షడ్ శాస్త్రపండితులు, ఉభ వేదాంతాలలో నిష్ణాతులు.
తెలంగాణ గర్వించ దగిన శాస్త్ర కోవిదులు, ఉత్తమ అధ్యాపకులు శ్రీమాన్ మరింగంటి శ్రీరంగచార్య స్వామి వారు.
విశిష్టాద్వైత వేదాంత విద్వాన్ గా, బ్రహ్మసూత్రాలకు అద్భుత భాష్యం అందించిన పండిత ప్రకాoడులు. ఎంత క్లిష్టమైన వేదాంత విషయాన్ని అయినా అందరికీ అరటిపండు వలిచినట్లు తేలికగా అందించగలిగిన మహామహోపాధ్యాయులు. తిరుప్పావై ప్రవచనాన్ని సుస్వరంగా, శరణాగతిని అత్యంత భక్తి భావ రంజకంగా అందించి, పండిత పామరులను మెప్పించిన విద్వాంసులు.
తర్కశాస్త్రంలో తలస్పర్శీ
పాండిత్యం వారిది. నవీన తర్క విద్వాన్ విద్వన్మణి
శ్రీమాన్ శ్రీ రంగాచార్య స్వామి వారు. రామాయణ, భారత, భాగవతాలను ఆపోసన పట్టిన అపర అగస్త్యులు. వారి వాగ్వైభవం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా విస్తరించిందనుట అక్షర సత్యం.
పూర్వ కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో శ్రీ ఉ.వే శ్రీమాన్ అప్పలాచార్యులు… నాచియారమ్మ దంపతులకు 1927 లో జన్మించారు శ్రీమాన్ రంగాచార్య స్వామి వారు.
విద్యాభ్యాసం:
శ్రీమాన్ మరింగంటి రంగాచార్య స్వామి వారికి చిన్నప్పటి నుంచే చదువుపై మక్కువ ఎక్కువ. అష్టావధాని శిరోమణి ఆచి వెంకట నరసింహాచార్య (ఆవునూరు) గారి వద్ద అధ్యయనానికి వెళ్ళినప్పుడు, ఆచార్యుల వారికి మరొక ఆచార్యులవారు గురువుగా ఉండడం సరిపోదని
గ్రంథాచార్యులుగా ఉంటామని, తదుపరి విశిష్టాద్వైత సిద్ధాంత సంబంధిత అంశాలపై రుచిని తెలిపి మార్గదర్శనం చేశారు.
అచ్చి వారి సలహా మేరకే రంగాచార్య స్వామి వారు నాయన గారి నొప్పించి హైదరాబాదులోని
శ్రీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం కోసం చేరడం జరిగింది. వీరి శాస్త్ర ఆచార్యులు శ్రీ వే శ్రీమాన్ కోయిల్ కందాడై అప్పన్ శఠ గోప రామానుజ ఆచార్య స్వామి వారు. కళాశాలలో అభ్యాసం పూర్తి చేసి తదుపరి ఎం . ఏ….తెలుగు సంస్కృతం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పరీక్షలు రాసి ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణులైనారు.
ప్రయాగ హిందీ విద్యాలయం నుండి,సాహిత్య విద్యా ప్రవీణ పట్టాను ఆంధ్ర కళా పరిషత్ వాల్తేరు నుండి
అందుకున్నారు.
విశిష్టాద్వైత వేదాంత విద్వాన్, వేద శాస్త్రాగమ, విద్వత్ సదస్సు తిరుమలనుండి అందుకున్నారు.
నవీన తర్కవిద్వాన్, మైసూరు విద్వాన్ మహాసభ మైసూరు నుండి పట్టాలు పొందిన
ప్రజ్ఞా ధూరీణులు. వేదాంతము, వ్యాకరణము, న్యాయము, సాహిత్యాలను అభ్యసించిన
ఉత్తమ విద్యార్థి వీరు.
సీతారాంబాగ్ ప్రాచ్య మహావిద్యాలయాధిపతులు
సీతారాంబాగ్
వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో చదువుకునిన ఉత్తమ విద్యార్థి రత్నం
శ్రీరంగాచార్య స్వామి వారు, అదే కళాశాలలో అధ్యాపకులుగా విధి నిర్వహణ చేసి విద్యార్థుల మదిలో కొలువైన దేశికోత్తములు. వీరి శిష్యులు ఎందరో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఆచార్యులుగా పండితులుగా, శాస్త్ర కారులుగా ప్రాచార్యులుగా వివిధ హోదాల్లో వెలుగొందుతున్నారు. వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల సీతారాంబాగ్
లో 1952 నుండి 1992 వరకు న్యాయ శాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు.
