ఒక జంతు ప్రదర్శన శాల (జూ,zoo)లో ఏనుగులు, మొసళ్ళు, రైనోసిరస్ లు (ఖడ్గమృగాలు) ఇంకా ఎన్నో ఎన్నో వేరే జంతువులు చాలా ఉన్నాయి. అక్కడ ఒక గొరిల్లా కూడా ఉన్నది. అది చూడటానికి చాలా భయంకరంగా ఉన్నది. దాన్ని చూసి అందరూ భయపడేవాళ్లు. ఆ గొరిల్లా ఎవరితో కూడా స్నేహం చేయలేదు. దాని పేరు పీట్ ( Pete) అని ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు ఒక చిన్న పాప వాళ్ళు ఈ జూ కు వచ్చారు. ఆ పాప పేరు జోసఫైన్. జోసఫైన్ తన తల్లి తో కలిసి గొరిల్లా బోను(cage) దగ్గర ఆగింది, వెళ్దాం రమ్మంటే అక్కడ నుండి కదలనే కదలని అన్నది.
” రా డియర్ వెళ్దాము” అని తల్లి పిలిచినా వెళ్లలేదు.
“మనం ఇంకా బ్యూబన్లను(Baboons), కంగారులను ( Kangaroos),జిరాఫీలను ( Giraffes) చూడాలి అని ఎంతగానో పిలిచింది. కానీ జోసెఫ్ తలను అడ్డంగా ఊపింది. “గొరిల్లా అన్నింటికంటే ఆహ్లాదకరమైంది.నాకు ఇతనితో … ఈ గొరిల్లా తో ఆడుకోవడమే ఇష్టం”అని అన్నది . గొరిల్లా ఈ మాటలు విన్నది. దాని మనసు ఈ చిన్న అమ్మాయి వైపు తిరిగింది.
మర్నాడు ఉదయం జూ కాపరి గొరిల్లా వెళ్లిపోయిందని తెలుసుకున్నాడు.అది మామూలుగా బోను ద్వారాన్ని నెట్టి తెరిచి జూ గోడ ఎక్కింది, అలా టౌన్ లోకి వెళ్లి పోయింది. వెంటనే అలారం మోగింది. అగ్నిమాపక దళం నిచ్చెనలతో బయటకు బయలుదేరింది.పోలీసులు వాళ్ళ లాఠీలతో, సైనికుల గుంపులు ట్యాంకులతో, కొద్దిమంది మిలిటరీ డాక్టర్లు, పశువుల డాక్టర్లు అందరూ గొరిల్లాను కనిపెట్టాలని బయలుదేరారు.
వెంటనే లౌడ్ స్పీకర్ వ్యాన్లు బజార్లో పెద్ద సంగీత ధ్వనులతో బయలుదేరాయి.
“ఎవ్వరూ ఇండ్ల నుండి బయటికి రావద్దు! జాగ్రత్త!! బయట భయంకరమైన గొరిల్లా తిరుగుతున్నది. ఎవరైనా చూస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలి ” అని అనౌన్స్ ఇది విని బలహీనమైన గుండె ఉన్న అమ్మాయిలు కొందరు మూర్ఛిల్లిపోయారు.ఎక్కడి వారు అక్కడనే భయపడిపోయారు.
కొందరు ఔత్సాహికులైన గొప్ప వేటగాళ్లు ఇండ్ల మీదికి గుండ్లు నింపిన రైఫిల్స్ తో ఎక్కారు. కానీ ఎక్కడా గొరిల్లా జాడలేదు. అది గాల్లో ఎగిరిపోయిందా అన్నట్లు అనిపించింది వాళ్ళ కు.
ఓ ఐదారు గంటలు గొరిల్లా కొరకు వెదికారు. కానీ అది ఎక్కడ కనిపించలేదు అప్పుడు ఒక జనరల్ కు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది.
AI. ఆల్సేషన్ ( శునకం, కుక్క) . అది ఎప్పుడైనా వాసన చూసి పసిగట్టేదొక దాన్ని తెప్పించారు.అది గొరిల్లా ఉంటున్న బోను వాసన చూసి, కాసేపు మొరిగింది.వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని వెంట శాశ్వత సైనిక విభాగ సైనికులు ఒక ప్లాటూన్ పోలీసులు,ఇంకా ఒక అగ్నిమాపక దళం , ఎవరైతే వాళ్ల నిచ్చెన్లను దారిలో పోగొట్టుకున్నారో వాళ్లంతాను పరిగెత్తారు.
AI . ఆల్ సెషన్ వాసన పసిగట్టి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి చేరింది.వెంట ఉన్న డాక్టర్లు,పశు వైద్యులు అందరూ దాన్ని వెంబడించారు.ఈ శునకాన్ని పట్టుకున్న పోలీస్ ట్రైన్డ్ కేర్‌టేకర్ భయపడుతూ కుక్క చూపిన ఒక ఇంటి డోర్ బెల్ కొట్టాడు,అది మొరగడం ఆపింది. పోలీసు వాళ్ళు వాళ్ళ కర్రలతో రెడీగా… గట్టిగా పట్టుకొని నిలబడ్డారు.
జోసఫైన్ డోర్ తెరిచి అల్లరి చేయవద్దని పెదవులపై వేలు పెట్టుకుంది. అతి నెమ్మదిగా ” నేను ఇప్పుడే ఒక కథ చెప్పి నిద్రపుచ్చాను. ఎవరు మీరంతా ? ఆగండి” అన్నది.
పోలీసులు, సైనికులు ,అగ్నిమాపక దళాలు అందరూ 475 మంది మెట్లపై ఇరుక్కుని నిలబడ్డారెందుకో గ్రహించి ,
అమాయకపు గొరిల్లాను నిద్ర నుండి లేపి,
జోసఫైన్ గొరిల్లాతో ” నేను రోజు వచ్చి కలుస్తాను నిన్ను.. ఇప్పుడు వాళ్లతో వెళ్ళు “అని మెల్లిగా వివరించింది. అలా ప్రతిరోజు వెళ్లి దాన్ని కలుస్తానని వాగ్దానం చేశాక అది అల్లరి చేయకుండా నెమ్మదిగా వాళ్ళ వెంట జూకు తిరిగి వెళ్ళింది.