నేను ప్రకృతి గురించి
రాసిన మరుసటి రోజున
మేడ పైన అలా
నా అడుగులను కదిలిస్తున్నాను.
అప్పుడే నా మనుసుని
ఒక ప్రశ్న
తెగ ఆలోచనలో పడేసింది.
అది ఏమిటి అంటే?
వాన పడగానే
ఆ దృశ్యాన్ని అంతలా
వర్ణించిన నేను
నాణెంకి
రెండు వైపులా చూసినట్లు
ప్రకృతికి ఒక వైపు
ఇంత అందంగా చూసి
మరో వైపున ఇంకోసారి
చూడకూడదు అనుకున్నాను.
పొలాలు
నిండు గర్భంతో
బంగారు రంగు వర్ణంతో
ప్రతి గింజ గంజికి
సిద్ధం అయ్యే తరుణంలో
తగువు పెట్టుకున్నట్లు వచ్చింది
ఈ వాన.
కడుపు నింపే పొలము
నింపడానికి వీలు లేకుండా
నీటిలో ఇక ముగిసిపోయింది
అని మునిగిపోయింది.
వ్యవసాయ దారుడి
గుండె భారానికి
కన్నీటి దారలే సాక్ష్యలు
రేయి పగలు చూడని
రైతుకి పగలే రేయి అయ్యింది.
చేరదీసే చెట్టు
చెదలు పట్టడానికి పడిపోయింది.
నీడని ఇచ్చే చెట్లని
వానతో వచ్చిన గాలి
వరుస పెట్టినట్లు
వంచేసింది.
వాన వరదగా మారి
తల్లి గర్భం లాంటి
ఇంటిని
తనువుని లేకుండా
తన్నుకుపోయింది.
పాడి పశువులు
పాతలానికి పరిమితమయ్యే
మనుషుల ఆశలు ఆవిరయ్యే
నల్లని మబ్బులు
కమ్ముకోగానే
వాన చినుకులు
వెలుగుని తెస్తాయి
అనుకుంటే
అదనంగా అంధకారాన్ని
అందించాయి.
అన్నిటికీ మనిషే కారణం
ప్రకృతిలాగా మన ఆలోచన
మొదటిని ఎంచుకుంటే
ప్రశాంతత.
రెండోది ఎంచుకుంటే
మన పతనం.