నడిచే నారాయణులు, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి చిన్న రామాను జీయర్ స్వామి వారి ఆహ్వానం మేరకు జగ్గయ్యపేట లో చేరి భారతీయ తత్వశాస్త్ర ఆచార్యులుగా, ప్రాచార్యులుగా కూడా సేవలందించిన ఘనత వీరిది.
తర్క సంగ్రహం బ్రహ్మసూత్రాలను డిగ్రీ చదివే పిల్లలకు బోధించి వారిచే ఉపన్యాసాలు ఇప్పించి పాఠక లోకాన్ని, పండితులను ఆశ్చర్య చకితులను చేశారు. ఆడపిల్లలకు సైతం తర్క బ్రహ్మ సూత్రాలపై శిక్షణ అందించి ఉపన్యాసాలు ఇప్పించి మగవారితో పాటు సమ ఘనతను వారికి ఆపాదింప చేసిన శ్రీ రామానుజ సిద్ధాంతాన్వయి వీరు.
ఉపన్యాసకేసరి
మరింగంటి స్వామి వారి ఉపన్యాసాలు వినేవారికి ద్రాక్షాపాకం లాగా అనిపించేవట. ముఖ్యంగా వారి తిరుప్పావై ప్రవచనం దివ్య అనుభూతిని కలిగించేదట. వారు ఉపన్యాసాలలో ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు, స్మృతులు ఇతిహాస పురాణ వాక్యాలు ఆళ్వారుల సూక్తులు, కాళిదాసాధికవుల,శ్లోకాలు ప్రహేళికలు, గాధలు, ధారలు ధారలుగా ప్రవహించేవట. నన్నయ్య తిక్కన నుండి విశ్వనాథ, జాషువా లాంటి ఆధునిక కవుల సాహిత్యాన్ని తమ ఉపన్యాసాల్లో అద్భుతంగా అన్వయించి వాక్సుధను
కురిపించే వారట.
వచన కవులకు అంతే గౌరవాన్ని అందించి తమ ప్రవచనాల్లో అవసరానుగుణంగా ఉటంకనలు చేసేవారట.
హిందీ కవులైన కబీర్దాస్ తులసీదాస్, సూరదాస్ కవిత్వాలను, ఉర్దూ వాక్యాలు
వీరు ఉపన్యాసాల్లో ముత్యాల లాగా దొరలేవట. ఆళ్వారుల సూక్తి సుధను గొప్పగా వినిపించిన సరస్వతీ పుత్రులు.
ఆచార్యుల వారి వాణి వైభవం చూచి అందరూ చతుర్వేద బ్రహ్మయని కొనియాడే వారట.
రచనా పరంపర
ఉభయ వేదాంత సభలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటిలో వీరు పాల్గొని నూతన ప్రతిపాదనలు చేసి, సభను రంజింప చేయడం, ఆలోచింప చేయడం వీరి పాండిత్యానికి ప్రతీక. పుస్తక ప్రచురణకు ఎక్కువ సమయం కేటాయించకపోయినా భాగవతంలోని రత్నాలు ..వీరు రచించిన పుస్తకాన్ని సురభారతి వారు ప్రచురించారు.
అలంకార మకరందం అనే గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం వారు వేశారు.
వేదాంత ప్రకాశిక, బ్రహ్మసూత్ర పాఠః… గ్రంథాలను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముద్రించింది. అ
నేక ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి.. లోకార్పణం చేయటంలో నిలబడిన.. కార్యసాధకులు కార్యశూరు లు.
విజ్ఞప్తి సప్తతి పేరిట శ్రీ .ఉ.వే శ్రీమాన్. నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి వారు మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారి పైన ఒక లఘుకావ్యం రాసి వీరి గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరిచినారు.
