Home బాల‌సాహిత్యం పాడే పక్షులు

ఒకసారి ఒక అడవిలో పాడే పక్షుల సమావేశం జరుగుతుంది. కోకిల కూడా ఒక పాడే పక్షిగా ఉన్నది. దాని “కూహ్ కూహ్” పాట తీయనిది. ఇతర పక్షులు దాన్ని ఇష్టపడలేదు. ఎవరు కూడా దాని తీయని పాటనూ కూడా ఇష్టపడలేదు. ఏది ఎట్లైనా వీలు చేసుకొని, కోకిల మాట్లాడింది : “ప్రియమైన మిత్రులారా, మనం భూమి మీద ఉండే జనుల హృదయాలను సంతోషపెట్టే పాటను కనిపెట్టాలి. వాళ్ళు పాటలను వినడానికి సంతోషపడుతారు. అప్పుడు ప్రపంచం అంతా ఆనందమయ మవుతుంది” అన్నది.

వెంటనేఅది ఎట్లా సంభవం? అటువంటి పాటను ఎట్లా వెదకాలి? అది అంత సులభం కాదుఅన్నది హంస. (హంస = పొడుగైన మెడగల చైనా బాతు)

ఎందుకు కాదు? మనందరమూ దూరపు ప్రాంతాలకు ఎగిరిపోదాం, వేరేవి చాలా పాటలను తెలుసుకుందాం. దాని తరువాత మనం మళ్ళీ అడవిలో కలుసుకొని ఒక్కొక్కరం విడివిడిగా పాడుదాం. అప్పుడు అన్నింటిలో చాలా బాగున్నదాన్ని ఎన్నుకొని దాన్ని ప్రపంచానికి విరాళంగా ఇద్దాం” అన్నది కోకిల.

పక్షులన్ని అంగీకరించాయి, వేరు వేరు ప్రాంతాలకు ఎగిరిపోయాయి. కూకూ, భ్రష్ అనే తీయని పాట పాడే పక్షులు మంచి ఊపులో ఉన్నాయి. చిన్నపక్షి కోకిల చాలా గ్రామాలు, పట్టణాలు దాటిపోయింది. ఎక్కడ కూడా శ్రావ్యమైన కంఠధ్వని వినలేదు. అవ్వన్ని కర్ణకఠోరంగా ఉన్నాయి, ఏమాత్రం తీయగ లేవు. అప్పుడు అది ఎత్తైన గుట్ట దగ్గరకు వచ్చింది. కానీ దాని రెక్కలు బాగా నొప్పి పెట్టడం వలన అది బాగా నీరసపడింది. అది ఒక బలహీనమైన పక్షి. చాలా నిరుత్సాహపడింది. అక్కడికి ఒక గద్ద వచ్చింది. సమయాన కోకిల రంధిగా ఒక పాట పాడుతున్నది.

“చెల్లీ, నీవు ఇంత రంధిగ ఉన్నావు ఎందుకు?” అని గద్ద అడిగింది.

“నేనేమి చేయగలను? నేను ఒక కొత్త పాటను వెదుకాలి, అది జనులందరిని సంతోషపెట్టాలి” ఆ చిన్న పక్షి అంది.

“నీకు ఆ పాట ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగిన గద్దతో

ఒకవేళ ఎత్తైన కొండను దాటితే నేను వెదికే పాట నాకు దొరుకుతుందిఅన్నది కోకిల.

“ఓహ్! చెల్లీ. అదానీ సమస్య. నీవు ఒక పనిచేయి. నేను రేపు ఉదయాన ఎత్తైన పర్వతం దాటుతాను. నీవు నా మెడ రెక్కలను గట్టిగా పట్టుకో. నేను నిన్ను మంచుకొండల వరుసలు దాటిస్తాను. నీవు అక్కడ రెండు మూడు రోజులు వుండు. నీ పని అయిన తరువాత నేను నిన్ను తిరిగి తీసుకవస్తాను” అన్నది గద్ద.

ఆ చిన్నపక్షి అంగీకరించింది. మరునాడు ఉదయమే గద్ద ఆ చిన్నపక్షిని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది. గద్ద చాలా ఎత్తుకు ఎగిరింది. ఆ గద్ద చిన్నపక్షిని పర్వత శిఖరాన దింపింది.

