Home కవితలు “నేల ఈని నట్లు”

“నేల ఈని నట్లు”

by Bhandaru Sujatha Sheker

రచన; డాక్టర్ బండారు సుజాత శేఖర్
భువిదివిగా ప్రకృతి పల్లవించే తరుణం ..
త్రివేణి సంగమం.. గంగా యమునా సరస్వతులు పులకిస్తున్న క్షణం
ఇది అమృతం.. గరుడుడు తల్లి చెరవిడిపించిన సాక్ష్యం ..
సురాసురుల క్షీర సాగర మధనం
ఉద్భవించిన అమృతం… సూర్యచంద్రుల బృహస్పత్రుల సంరక్షణలో
దివి చేరుతున్న వేళ నాసిక్ ప్రయాగ్ హరిద్వార్,సరస్వతి, గోదావరి
పుణ్యక్షేత్రాల చినుకుగా తరింప చేసేహేల ..
మానవాతీత భక్తి ముక్తి మార్గాల అన్వేషణ
అకార నాగ వేవేల సాధు సజ్జనుల కదిలించే కుంభం ;
నేల ఈనినట్లు, పక్షులు రెక్కలు విచ్చినట్లు
పూలు విచ్చారినట్లు, సీతాకోకచిలుకలు బార్లు తీరినట్లు
మహా కుంభమేళ, కుంభమేళా సనాతన సధర్మ సంస్థాపన
చరితలకే చరిత సృష్టించే వైనం;
జగమే జీవనాధారం; జలమే జీవ సాకారం..
పుణ్య స్నానాల పుణ్యకార్యాల పాపపుణ్యాల బేరీజు
మనిషి మరొక్క మారు, ఇంకొక్క మారు అంత: మధనం; పిత్రుణాన్ని తీర్చే సతరుణం..
భారతాంబ కర్మభూమిగా పులకింత
ప్రపంచ పటాన మహాకుంభమేళ ఉత్సవం
నిరంతరం పుణ్యభూమిని జే గంటలతో శ్లాగిస్తున్న మహోత్సవం;
ఏది ఏమైనా
మనిషి మనీషిగా మారాలంటే ధర్మాచరణ కర్మ క్రియలే కాదు
నిన్ను నిన్నుగా సంస్కరించుకోవాలని మరువకు..
మానవత్వ శిఖరాన్ని గంగా పవిత్రతను పొందాలంటే
ప్రకృతి పరిరక్షకుడువై పల్లవించు…
కాలుష్య రహిత గంగా యమున సరస్వతుల, గోదావరి కృష్ణా ప్రవాహాన్ని. . భువిదివిగా ప్రకాశింపచేయి.

You may also like

2 comments

Renee3265 September 24, 2025 - 3:01 pm Reply
Chandler4661 September 27, 2025 - 9:04 am Reply

Leave a Reply to Renee3265 Cancel Reply