కవితలు మనసు – మాట by Aruna Dhulipala July 29, 2024 written by Aruna Dhulipala July 29, 2024 వాళ్లిద్దరూ….ఎంతో ఆత్మీయులుఅప్పుడప్పుడువిడదీయలేని శత్రువులు అంతరంగ జగత్తుకుఒకరు సాధికారులుశబ్దాశ్రయంగాబహిరంగ స్వరాధికారులువేరొకరు లోతుల్లోని భావాలమర్మం ఒకరైతేభావ వినిమయ ప్రసారాలచతురులు మరొకరు ఆలోచనల సూక్ష్మతఒకరిదైతేపెదవుల వాహకంగాపరుగులు తీసేధ్వని తరంగాలు ఇంకొకరివి మనసు చెప్పినామాట పలుకదు ఒక్కోసారివద్దంటున్నాపలుకక ఉండదు మరోసారివీటి మధ్య మౌనంమింగుతుంది కాలాన్నిఅనేకసార్లు మనసు, మాటకు నడుమకావాలి మేలనంఅదే కరువైతేవ్యక్తిత్వపు చిరునామాకుతప్పవు అవమానాలుఅనుభవం ఎంతటిదైనా-!! దాచుకోవాల్సినవి కొన్నిదాపరికం ఉండకూడనివి మరిన్నిఏది తగునో?ఏది తగువో?పెదవి దాటడమంటేమనసు స్వచ్ఛమై వికసించడమే !! 0 comment 0 FacebookTwitterPinterestEmail Aruna Dhulipala previous post ఆషాఢం – విశిష్ఠత next post The Learned You may also like సాగిపోవాల్సిందే జీవితం! November 30, 2024 మనుషుల్లా కాసేపు November 30, 2024 నేస్తమంటే….. November 30, 2024 దీపం వెలిగించాలి November 30, 2024 ఎక్కడ నీ నెలవు November 30, 2024 కాలమే అనుకూలిస్తే.. November 30, 2024 మనిషి- మరణం November 30, 2024 హైడ్రా November 29, 2024 Egoist November 29, 2024 కవితా సాగర మధనం November 22, 2024 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.