటి వారి ప్రవచనాలు ఎలా వినాలో, నచ్చిన పాటలు ఎలా వినాలో చూపించింది. శారదతో వస్తున్నప్పుడు తన గురించి ఏమైనా అడుగుతుందేమో, తన సంగతి తెలిసి చిన్న చూపు చూస్తుందేమో అని ఉన్న రాజీ, శారద అసలు ఆ విషయం గురించే మాట్లాడకపోవటము, తెలిసినట్లే లేకపోవటముతో నూన్యతాభావన, బెరుకు పోయాయి రాజేశ్వరిలో. శారద ఆహార్యం, స్నేహశీలత్వం నచ్చాయి రాజేశ్వరికి. ప్రతిరోజూ సాయంకాలం వచ్చి రాజేశ్వరిని బిర్లా మందిర్, రామకృష్ణామఠం అలా తీసుకెళ్ళేది. శారద సత్ సాంగత్యంలో రాజేశ్వరి మంచి సాహిత్య పఠనం, ప్రవచనాలు విని ఆకళింపు చేసుకోవడం అలవరుచుకుంది.
రాజేశ్వరిలోని మార్పును ఆనందంగా గమనిస్తున్నాడు శౌర్య. ఒకసారి అమ్మ చిన్నప్పుడు ఉన్న బస్తీని వెతుక్కుంటూ తీసుకెళ్ళాడు. పోలీస్ జీప్ ఇంటి ముందు ఆగేసరికి చాలా భయపడ్డారు వాళ్ళు. రాజేశ్వరిమాటలతో జ్ఞాపకం తెచ్చుకున్నారు. తమ్ముడి, చెల్లెలి పెళ్ళిళ్ళు అయ్యాయి. బాగానే సెటిల్ అయ్యారు. తమ్ముడి కుటుంబం, అమ్మానాన్నా కలిసి ఉన్నారు. కాలం తెచ్చిన మార్పు వారిలో కనిపిస్తోంది. కాసేపు కూర్చొని వచ్చేసారు. తనవాళ్ళను చూసేసరికి తనలో మనోబలం పెరిగినట్లుగా అనిపించింది రాజేశ్వరికి!
ఆ రోజు ఆగస్ట్ పదిహేను. బస్తీ మధ్యలో ఝండా ఎగురేసి మైక్ చేతిలోకి తీసుకొని చుట్టూ చూసింది. అక్కడ ఉన్న పిల్లలను చూస్తుంటే తన బాల్యం గుర్తొచ్చింది. ఝండాను పోలినట్లు, తెలుపుకు ఆకుపచ్చ అంచున్న ఖాదీ చీర, నారింజ రంగు జాకెట్టు, మెడలో సన్న స్పటికపు మాల, చిన్న ముడితో డిగ్నిఫైడ్‌గా ఉన్న రాజేశ్వరిని ఆరాధనగా, ఏమి చెపుతుందా?! అని అసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ.
“అందరికీ నమస్కారం. మీలో పెద్దవాళ్ళు కొంత మందికైనా నేను గుర్తు ఉండే ఉంటాను. నా చిన్నప్పుడు మీ అందరిలాగే ఆటపాటలతో ఇక్కడే పెరిగాను. ఆనందంగా అమ్మానాన్నల నీడన ఉన్న నాకు ఒక త్రాష్టుడు తగిలాడు. వాడి మాయమాటలకు మోసపోయి, నా జీవితాన్ని చిందరవందర చేసుకున్నాను. ఇంకో పుణ్యాత్ముని సహాయసహకారము వలన నా కొడుకు ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు వచ్చాడు. నేను ఒక ముళ్ళ కంచె నుంచి బయటకు వచ్చాను. ఇదంతా మీకెందుకు చెపుతున్నాను అంటే నాలాగా ఏ ఆడపిల్లా మోసపోకూడదని. అమ్మాయిలూ, అబ్బాయిలూ మీ వయసు చదువుకునే వయసు. ఇది వరకులాగా మనలని అమ్మానాన్నలు పనులకు పంపటం లేదు. వాళ్ళ శక్తి కొద్దీ మంచి స్కూల్స్‌లోనే చదివిస్తున్నారు. ప్రభుత్వం మనకు ఎన్నో రాయతీలూ, అవకాశాలు కల్పిస్తోంది. వాటిని ఉపయోగించుకోండి. చక్కగా చదువుకోండి. అమ్మాయిలూ అనవసరపు వ్యామోహాలకు లొంగిపోకండి. గుడ్ టచ్, బాడ్ టచ్ ఏదో తెలుసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే అమ్మకు, టీచర్‌కు చెప్పండి. వాళ్ళు మీ బాగు కోరేవారే. ముందుకోపం చేసినా తరువాత అక్కున చేర్చుకుంటారు. అబ్బాయిలూ మీరూ అనవసరమైన వ్యాపకాలు పెట్టుకోకండి. పిచ్చిపిచ్చి, భయంకరమైన వీడియోలు చూడకండి. వాటి వ్యామోహంలో పడితే మీ జీవితాలే నాశనమవుతాయి. మీ తోటి అమ్మాయిలను గౌరవించండి, తెలిసీతెలియక ప్రేమ అంటూ, ఏవో అనుభవాలు కావలంటూ వారిని వేధించకండి. మీకోసం మీ తల్లి తండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించండి. ఈనాటి బాలలే రేపటి పౌరులు. ఈనాడు మీ ప్రవర్తన బాగుంటే రేపటి సమాజం బాగుంటుంది. మీరే అందరికీ విజ్ఞాన దీపికలు.
ఏదీ అందరూ లేచి నిలబడి “మేము బాగా చదువుకుంటాము. మంచి ప్రవర్తన కలిగి ఉంటాము. పెద్దలు చెప్పిన మాట వింటూ వారిని గౌరవిస్తాము. దేశం కోసం పాటుపడతాము అని ప్రమాణం చేయండి” అని అందరితో ప్రమాణం చేయించింది.
‘జై హింద్’ అని సమావేశం ముగించింది.
ముళ్ళ కంచెను దాటి, శిధిలమైన శిలలా ఆత్మన్యూన్యతో బాధపడిన అమ్మ దేవుని గుడిలో వున్న శిల్పంగా కనిపిస్తున్న అమ్మను అపురూపంగా చూసాడు శౌర్య!

6 comments
https://shorturl.fm/oYjg5
https://shorturl.fm/TbTre
https://shorturl.fm/A5ni8
https://shorturl.fm/N6nl1
https://shorturl.fm/eAlmd
Kate’s playground pussy linkMal self facial tubeClub
gangbang videoQuality facial productsPanty play lesbianDisplaying my naked wifeCrosley midget xnxx House wife porn freeTommie ryden pornAva
devine prolapsed analEngerix-b adult pfs 5 bxCat doll
lounge pussyJustene jaro nude oicsBiggest titties movie thumbsFinal fantasy 8 adult https://m.xnxxtubexxx.cc/ Femdom forced vaginoplastyAmerica public sexTeardrop
breast implant resultsRedtube sex with full figured womenEnglish lesbian photo setsBig
natural floppy boobBride by cock fucked huge newHott teen nude
babes xnxx Sister licks sister pussyClean home sex clipsReal men nudeBlond and nakedRecommended
adult immunizationVideos to make you masturbateSapphic erotica pussy tastingThe swedish
bikini team playboy spreadHome remedy to increase breastCondom namesFree black sex websitesDating comparison online sexy costumesAmateur japaneseAlton towers happy hardcoreSex chat
cameraCondom pornoAsian girls and mini skirtsThe thickest penis