Home బాల‌సాహిత్యం ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌

ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌

ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ గారు పశ్చిమ బెంగాల్‌ లో ఒక గొప్ప పండితుడు. వారు చాలా కఠినంగా క్రమశిక్షణ పాటిస్తూ సాదాసీదా జీవితాన్ని గడిపారు. పశ్చిమ బెంగాల్‌ ప్రజలు వారిని ఎంతో గౌరవిస్తూ, ప్రేమతో చూసేవారు.

ఒకరోజు కలకత్తాలో వారిని గౌరవించేందుకు గొప్ప సభను ఏర్పాటు చేశారు. ఎంతోమంది ముఖ్యులను ఆ సభకు ఆహ్వానించారు. ప్రజలందరు మంచి డ్రెస్సుల్లో వారి వారి ఖరీదైన కార్లలో రావడం మొదలయింది. గేటు దగ్గర గేటు కీపర్‌ ఆహ్వానితుల కార్లను సభాస్థలానికి పంపిస్తున్నాడు. ఒక మనిషి నడుస్తూ గేటు వద్దకు వచ్చాడు. గేటు కీప్‌ ధోతీ, కుర్తా, శాలువా తన భుజాల చుట్టు వేసుకున్న ఆయనను చూశాడు. అతడు ఒక ఆహ్వానితుడిలాగా కనబడలేదు.

ఆ మనిషి గేటు కీపర్‌ ను ”ఇక్కడ ఏమి జరుగుతున్నదని” అడిగాడు.

”ఏం నీకు తెలియదా, ఒక గొప్ప వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ ఇక్కడికి వస్తున్నారు. అతను ఈరోజు ఇక్కడ గౌరవింపబడుతున్నాడు. ఇక దయచేసి పక్కకు జరగండి. చాలామంది వస్తున్నారిప్పుడు” గేట్‌ కీపర్‌ జవాబిచ్చాడు.

”నేను ఈ ఆడిటోరియంలోకి వెళ్ళాల్సి ఉంది. ఇదిగో చూడు. నేను ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ ని” అని ఆ మామూలు డ్రెస్‌ లో ఉన్న మనిషి అన్నాడు.

”నువ్వా !” గేట్‌ కీపర్‌ నవ్వడం ప్రారంభించాడు. ”నీవు నన్ను తెలివితక్కువ వాడిగా అనుకుంటున్నావా? విద్యాసాగర్‌ అనే మనిషి మామూలు డ్రెస్‌ లో కార్యక్రమానికి నడుచుకుంటూ వస్తాడని నన్ను నమ్మమంటావా? ఇప్పుడు. నువ్వు నా సమయాన్ని వృథా చేస్తున్నావు” అని అనుకుంటూ గార్డు ఆ మనిషిని పక్కకు తోసేసాడు.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ తనే గొప్ప మనిషి అయి కూడా మాట్లాడకుండా తిరిగి నడిచి వెళ్ళాడు. ఎవరో ఇతడ్ని గుర్తించి బయటికి పోతున్నవాడిని ఎంతో గౌరవంగా వెంట తీసుకొని ఆడిటోరియంలోకి వెళ్ళాడు. గార్డు చేసిన తప్పుకు సభ ఏర్పాటు చేసిన వ్యక్తులు క్షమాపణ కోరారు.

ఆ గొప్ప వ్యక్తి గార్డుపై కోపం తెలుపలేదు. ”అతను కేవలం అతని డ్యూటీ చేస్తున్నాడు” అన్నాడు. మరియు గార్డును తిట్టకుండా వారిని ఆపేశాడు.

వారికోసం ఏర్పాటు చేసిన సభ తరువాత, వారిని కొన్నిమాటలు మాట్లాడమని కోరారు.

”నా మిత్రులారా” అని మొదలుపెట్టారు. నేను ఈ రోజు ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. ఒక మనిషి తను వేసుకున్న బట్టలతో గుర్తింపబడతాడు. కానీ వాస్తవంగా లోపల అతడు / ఆమె ఏమిటో కాదు.

కార్యక్రమానికి వచ్చిన జనులు ఈ మాటలు విని తలలు వంచుకున్నారు. వారు గార్డు అతడిని పక్కకు నెట్టివేసిన ఘటన విన్నారు. ఆ సభకు వారందరూ మంచి మంచి డ్రెస్సుల్లో వచ్చారు. కానీ ఈ గొప్ప వ్యక్తి ఎవరైతే గౌరవింపబడుతున్నాడో చాలా మామూలు  బట్టల్లో వచ్చారు.

You may also like

Leave a Comment