నా జీవితం-
ఓటిపడవ ప్రయాణం
నిత్యం నా నిరీక్షణ
దరిదాపుకై సంశోధనం
నేను-
ఎడారి కోయిలను
నా హృదయాలాపన
గ్రీష్మకాల ప్రణవనాదం

నాది-
క్షతగాత్ర హృదయం
నా అంతరంగం
ఓ మరుభూమి
నాకు-
ఓదార్పు కలకంఠి గాత్రం
మోడువారిని నా జీవితానికి
తొలకరి జల్లు ఆ గీతం
నా జీవితం-
ఓటిపడవ ప్రయాణం
నిత్యం నా నిరీక్షణ
దరిదాపుకై సంశోధనం
నేను-
ఎడారి కోయిలను
నా హృదయాలాపన
గ్రీష్మకాల ప్రణవనాదం
నాది-
క్షతగాత్ర హృదయం
నా అంతరంగం
ఓ మరుభూమి
నాకు-
ఓదార్పు కలకంఠి గాత్రం
మోడువారిని నా జీవితానికి
తొలకరి జల్లు ఆ గీతం