ఆ చిన్న కోకిల కుతూహలంగ చుట్టూ చూసింది. ఆ శిఖరంపై ఒక చిన్న గుడిసె ఉన్నది. ఆ గుడిసెలో ఒక ఋషి ఉన్నాడు. అతడు వృద్ధుడు, తెలివైనవాడు కూడా.

ఋషి మాట్లాడాడు. “నాకు తెలుసు నువ్వు ఎవ్వరివో. నీవు ఒక చిన్న పక్షివి. కాని ఎందుకు ఆలస్యం చేశావు. చాలాకాలం నుండి నీ కొరకు ఎదిరి చూస్తున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో కూడా తెలుసు.” అన్నాడు.

ఓహ్! నా అదృష్టం! ఋషి వర్యా, నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. కాని మీకు ఎట్లా తెలిసిందిఅని అడిగింది.

ఓ పక్ష్మీ నేను భగవంతుని అన్వేషణలో ఉన్నాను. అతడు అతిబలవంతుడు. నాకు ఈ ప్రపంచంలో అన్నీ తెలుసు. నీవు ఒక పాట అన్వేషణలో వచ్చావు. నీవు మనుషుల హృదయాలను సంతోషపెట్టడానికి ఓ పాట నేర్చుకుందామని అనుకుంటున్నావు. కాని అది సామాన్యమైన పని కాదు. దానికొరకు చాలా ఓపికతో ఉండాలి” ఋషి సమాధానమిచ్చాడు.

సార్, నేను రెడీ. ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే చాలా ఓపిక కల్గి ఉండటం అవసరం. ఎడతెగని ప్రయత్నం చేయకుంటే ఎవరు గొప్పవారు కాలేరు. దయతో నాకు బోధించండిఅన్నది పక్షి.

సరే, నీవు తీరుగ చెయ్యి. నీ గుడిసె వెనుక ఒక ముళ్ల చెట్టు వుంది. అక్కడికి వెళ్ళి ముళ్ళ మీద కూర్చో. సహజంగానే ముళ్ళు నీకు గుచ్చుకుంటూ బాధపెడతాయి. నీవు బాధను ఒక వారం సహించాలి. నీ రక్తం బయటికి వస్తుంది, తప్పదు. కాని రోజు రోజుకు నీ గానం మెరుగు పడుతుంది. వారం రోజుల చివరన నీ గానం చాలా బాగుంటుంది. అది జనుల హృదయాలను సంతోష

పెడుతుంది. నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. నేను నా మహిమలతో నీ గాయాలను నయం చేస్తాను. గద్ద నిన్ను నీ స్థలానికి తీసుకుపోతుందిఅని చెప్పాడు ఋషి.

పక్షి అంగీకరించి ఋషి చెప్పినట్లు చేసింది. అది మొదటిరోజే పాడటం మొదలుపెట్టింది. దినం తరువాత దినం దాని పాట మెరుగయ్యింది. వారం చివరిలో గాయాలతో బాధపడుతున్న కోకిల తన పాటను చాలా శ్రావ్యంగా పాడగలిగింది. వయసు మళ్ళిన ఋషి అవస్థ పడుతున్న పక్షిని తన చేతుల్లోకి తీసుకొని తన మహిమతో దాని గాయాలను ముట్టుకొని నయం చేశాడు.

పక్షి, నీవు ఇప్పుడు భూమి మీదికి తిరిగిపో, అక్కడ కొత్త పాట పాడు. జనాలు కూహ్ కూహ్ అను నీ తీయని స్వరం విని ఆశ్చర్యపడుతారుఋషి అన్నాడు. కోకిల ఋషికి ధన్యవాదాలు చెప్పి గద్ద కోసం ఎదురు చూస్తూ ఉన్నది.

గద్ద అన్నమాట ప్రకారం మరుసటి రోజు వచ్చింది. కోకిలను ఎత్తుకు పోయింది. కోకిల దాని ఇంటికి తిరిగి వచ్చింది. సమావేశంలో అది బహు శ్రావ్యంగ పాట పాడింది. అది ఒక గొప్ప సంతోష సంఘటన. పక్షులన్ని భళా భళా అని మెచ్చుకున్నాయి.

రోజు కూడా కోకిల గానం విన్న వాళ్ళందరి హృదయాలను సంతోషపెడుతుంది.

You may also like

Leave a Comment