ఆకాశవాణితో పెనవేసుకున్న అనుబంధం
హైదరాబాదు ఏ రేడియో కేంద్రంలో సుమారు 25 సంవత్సరాలు వీరు సంస్కృత పాఠాన్ని ఉదయం పూట బోధించేవారు. సుమారు 35 సంవత్సరాలు ఆకాశవాణిలో సంస్కృత కావ్య గానాన్ని, సంస్కృత కావ్య, నాటక సంబంధిత ప్రసంగాలు చేసిన దిషణ ఆచార్యుల వారిది.
అందుకున్న పురస్కారాలు
మైసూర్ విద్వాన్ మహాసభ మైసూరు మహారాజా వారిచే సన్మాన్నీ అందుకున్నారు.
తిరుమల వేద శాస్త్ర విద్వత్ సదస్సు ఘనంగా సన్మానాన్ని అందించింది.
ఉదయ తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పట్టణాలన్నింటిలోనూ సత్కారాలను స్వీకరించారు.
తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉత్తమ సంస్కృత పండిత పురస్కారాన్ని అందించింది.
మహా మహోపాధ్యాయ పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారథి గారు స్థాపించిన సర్వ వైదిక సంస్థానం కరీంనగర్ ద్వారా వీరు విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు.
బిరుదులు
ప్రవచనా వాచస్పతి
మధురోపన్యాసక
వాక్శిఖామణి
కుటుంబo: వీరి శ్రీమతి……
వీరికి ఐదుగురు సంతానం.
పెద్ద కుమారులు శ్రీమాన్ మరింగ్ అంటి విజయసారధి గారు ఐఎస్ఎస్ రిటైర్డ్
రెండో అబ్బాయి మరింగంటి వేణు ఆచార్య….అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నారు.
ల.సౌ. విజయలక్ష్మి ఇందిర, భారతి వారి ఆడ సంతానం.
వీరి అల్లుళ్ళు, కోడళ్ళు మనవళ్లు మనవరాలు దాదాపుగా పాతికమంది వరకు ఉన్నారు. అందరూ ఉన్నత విద్యావంతులే, ఉన్నతోన్నత ఉద్యోగస్తులే.
విధ్వన్మణి పరమ భాగవతో త్తములు శ్రీ రంగాచార్య స్వామి వారు లోకం విడిచి వెళ్లినా… నిత్యసూరి గణంలో నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారు.
శ్రీమాన్ మరింగoటి
శ్రీరంగ ఆచార్య స్వామి వారి పరమపదానంతరం వారి కుమారులు, శిష్యులు, విద్యార్థులు, హితైషులు కలిసి ఒక స్మారక సమితిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఉత్తమ సంస్కృత పండిత పురస్కారాన్ని ఉత్తమ సంస్కృత విద్యార్థి ప్రోత్సాహక పురస్కారాన్ని 2005 నుండి అందిస్తున్నారు.
2025 నుండి తిరుప్పావై ప్రవాచక విశిష్ట పురస్కారాన్ని కూడా ప్రధానం చేస్తున్నారు.
తొలి పురస్కారాన్ని శ్రీ ఉ.వే శ్రీమాన్ డాక్టర్ టి కె వి రాఘవన్ గారు అందుకున్నారు.
ఈ సమితి ద్వారా అలంకార సర్వస్వం అనే గ్రంధాన్ని ప్రచురించారు. కృతి శ్రీ అని 2011లో మరొక గ్రంథాన్ని తీసుకొని వచ్చారు.
శత జయంతి ఉత్సవాలు
నవంబర్ 2026 నుండి వీరి శతజయంతి ఉత్సవాలు ఆరంభమవుతున్నాయి. హైదరాబాదు మహానగరం తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా విద్వత్ సభలు, పురస్కారాలు, చర్చాగోష్టులు మొదలగునవి నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీరి పెద్ద కుమారుడు శ్రీమాన్ మరింగంటి విజయకుమార్ ఆచార్య
సత్ సంప్రదాయ పరిరక్షణ సమితి కార్యదర్శి, శ్రీమాన్ సముద్రాల శఠగోపాలచార్యుల వారు వారి శిష్య బృందం సన్నిహితులందరూ కలిసి ఒక శతజయంతి సంచికను తీసుకొని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీమాన్ మరింగoటి శ్రీరంగాచార్య గారి శతజయంతి సందర్భంగా స వీరికి పద్మశ్రీ ఇవ్వాలని తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
కె ఎస్ అనంతాచార్య
కరీంనగర్
9441195765
